Bajaj finserv
-
బజాజ్ ఫిన్సర్వ్ రెండు ఈటీఎఫ్‌లు
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. -
దీర్ఘకాలంలో బులిష్ గా భారత ఈక్విటీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలికంగా భారతీయ ఈక్విటీలు బులిష్ గా కనిపిస్తున్నాయని బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ సీఐవో నిమేష్ చందన్ చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా రాజకీయ, భోగోళికపరమైన అంశాల కారణంగా కొన్ని ఒడుదుడుకులు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లతో లభిస్తున్నాయని తెలిపారు. అటు ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల విషయానికొస్తే మెరుగైన ఈల్డ్‌లను లాకిన్ చేసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే కొద్దీ మధ్యకాలికంగా క్యాపిటల్ గెయిన్స్పరమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌ను (బీఏఎఫ్) ఆవిష్కరించామని, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇలాంటివి గణనీయంగా రాబడులు అందించే అవకాశం ఉందన్నారు. బీఏఎఫ్తో మరిన్ని ప్రయోజనాలు.. ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్కమ్ సాధనాలకు ఏయే పాళ్లలో ఏ విధంగా పెట్టుబడులను కేటాయించవచ్చనేది బీఏఎఫ్లో నిపుణులైన అనుభవజు్ఞల పర్యవేక్షణలో జరుగుతుంది. సాధారణంగా ఈక్విటీ సూచీలతో పోలిస్తే ఈ తరహా ఫండ్స్‌లో ఒడుదుడుకులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలు ఉన్న చాలా మందికి ఈ ఫండ్స్ అన్నివేళలా అనువైనవి. బీఏఎఫ్ అనేది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోనూ డైవర్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఏ ఈక్విటీ లేదా అసెట్ అలొకేషన్ వ్యూహమైనా సరైన పనితీరు కనపర్చాలంటే కనీసం 3–5 ఏళ్ల పాటు న్వెస్ట్మెంట్ కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్ విషయంలోనూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి. ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక పాత ఫండ్స్ (వింటేజ్) వైపు చూడాలా అని కొందరిలో మీమాంస ఉండొచ్చు. అయితే, ఫండ్ వ్యూహం, తమ అసెట్ అలొకేషన్కి అది ఎంత వరకు ఉపయోగపడుతుందనేదే చూసుకోవడం మంచిది. సాధారణంగా వింటేజ్ ఫండ్స్‌కి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ విధానం, మేనేజ్మెంట్ బృందం మొదలైనవి మారిపోతే వాటి గత పనితీరు అనేది భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందనుకోవడానికి ఉండదు. వింటేజ్ ఫండ్లు చేసిన తప్పిదాల నుంచి నేర్చుకుని, అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా న్యూ ఫండ్ ఆఫర్లు ఉండవచ్చు. -
గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ
హైదరాబాద్: ఏఐసీటీసీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ) బజాజ్ ఫిన్సర్వ్ చేతులు కలిపాయి. బుధవారం ఇవి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు కావాల్సిన నైపుణ్యాలను అందచనున్నాయి. ఈ భాగస్వామ్యం కింద 20వేల మంది అభ్యర్థులకు సరి్టఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (సీపీబీఎఫ్ఐ) కోర్సులో బజాజ్ ఫిన్సర్వ్ శిక్షణ ఇవ్వనుంది. పరిశ్రమకు చెందిన నిపుణులు, శిక్షణ భాగస్వాములు, విద్యా సంస్థల సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను బజాజ్ ఫిన్సర్వ్ రూపొందించింది. టైర్–2, 3 పట్టణాల్లోని గ్రాడ్యుయేట్లు, ఎంబీఏ చేసిన వారు ఉద్యోగాన్వేషణ దిశగా కావాల్సిన నైపుణ్యాలను అందించనుంది. భావవ్యక్తీకరణ, పని నైపుణ్యాలను కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఒడిశాలోని పది జిల్లాల్లో మొదటి దశ కింద ఉద్యోగార్థులకు ఈ నైపుణ్యాలను ఆఫర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. -
కొత్త వ్యాపారం ప్రారంభించిన బజాజ్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్సర్వ్ అడుగు పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నెలాఖరులోపు లిక్విడ్, మనీ మార్కెట్ తదితర మూడు ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నియంత్రణ సంస్థ అనుమతితో మరో 4 కొత్త పథకాలను తీసుకురానున్నట్టు గ్రూప్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 42 సంస్థలు ఉన్నాయి. తమ గ్రూపు పరిధిలో ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయని, 7 కోట్ల మంది కస్టమర్లకు ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నట్టు సంజీవ్ చెప్పారు. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.దినేశ్ నియమితులయ్యారు. -
మార్కెట్లో దూసుకెళ్తున్న బజాజ్ ఫిన్సర్వ్!
