ఆన్‌లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌తో మీ పర్సనల్ లోన్ ఈఎంఐ లను అర్థం చేసుకోండి
ఉపయోగించుకునేందకు సులభం కావడంతో పాటుగా ఏ ప్రయోజనం కోసమైనా ఉపయోగించుకునే వీలు ఉండడంతో నేడు పర్సనల్ లోన్ అనేది ఎంతో మందికి ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారుతోంది. ఉదాహరణకు మీరు బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ తీసుకుంటే, కొలేటరల్ లేకుండానే మీరు రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు, అది కూడా సరళమైన అర్హత నిబంధనలపై. అయితే, తెలివైన పని ఏంటంటే మీ అవసరాలను మరియు తిరిగి చెల్లింపు ప్లాన్‌ను పూర్తిగా మదింపు వేసుకున్న తరువాత మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోవాలి.
ఆ విధంగా చేయడం ద్వారా మీ అవసరాలను తీర్చుకోవడంలో ఆ రుణం తోడ్పడుతుంది తప్పితే మీరు రుణాల ఊబిలో కూరుకుపోయేలా చేయదు. ప్లానింగ్ కోసం పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఒక చక్కటి ఉపకరణంగా ఉపయోగపడుతుంది.
మీకు ఎందుకు ఈ ఉపకరణం కావాలి? ఎందుకంటే, పర్సనల్ లోన్ ఈఎంఐ గణింపు అనేది ఎన్నో సంక్లిష్టతలతో కూడుకొని ఉంటుంది. మాన్యువల్‌గా కూడా వాటిని చేసుకోవచ్చు, కాకపోతే, తప్పులు దొర్లే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, అలా లెక్కలు వేసుకునేందుకు ఎంతో సమయం పడుతుంది. అదే పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ విషయానికి వస్తే దాంట్లో పొరపాట్లు జరగవు. తక్షణమే ఫలితాలు వస్తుంటాయి.
పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ తో మీ ఈఎంఐ చెల్లింపులను అర్థం చేసుకోవడానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?
పర్సనల్ లోన్ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ ఉపకరణం. మీ ఈఎంఐ కి సబంధించిన వివిధ విలువలను (ఫలితాలను) అది జనరేట్ చేస్తుంటుంది మరియు ఈఎంఐ ఫార్ములాపై మొత్తం వడ్డీ చెల్లింపు అనేది ఆధారపడి ఉంటుంది.
ఆ ఫార్మూలా: EMI = [P x R x (1+R)N ]/[(1+R)N-1]
P = అసలు లేదా రుణ మొత్తం
R = నెలవారీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు
N = ఈఎంఐల సంఖ్య లేదా కాలం
బజాన్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ వంటి కొలేటరల్ ఫ్రీ లోన్స్ ప్రతి తదుపరి కాలిక్యులేషన్ లో తిరిగి చెల్లించిన అసలు భాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. మరో విధంగా చెప్పాలంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి ఉంటుంది. ఈఎంఐ కాలిక్యులేటర్లు ఇదే విధానంలో పని చేస్తాయి. పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఆన్ లైన్ లో ఉపయోగించడం ఎలా ?
ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎంతో సులభం. క్షణాల్లో లెక్కలు పూర్తయిపోతాయి. మీరు చేయాల్సిందల్లా దిగువ వాటికి వివరాలు ఇవ్వడమే:
• అసలు
• వడ్డీ రేటు
• కాలం
ఖాళీగా ఉన్న గడుల్లో ఆయా అంకెలను ఎంటర్ చేయడం లేదా స్లైడర్స్ ఉపయోగించి గానీ మీరు ఈ పని చేయవచ్చు.
ఉదాహరణకు మీరు అసలు కింద రూ.10,00,000 ఎంటర్ చేశారనుకుందాం. 48 నెలల కాలానికి, పర్సనల్ లోన్ వడ్డీరేటు 12 శాతం చొప్పున మీరు పొందేవి:
• రుణం ఈఎంఐ = రూ. 26,334
• మొత్తం చెల్లించాల్సిన వడ్డీ = రూ. 2,64,024
• మొత్తం చెల్లింపు (అసలు + వడ్డీ) = రూ. 12,64,024
మీరు చూస్తున్నట్లుగా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎన్నో విషయాలను లోతుగా తెలియజేస్తుంది. దాన్ని బట్టి మీరు మీ తిరిగిచెల్లింపులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు గనుక మీకు అర్హత గల మీ పర్సనల్ లోన్ ఇంట్రస్ట్ రేటును తెలుసుకుంటే, అసలు మరియు కాలం లను మీ తిరిగిచెల్లింపు సామర్థ్యా లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపులకు వీలుగా కాల వ్యవధిని సర్దుబాటు చేసుకోండి.
