మనసు ప్రశాంతంగా ఉంటే.. ముఖం కూడా అందంగా మరిసిపోతూ ఉంటుంది. కానీ పెరుగుతున్నకాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం తదితర కారణాలతో ముఖం వెలవెలబోతూ ఉంటుంది. అలాంటిపుడే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి. ఇంట్లోనే, సహజసిద్ధంగా ఫేషియల్ గ్లో(Facial Glow) పొందవచ్చు. సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కాలు తెలుసుకుందాం పదండి.
సమతుల ఆహారం, వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, రోజులో కనీసం 7 గంటల నిద్రతోపాటు ఒత్తిడికి దూరంగా ఉంటూ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో ఆశ్చర్యపోయే బ్యూటీని సొంతం చేసుకోవచ్చు.
స్ట్రాబెర్రీ , ఎగ్
అరకప్పు స్ట్రాబెర్రీ గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొన రెండు చెంచాలు, ఒక చెంచాడు నిమ్మరసం, వేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే జిడ్డు తగ్గి, ముఖం మిలమిలలాడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రంగా చేస్తుంది. చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.
పప్పాయి, కలబంద
బాగా పండిన తాజా బొప్పాయి ముక్కలు,( Papaya) తాజా కలబంద (Aloevera)లో కొద్ది నిమ్మరసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం పిండి, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కీరా ఎగ్
సగం కీరకాయ, ఒక కోడిగుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల పాలమీగడ పావు కప్పు ఆయిల్ (వీట్‌జెర్మ్, ఆలివ్, అవొకాడోలలో ఏదో ఒకటి) తీసుకోవాలి. కీరకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా ముక్కలు చేయాలి. ఈ ముక్కలను, మిగిలిన అన్నింటితో కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత తుడిచేయాలి. ఇలా ఉదయం, రాత్రి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. (ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు)
- ముఖం మీద మురికి, ఆయిల్, మలినాలను తొలగించడానికి రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) ముఖాన్ని కడగాలి.
- సహజ నూనెలను తొలగించకుండా ఉండటానికి మీ చర్మ రకానికి సరిపోయే తేలికపాటి క్లెన్సర్‌ను ఉపయోగించండి.
- విటమిన్ సీ లభించే పండ్లను బాగా తీసుకోవాలి
- విటమిన్ సి పిగ్మెంటేషన్, సన్ టాన్ మచ్చలు, వయసు మచ్చలను తగ్గిస్తుంది.కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈవెన్ టోన్డ్ ఛాయను ప్రోత్సహిస్తుంది.
- చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలిచర్మ ఆరోగ్య రక్షణలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. మెరిసే చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.
- కెమికల్స్ లేని సన్ స్క్రీన్ వాడాలి. అవసరాన్ని బట్టి రోజులు మూడు, నాలుగు సార్లు దీన్ని అప్లయ్ చేయాలి.
- తాజా పళ్లు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే, విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
- ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.అలాగే ఫేస్ ప్యాక్ వేసుకున్నపుడు, లేదా ఎక్స్‌ఫోలియేట్ చేసేటపుడు చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా, మృదువుగా చేయాలి.
- ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన జుట్టుకు ,మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి.ప్రోబయోటిక్ సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
- యాంటీఆక్సిడెంట్లు (బెర్రీలు, ఆకుకూరలు ,గింజలు వంటివి),ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు (సాల్మన్ , అవకాడోలు వంటివి) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
వేడినీటితో ఈ ముప్పు
ఆవిరిస్నానం, ఎక్కువ వేడి నీటి స్నానానికి దూరంగా ఉండాలి. లేదా సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు వేడి నీటిని ప్రవహించడం వల్ల చర్మంలోని సహజనూనెలు దెబ్బతిని స్తేజంగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్‌కు లడ్డూ లంచమా?!
Comments
Please login to add a commentAdd a comment