ఓట్స్ ఆరోగ్యపోషణతోపాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. ఓట్స్‌తో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో చూద్దాం.
రెండు టేబుల్ స్పూన్‌ల ఓట్స్‌పౌడర్‌లో మూడు టేబుల్ స్పూన్‌ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిక్స్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతమవుతుంది.
మొటిమలు తగ్గాలంటే టేబుల్ ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును ఓట్స్ పీల్చుకోవడం వల్ల మొటిమలు వాడిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నాలుగు వారాల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.
రెండు టేబుల్ స్పూన్‌ల ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్‌ల పాలు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ సహజమైన బ్లీచ్. చర్మాన్ని తెల్లబరుస్తుంది. మృదువుగా మారుతుంది కూడా.
ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్‌లు, బాదం ΄÷డి టేబుల్ స్పూన్, తేనె టేబుల్ స్పూన్, పాలు లేదా పెరుగు రెండు టేబుల్ స్పూన్‌లు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి వలయాకారంలో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు చర్మకణాల్లో పట్టేసిన మురికి వదులుతుంది. ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వేస్తుంటే ప్రత్యేకంగా స్క్రబ్ క్రీమ్‌లు, బ్లీచ్‌లు వాడాల్సిన అవసరం ఉండదు.
రెండు టేబుల్ స్పూన్‌ల ఓట్స్ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్‌ల బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ΄÷డి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు ఉన్నవాళ్లు బాదం ఆయిల్ లేకుండా ప్యాక్ వేసుకోవచ్చు.
ఇవి చదవండి: Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం!
Comments
Please login to add a commentAdd a comment