బజాజ్ ఫిన్ సర్వ్ లాంటి సంస్థలు 60 నెలల దాకా సరళవంతమైన కాలవ్యవధిని అందిస్తాయి. ప్రస్తుత ఆదాయ వ్యయాలకు అనుగుణంగా మీ ఈఎంఐలను సర్దుబాటు చేసుకునేందుకు మీరు ఈ సదుపాయా న్ని వాడుకోవచ్చు. తద్వారా మీరు, మీకు గనుక ఇప్పటికే భారీ మొత్తంలో ఇతర బాధ్యతలు ఉంటే, మీ ఈఎంఐని తగ్గించుకునేందుకు గాను కాల వ్యవధిని పెంచుకోవచ్చు. అయితే చెల్లించే వడ్డీ అధికం అయ్యేందుకు ఇది దారి తీస్తుంది.
అలా గాకుండా మీరు వ్యూహాత్మకంగా మీ ఈఎంఐ చెల్లింపులు అధికంగా కాకుండా ఉండేందుకు గాను తక్కువ కాలవ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. తద్వారా మీరు నికరంగా చెల్లించే వడ్డీ మొత్తం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. ఉదాహరణకు పై ఉదాహరణలో మీరు 48 నెలలకు బదులుగా 36 నెలలు మరియు 60 నెలలు ఉంచి ఏం జరుగుతుందో చూడండి. ఈఎంఐ కాలిక్యులేటర్ అందించే వివరాలు ఇలా ఉంటాయి.
చక్కటి రుణ నిర్మాణం సాధించేందుకు అసలు మొత్తాన్ని సర్దుబాటు చేయండి. నిర్వహించుకోదగిన ఈఎంఐని పొందేందుకు గాను మీరు కాలిక్యులేటర్ లో అసలు మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఈఎంఐ కూడా మారిపోతుంది. అంటే అసలు మొత్తం పెరిగితే ఈఎంఐ కూడా పెరుగుతుంది, అసలు తగ్గితే ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఎంత మొత్తంలో ఈఎంఐలు మీరు చెల్లించగలరో చూసుకుంటే, నిర్దిష్ట కాలవ్యవధిని మీరు ఎంచుకుంటే, మీరు అసలు విషయంలో కూడా తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం వంటివి చేసుకోవచ్చు.
ముందస్తు చెల్లింపులు మరియు బ్యాలన్స్ ట్రాన్స్ ఫర్స్ కోసం ఈఎంఐ షెడ్యూల్ ప్రణాళికను చూడండి. ఎన్నో పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్లు మీకు మారిటైజేషన్ పట్టిక ను కూడా అందిస్తాయి. అందులో మీ ఈఎంఐకి సంబంధించి బ్రేకప్స్ ఉంటాయి. సులభతరంగా చెప్పాలంటే కాలవ్యవధి అంతా కూడా మీ ఈఎంఐ స్థిరంగా ఉన్నప్పటికీ, అసలు మరియు వడ్డీ శాతాలు మారుతూ ఉంటాయి.
కాలవ్యవధి గడుస్తున్నకొద్దీ వడ్డీకింద పోయే మొత్తం తగ్గుతుంటుంది. అదే విధంగా కాలం గడిచే కొద్దీ అసలు కింద జమ అయ్యే మొత్తం పెరుగుతుంటుంది. వడ్డీ భాగం తిరగి చెల్లింపు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే పార్ట్ – ప్రీపేమెంట్ మరియు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్స్ లాంటివి మెరుగ్గా ఉంటాయి. అందుకే ఈఎంఐ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను చూడండి. మీ ఈఎంఐ కాలిక్యులేర్ మీ తిరిగి చెల్లింపులకు సంబంధించి మరిన్ని లోతుపాతులను వెల్లడిస్తుంది.
మీ అవసరాలను తీర్చుకునేందుకు రుణం గనుక తీసుకోవాల్సి వస్తే, మీ చెల్లింపులకు సంబంధించి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఎలా వినియోగించాలో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బజాజ్ ఫిన్ సర్వ్ ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అప్లికేషన్‌ను తక్షణ ఆమోదంతో అందిస్తోంది. 24 గంటల్లో సొమ్ము మీకు అందుతుంది. ఇంట్లోంచి లేదా ఆఫీస్‌లో నుంచి మీ సౌలభ్యానికి అనుగుణంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. (Advertorial)
Comments
Please login to add a commentAdd a comment