work out
-
శిల్పంలాంటి ముఖాకృతి కోసం..!
సినీ తారలు, సెలబ్రిటీల ముఖాలు చాలా ప్రకాశవంతంగా రిఫ్రెష్‌గా కనిపిస్తాయి. వాళ్ల ముఖాల్లో ఇంత గ్లో ఎలా సాధ్యమవుతోంది?. అందరికి వ్యక్తిగతంగా ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు కామన్‌గానే ఉంటాయి. అయినా అవేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకుండా భలే ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తాయి. అందుకు బ్యూటీ పార్లర్లు, ఫేస్ క్రీంలు మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. సినీస్టార్లు ప్రముఖులు, వర్కౌట్లు, వ్యాయామాల తోపాటు ఫేస్ యోగా కూడా చేస్తారని, అది వారి దైనందిన జీవితంలో భాగమమని చెబుతున్నారు. అదే వారి అందమైన ముఖాకృతి రహస్యం అని చెబుతున్నారు. అసలేంటి ఫేస్ యోగా?. ఎలా చేస్తారంటే..?ప్రస్తుత రోజుల్లో ఫేస్ యోగా చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన వర్కౌట్‌గా మారింది. ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేయడమే గాక చెక్కిన శిల్పంలా ముఖాకృతి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను కనిపించనివ్వదు, అలాగే ముడతలను నివారిస్తుంది. ఈ ఫేస్ యోగా ముఖం, మెడలోని మొత్తం 57 కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేగాదు రక్తప్రసరణ మెరుగ్గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖానికి మంచి మసాజ్‌లా ఉండి సెలబ్రిటీల మాదిరి ముఖాకృతిని పొందేలా చేస్తుందన్నారు. ఎలా చేయాలంటే.. ఫిష్ ఫేస్:ముఖాన్ని చేప మాదిరిగా.. రెండు బుగ్గలను లోపలకు గట్టిగా లాగాలి. ఇది బుగ్గలు, దవడలలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ఐదు నుంచి పది సెకన్లు ఉంటే చాలు.'O' మాదిరిగా నోరు తెరవడం..మధ్య ముఖ ప్రాంతాన్ని ఎత్తి చేస్తాం. అంటే ఆంగ్ల అక్షరం 'o' అని పెద్దగా నోరు తెరిచి ఉంచాలి. ఇలా పది నుంచి 15 నిమిషాలు చేయాలి. ఇది ముఖం కుంగిపోకుండా నివారిస్తుంది.ముఖంపై సున్నితంగా టచ్ చేయడం..నుదిటి కండరాల నుంచి ఒత్తిడిని విడుదల చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే కోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు చేతులను నుదిటిపై నుంచి మెడ వరకు సుతి మెత్తంగా టచ్ చేస్తూ పోవాలి.ది ఐ ఓపెనర్కళ్లకు సంబంధించిన వ్యాయామం. కళ్లను పెద్దవిగా చేసి అటు ఇటూ తిప్పడం. అలాగే కొద్దిసేపు గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. కళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. కనురెప్పలు కుంగిపోకుండా చేస్తుంది. కిస్సింగ్ అండ్ స్మైలింగ్ పోస్ముఖాన్ని ఇంటి పైకపు చూస్తున్నట్లుగా పైకెత్తాలి. ఈ భంగిమలో పైకి చూస్తూ..కాసేపు నవ్వడం, కిస్ చేస్తున్నట్లుగా గడ్డం పైకెత్తడం వంటివి చేయాలి.ప్రయోజనాలు..వృద్ధాప్య సమస్యలకు చక్కటి సహజసిద్ధమైన పరిష్కారంచర్మపు స్థితిస్థాపకతను పెంచుతుందిముడతలను తగ్గిస్తుందిధృడమైన యవ్వన రూపాన్ని అందిస్తుంది. ముఖ ఉద్రిక్తతను తగ్గించి, ఉబ్బడాన్ని నివారిస్తుంది.చెంప ఎముకలను చక్కటి ఆకృతిలో ఉండేలా చేస్తుందికను రెప్పలు వంగిపోకుండా నివారిస్తుందిఅలాగే ముఖాకృతిని మెరుగుపరుస్తుంది -
తొమ్మిది పదుల వయసులోనూ ఫిట్‌గా, ఆరోగ్యంగా..
