RICE
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్‌లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.
– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).
– I అంటే ఐస్‌ప్యాక్ పెట్టడం. ఐస్‌క్యూబ్స్‌ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.
– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్‌తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.
– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.
బ్యూటిప్స్..
ఫేషియల్ మసాజ్..
– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.
– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment