
ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు రెండు కంపెనీలు సిద్ధమయ్యాయి. సాయి ఇన్ఫినియం, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు అనుమతులు కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించాయి. ఈ రెండు ఇష్యూలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) లేకుండానే జరగనున్నాయి.
సాయి ఇన్ఫినియం 1.96 కోట్ల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. సమీకరించిన నిధుల్లో 17.4 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.130 కోట్లు, రోలింగ్ మిల్లు కొనుగోలుకు రూ.65 కోట్లు, కార్గో వెసెల్ కొనుగోలుకు రూ.19 కోట్లు ఉపయోగించనుంది.
అడ్వాన్స్ ఆగ్రోలైఫ్
అగ్రోకెమికల్ తయారీ కంపెనీ ‘అడ్వాన్స్ అగ్రోలైఫ్’ 1.92 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ద్వారా నిధులు సమీకరించనుంది. అర్హులైన కంపెనీ ఉద్యోగులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. అలాంటి వారికి డిస్కౌంట్‌తో షేర్లు కేటాయించనుంది. సమీకరించిన నిధుల్లో రూ.135 కోట్లు మూలధన అవసరాలకు మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.