హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలికంగా భారతీయ ఈక్విటీలు బులిష్ గా కనిపిస్తున్నాయని బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ సీఐవో నిమేష్ చందన్ చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా రాజకీయ, భోగోళికపరమైన అంశాల కారణంగా కొన్ని ఒడుదుడుకులు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లతో లభిస్తున్నాయని తెలిపారు.
అటు ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల విషయానికొస్తే మెరుగైన ఈల్డ్‌లను లాకిన్ చేసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే కొద్దీ మధ్యకాలికంగా క్యాపిటల్ గెయిన్స్‌పరమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌ను (బీఏఎఫ్) ఆవిష్కరించామని, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇలాంటివి గణనీయంగా రాబడులు అందించే అవకాశం ఉందన్నారు.
బీఏఎఫ్‌తో మరిన్ని ప్రయోజనాలు..
ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్‌కమ్ సాధనాలకు ఏయే పాళ్లలో ఏ విధంగా పెట్టుబడులను కేటాయించవచ్చనేది బీఏఎఫ్‌లో నిపుణులైన అనుభవజు్ఞల పర్యవేక్షణలో జరుగుతుంది. సాధారణంగా ఈక్విటీ సూచీలతో పోలిస్తే ఈ తరహా ఫండ్స్‌లో ఒడుదుడుకులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలు ఉన్న చాలా మందికి ఈ ఫండ్స్ అన్నివేళలా అనువైనవి. బీఏఎఫ్ అనేది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోనూ డైవర్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఏ ఈక్విటీ లేదా అసెట్ అలొకేషన్ వ్యూహమైనా సరైన పనితీరు కనపర్చాలంటే కనీసం 3–5 ఏళ్ల పాటు న్వెస్ట్‌మెంట్ కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్ విషయంలోనూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి.
ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక పాత ఫండ్స్ (వింటేజ్) వైపు చూడాలా అని కొందరిలో మీమాంస ఉండొచ్చు. అయితే, ఫండ్ వ్యూహం, తమ అసెట్ అలొకేషన్‌కి అది ఎంత వరకు ఉపయోగపడుతుందనేదే చూసుకోవడం మంచిది. సాధారణంగా వింటేజ్ ఫండ్స్‌కి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ విధానం, మేనేజ్‌మెంట్ బృందం మొదలైనవి మారిపోతే వాటి గత పనితీరు అనేది భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందనుకోవడానికి ఉండదు. వింటేజ్ ఫండ్లు చేసిన తప్పిదాల నుంచి నేర్చుకుని, అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా న్యూ ఫండ్ ఆఫర్లు ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment