బ్యూటీ టిప్స్
చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతగాలుల వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది. వీటితో పాటు సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు!
బ్యూటీ టిప్స్
- స్పూన్ గ్లిజరిన్, స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.
- రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.
- కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ముఖ చర్మం మృదువుగా అవుతుంది.
- కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి.
- రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.
- ఓట్‌మీల్ పౌడర్ టీ స్పూన్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
- బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది.
క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment