Overnight
-
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్
దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్‌లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్‌టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్‌ని కొనుగోలు చేశాడు. ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్‌కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు. తాను ఇలా లాటరీ టిక్కెట్‌ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య. View this post on Instagram A post shared by Big Ticket (@bigticketauh) (చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!) -
వినేశ్ ఫోగట్ ఓవర్‌నైట్ వర్కౌట్లు..ఇలా చేస్తే బరువు తగ్గుతారా?!
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. అందరూ ఆమెను ఆమెను ఒక్క క్రీడాకారిణిగానే కాకుండా ఒక పోరాట యోధురాలిగా చూశారు. రెజ్లింగ్ ప్రపంచంలో ఆమె ఎన్నో పెద్ద విజయాలు అందుకుంది. ఆమె కెరీర్లో మిగిలిపోయిన ఒలిపింక్ పతకం గెలుచుకుందామన్న సమయంలో.. ఆ కొద్ది బరువు ఆటే ఆడకుండా చేసి జీవితకాలపు విషాదాన్ని మిగిల్చింది.అయితే ఈ ఉదంతానికి ముందు ఆమె బరువు తగ్గేందుకు ఓవర్ నైట్ పడ్డ కష్టం గురించి ఆమె కోచ్ చెప్పిన విషయాలు అందర్నీ షాక్‌కు గురిచేశాయి. ఆమె బరువు ఎక్కువగా ఉందని తగ్గించేందుకు నీళ్లు తాగకుండా, ఓవర్‌నైట్ అంతా కసరత్తులు చేసి, జుట్టు కత్తిరించి ఇలా ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. అయినా ఆమె కష్టం వృధాగా మిగిలి తీరని బాధను మిగిల్చిందని చెప్పారు కోచ్. ఇక్కడ బరువుతగ్గేందుకు ఓవర్‌నైట్ వ్యాయామాలు అనేవి ఒక్కసారిగా అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. ఇలా చేయడం ఆరోగ్యకరమేనా? నిజానికి రాత్రిపూట వ్యాయామాలతో బరువు తగ్గగలమా అంటే..ఇలా ఓవర్‌నైట్‌లో కాస్త ఎక్కువగా వ్యాయామాలు చేస్తే ఓ వ్యక్తి మహా అయితే ఒకటిన్నర్ లేదా రెండు కేజీల బరువు తగ్గగలరని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా శ్వాస, చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది కాబట్టి తాత్కాలికంగా బరువు తగ్గుతాం. అలాగే తాత్కాలికంగా కొద్దిపాటి కొవ్వు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రెజ్లర్లు, ఒలింపిక్ అథ్లెట్లు పోటీ అవసరాల కోసం ఇటువంటి స్వల్సకాలిక బరువు నిర్వహణ వ్యూహాలను తమ కోచ్, పోషకాహార నిపుణుల ఆధ్వర్యంలో అనుసరిస్తుంటారు. ఇవి క్రీడాకారులు పోటీ పడేందుకు చేసే కసరత్తులు. సాధారణ వ్యక్తులు ఇవి అనుసరించేందుకు ఆమోదయోగ్యమైనవి కావని చెబుతున్నారు నిపుణులు. వేగవంతంగా బరువు తగ్గడం హానికరం..త్వరగా బరువు తగ్గడం అనేది సాధారణంగా ఆరోగ్యమైనది కాదు. తరుచుగా నీరు, కండరాలను కోల్పోతుందే గానీ కొవ్వులను కాదు. ఇక్కడ క్రీడాకారులు, అథ్లెట్లు నిర్థిష్ట బరువుని త్వరితగతిన మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వారి విషయంలో ఆచరణాత్మకమైనదే తప్ప మిగతావారికి కాదని అన్నారు. అందరూ సమతుల్య ఆహారం, వ్యాయామాలతో కొవ్వుని తగ్గించుకునే యత్నం చేసి బరువు తగ్గడమే ఆరోగ్యకరం అని చెప్పారు నిపుణులు. అంతేగాదు వారానికి కిలో లేదా అరకిలో చొప్పున బరువు తగ్గడం మంచిదని చెప్పుకొచ్చారు. వేగవంతంగా బరువు తగ్గడం ఆసక్తికరంగా అనిపించినా..దీర్ఘకాలిక ఆరోగ్యపరంగా మంచిది కాదని తేల్చి చెప్పారు. సురక్షిత మార్గంలో బరువు తగ్గే ప్రయత్నాలే ఆరోగ్యాని మేలు చేస్తాయని నొక్కి చెప్పారు. ఇక్కడ వినేశ్ ఫోగట్ విషయంలో నిపుణులు, వైద్య విజిలెన్స్ పర్యవేక్షణలో ఈ వ్యూహాలు అనుసరించడం జరిగిందనేది గ్రహించాలని నిపుణులు అన్నారు.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !) -
దెయ్యాలు కట్టిన గుడి!..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!
మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం. పసివయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి.. ‘దండం పెట్టుకో..’ అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరూ! గొంతు బొంగురుగా చేసి.. ‘హో..’ అనే ఓ విచిత్రమైన శబ్దంతో ‘అదిగో వస్తుంది’ అనే ఓ అబద్ధంతో బెదరగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు.. అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్మఠ్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్, మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడం.. చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్ మెటీరియల్ (జిగట పదార్థం) వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే.. రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం.. నేటికీ చెక్కుచెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు. వాచ్‌మన్ కూడా లేడు. కొందరు హోమ్ గార్డ్స్ మాత్రం.. ఈ గుడికి కాస్త దూరంగా.. రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూంటారు. ఏదో అతీతమైన శక్తి.. ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడివారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే.. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలిజిస్ట్‌లు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ, ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయరు. అయితే నేటికీ ఈ ఆలయం చుట్టూ.. ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడపడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి, కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని.. కిందున్న ఏ రాయిని కదిలించినా, గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒకరకమైన శబ్దం వస్తుందనే పుకార్లూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తూంటారు చాలామంది. నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరూ చేయలేదు. దాంతో ఈ ఆలయనిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన (చదవండి: వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!) -
కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్
నాగ్‌పూర్: కుండపోత వర్షంతో నాగ్‌పూర్ నీటమునిగింది. శుక్రవారం ఒక్కరాత్రిలోనే 106 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 'అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో నాగ్‌పూర్‌లోని అంబజారీ సరస్సు పొంగిపొర్లింది. సమీప ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.' అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. వర్షంలో నీటమునిగిన ప్రాంతాలకు సహాయక బృందాలను ప్రభుత్వం పంపింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను అప్రమత్తం చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు నాగ్‌పూర్ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో నగరంలో రోడ్లు కొట్టుకుపోయాయి. నాలాలు దెబ్బతిన్నాయి. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న డెంగీ -
ఏ నాయకుడు అయినా ఆ పుణ్యక్షేతంలో రాత్రిపూట ఉన్నారో అంతే..!
భారతదేశంలో పురాతన పవిత్రమైన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని చాలా మహిమాన్వితమైనది. ఈ నగరం దేశ చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్ర స్థానంగా అలరారుతుంది. మధ్యప్రదేశ్‌లో శిప్రా నది ఒడ్డున ఉజ్జయిని ఉంది. ఈ నగర సాంస్కృతిక వారసత్వం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉజ్జయిని నగరంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి రాత్రిపూట బస చేయలేదట. ఇంతవరకు అలా ఎవ్వరూ ఉండేందుకు సాహసం చేయలేదట. ఎందకలా? దాని వెనుక దాగిఉన్న రహస్యం ఏంటీ?.. నిజానికి ఈ ఉజ్జయినిని మహాభారత కాలంలో 'అవంతి' అని పిలిచేవారు. వేదాలు, పురాణాలతో సహ వివిధ పురాతన హిందూ గ్రంథాల్లో ఈ నగరం ప్రస్తావన ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ నగరం పేరు చెప్పగానే విక్రమాదిత్యుడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయనే ఇక్కడకు నిత్యం వచ్చి 'హరసిద్ధ' మాతను పూజించేవాడు. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ప్రధాన అధి దేవత 'బాబా మహాకల్'. ఉజ్జయిని సర్వోన్నత ప్రభువుగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఆ నగరంలోని అన్ని అధికారాలు ఆయనవే. అందువల్ల అక్కడ ఏ నాయకుడు ఉండకూడదు. అలాగే ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉండటం కుదరదు. అందువల్ల ఏ నాయకుడు అక్కడ బస చేయరు. అది అక్కడ ఆచారం. దీన్ని అతక్రమించి ఉన్నవాళ్లందరూ విపత్కర పరిస్థితులు చూచిన దాఖాలాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఏ నాయకుడు ఆ సాహసం చేయకపోవడం విశేషం. నాయకులు ఈ ఆచారాన్ని అతిక్రమించకపోవడానికి మరో ప్రధాన కారణం రాజకీయ అంశం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండలి, అధికారంలో సాగాలంటే వారి ఆధరాభిమానాలు పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ప్రజల మత విశ్వాసాలను గౌరవించక తప్పదు. ఆయా కారణాల రీత్యా కూడా నాయకులు దీనికి విరుద్ధంగా వెళ్లే సాహసం చేయలేదు. మరికొందరూ ఆ ఆచారానికి విరుద్ధంగా వెళ్లితే ఏమవుతుందన్న భయంతోనే.. మొత్తం మీద ఇంతవరకు ఏ నాయకుడు ఉజ్జయినిలో రాత్రిపూట బస చేయలేదట. భవిష్యత్తులో ఇదే కొనసాగుతుందో లేదో కానీ ఈ విషయం మాత్రం ఉజ్జయినీలో ఓ అంతుపట్టని మిస్టరీలా ఉంది. -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం
-
Ranu Mondal: ఓవర్‌నైట్ సెన్సెషన్ మరోసారి వార్తల్లోకి..
రాను మండల్.. పరిచయం అక్కర్లేని పేరు. బెంగాల్‌లోని రణఘాట్‌లో వీధుల్లో ఈమె పాడిన పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీలంక గాయకుడు, రచయిత యోహానీ రాసిన ‘ మానికే మాఘే హితే’ అనే పాటను మండల్ పాడారు. దీంతో రాను మండల్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ హృశికేష్ మోండల్ దర్శకత్వం వహించిన ‘మిస్ నాను మరియా’ సినిమాలో పాటపాడటానికి అవకాశం ఇచ్చారు. దీనికి బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ఆమెను ప్రోత్సహించారు. సూపర్ స్టార్ రియాలిటీ షోలో పాట పాడటానికి హిమేష్.. మండల్‌ను ఆహ్వానించారు. హిమేష్ చిత్రం .. హ్యపీ హర్డీ అండ్ హీర్ సినిమాలో రెండు మండల్‌తో రెండు పాటలను పాడించారు. ఆ తర్వాత.. ఒక కార్యక్రమంలో అభిమాని పట్ల మండల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఒక పెద్ద సెలబ్రిటీలాగా ప్రవర్తిస్తోందని నెటిజన్లు ఆమె తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం మండల్ పాడిన పాట మరోసారి సోషల్ మీడియాలో సెన్సెషన్‌గా మారడంతో ఆమెకు మరో అవకాశం వస్తుందేమో చూడాలి. చదవండి: Ranu Mondal Biopic: ‘ఆమె పాత్ర పోషించడాన్ని అవమానంగా భావించారు’ -
ఎయిరిండియాలో అర్థరాత్రి తొలగింపుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ రాత్రికి రాత్రి ఆదేశాలు జారీ చేయడం కలకలం సృష్టించింది. కరోనా సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. సకాలంలో జీత భత్యాలు చెల్లించలేదంటూ జూలై, 2019 న ఈ 48 మంది పైలట్లు రాజీనామా చేశారు. అయితే 6 నెలల నోటీసు పీరియడ్ లో ఈ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. దీనికి అధికారిక ఆమోదం తరువాత ప్రస్తుతం వీరంతా ఎయిర్ బస్ విధుల్లో ఉన్నారు. అయితే గత రాత్రి హఠాత్తుగా తొలగింపు ఆదేశాలివ్వడం ఆందోళన రేపింది. ఇది తెలియని కొంతమంది పెలట్లు ప్రస్తుతం విధుల్లో ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారీ నష్టాల్లో ఉన్నాం.. ఆర్థిక సామర్థ్యం లేదంటూ ఎయిరిండియా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పైలట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలనంటూ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఐ) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరికి, ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ కు ఒక లేఖ రాసింది. అక్రమ తొలగింపులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు కొందరు పైలట్లు న్యాయం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. -
పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్ ఫండ్
ఓవర్‌నైట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే లక్ష్యంతో పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ (లోగడ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా) నుంచి ఓవర్‌నైట్ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ నెల 12న ఆఫర్ ప్రారంభం కాగా, ఈ నెల 26 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు వ్యవధిలో గడువు తీరే ఓవర్‌నైట్ సెక్యూరిటీల్లో (డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లు) ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. స్వల్ప కాలం కోసం నిధులను పార్క్ చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం. రిస్క్ తక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ (కోరుకున్నప్పుడు వేగంగా వెనక్కి తీసుకోగలగడం) ఇందులోని మరో సానుకూలత. అయితే, రాబడులకు హామీ ఉండదు. ప్రవేశం, వైదొలిగే సమయంలో ఎటువంటి చార్జీలు ఉండవు. ఒక రోజు నుంచి నెల రోజుల వరకు తమ నిధులపై రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ రాత్రికి రాత్రే ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వడ్డీరేట్లపై 25-30 బేసిస్ పాయింట్లనుతగ్గించింది. సగటు ఎంఎల్ ఆర్ ను 8.6 శాతంగా నిర్ణయించింది. అలాగే ఒక నెలకు 8,80శాతం మూడు నెలలకు 8,90శాతం ఆరు మాసాలకు 9.05 శాతం, వార్షిక రేటును 9.20శాతం , రెండేళ్ళ రేటు 9.25శాతం మూడేళ్లకుగాను 9.30శాతంగా ప్రకటించింది. జనవరి 1, 2017 నుంచి ఈ తగ్గింపు రేట్లు అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ఇది మంచి సంకేతమని బ్యాంకుల కార్యనిర్వాహక బోర్డు ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ వ్యాఖ్యానించింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. -