ఈ బామ్మ ఫిట్నెస్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఈ ఏజ్‌లోనూ ఎంతో చలాకీగా వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. రెస్ట్ తీసుకునే వయసులో తనకు వీలైన విధంగా సింపుల్ వ్యాయామాలు చేస్తున్నారు. అదికూడా ఏ రోజు స్కిప్ చేయకుండా చేస్తుందట. ఫిటనెస్ పట్ల ఆమె కనబరుస్తున్న నిబద్ధతకు సలాం కొట్టకుండా ఉండలేరు. వృద్ధాప్యంలోనూ మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?. ఈ బామ్మలా చలాకీగా వ్యాయమాలు చేయాలంటే..ఫిట్నెస్కి నిజమైన స్ఫూర్తి 90 ఏళ్ల జే. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా వ్యాయామాలు చేస్తుంది. చాలా చురుకుగా తన దినచర్యను పూర్తిచేస్తుంటుంది. జే 30 స్క్వాట్లు (సపోర్ట్ కోసం ఫ్రిజ్‌ని పట్టుకుని మరీ..) 25 సిట్-అప్లు, 30-సెకండ్ ప్లాంక్ , పదివేల అడుగులు నడవడం తదితరాలన్నింటిని చేస్తుంది. మాములుగా అయితే ఎవ్వరైనా ఓ రెండు, మూడు రోజులు చేసి వదిలేస్తారు. కానీ ఈ బామ్మ అలాకాదు. ప్రతిరోజూ చక్కగా వ్యాయామాలు చేస్తుంది. ఇలా ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్లు చేయడం ముఖ్యం అని చేతల్లో చూపించింది జెనీ బామ్మ. వృద్ధాప్యంలో కూడా జే బామ్మలానే చక్కగా వీలైనన్నీ వ్యాయామాలు చేస్తే అనారోగ్యం బారిన పడరు, పైగా హాయిగా చివరి రోజులు సాగిపోతాయి. ఈ సందర్భంగా వృద్ధులు ఈజీగా వేయగలిగే సింపుల్ వ్యాయామాలను చూద్దామా..!. చైర్ స్క్వాట్లు: కాలు కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్యతకు స్క్వాట్లు మంచివి. ఇవి లేచి నిలబడి, కూర్చీలోంచి నెమ్మదిగా కూర్చవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఉండదు. పైగా సులభంగా చేయగలుగుతారు. వాల్ పుష్-అప్స్: ఇవి ఎగువ శరీర బలాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వృద్ధులు నేలకు బదులు గోడను ఆసరా చేసుకుని చెయ్యొచ్చు. కూర్చునే మార్చింగ్: కూర్చీలో కూర్చొని ఆర్మీ మాదిరిగా మార్చింగ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపరడటమే గాక కాలు కండరాలు బలోపేతమవుతాయి.లైట్ వెయిట్స్తో ఆర్మ్ రైజ్‌లు: భుజం ఎత్తుకు చేతులు ఎత్తడం వల్ల భుజాల పైభాగంలో ఉన్న కండరాలు బలపడతాయి. చీలమండల భ్రమణాలు: కూర్చీలో కూర్చొని మడమలను ముందుకు వెనుకకు సవ్య-అపసవ్య దిశల్లో తిప్పడం వల్ల కాళ్లో చక్కటి రక్తప్రసరణ జరిగి.. అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు) -
గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం సహజం. చెయిర్లో లేదా యోగా మ్యాట్ మీద కూర్చుని చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయి. వీటిని సాధన చేయడం వల్ల పొట్ట భాగం చదునుగా అవుతుంది. దీంతోపాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాల గురించి తెలుసుకొని, ఆచరణ లో పెడదాం.. సీటెడ్ లెగ్ లిఫ్ట్స్కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలపై అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలిని కూడా అదేవిధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. కుర్చీ హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్లపాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీనివల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజులు చేసేటప్పుడు చెయిర్ గట్టిగా, ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆబ్లిక్ ట్విస్ట్నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి అదే భంగిమలో కొద్దిగా పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధాస్థితికి రావాలి. ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ వ్యాయామాన్ని చేయచ్చు. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. సీటెడ్ బైస్కిల్ పెడల్స్ చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. టో టచెస్కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధాస్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. (చదవండి: ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాదులను నివారించొచ్చు..!) -
వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి అక్టోబర్ 5న తీవ్రమైన వర్కవుట్ సెషన్లో వెన్నుకి గాయమయ్యింది. ఆమె జిమ్‌లో బ్యాక్బ్రేస్ని ధరించకుండా 80 కిలోల డెడ్లిఫ్ట్ని నిర్వహించి వెన్ను నొప్పి బారిన పడింది. అయినా లెక్క చేయక ఆ తర్వాత కూడా వర్కౌట్ సెషన్‌ని కొనసాగించింది. దీంతో ఆమె వెన్నుకి తీవ్ర గాయమయ్యింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నిజానికి ఈ డెడ్‌లిఫ్ట్ వర్కౌట్స్‌ని ఒత్తిడిని నివారించడానికి, వెన్ను కండరాలను బలోపేతం చేయడానికి ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇవి చేసేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ నిపుణుల ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాలతో చేయాలి. ఇక్కడ రకుల్లా గాయాల బారిన పడకుండా వెనుక కండరాలను బలోపేతం చేసే కొన్ని ప్రభావవంతమైన వ్యాయామాలు ఏంటో సవివరంగా చూద్దామా..!వార్మ్-అప్వార్మప్తో వ్యాయామాన్ని ప్రారంభించడం చాలా అవసరం. 5 నుంచి 10 నిమిషాల మితమైన కార్డియోతో ప్రారంభించండి, ఆపై ఫోర్స్‌గా చేసే వ్యాయామాలకు సిద్ధమయ్యేలా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండిరెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్చాలా మంది వ్యక్తులు రెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్ వ్యాయామాలతో తమ బ్యాక్ వర్కౌట్‌ను ప్రారంభిస్తారు. ఈ వ్యాయామం చాలా ప్రభావవంతమైనది. సుమారు 15 నుంచి 20 చొప్పున 1 లేదా 2 సెట్లను పూర్తి చేసేలా మంచి రిసిస్టెన్స్ బ్యాండ్‌ను ఎంచుకోవాలి. లాట్ పుల్డౌన్ఈ వ్యాయామాన్ని రెసిస్టెన్స్ బ్యాండ్‌తో లేదా జిమ్‌లో మెషీన్ సాయంతో పూర్తి చేయవచ్చు. ఈ వ్యాయామం వెనుక డెల్టాయిడ్లు, రోంబాయిడ్స్, కండరపుష్టి, ముంజేతులతో పాటు మధ్య, దిగువ వెనుక కండరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. బలమైన వెన్ను కండరాలు కావాలనుకునే వారికి ఇది ముఖ్యమైన వ్యాయామం.క్వాడ్రూప్డ్ సింగిల్ ఆర్మ్ డంబెల్ రోకదలిక ఎగువన ఓవర్-రోయింగ్ కదలిక దిగువన ఎక్కువగా సాగదీయడం వంటి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఏదైనా ఇతర రోయింగ్ కదలికలను పూర్తి చేయడానికి ఈ వ్యాయామాన్ని సిఫార్సు చేస్తారు నిపుణులు.(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి) -
వినేశ్ ఫోగట్ ఓవర్‌నైట్ వర్కౌట్లు..ఇలా చేస్తే బరువు తగ్గుతారా?!
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. అందరూ ఆమెను ఆమెను ఒక్క క్రీడాకారిణిగానే కాకుండా ఒక పోరాట యోధురాలిగా చూశారు. రెజ్లింగ్ ప్రపంచంలో ఆమె ఎన్నో పెద్ద విజయాలు అందుకుంది. ఆమె కెరీర్లో మిగిలిపోయిన ఒలిపింక్ పతకం గెలుచుకుందామన్న సమయంలో.. ఆ కొద్ది బరువు ఆటే ఆడకుండా చేసి జీవితకాలపు విషాదాన్ని మిగిల్చింది.అయితే ఈ ఉదంతానికి ముందు ఆమె బరువు తగ్గేందుకు ఓవర్ నైట్ పడ్డ కష్టం గురించి ఆమె కోచ్ చెప్పిన విషయాలు అందర్నీ షాక్‌కు గురిచేశాయి. ఆమె బరువు ఎక్కువగా ఉందని తగ్గించేందుకు నీళ్లు తాగకుండా, ఓవర్‌నైట్ అంతా కసరత్తులు చేసి, జుట్టు కత్తిరించి ఇలా ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. అయినా ఆమె కష్టం వృధాగా మిగిలి తీరని బాధను మిగిల్చిందని చెప్పారు కోచ్. ఇక్కడ బరువుతగ్గేందుకు ఓవర్‌నైట్ వ్యాయామాలు అనేవి ఒక్కసారిగా అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. ఇలా చేయడం ఆరోగ్యకరమేనా? నిజానికి రాత్రిపూట వ్యాయామాలతో బరువు తగ్గగలమా అంటే..ఇలా ఓవర్‌నైట్‌లో కాస్త ఎక్కువగా వ్యాయామాలు చేస్తే ఓ వ్యక్తి మహా అయితే ఒకటిన్నర్ లేదా రెండు కేజీల బరువు తగ్గగలరని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా శ్వాస, చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది కాబట్టి తాత్కాలికంగా బరువు తగ్గుతాం. అలాగే తాత్కాలికంగా కొద్దిపాటి కొవ్వు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రెజ్లర్లు, ఒలింపిక్ అథ్లెట్లు పోటీ అవసరాల కోసం ఇటువంటి స్వల్సకాలిక బరువు నిర్వహణ వ్యూహాలను తమ కోచ్, పోషకాహార నిపుణుల ఆధ్వర్యంలో అనుసరిస్తుంటారు. ఇవి క్రీడాకారులు పోటీ పడేందుకు చేసే కసరత్తులు. సాధారణ వ్యక్తులు ఇవి అనుసరించేందుకు ఆమోదయోగ్యమైనవి కావని చెబుతున్నారు నిపుణులు. వేగవంతంగా బరువు తగ్గడం హానికరం..త్వరగా బరువు తగ్గడం అనేది సాధారణంగా ఆరోగ్యమైనది కాదు. తరుచుగా నీరు, కండరాలను కోల్పోతుందే గానీ కొవ్వులను కాదు. ఇక్కడ క్రీడాకారులు, అథ్లెట్లు నిర్థిష్ట బరువుని త్వరితగతిన మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వారి విషయంలో ఆచరణాత్మకమైనదే తప్ప మిగతావారికి కాదని అన్నారు. అందరూ సమతుల్య ఆహారం, వ్యాయామాలతో కొవ్వుని తగ్గించుకునే యత్నం చేసి బరువు తగ్గడమే ఆరోగ్యకరం అని చెప్పారు నిపుణులు. అంతేగాదు వారానికి కిలో లేదా అరకిలో చొప్పున బరువు తగ్గడం మంచిదని చెప్పుకొచ్చారు. వేగవంతంగా బరువు తగ్గడం ఆసక్తికరంగా అనిపించినా..దీర్ఘకాలిక ఆరోగ్యపరంగా మంచిది కాదని తేల్చి చెప్పారు. సురక్షిత మార్గంలో బరువు తగ్గే ప్రయత్నాలే ఆరోగ్యాని మేలు చేస్తాయని నొక్కి చెప్పారు. ఇక్కడ వినేశ్ ఫోగట్ విషయంలో నిపుణులు, వైద్య విజిలెన్స్ పర్యవేక్షణలో ఈ వ్యూహాలు అనుసరించడం జరిగిందనేది గ్రహించాలని నిపుణులు అన్నారు.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !) -
ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయొచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరి మనుసులో మెదిలే సందేహమే ఇది. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అసలు ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల మంచిదేనా..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు వర్కౌట్లు చేయడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యకరమైన రీతిలో చేస్తేనే మంచి ఫలితాలను పొందగలుగుతారు. చాలామంది ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడమే మంచిదని గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ఉత్తమ ఫలితాలు పొందేందుకు ఇది సరైనదే కానీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొంతమంది వ్యక్తులు వారి జీవక్రియ, శక్తి స్థాయిలను బట్టి వ్యాయామానికి ముందు ఏదైనా తినవలసి ఉంటుంది. ప్రతి వ్యక్తికి వారి ఆరోగ్య రీత్యా పరిస్థితి భిన్నంగా ఉంటుందనేది గ్రహించాలి. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలు..ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే.. దాన్ని ఫాస్టెడ్ కార్డియో అంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారానికి బదులుగా నిల్వ చేయబడిన కొవ్వు, కార్బోహైడ్రేట్ల నుంచి శరీరం శక్తిని ఉపయోగించుకుంటుంది. బరువు తగ్గడం సులభమవుతుంది గానీ కొందరిలో ఇది అధిక కొవ్వు నష్టానికి దారితీయొచ్చు.ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు వ్యాయామాలు బరువు నిర్వహణకు సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2016 నుంచి జరిపిన అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు అల్పాహారం తీసుకోని వ్యక్తులు ఎక్కువ కొవ్వును కరిగిస్తారని తేలింది. అయితే ఈ వాస్తవాన్ని తోసిపుచ్చే ఒక అధ్యయనం ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. 2014 అధ్యయనం ప్రకారం, వ్యాయామం చేసే ముందు తిన్న లేదా ఉపవాసం ఉన్న సమూహాల మధ్య శరీర కూర్పు మార్పులలో గణనీయమైన తేడా లేదు. అధ్యయనం కోసం, పరిశోధకులు నాలుగు వారాల పాటు శరీర బరువు, కొవ్వు శాతం, నడుము చుట్టుకొలతలను తీసుకున్నారు. అయితే అధ్యయనంలో ఈ రెండు గ్రూపులు బరువు, కొవ్వు ద్రవ్యరాశిని కోల్పోయినట్లు పరిశోధకులు గుర్తించారు.ఇక్కడ ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినప్పుడు శరీరం ప్రోటీన్‌ను శక్తి వనరుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది.ఖాళీ కడుపుతో పని చేయడం వల్ల శరీరం తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే వ్యాయామానికి ముందు తినకపోతే స్ప్రుహ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి తలనొప్పి, వికారంకు దారితీస్తుంది.వ్యాయామానికి ముందు తినడం వల్ల కలిగే ప్రయోజనాలువర్కౌట్లకు ముందు ఆహారం తీసుకోవడం వల్ల వర్కౌట్లు చేయగలిగేలా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు శరీరం దానిని గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది ప్రాధమిక శక్తి వనరుగా పనిచేసి ఎక్కవ వర్కౌట్లు చేసేందుకు ఉపయోగపడుతుంది.అంతేగాదు కండరాల సంరక్షణలో సహాయపడుతుంది. ఇక్కడ శారీరక శ్రమ చేసినప్పుడు,శరీరం శక్తి నిల్వల కోసం చూస్తుంది. ఎప్పుడైతే తినకుండా వ్యాయామాలు చేస్తామో అప్పుడూ కండరాల కణజాలం విచ్ఛిన్నం కావడం మొదలై కండరాల నష్టానికి దారి తీస్తుంది. అందువల్ల, వ్యాయామానికి ముందు తింటే ఇలాంటి నష్టాన్ని నివారించవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా..!) -
యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!
కోలీవుడ్ నటుడు రంగనాథ్ మాదవన్ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, విమర్శకుల ప్రశంసలందకున్నారు. మాధవన్ తన అభినయ నటనకుగానూ రెండు ఫిలింఫేర్ పురస్కరాలు అందుకున్నాడు. దాదాపు ఏడు భాషల్లో నటించారు. ఆయన రచయిత కూడా. మాధవన్ సినీ ప్రయాణం టీవీ సీరియల్ నుంచి మొదలై అలా 2000లో వచ్చిన 'అలై పాయుదే; అదే తెలుగులో 'చెలి'(2001) మూవీ నుంచి వెనుతిరిగి చూడకుండా విజయపథంలోకి దూసుకుపోయారు. ఐదు పదుల వయసుకు చేరువైన మాధవన్ ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా మంచి స్మార్ట్ లుక్‌లో కనిపిస్తారు. అంతలా గ్లామరస్‌గా కనిపించడానికి మాధవన్ ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా! వర్కౌట్లు.. మాదవన్ ఫిట్నెస్కి పెట్టింది పేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. చక్కటి బాడీ మెయింటెయిన్ చేసేందుకు కఠిన వర్కౌట్లు డైలీ లైఫ్‌లో భాగం. దాదాపు 30 నిమిషాల పాటు కార్డియో సెషన్ ప్రారంభిస్తాడు. ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, ఎలిప్టికల్ మెషీన్ వంటివి ఉంటాయి. ఆయన స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుల్ అప్స్లు తప్పనిసరిగా చేస్తాడు. అవి అతని హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని కనీసం మూడు నుంచి నాలుగు సెట్ల వారీగా ప్రతిసెట్లో కనీసం ఎనిమిది నుంచి 12 కసరత్తుల చొప్పున చేస్తారు. అలాగే ఒత్తడిని దూరం చేసుకునేలా ధ్యానం వంటివి చేస్తారు సముతుల్య ఆహారం, పోషకాలతో కూడిన ఆహారాలను డైట్లో ఉండేలా చూసకుంటారు. కానీ తినాలనుకున్నది మాత్రం కడుపు నిండుగా తింటాని చెబుతున్నాడు మాధవన్. అయితే అందుకు తగ్గట్టుగానే కసరత్తులు కూడా చేస్తానని అంటున్నాడు. డైట్.. చికెన్, చేపలు, కాయధాన్యాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. శక్తినిచ్చేలా బ్రౌన్ రైస్, క్వినోవా, చిలగడదుంప, తదితరాలను తీసుకుంటారు. అలాగే ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయాలు ఉండేలా చూసుకుంటారు. పైగా శరీరానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అందేలా జాగ్రత్త పడతారు. తన వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణుడు సాయంతోనే మంచి డైట్ ఫాలో అవుతారు మాధవన్. (చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?) -
Jyothika-Suriya Workout: జిమ్‌లో సూర్య- జ్యోతిక కసరత్తులు.. ఫోటోలు వైరల్!
-
జీవితంలో ఇద్దరి మధ్యా సమస్యలు వస్తాయని తెలుసు : సమంత
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు, పర్సనల్ లైఫ్, ఫిట్నెస్ సహా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. సమంత ఫిట్నెస్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. అందులో సామ్ వర్కవుట్స్ చేస్తుంటే, తన పెట్స్ హాష్, సాషాలు గొడవ పడుతుంటాయి. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. జీవితంలో సిబ్లింగ్స్ మధ్య సమస్యలు వస్తుంటాయని నాకు తెలుసు అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చింది. అయితే గొడవ పడ్డా మళ్లీ ఒక్క నిమిషంలోనే అవి కలిసిపోయాయంటూ ఫోటోలను షేర్ చేసింది. #samantha 😍🔥 pic.twitter.com/azEAdiLfoX — Cinema Updates (@mastervijay2020) March 4, 2022 -
హీరో రామ్ పోతినేనికి గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్
Ram Pothineni Got Injured : హీరో రామ్ పోతినేని గాయాలపాలయ్యారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్ చేశాడు. దీంతో 'రామ్ త్వరగా కోలుకోవాలి..గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రామ్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయాలపాలయ్యారు. RAPO19గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రామ్‌కి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. View this post on Instagram A post shared by RAm POthineni (@ram_pothineni) -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న నాగశౌర్య.. ఫోటో వైరల్
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలో సత్తా చాటుతున్న యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదిచుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో జిమ్ వర్కవుట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో నాగ శౌర్య మాచో రిప్డ్ లుక్‌లో కండలు కండలు తిరిగిన దేహదారుఢ్యంతో కనిపిస్తున్నాడు. ఇక గతంలోనూ లక్ష్య సినిమా కోసం 8 ప్యాక్ బాడీతో పాటు పోనీ టెయిల్‌తో ఉన్న శౌర్య లుక్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ కసరత్తులే చేస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి : రెమ్యునరేషన్ బీభత్సంగా పెంచిన యంగ్ హీరో నితిన్ డేరింగ్ స్టెప్: షూటింగ్ మొదలు -
అలా చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది : సమంత
ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు సమంత. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారీ బ్యూటీ. తాజాగా వర్కౌట్స్ గురించి సమంత మాట్లాడుతూ – ‘‘రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు రోజులో ఓ గంట సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించాలి. ఉదయాన్నే వ్యాయామం లేదా యోగాతో రీచార్జ్ అయితే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అందుకే తప్పకుండా వ్యాయామం చేయండి. మంచి శరీరాకృతి, అందం కోసమే నేను వర్కౌట్స్ చేయాలనుకోను. వర్కౌట్స్ చేసిన తర్వాత వచ్చే మంచి ఫీల్, నాలో వచ్చే కొత్త ఉత్సాహం కోసం చేస్తుంటాను’’ అని అన్నారు. -
బేబీ బంప్‌తో వర్కవుట్ ఫోటో షేర్ చేసిన నటి
ముంబై : బాలీవుడ్ నటి, మోడల్ లీసా హెడెన్ ఇటీవలె తాను మూడోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేసుకునే లీసా తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను పంచుకుంది. గర్భిణీగా ఉన్నా డాక్టర్ల సూచనలతో వ్యాయామం చేస్తున్నారు. ఈ మేరకు ఇండోర్ సైక్లింగ్ వర్కవుట్ సెషన్‌కు ముందు అద్దంలో చూస్తూ బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లీసా హెడెన్... తల్లి పాల ఆవశ్యకత, పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి తల్లులకు అవగాహన కల్పించడం వంటి సామాజిక దృక్పథం కలిగిన అంశాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాగా చెన్నైలో జన్మించిన లీసా హేడెన్ మోడల్‌గా కెరీర్ ఆరంభించి బీ-టౌన్లో అడుగుపెట్టారు. చాలా ఏళ్లపాటు, హాంకాంగ్‌లోనే ఉన్న ఆమె... 'హౌస్‌ఫుల్-2', 'క్వీన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక 2016లో వ్యాపారవేత్త డినో లల్వానీని పెళ్లాడిన లీసా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. వారికి ఇద్దరు కుమారులు జాక్ లల్వానీ, లియో లల్వానీ ఉన్నారు. చదవండి : (మూడోసారి తల్లి కాబోతున్న నటి) (భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక) -
భార్యతో కలిసి రోహిత్ శర్మ ఫిట్నెస్ వీడియో
రోజు వర్క్అవుట్స్ చేద్దామనుకొని మీరు చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి వర్క్అవుట్స్ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై రోహిత్ శర్మ సహచరుడు యజువేంద్రచహల్ కూడా ఫన్నీగా స్పందించారు. సోషల్ మీడియలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రోహిత్ శర్మ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మొన్న దుబాయ్ వెళుతున్న సమయంలో తన కూతురు వస్తువులు ప్యాక్ చేయడంలో సాయం చేస్తున్న వీడియోను షేర్ చేసిన రోహిత్ తాజాగా తన భార్యతో కలిసి వర్క్అవుట్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. దీనికి కలిసి ‘శక్తిమంతమవుదాం’ అనే క్యాప్షన్‌కి తోడు దానికి ఒక బ్లూకలర్ ఎమోజీని జోడించాడు. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తున్నారు. కపుల్ గోల్స్ యట్ పీక్స్ అంటూ కొందరు కామెంట్ చేశారు. యజువేంద్ర చహల్ మాత్రం ఈ వీడియోపై చాలా ఫన్నీగా స్పందించారు. ఏంటి వదిన, భయ్యా నీతో కలిసి ఐపీఎల్ ఓపెనింగ్ ఆడుతున్నాడా? అని కామెంట్ చేశారు. View this post on Instagram Stronger together 💙 A post shared by Rohit Sharma (@rohitsharma45) on Aug 25, 2020 at 1:14am PDT చదవండి: రోహిత్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం -
82వ వసంతంలోకి ఉషా సోమన్
న్యూఢిల్లీ : పుష్-అప్స్, లాంగ్రన్స్తో ఫిట్‌నెస్‌లో తనకు తానే సాటిగా నిరూపించుకున్న ఉషా సోమన్ 82వ వసంతంలోకి అడుగుపెట్టారు. బర్త్‌డే సందర్భంగా ఒకేసారి ఏకధాటిగా 15 పుష్అప్స్ చేసి మరోసారి తన మార్క్ చూపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బామ్మగారి ఫిట్నెస్కి ఎంతోమంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఫిట్నేస్ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్న ఉషా సోమన్.. మన టాప్ ఇండియన్ మోడల్ మిలింద్ సోమన్ తల్లి. . గతంలోనూ మిలింద్ భార్య అంకితా కొన్వర్తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్ జంప్స్ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్-అప్స్, వర్కఅవుట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉష సోమన్ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్-అప్లు చేస్తున్న వీడియో కూడా ఫిట్నెస్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్కు పోటీగా ఒకేసారి 16 పుష్-అప్లు చేసిన వీడియోను ఉమెన్స్ డే సందర్భంగా షేర్ చేశాడు. అలాగే 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో మలింద్తో పాటు ఆయన తల్లి ఉష కూడా పాల్గొన్న వీడియో మదర్స్ డే సందర్భంగా పంచుకున్నాడు. ఇలా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్నెస్తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలుగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మలింద్ సోషల్ మీడియాలో పంచుకంటుంటాడు. (వైరల్: సినిమాను తలపించే పోలిస్ ఛేజింగ్! ) View this post on Instagram 3rd July 2020. 81 amazing years celebrated with birthday in lockdown. Party with 15pushups and a jaggery vanilla almond cake baked by @ankita_earthy 😀 happy birthday Aai 🤗🤗🤗 keep smiling !! . . . #livetoinspire #keepmoving #neverstop #FitnessAddict #love #health #happybirthday A post shared by Milind Usha Soman (@milindrunning) on Jul 4, 2020 at 11:48pm PDT -
