
న్యూఢిల్లీ: ఓవర్‌నైట్ ఫండ్స్ (డెట్ మ్యూచువల్ ఫండ్స్)కు సంబంధించి కటాఫ్‌టైమ్‌లో సెబీ మార్పులు చేసింది. పనిదినంలో మధ్యాహ్నం 3 గంటల వరకు (కటాఫ్ టైమ్) వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్‌ఏవీ (తదుపరి వ్యాపార దినం ముందు నాటి) వర్తిస్తుంది. 3 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్‌ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులకు సాయంత్రం 7 గంటలను కటాఫ్ టైమ్‌గా సెబీ నిర్ణయించింది.
అంటే ఆలోపు వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులకు అదే రోజు ఎన్‌ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఈ కొత్త వేళలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఓవర్‌నైట్ పథకాల యూనిట్లను తనఖా నుంచి విడిపించుకునేందుకు స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సబ్యులకు కొత్త మార్పులు అనుకూలించనున్నాయి. వీరు తమవద్దనున్న క్లయింట్ల నిధులను ఓవర్‌నైట్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. తద్వారా ఇన్వెస్టర్ల నిధులకు రిస్క్ ఉండకపోగా, స్టాక్ బ్రోకర్లకు కొంత ఆదాయం కూడా లభిస్తుంటుంది.