ఆటో స్టార్టర్లు పెడితే రైతులపై కేసులు
* ఈఆర్సీ బహిరంగ విచారణలో దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి * పగలు 6 గంటల సరఫరా.. రాత్రి ఇచ్చినా రైతులు వాడుకోరు * అందుకే 9 గంటల విద్యుత్ అవసరాలను వార్షిక నివేదికలో చూపలేదు * రైతులు ఆటో స్టార్టర్లు పెడితే కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తాం * అవసరమున్నవారు రాత్రివేళ పొలానికెళ్లి స్విచ్ వేసుకోవాలని వ్యాఖ్య * చార్జీల పెంపును వ్యతిరేకించిన పరిశ్రమలు, రైల్వే సంస్థల ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యవసాయానికి పగటి పూట 6 గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది. అవసరమున్న రైతులు రాత్రిపూట కూడా వాడుకోవచ్చు. కానీ పొలానికి వెళ్లి స్విచ్ వేసి, తర్వాత బంద్ చేసుకోవాలి. వ్యవసాయ పంపుసెట్లకు ఆటో స్టార్టర్లు (విద్యుత్ సరఫరా రాగానే వాటంతట అవే మోటార్లను స్టార్ట్ చేసే పరికరాలు) బిగిస్తే మాత్రం కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని కోరాం..’’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రెండో రోజు గురువారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విచారణకు పారిశ్రామిక, వాణిజ్య, రైల్వే సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యుత్ రంగ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీలపై వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన విద్యుత్ డిమాండ్‌ను ‘వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)’లలో చూపకపోవడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు కావాల్సిన సబ్సిడీని ప్రభుత్వం కేటాయించలేదేమని ప్రశ్నించారు. ఈ అభ్యంతరాలు, విజ్ఞప్తులపై రఘుమారెడ్డి చివర్లో బదులిచ్చారు. వ్యవసాయానికి పగటి పూటే 6 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని.. దీనివల్ల రైతులు రాత్రిపూట విద్యుత్‌ను వాడుకోరనే ఉద్దేశంతోనే 9 గంటల విద్యుత్‌కు సంబంధించిన సమాచారాన్ని ఈఆర్సీకి సమర్పించలేదని చెప్పారు. ఎగువ రాష్ట్రాల్లో బాబ్లీ తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని... అందుకే జల విద్యుత్ ధరను యూనిట్ రూ.3.32కు పెంచామని పేర్కొన్నారు. రాత్రిపూట విద్యుత్‌ను వినియోగించుకునే పరిశ్రమలకు కొత్తగా ప్రకటించిన 55 పైసల రాయితీని రూపాయికి పెంచే అంశాన్ని వచ్చే ఏడాది పరిశీలిస్తామన్నారు. అధిక విద్యుత్ టారిఫ్ గల వాణిజ్య కేటగిరీ నుంచి పారిశ్రామిక కేటగిరీకి మార్చాలని వివిధ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ కింద టారిఫ్ విధించాలని స్పిన్నింగ్ మిల్లులు, ఆఫ్సెట్ ప్రింటర్లు తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటే కేటగిరీల సంఖ్యకు వందకు మించిపోతుందని పేర్కొన్నారు. రైల్వేలకు టారిఫ్ పెంపు న్యాయోచితంగానే ఉందన్నారు. ఆర్వో ప్లాంట్లను కమర్షియల్ కేటగిరీ నుంచి మళ్లీ పరిశ్రమల కేటగిరీకి మార్చామని చెప్పారు. గోదావరిపై ప్రాజెక్టుతో.. కృష్ణాలో విద్యుత్ తగ్గింది! ఎగువ రాష్ట్రాల్లో నిర్మించిన బాబ్లీ తదితర ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయిందని ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి తన వివరణలో పేర్కొన్నారు. అందుకే జల విద్యుత్ ధర పెంచాల్సి వచ్చిందన్నారు. అసలు మహారాష్ట్ర గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టును నిర్మించగా... రాష్ట్రానికి జల విద్యుత్ అందించే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కృష్ణా నదిపై ఉన్నాయి. గోదావరిపై జల విద్యుత్ ప్రాజెక్టులేమీ లేకపోయినా.. బాబ్లీ వల్ల జల విద్యుత్ తగ్గిందని రఘుమారెడ్డి పేర్కొనడం గమనార్హం.