ముంబై: ప్రముఖ బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ షేర్లు తొలిసారిగా రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను దాటాయి. నేడు కూడా స్టాక్ మార్కెట్ భారీగా లాభాలు పొందడంతో ఈ మైలురాయిని సాధించిన దేశంలో 18వ సంస్థగా నిలిచింది. ఇంట్రాడే స్టాక్ బిఎస్ఈలో ₹19,107.45 తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 1.04% పెరిగి 61,943.84 పాయింట్లకు చేరుకుంది. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ 7.41% లాభపడతే, ఏడాది నుంచి ఇప్పటి వరకు 114% పెరిగింది. ఇంతకు ముందు వరకు ఆర్ఐఎల్, టీసీఎస్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఒఎన్ జిసి, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఈ మైలురాయిని సాధించాయి. కరోనా మహమ్మారి వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఎదరైనా వృద్ధికి బాగా దోహదపడే అనేక చర్యలు తీసుకుంది. ఇటీవలే బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్)ను స్పాన్సర్ కోసం సెబీ నుండి సూత్రప్రాయ ఆమోదం పొందింది.(చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక!) -
బజాజ్ ఫిన్సర్వ్ సేల్స్ ఢమాల్
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 833 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,215 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,192 కోట్ల నుంచి రూ. 13,949 కోట్లకు బలహీనపడింది. సొంత అనుబంధ సంస్థలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ల ఉమ్మడి పనితీరుతో వెల్లడించిన ఫలితాలివి. ఫైనాన్స్ ఓకే: అనుబంధ సంస్థలలో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 4 శాతంపైగా ఎగసి రూ. 1,002 కోట్లను తాకగా.. జనరల్ ఇన్సూరెన్స్ లాభం 8.4 శాతం క్షీణించి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం లాభం 35 శాతం పైగా వెనకడుగుతో రూ. 84 కోట్లకు చేరింది. -
నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం!
మీరు కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? మీ దగ్గర సరిపడినంత డబ్బులు లేవా? అయితే మీకు శుభవార్త. ఒకేసారి డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేనివారు కోసం బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్ కస్టమర్లకు మంచి డీల్ అందిస్తోంది. శామ్సంగ్ రిఫ్రిజిరేటర్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ని అందిస్తోంది. మీరు నెలకు రూ.890 చెల్లించి శాంసంగ్ ఫ్రిజ్‌ను కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ ఫ్రిజ్‌లలో డిజిటల్ ఇన్వర్టర్స్, ఆల్‌రౌండ్ క్లీనింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. కస్టమర్లకు కన్వర్టిబుల్ 5-ఇన్ -1 మోడల్స్, సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. శామ్సంగ్ 212 లీటర్ల 5 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ కొనాలనుకుంటే ఈఎంఐ రూ.890గా ఉంది. అలాగే 198 లీటర్ల 5 స్టార్ సింగిల్ ఫ్రిజ్ కొంటే ఈఎంఐ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. 198 లీటర్ల 3 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.1025 ఈఎంఐ కట్టాలి. 386 లీటర్ల 2 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.2333 ఈఎంఐ పడుతుంది. ఫ్రిజ్ కొనాలనుకునే వారు బజాజ్ ఈఎంఐ స్టోర్‌లోకి లాగిన్ అయి కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఢిల్లీ, పూణే, ముంబై, థానే, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ఈ సదుపాయం ఉంది. ఈఎంఐ స్టోర్ హైపర్‌లోకల్ షాపింగ్ మోడల్‌ను కలిగి ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా శామ్సంగ్ రిఫ్రిజిరేటర్‌ను ఆర్డర్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయనున్నారు. చదవండి: వన్‌ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ -
