చర్మ సౌందర్యానికి అతివలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, ముడతలు రాకుండా ఉండటానికి ఫేస్‌మాస్కులు వేసుకోవడం, క్రీములు, లోషన్లు పూసుకోవడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. చర్మాన్ని మృదువుగా, ముడతలు రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు అంత కసరత్తు అవసరం లేదు.
ప్రత్యామ్నాయ పరిష్కారంగా సరికొత్త గాడ్జెట్ మార్కెట్‌లోకి వచ్చింది. అదే ఈ ‘క్లినికల్ మైక్రోడెర్మాబ్రేషన్ మెషిన్’. క్లినికల్ పరీక్షల్లో ఈ గాడ్జెట్ పనితీరు సమర్థంగా నిరూపితమైంది. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, టోనింగ్ చేస్తుంది. ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం ‘స్పా’ చేసినట్లుగా తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులోని మైక్రోడెర్మ్ గ్లో సిస్టమ్ ముఖ చర్మానికి అధునాతన హోమ్ ఫేషియల్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది. అత్యంత సులభంగా మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసి, వయసు ప్రభావాన్ని వెనక్కు నెట్టేస్తుంది.
త్రీడీ టెక్నాలజీతో రూపొందిన ఈ గాడ్జెట్ అన్ని రకాల చర్మాలకూ సురక్షితమైనదే. ఇది పూర్తిగా వైర్‌లెస్,రీఛార్జబుల్. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. వారానికి ఒకసారి నాలుగు నిమిషాలసేపు ముఖానికి దీంతో ట్రీట్‌మెంట్ ఇస్తే, మంచి ఫలితం ఉంటుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలోని డిస్‌ప్లేలో స్పీడ్, మోడ్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. డిస్‌ప్లే కింద పవర్ బటన్, స్పీడ్ పెంచుకునే బటన్, స్పీడ్ తగ్గించుకునే బటన్ వరుసగా ఉంటాయి. దీనిని ముఖంతో పాటు మెడ, చేతులు, కాళ్లు వంటి ఇతర భాగాలలోనూ ఉపయోగించుకోవచ్చు. దీని ధర 200 డాలర్లు (సుమారు రూ.15,000).
Comments
Please login to add a commentAdd a comment