సినీ తారలు, సెలబ్రిటీల ముఖాలు చాలా ప్రకాశవంతంగా రిఫ్రెష్‌గా కనిపిస్తాయి. వాళ్ల ముఖాల్లో ఇంత గ్లో ఎలా సాధ్యమవుతోంది?. అందరికి వ్యక్తిగతంగా ఏవేవో టెన్షన్‌లు, ఒత్తిడులు కామన్‌గానే ఉంటాయి. అయినా అవేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకుండా భలే ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తాయి. అందుకు బ్యూటీ పార్లర్‌లు, ఫేస్ క్రీంలు మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. సినీస్టార్‌లు ప్రముఖులు, వర్కౌట్లు, వ్యాయామాల తోపాటు ఫేస్ యోగా కూడా చేస్తారని, అది వారి దైనందిన జీవితంలో భాగమమని చెబుతున్నారు. అదే వారి అందమైన ముఖాకృతి రహస్యం అని చెబుతున్నారు. అసలేంటి ఫేస్ యోగా?. ఎలా చేస్తారంటే..?
ప్రస్తుత రోజుల్లో ఫేస్ యోగా చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన వర్కౌట్‌గా మారింది. ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేయడమే గాక చెక్కిన శిల్పంలా ముఖాకృతి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను కనిపించనివ్వదు, అలాగే ముడతలను నివారిస్తుంది. ఈ ఫేస్ యోగా ముఖం, మెడలోని మొత్తం 57 కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేగాదు రక్తప్రసరణ మెరుగ్గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖానికి మంచి మసాజ్‌లా ఉండి సెలబ్రిటీల మాదిరి ముఖాకృతిని పొందేలా చేస్తుందన్నారు.
ఎలా చేయాలంటే..
ఫిష్ ఫేస్:
ముఖాన్ని చేప మాదిరిగా.. రెండు బుగ్గలను లోపలకు గట్టిగా లాగాలి. ఇది బుగ్గలు, దవడలలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ఐదు నుంచి పది సెకన్లు ఉంటే చాలు.
'O' మాదిరిగా నోరు తెరవడం..
మధ్య ముఖ ప్రాంతాన్ని ఎత్తి చేస్తాం. అంటే ఆంగ్ల అక్షరం 'o' అని పెద్దగా నోరు తెరిచి ఉంచాలి. ఇలా పది నుంచి 15 నిమిషాలు చేయాలి. ఇది ముఖం కుంగిపోకుండా నివారిస్తుంది.
ముఖంపై సున్నితంగా టచ్ చేయడం..
నుదిటి కండరాల నుంచి ఒత్తిడిని విడుదల చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే కోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు చేతులను నుదిటిపై నుంచి మెడ వరకు సుతి మెత్తంగా టచ్ చేస్తూ పోవాలి.
ది ఐ ఓపెనర్
కళ్లకు సంబంధించిన వ్యాయామం. కళ్లను పెద్దవిగా చేసి అటు ఇటూ తిప్పడం. అలాగే కొద్దిసేపు గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. కళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. కనురెప్పలు కుంగిపోకుండా చేస్తుంది.
కిస్సింగ్ అండ్ స్మైలింగ్ పోస్
ముఖాన్ని ఇంటి పైకపు చూస్తున్నట్లుగా పైకెత్తాలి. ఈ భంగిమలో పైకి చూస్తూ..కాసేపు నవ్వడం, కిస్ చేస్తున్నట్లుగా గడ్డం పైకెత్తడం వంటివి చేయాలి.
ప్రయోజనాలు..
వృద్ధాప్య సమస్యలకు చక్కటి సహజసిద్ధమైన పరిష్కారం
చర్మపు స్థితిస్థాపకతను పెంచుతుంది
ముడతలను తగ్గిస్తుంది
ధృడమైన యవ్వన రూపాన్ని అందిస్తుంది.
ముఖ ఉద్రిక్తతను తగ్గించి, ఉబ్బడాన్ని నివారిస్తుంది.
చెంప ఎముకలను చక్కటి ఆకృతిలో ఉండేలా చేస్తుంది
కను రెప్పలు వంగిపోకుండా నివారిస్తుంది
అలాగే ముఖాకృతిని మెరుగుపరుస్తుంది
Comments
Please login to add a commentAdd a comment