అప్పుల చెల్లింపునకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయం
కాలక్రమంలో మీ జీవితంలో బాధ్యతలు హఠాత్తుగా పెరిగిపోతాయి. అద్దె, యుటిలిటిలు, ఇన్సురెన్స్, కారు చెల్లింపుల ఖర్చులతో పాటు స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు రకరకాల క్రెడిట్ కార్డులపై ఉన్న అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, ఇవన్నీ మీ నెల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ ఖర్చులు పెరిగిపోతాయి. అవి మీ నెలవారీ బడ్జెటుకు లోబడి ఉన్నా వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క పేమెంట్ మిస్ అయిన అది మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయాల్లో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయపడుతుంది. ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అంటే ఏంటి? చాలా ఆర్థిక సంస్థలు ముందస్తు ఆమోదిత లోన్స్ అందిస్తుంటాయి. వీటికి డాక్యుమెంటేషన్ చాలా తక్కువుంటుంది, అప్రూవల్ కూడా 24 గంటల్లో వస్తుంది. ఆ రుణ మొత్తాలు గణనీయంగా ఉంటాయి, వాటి చెల్లింపు కూడా ఒక నిర్ణీత గడువులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లోన్ ను ఎంచుకోవడం ద్వారా స్వల్పకాలంలో మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని బకాయిలు సకాలంలో చెల్లించవచ్చు, ప్రతీ నెలా ఒక సింగిల్ ఈఎంఐ చెల్లింపుపై దృష్టి సారిస్తే సరిపోతుంది. పర్సనల్ లోన్ ఎటువంటి సమయాలలో తీసుకోవాలి? పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు క్రెడిట్ కార్డులతో పోల్చితే చాలా తక్కువుంటుంది. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకొని మీ క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించవచ్చు. తద్వారా వడ్డీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతే కాదు మీరు చెల్లిస్తున్న ఎక్కువ వడ్డీరేటు కలిగిన రుణాలను కూడా ఈ విధానంలో తిరిగి చెల్లించవచ్చు. అప్పులన్నీ తీర్చడానికి పర్సనల్ లోన్ బెస్ట్ అనేక ఈఎంఐలు చూసుకోవడం, వాటి వడ్డీ రేట్లు, పేమెంట్ చేయాల్సిన తేదీలు గుర్తుంచుకోవడం, పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. లెక్కల్లో చిన్న తప్పు పేమెంట్ డీఫాల్ట్కు దారి తీయడమే కాదు పెనాల్టీలు, చక్రవడ్డీల చెల్లింపుతో పాటు కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక ఇన్స్టంట్ పర్సనల్ లోన్ తీసుకొని మీ అప్పులన్నీ ఒకేసారి చెల్లించవచ్చు. తీసుకున్న పర్సనల్ లోన్ కు సంబంధించిన ఒక ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్ అప్పులను దూరం పెట్టేందుకు పర్సనల్ లోన్ తీసుకోండి వివాహలు, సెలవులు లేదా దేశంలో లేదా విదేశాల్లో చదువుతున్న మీ పిల్లల చదువుల ఖర్చులు, వీటి చెల్లింపులు సకాలంలో జరపకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి పెనాల్టీ బారిన పడవచ్చు. కొన్నిసార్లు లీగల్ నోటీసూ అందుకోవాల్సి రావచ్చు. అటువంటి సమయాలలో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ద్వారా మీ చెల్లింపులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. ఆ లోన్ మొత్తాన్ని చిన్న మొత్తాల్లో మీరు భరించగలిగే స్థాయిలో ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చు. బకాయిల చెల్లింపు కోసం పర్సనల్ లోన్ అప్లై చేసే ఆలోచన ఉంటే పర్సనల్ లోన్ ఆప్షన్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. దీని కోసం బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టంట్ పర్సనల్ లోన్'ను