పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. అందరూ ఆమెను ఆమెను ఒక్క క్రీడాకారిణిగానే కాకుండా ఒక పోరాట యోధురాలిగా చూశారు. రెజ్లింగ్ ప్రపంచంలో ఆమె ఎన్నో పెద్ద విజయాలు అందుకుంది. ఆమె కెరీర్‌లో మిగిలిపోయిన ఒలిపింక్ పతకం గెలుచుకుందామన్న సమయంలో.. ఆ కొద్ది బరువు ఆటే ఆడకుండా చేసి జీవితకాలపు విషాదాన్ని మిగిల్చింది.
అయితే ఈ ఉదంతానికి ముందు ఆమె బరువు తగ్గేందుకు ఓవర్ నైట్ పడ్డ కష్టం గురించి ఆమె కోచ్ చెప్పిన విషయాలు అందర్నీ షాక్‌కు గురిచేశాయి. ఆమె బరువు ఎక్కువగా ఉందని తగ్గించేందుకు నీళ్లు తాగకుండా, ఓవర్‌నైట్ అంతా కసరత్తులు చేసి, జుట్టు కత్తిరించి ఇలా ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. అయినా ఆమె కష్టం వృధాగా మిగిలి తీరని బాధను మిగిల్చిందని చెప్పారు కోచ్. ఇక్కడ బరువుతగ్గేందుకు ఓవర్‌నైట్ వ్యాయామాలు అనేవి ఒక్కసారిగా అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. ఇలా చేయడం ఆరోగ్యకరమేనా? నిజానికి రాత్రిపూట వ్యాయామాలతో బరువు తగ్గగలమా అంటే..
ఇలా ఓవర్‌నైట్‌లో కాస్త ఎక్కువగా వ్యాయామాలు చేస్తే ఓ వ్యక్తి మహా అయితే ఒకటిన్నర్ లేదా రెండు కేజీల బరువు తగ్గగలరని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా శ్వాస, చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది కాబట్టి తాత్కాలికంగా బరువు తగ్గుతాం. అలాగే తాత్కాలికంగా కొద్దిపాటి కొవ్వు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రెజ్లర్లు, ఒలింపిక్ అథ్లెట్లు పోటీ అవసరాల కోసం ఇటువంటి స్వల్సకాలిక బరువు నిర్వహణ వ్యూహాలను తమ కోచ్, పోషకాహార నిపుణుల ఆధ్వర్యంలో అనుసరిస్తుంటారు. ఇవి క్రీడాకారులు పోటీ పడేందుకు చేసే కసరత్తులు. సాధారణ వ్యక్తులు ఇవి అనుసరించేందుకు ఆమోదయోగ్యమైనవి కావని చెబుతున్నారు నిపుణులు.
వేగవంతంగా బరువు తగ్గడం హానికరం..
త్వరగా బరువు తగ్గడం అనేది సాధారణంగా ఆరోగ్యమైనది కాదు. తరుచుగా నీరు, కండరాలను కోల్పోతుందే గానీ కొవ్వులను కాదు. ఇక్కడ క్రీడాకారులు, అథ్లెట్లు నిర్థిష్ట బరువుని త్వరితగతిన మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వారి విషయంలో ఆచరణాత్మకమైనదే తప్ప మిగతావారికి కాదని అన్నారు. అందరూ సమతుల్య ఆహారం, వ్యాయామాలతో కొవ్వుని తగ్గించుకునే యత్నం చేసి బరువు తగ్గడమే ఆరోగ్యకరం అని చెప్పారు నిపుణులు.
అంతేగాదు వారానికి కిలో లేదా అరకిలో చొప్పున బరువు తగ్గడం మంచిదని చెప్పుకొచ్చారు. వేగవంతంగా బరువు తగ్గడం ఆసక్తికరంగా అనిపించినా..దీర్ఘకాలిక ఆరోగ్యపరంగా మంచిది కాదని తేల్చి చెప్పారు. సురక్షిత మార్గంలో బరువు తగ్గే ప్రయత్నాలే ఆరోగ్యాని మేలు చేస్తాయని నొక్కి చెప్పారు. ఇక్కడ వినేశ్ ఫోగట్ విషయంలో నిపుణులు, వైద్య విజిలెన్స్ పర్యవేక్షణలో ఈ వ్యూహాలు అనుసరించడం జరిగిందనేది గ్రహించాలని నిపుణులు అన్నారు.
(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !)
Comments
Please login to add a commentAdd a comment