ఇదే నా టాప్ ఎక్సర్సైజ్: విరాట్ కోహ్లి
-
రన్నింగ్ ఒక్కటే మెదడుకు మంచిది
న్యూయార్క్: మానవులు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తెలివితేటలు పెరుగుతాయని గ్రీకులు, రోమన్ల కాలం నుంచి వస్తున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని శాస్త్ర విజ్ఞానపరంగా నిరూపించేందుకు గత రెండు దశాబ్దాలుగా న్యూరోసైన్స్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ వస్తున్నారు. శారీరక వ్యాయామం చేయడం ద్వారా మెదడులోని కణాల అభివృద్ధికి తోడ్పడే ప్రొటీన్లు పెరుగుతాయని, కణాలు పెరగడం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఇది పాక్షికంగా మాత్రమే నిజం. మెదడులో జ్ఞాపకశక్తి విస్తరించడానికి, కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి మెదడు కణాల్లో జరిగే జీవన క్రియను వైద్య పరిభాషలో హిప్పోక్యాంపస్ అని పిలుస్తాం. ఈ హిప్పోక్యాంపస్ ప్రక్రియ అభివృద్ధి చెందడానికి శారీరక వ్యాయామం తోడ్పడుతుందనే విషయం కూడా వాస్తవమే. అయితే ఎలాంటి వ్యాయామం వల్ల ఈ ప్రక్రియ అభివృద్ధి చెందుతుందనే విషయం ఇంతకాలం సంక్లిష్టంగా ఉంటూ వచ్చింది. కొందరు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని, ఏరోబిక్స్ చేస్తే మెదడు క్రియాశీలకంగా మారుతుందని, జిమ్‌కెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మెదడు కణాలు అభివృద్ధి చెందుతుందని, ఏరకమైన ఎక్సర్సైజ్ అయినా మెదడుకు మంచిదేనని రకరకాలుగా చెబుతున్న వారు ఎందరో ఉన్నారు. శరీరంలో కొవ్వు కరగడానికి, కండరాలు బలపడడానికి ఏ వ్యాయామమైనా సరిపోవచ్చుగానీ తెలివితేటలు పెరిగేందుకు తోడ్పడే మెదడు కణాల అభివృద్ధికి మాత్రం పరుగెత్తడం ఒక్కటే మార్గమని ఇటీవల జరిపిన రెండు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో ఓ అధ్యయనాన్ని ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించగా, మరో అధ్యయనాన్ని ‘సెల్ మెటబాలిజమ్’ తన తాజా సంచికలో వెల్లడించింది. ఈ అధ్యయనాలు జరిపిన రెండు బృందాలు వేర్వేరుగా హెచ్ఐటీ, ఆర్టీ వ్యాయామాలు చేసిన వారిలోని మెదడు కణాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. హెచ్ఐటీ అంటే హై ఇంటెన్సిటివ్ ఇంటర్వెల్ ట్రేనింగ్, అంటే ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయడం, ఆర్టీ అంటే రిసిస్టెంగ్ ట్రేనింగ్, అంటే వెయిట్ లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు చేయడం. ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాలు స్వల్పంగా అభివృద్ధి చెందాయి. వెయిట్‌లిఫ్టింగ్ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు పరుగెత్తే వారి మెదడులో కలిగిన మార్పులను అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా వారిలో హిప్పోక్యాంపస్ ప్రక్రియ వేగవంతమై మెదడులోని కణాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పాత కణాలు బలపడడమే కాకుండా కొత్త కణాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ పరిశోధనల ద్వారా పరుగెత్తడమే మెదడుకు మంచిదని, జ్ఞాపక శక్తి పెరిగి తెలివి తేటలుపెరుగుతాయని పరిశోధకులు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. రోజూ పరుగెత్తే వారందరికి తెలివి తేటలు వాటంతట అవే వస్తాయనుకుంటే పొరపాటు. అలా అయితే పోటీల్లో పాల్గొనే రన్నర్లు అందరూ తెలివితేటలు కలిగిన వారై ఉండాలి. తెలివితేటలు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన శక్తి మాత్రమే మెదడుకు సంక్రమిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులపై దృష్టిని కేంద్రకరిస్తే వాటిల్లో మన తెలివితేటలు పెరుగుతాయి.