పరిగణనలోకి తీసుకోండి. దీనికి అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. ఆమోదం కూడా 5 నిమిషాల్లోనే లభిస్తుంది. మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి, రూ.25 లక్షల వరకు రుణం పొందవచ్చు. దాన్ని 60 నెలల వరకు ఉండే వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. మీరు కావాలనుకుంటే ఫ్లెక్సి ఫెసిలిటీని కూడా ఎంచుకోవచ్చు. దీనిలో మీరు మీ రుణ పరిమితి నుంచి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మీ అవసరాన్ని బట్టి డబ్బు తీసుకోవచ్చు, మీరు వాడుకున్న మొత్తానికి వడ్డీ కడితే సరిపోతుంది. దీని ద్వారా మీరు ఎక్కువ ఆదా చేసుకోవడమే కాదు అనుకోని ఖర్చుల నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. మీ వ్యవధి కాలానికి సంబంధించి తొలినాళ్లలో కేవలం వడ్డీని మాత్రమే ఈఎంఐగా చెల్లించుకునే వెసులుబాటూ ఉంది. దీని ద్వారా మీ ఈఎంఐ మొత్తాన్ని 45% వరకు తగ్గించుకోవచ్చు. దీన్ని ఎంచుకోవడం ద్వారా మీరు నగదును సక్రమంగా నిర్వహించుకోవచ్చు, మీ దగ్గర తగిన డబ్బు ఉన్నప్పుడు మీ లోన్(Loan) తిరిగి చెల్లించవచ్చు. మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు పాక్షిక ప్రీ-పేమేంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు, ఇంకా ఇతర విలువ ఆధారిత ఫీచర్స్ పొందేందుకు ఇప్పుడే అప్లై చేయండి, మీ అప్పులను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి. (Advertorial) -
పర్సనల్ లోన్ ఈఎంఐ లెక్క ఇలా..
ఆన్లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌తో మీ పర్సనల్ లోన్ ఈఎంఐ లను అర్థం చేసుకోండి ఉపయోగించుకునేందకు సులభం కావడంతో పాటుగా ఏ ప్రయోజనం కోసమైనా ఉపయోగించుకునే వీలు ఉండడంతో నేడు పర్సనల్ లోన్ అనేది ఎంతో మందికి ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారుతోంది. ఉదాహరణకు మీరు బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ తీసుకుంటే, కొలేటరల్ లేకుండానే మీరు రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు, అది కూడా సరళమైన అర్హత నిబంధనలపై. అయితే, తెలివైన పని ఏంటంటే మీ అవసరాలను మరియు తిరిగి చెల్లింపు ప్లాన్‌ను పూర్తిగా మదింపు వేసుకున్న తరువాత మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా మీ అవసరాలను తీర్చుకోవడంలో ఆ రుణం తోడ్పడుతుంది తప్పితే మీరు రుణాల ఊబిలో కూరుకుపోయేలా చేయదు. ప్లానింగ్ కోసం పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఒక చక్కటి ఉపకరణంగా ఉపయోగపడుతుంది. మీకు ఎందుకు ఈ ఉపకరణం కావాలి? ఎందుకంటే, పర్సనల్ లోన్ ఈఎంఐ గణింపు అనేది ఎన్నో సంక్లిష్టతలతో కూడుకొని ఉంటుంది. మాన్యువల్‌గా కూడా వాటిని చేసుకోవచ్చు, కాకపోతే, తప్పులు దొర్లే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, అలా లెక్కలు వేసుకునేందుకు ఎంతో సమయం పడుతుంది. అదే పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ విషయానికి వస్తే దాంట్లో పొరపాట్లు జరగవు. తక్షణమే ఫలితాలు వస్తుంటాయి. పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ తో మీ ఈఎంఐ చెల్లింపులను అర్థం చేసుకోవడానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది? పర్సనల్ లోన్ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్లైన్ ఉపకరణం. మీ ఈఎంఐ కి సబంధించిన వివిధ విలువలను (ఫలితాలను) అది జనరేట్ చేస్తుంటుంది మరియు ఈఎంఐ ఫార్ములాపై మొత్తం వడ్డీ చెల్లింపు అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ఫార్మూలా: EMI = [P x R x (1+R)N ]/[(1+R)N-1] P = అసలు లేదా రుణ మొత్తం R = నెలవారీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు N = ఈఎంఐల సంఖ్య లేదా కాలం బజాన్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ వంటి కొలేటరల్ ఫ్రీ లోన్స్ ప్రతి తదుపరి కాలిక్యులేషన్ లో తిరిగి చెల్లించిన అసలు భాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. మరో విధంగా చెప్పాలంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి ఉంటుంది. ఈఎంఐ కాలిక్యులేటర్లు ఇదే విధానంలో పని చేస్తాయి. పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఆన్ లైన్ లో ఉపయోగించడం ఎలా ? ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎంతో సులభం. క్షణాల్లో లెక్కలు పూర్తయిపోతాయి. మీరు చేయాల్సిందల్లా దిగువ వాటికి వివరాలు ఇవ్వడమే: • అసలు • వడ్డీ రేటు • కాలం ఖాళీగా ఉన్న గడుల్లో ఆయా అంకెలను ఎంటర్ చేయడం లేదా స్లైడర్స్ ఉపయోగించి గానీ మీరు ఈ పని చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసలు కింద రూ.10,00,000 ఎంటర్ చేశారనుకుందాం. 48 నెలల కాలానికి, పర్సనల్ లోన్ వడ్డీరేటు 12 శాతం చొప్పున మీరు పొందేవి: • రుణం ఈఎంఐ = రూ. 26,334 • మొత్తం చెల్లించాల్సిన వడ్డీ = రూ. 2,64,024 • మొత్తం చెల్లింపు (అసలు + వడ్డీ) = రూ. 12,64,024 మీరు చూస్తున్నట్లుగా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎన్నో విషయాలను లోతుగా తెలియజేస్తుంది. దాన్ని బట్టి మీరు మీ తిరిగిచెల్లింపులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు గనుక మీకు అర్హత గల మీ పర్సనల్ లోన్ ఇంట్రస్ట్ రేటును తెలుసుకుంటే, అసలు మరియు కాలం లను మీ తిరిగిచెల్లింపు సామర్థ్యా లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపులకు వీలుగా కాల వ్యవధిని సర్దుబాటు చేసుకోండి. బజాజ్ ఫిన్ సర్వ్ లాంటి సంస్థలు 60 నెలల దాకా సరళవంతమైన కాలవ్యవధిని అందిస్తాయి. ప్రస్తుత ఆదాయ వ్యయాలకు అనుగుణంగా మీ ఈఎంఐలను సర్దుబాటు చేసుకునేందుకు మీరు ఈ సదుపాయా న్ని వాడుకోవచ్చు. తద్వారా మీరు, మీకు గనుక ఇప్పటికే భారీ మొత్తంలో ఇతర బాధ్యతలు ఉంటే, మీ ఈఎంఐని తగ్గించుకునేందుకు గాను కాల వ్యవధిని పెంచుకోవచ్చు. అయితే చెల్లించే వడ్డీ అధికం అయ్యేందుకు ఇది దారి తీస్తుంది. అలా గాకుండా మీరు వ్యూహాత్మకంగా మీ ఈఎంఐ చెల్లింపులు అధికంగా కాకుండా ఉండేందుకు గాను తక్కువ కాలవ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. తద్వారా మీరు నికరంగా చెల్లించే వడ్డీ మొత్తం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. ఉదాహరణకు పై ఉదాహరణలో మీరు 48 నెలలకు బదులుగా 36 నెలలు మరియు 60 నెలలు ఉంచి ఏం జరుగుతుందో చూడండి. ఈఎంఐ కాలిక్యులేటర్ అందించే వివరాలు ఇలా ఉంటాయి. చక్కటి రుణ నిర్మాణం సాధించేందుకు అసలు మొత్తాన్ని సర్దుబాటు చేయండి. నిర్వహించుకోదగిన ఈఎంఐని పొందేందుకు గాను మీరు కాలిక్యులేటర్ లో అసలు మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఈఎంఐ కూడా మారిపోతుంది. అంటే అసలు మొత్తం పెరిగితే ఈఎంఐ కూడా పెరుగుతుంది, అసలు తగ్గితే ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఎంత మొత్తంలో ఈఎంఐలు మీరు చెల్లించగలరో చూసుకుంటే, నిర్దిష్ట కాలవ్యవధిని మీరు ఎంచుకుంటే, మీరు అసలు విషయంలో కూడా తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం వంటివి చేసుకోవచ్చు. ముందస్తు చెల్లింపులు మరియు బ్యాలన్స్ ట్రాన్స్ ఫర్స్ కోసం ఈఎంఐ షెడ్యూల్ ప్రణాళికను చూడండి. ఎన్నో పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్లు మీకు మారిటైజేషన్ పట్టిక ను కూడా అందిస్తాయి. అందులో మీ ఈఎంఐకి సంబంధించి బ్రేకప్స్ ఉంటాయి. సులభతరంగా చెప్పాలంటే కాలవ్యవధి అంతా కూడా మీ ఈఎంఐ స్థిరంగా ఉన్నప్పటికీ, అసలు మరియు వడ్డీ శాతాలు మారుతూ ఉంటాయి. కాలవ్యవధి గడుస్తున్నకొద్దీ వడ్డీకింద పోయే మొత్తం తగ్గుతుంటుంది. అదే విధంగా కాలం గడిచే కొద్దీ అసలు కింద జమ అయ్యే మొత్తం పెరుగుతుంటుంది. వడ్డీ భాగం తిరగి చెల్లింపు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే పార్ట్ – ప్రీపేమెంట్ మరియు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్స్ లాంటివి మెరుగ్గా ఉంటాయి. అందుకే ఈఎంఐ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను చూడండి. మీ ఈఎంఐ కాలిక్యులేర్ మీ తిరిగి చెల్లింపులకు సంబంధించి మరిన్ని లోతుపాతులను వెల్లడిస్తుంది. మీ అవసరాలను తీర్చుకునేందుకు రుణం గనుక తీసుకోవాల్సి వస్తే, మీ చెల్లింపులకు సంబంధించి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఎలా వినియోగించాలో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బజాజ్ ఫిన్ సర్వ్ ఆన్లైన్ పర్సనల్ లోన్ అప్లికేషన్‌ను తక్షణ ఆమోదంతో అందిస్తోంది. 24 గంటల్లో సొమ్ము మీకు అందుతుంది. ఇంట్లోంచి లేదా ఆఫీస్‌లో నుంచి మీ సౌలభ్యానికి అనుగుణంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. (Advertorial) -
పీఎం కేర్స్‌కు బజాజ్ ఫిన్సర్వ్ 10 కోట్లు
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ అనే ప్రత్యేక నిధికి బజాజ్ ఫిన్సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంఆర్ఎఫ్ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సైతం కరోనా వైరస్ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది. కోల్ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా కరోనా వైరస్ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది. -
వైద్యానికి రూ.4 లక్షల వరకు రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్, ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి అపోలో హాస్పిటల్స్–బజాజ్ ఫిన్సర్వ్ హెల్త్ ఈఎంఐ కార్డును ప్రవేశపెట్టాయి. వైద్య సేవలకు అయిన వ్యయాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు ఈ కార్డు వీలు కల్పిస్తుంది. ఆసుపత్రిలో ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 12 నెలల్లో ఈ మొత్తాన్ని బజాజ్ ఫిన్సర్వ్కు వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. కార్డుదారుకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతోపాటు డిస్కౌంట్ వోచర్స్, కూపన్స్ ఆఫర్ చేస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పాన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాన్సల్డ్ చెక్కు సమర్పించి ఈ కార్డు పొందవచ్చు. ఒప్పందం నేపథ్యంలో అపోలో ఆసుపత్రుల్లో ప్రత్యేక కౌంటర్లను బజాజ్ ఫిన్సర్వ్ ఏర్పాటు చేయనుంది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎండీ సునీతా రెడ్డి, బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్, ఇరు సంస్థల ప్రతినిధులు ఈ కార్డును ఆవిష్కరించారు. కాగా, అపోలో టెలిహెల్త్ సర్వీసెస్ మలేషియాలో ఈ ఏడాది డిసెంబరు నాటికి 100 టెలి క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెలిహెల్త్కేర్ మలేషియాలో ఒప్పందం చేసుకుంది. -
బజాజ్ ఫిన్సర్వ్ నుంచి సులభంగా పర్సనల్ లోన్
హైదరాబాద్: పండుగల సీజన్లో మీ ఇంటిని ఆధునీకరించుకునేందుకు, మీకు ఎదురయ్యే అదనపు ఖర్చులను తట్టుకునేందుకు పర్సనల్ లోన్ అక్కరకు వస్తుంది. దసరా, దీపావళి పండుగలు వచ్చే నెల రోజుల్లోపు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఫర్నిచర్ లేదా గృహోపకరణాలు ఇతరత్రా ఏవైనా కొనుగోళ్లకు బజాన్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్‌ను ఆఫర్ చేస్తోంది. సులభ అర్హత నిబంధనలు, పరిమిత డాక్యుమెంటేషన్‌తో కేవలం 5 నిమిషాల్లోనే పర్సనల్‌లోన్ అనుమతి ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు తెలిపింది. అర్హతను బట్టి రూ.25 లక్షల వరకు 24 గంటల వ్యవధిలోనే పొందొచ్చని.. 60 నెలల వరకు కాల వ్యవధిని ఎంచుకోవచ్చని పేర్కొంది. మరిన్ని వివరాలను https://www.bajajfinserv.in పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. -
బజాజ్ ఫిన్సర్వ్ ఫలితాలు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: బజాజ్ ఫిన్సర్వ్ మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. లాభం 32 శాతం పెరిగి రూ.839 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా 44 శాతం వృద్ధితో 12,995 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.637 కోట్లు, ఆదాయం రూ.9,055 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో అన్ని అంశాల్లోనూ మంచి వృద్ధి నమోదైనట్టు, అనుబంధ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ లాభం 57 శాతం పెరిగిందని బజాజ్ ఫిన్సర్వ్ సీఈవో ఎస్ శ్రీనివాసన్ తెలిపారు. ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.42,606 కోట్ల ఆదాయంపై రూ.3,219 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.32,863 కోట్లు, నికర లాభం రూ.2,650 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. జనరల్ ఇన్సూరెన్స్ బజాజ్ ఫిన్సర్వ్ అనుబంధ బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం మాత్రం అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.187 కోట్ల నుంచి రూ.83 కోట్లకు క్షీణించింది. అంటర్రైటింగ్ నష్టాలు ఎక్కువగా ఉండడం, పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.20 కోట్లను కేటాయించడం లాభం తగ్గడానికి కారణమని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియం ఆదాయం 23 శాతం వృద్ధితో 3,402 కోట్లకు చేరింది. క్లెయిమ్ రేషియో 75.5 శాతంగా ఉంది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం జనరల్ ఇన్సూరెన్స్ లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15 శాతం తగ్గి రూ.780 కోట్లకు పరిమితమైంది. లైఫ్ ఇన్సూరెన్స్ మరో అనుబంధ కంపెనీ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.171 కోట్ల నుంచి రూ.112 కోట్లకు తగ్గింది. బజాజ్ ఫైనాన్స్ లాభం 50% అప్ ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 50 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.743 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,114 కోట్లకు పెరిగిందని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,425 కోట్ల నుంచి రూ.4,888 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 6 డివిడెండ్ (300 శాతం) ఇవ్వనున్నామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.2,485 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,890 కోట్లకు పెరిగిందని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 1.54 శాతంగా, నికర మొండి బకాయిలు 0.63 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేర్ 3.6 శాతం లాభంతో రూ.3,112 వద్ద ముగిసింది. -
21 నుంచి బజాజ్ ఫిన్సర్వ్ రిపబ్లిక్ డే సేల్
ముంబై: గణతంత్ర దినోత్సరం సందర్భంగా బజాజ్ ఫిన్సర్వ్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బజాజ్ ఫిన్సర్వ్ డైరెక్ట్ ఆన్లైన్ పోర్టల్ https:// www.bajajfinservmarkets.in/ emistore/ ద్వారా ఈఎంఐ కొనుగోళ్లపై రూ.2019 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నోకాస్ట్ ఈఎంఐ కింద, ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసిన 4 గంటల్లో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను 24 గంటల్లో డెలివరీ చేస్తామని ప్రకటించింది. -
స్టాక్స్ వ్యూ
