ఖాళీ కడుపుతో వ్యాయామం చేయొచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరి మనుసులో మెదిలే సందేహమే ఇది. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అసలు ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల మంచిదేనా..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు వర్కౌట్‌లు చేయడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యకరమైన రీతిలో చేస్తేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు. చాలామంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడమే మంచిదని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ఉత్తమ ఫలితాలు పొందేందుకు ఇది సరైనదే కానీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి వారి ఆరోగ్య రీత్యా పరిస్థితి భిన్నంగా ఉంటుందనేది గ్రహించాలి.
ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలు..
ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే.. దాన్ని ఫాస్టెడ్ కార్డియో అంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారానికి బదులుగా నిల్వ చేయబడిన కొవ్వు, కార్బోహైడ్రేట్ల నుంచి శరీరం శక్తిని ఉపయోగించుకుంటుంది. బరువు తగ్గడం సులభమవుతుంది గానీ కొందరిలో ఇది అధిక కొవ్వు నష్టానికి దారితీయొచ్చు.
ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు వ్యాయామాలు బరువు నిర్వహణకు సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2016 నుంచి జరిపిన అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు అల్పాహారం తీసుకోని వ్యక్తులు ఎక్కువ కొవ్వును కరిగిస్తారని తేలింది. అయితే ఈ వాస్తవాన్ని తోసిపుచ్చే ఒక అధ్యయనం ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. 2014 అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు తిన్న లేదా ఉపవాసం ఉన్న సమూహాల మధ్య శరీర కూర్పు మార్పులలో గణనీయమైన తేడా లేదు. అధ్యయనం కోసం, పరిశోధకులు నాలుగు వారాల పాటు శరీర బరువు, కొవ్వు శాతం, నడుము చుట్టుకొలతలను తీసుకున్నారు. అయితే అధ్యయనంలో ఈ రెండు గ్రూపులు బరువు, కొవ్వు ద్రవ్యరాశిని కోల్పోయినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇక్కడ ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినప్పుడు శరీరం ప్రోటీన్‌ను శక్తి వనరుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో పని చేయడం వల్ల శరీరం తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే వ్యాయామానికి ముందు తినకపోతే స్ప్రుహ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి తలనొప్పి, వికారంకు దారితీస్తుంది.
వ్యాయామానికి ముందు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
వర్కౌట్లకు ముందు ఆహారం తీసుకోవడం వల్ల వర్కౌట్‌లు చేయగలిగేలా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు శరీరం దానిని గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది ప్రాధమిక శక్తి వనరుగా పనిచేసి ఎక్కవ వర్కౌట్లు చేసేందుకు ఉపయోగపడుతుంది.
అంతేగాదు కండరాల సంరక్షణలో సహాయపడుతుంది. ఇక్కడ శారీరక శ్రమ చేసినప్పుడు,శరీరం శక్తి నిల్వల కోసం చూస్తుంది. ఎప్పుడైతే తినకుండా వ్యాయామాలు చేస్తామో అప్పుడూ కండరాల కణజాలం విచ్ఛిన్నం కావడం మొదలై కండరాల నష్టానికి దారి తీస్తుంది. అందువల్ల, వ్యాయామానికి ముందు తింటే ఇలాంటి నష్టాన్ని నివారించవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment