
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్‌సర్వ్ అడుగు పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నెలాఖరులోపు లిక్విడ్, మనీ మార్కెట్ తదితర మూడు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (స్థిరాదాయ/డెట్) పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు నియంత్రణ సంస్థ అనుమతితో మరో 4 కొత్త పథకాలను తీసుకురానున్నట్టు గ్రూప్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 42 సంస్థలు ఉన్నాయి. తమ గ్రూపు పరిధిలో ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయని, 7 కోట్ల మంది కస్టమర్లకు ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నట్టు సంజీవ్ చెప్పారు.