బజాజ్ ఫిన్సర్వ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.1,835 టార్గెట్ ధర: రూ.2,102 ఎందుకంటే: బజాజ్ గ్రూప్‌కు చెందిన బజాజ్ ఫిన్సర్వ్ ఆర్థిక దిగ్గజ కంపెనీగా ఎదిగింది. జీవిత బీమా, సాధారణ బీమా, కన్సూమర్ ఫైనాన్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక సేవలతో పాటు పవన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్.... ఈ మూడు వ్యాపారాల్లో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మంచి లాభాలార్జిస్తోంది. అలయంజ్ ఎస్ఈ(జర్మన్) కంపెనీతో కలిసి జీవిత, సాధారణ బీమా కంపెనీలను ఏర్పాటు చేసింది. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా వ్యాపారాన్ని, బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణ జీవిత బీమా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్(ఇది కూడా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బజాజ్ ఫిన్సర్వ్కు ఇది లిస్టెడ్ అనుబంధ సంస్థ. బజాజ్ ఫైనాన్స్‌లో బజాజ్ ఫిన్సర్వ్కు 57.6 శాతం వాటా ఉంది) వినియోగదారులకు, వాహన, వినియోగ వస్తువుల రుణాలందిస్తోంది. భారత్‌లో అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల్లో ఒకటిగా బజాజ్ ఫైనాన్స్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బజాజ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు రూ.32,410 కోట్లకు పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ లోన్ బుక్ నాలుగేళ్లలో నాలుగింతలైంది. ఆదాయం 13 శాతం, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక బజాజ్ ఫిన్సర్వ్ మహారాష్ట్రలో 138 విండ్ మిల్స్‌తో 64 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. రెండేళ్లలో బజాజ్ ఫిన్సర్వ్ నికర అమ్మకాలు 14 శాతం, నికరలాభం 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. గుజరాత్ పిపవావ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.175 టార్గెట్ ధర: రూ.202 ఎందుకంటే: ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్లలో ఒకటైన ఏపీఎం టెర్మినల్స్ దన్నుతో గుజరాత్ పిపవావ్ పోర్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్ పిపవావ్లో ఏపీఎం టెర్మినల్స్‌కు 43 శాతం వాటా ఉంది. భారత ప్రైవేట్ రంగంలో తొలి పోర్ట్ కంపెనీ అయిన గుజరాత్ పిపవావ్ కంపెనీ కార్గో హ్యాండ్లింగ్, వేర్‌హౌస్, సీఎఫ్ఎస్ సౌకర్యాలనందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలు 10% వృద్ధితో రూ.185 కోట్లకు చేరాయి. నికర లాభం ఫ్లాట్‌గా రూ.80 కోట్లుగా నమోదైంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 22%, నికర లాభం 56% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఏపీఎం టెర్మినల్స్ సంస్థ భారత రైల్వేలతో కలిసి పిపవావ్ రైల్వే కార్పొరేషన్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌లో డబుల్ స్టాక్ ట్రైన్స్(ఒక బోగీపై మరో బోగీ ఉన్న రైళ్లు)ను ప్రవేశపెట్టనున్న తొలి కంపెనీ ఇదే కానున్నది. నైరుతీ భారత దేశంలో ప్రధానమైన ఇన్లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ-కంటైనర్ కార్గోను తాత్కాలికంగా స్టోరేజ్, హ్యాండ్లింగ్ చేసే డ్రై పోర్టులు)లతో అనుసంధానతను మరింత మెరుగుపరచుకుంది. దీనికోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ పోర్ట్ ఉంది. దాద్రి నుంచి రీఫర్ రాక్స్(రిప్రిజిరేటర్ లాజిస్టిక్స్) సౌకర్యం ఉన్న గుజరాత్‌లోని ఏకైక పోర్ట్ ఇదొక్కటే. దీంతో పశ్చిమాసియా, ఈజిప్ట్, మధ్యధరా దేశాల, ఆఫ్రికా, యూరప్ పోర్ట్‌లతో నేరుగా అనుసంధానం ఏర్పర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ. 202 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం.