Oats
-
Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్!
ఓట్స్, పొటాటోలు కలిపి తయారుచేసే చీజ్ బాల్స్ వంటకంతో ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఈ వంటకంలో పుష్కలమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. ఇక వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..కావలసినవి..ఉడికించి చిదిమిన బంగాళాదుంప – 2 కప్పులు;ఓట్స్ – కప్పు;చీజ్ తురుము – కప్పు;ఉల్లిపాయ తరుగు – పావు కప్పు;కొత్తిమీర – పావు కప్పు (తరగాలి);మిరప్పొడి– అర టీ స్పూన్;చాట్ మసాలా– అర టీ స్పూన్;ఉప్పు – రుచికి తగినంత;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– ఓట్స్‌ను బాణలిలో నూనె లేకుండా మీడియం మంట మీద ఒక మోస్తరుగా వేయించి, పొడి చేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో చిదిమిన బంగాళాదుంప, ఓట్స్ పొడి, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరప్పొడి, ఉప్పు వేసి కలపాలి.– మొత్తం చపాతీ పిండిలా ముద్దగా తయారవుతుంది. ఈ ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో బాల్స్ చేసుకోవాలి.– ఒక్కో బాల్ని అరచేతిలో వేసి కొద్దిగా ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో వత్తాలి.– ఆపం పెనం లేదా కొంచెం గుంటగా ఉన్న పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాసి ఒక్కో బాల్ని పెనం మీద అమర్చి మంటను మీడియంలో పెట్టాలి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత మెల్లగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.– ఈ చీజ్ బాల్స్‌ని వేడిగా ఉన్నప్పుడే కెచప్ లేదా సాస్‌లతో వడ్డించాలి.గమనిక: పిండిలో కలిపిన చీజ్ కరిగి బయటకు వస్తుంది. కాబట్టి నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. పెనం మాడుతున్నట్లనిపిస్తే చీజ్ బాల్స్ కాలుతున్నప్పుడు పై నుంచి కొద్ది చుక్కలు నూనె వేయవచ్చు.పోషకాలు: పై కొలతలతో చేసిన చీజ్ బాల్స్‌లో 150 కేలరీలుంటాయి. కార్బొహైడ్రేట్లు 25 గ్రాములు, ప్రోటీన్లు– 6 గ్రాములు, ఫ్యాట్– 7 గ్రాములు, ఫైబర –3 గ్రాములు, క్యాల్షియం– 100 మిల్లీ గ్రాములు, ఐరన్– 1.5 మిల్లీ గ్రాములు– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్, వెల్నెస్ కోచ్ -
Beauty Tips: అందానికి 'ఓట్లు'..
ఓట్స్ ఆరోగ్యపోషణతోపాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. ఓట్స్‌తో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో చూద్దాం.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్పౌడర్లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిక్స్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతమవుతుంది.మొటిమలు తగ్గాలంటే టేబుల్ ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును ఓట్స్ పీల్చుకోవడం వల్ల మొటిమలు వాడిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నాలుగు వారాల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ సహజమైన బ్లీచ్. చర్మాన్ని తెల్లబరుస్తుంది. మృదువుగా మారుతుంది కూడా.ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, బాదం ΄÷డి టేబుల్ స్పూన్, తేనె టేబుల్ స్పూన్, పాలు లేదా పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి వలయాకారంలో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు చర్మకణాల్లో పట్టేసిన మురికి వదులుతుంది. ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వేస్తుంటే ప్రత్యేకంగా స్క్రబ్ క్రీమ్‌లు, బ్లీచ్‌లు వాడాల్సిన అవసరం ఉండదు.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ΄÷డి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు ఉన్నవాళ్లు బాదం ఆయిల్ లేకుండా ప్యాక్ వేసుకోవచ్చు.ఇవి చదవండి: Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం! -
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటున్నారా..?
ప్రజలు తమ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి ఎక్కువగా వినియోగించే తృణధాన్యాల్లో ఒకటి ఓట్స్. పైగా శరీరానికి పుష్కలమైన ఫైబర్స్ అందుతాయని దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా డైటీషియన్లు, జిమ్ శిక్షకులు ఫైబర్ కంటెంట్ ఉండే ఓట్స్‌ని తీసుకోమని సూచిస్తారు. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడే ఓట్స్‌ని తీసుకోవడం మంచిదే అయినప్పటికీ దీన్ని డైట్లో భాగం చేసుకునేటప్పుడూ ఈ జాగ్ర త్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అంటున్నారు నిపుణలు. లేదంటే దుష్పభావాలు తప్పవంటున్నారు.రోజు ఎందుకు తినకూడదు..నిపుణులు అభిప్రాయం ప్రకారం వోట్స్ కొన్ని రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. వారి ప్రకారం ఇది శరీరానికి విషపూరితం కావొచ్చని అంటున్నారు. శాస్త్రవేత్తలు 2017 నుంచి 2023 మధ్యకాలంలో జరిపిన అధ్యయనంలో చాలామంది అమెరికన్ల ఉపయోగించే ఓట్స్‌లో క్లోమరోమెక్వాట్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఆ పరిశోధనల్లో సుమారు 92% వోట్స్ ఆధారిత వాటిల్లో క్లోర్మెక్వాట్ గుర్తించదగిన స్థాయిల్లో ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని పెద్దపెద్ద బ్రాండ్ ఓట్స్‌లలో కూడా ఈ విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఇది పునరుత్పత్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మానవులకు హాని కలిగించే అవకాశాలు ఎక్కుగా ఉన్నట్లు అని పరిశోధన వెల్లడించింది. బరువు పెరిగేందుకు..ఓట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటన్నారు. అలాగే చాలామంది దీన్ని చక్కెర, నట్స్, చాక్లెట్ చిప్స్, ఉప్పుతో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకుంటే ప్రయోజనాల కంటే, సమస్యలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. పొట్ట ఉబ్బరం..కొందరికి అదేపనిగా తృణధాన్యాలు తీసుకుంటే పొట్ట ఉబ్బరం కలిగిస్తాయి. అందువల్ల డైటీషియన్లు ఎప్పడూ కొద్ది మొత్తంలోనే తీసుకోమని సూచిస్తారు. దీన్ని జీర్ణశయాలు లేదా పెద్ద ప్రేగలలోని బ్యాక్టీరియాను వినియోగించుకోవటంతో గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది.గ్లూటెన్ సున్నితత్వం..ఇవి గ్లూటెన్ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్ చేయబడతాయి. ఇది ఉదరకుహార వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీకి దారితీస్తంది. క్రమం తప్పకుండా ఓట్స్ తింటుంటే ప్రతికూల ప్రతి చర్యలకు దారితీస్తుంది. డైలీ తినాలనుకునేవారు పూర్తిగా గ్లూటెన్ రహిత ఓట్స్‌ని ఎంచుకోవాని చెబుతున్నారు. కడుపు వాపుఇవి ఒక్కోసారి గ్యాస్టిక్ వాపుని కలుగజేస్తాయి. ఆహారంలో ఆకస్మిక మార్పు వల్ల కలిగే ప్రభామే ఈ కడుపు వాపు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వోట్స్ తీసుకునే మొత్తాన్ని తగ్గించాలి. మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఫైటిక్ యాసిడ్లుఈ ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్‌ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది.(చదవండి: భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..) -
ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!
ఓట్స్ లడ్డూకి కావలసినవి: ఓట్స్ – ఒక కప్పు (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) వేరుశనగలు – అర కప్పు (దోరగా వేయించి కచ్చాపచ్చాగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి.. పొట్టు తీసినా తీయకపోయినా పరవాలేదు) బెల్లం తురుము – ఒక కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) నెయ్యి – సరిపడా డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా చిన్న మంట మీద బెల్లం పాకం పెట్టుకోవాలి. పాకం గమనించుకుని.. దగ్గర పడుతున్న సమయంలో, వేరుశనగల పొడి, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఓట్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: ఎప్పుడైనా పెసలుతో పాలక్ ఇడ్లీ ట్రై చేశారా! ఆరోగ్యాని ఆరోగ్యం..రుచికి రుచి..!) -
ఓట్స్ – యాపిల్ లడ్డూలు
కావలసినవి: యాపిల్ – 3 మీడియం సైజ్ (తొక్క, గింజలు తీసి గుజ్జులా చేసుకోవాలి) ఓట్స్ పౌడర్ – అర కప్పు (నెయ్యితో దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్– 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి – అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ – గార్నిష్‌కి కొద్దిగా (అభిరుచిని బట్టి) నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్ గుజ్జు, కొబ్బరి కోరు, పంచదార, మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, ఓట్స్ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. వాటిపైన డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొద్దికొద్దిగా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి) -
క్షణాల్లో ఓట్స్ స్మూతీ.. సింపుల్ రెసిపి
ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సినవి: ఓట్స్ –మూడు టేబుల్ స్పూన్లు; వేయించి పొట్టుతీసిన పల్లీలు – పావు కప్పు ; అవిసెగింజలు – టేబుల్ స్పూను; సబ్జాగింజలు – టీస్పూను; దాల్చిన చెక్క – అరంగుళం ముక్క; కర్జురాలు – నాలుగు; బాగా పండిన అరటి పండు – ఒకటి. తయారీ విధానమిలా: ►ఓట్స్‌ను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో వేయాలి. దీనిలో కప్పు నీళ్లుపోయాలి. ► పల్లీలు, అవిసె, సబ్జా గింజలు, దాల్చిన చెక్క, కర్జూరాలు, అరటిపండు ముక్కలు కూడా వేయాలి. ► వీటన్నింటిని చక్కగా గ్రైండ్ చేస్తే స్మూతీ రెడీ. -
కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి
బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు... ఓట్స్ బీట్రూట్ పన్నీర్ పరాటా తయారీకి కావల్సినవి: వేయించిన ఓట్స్ – కప్పు; బీట్రూట్ ప్యూరీ – కప్పు; పన్నీర్ తరుగు – అరకప్పు; గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను; కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను. తయారీ విధానమిలా: పెద్దగిన్నెలో ఓట్స్, బీట్రూట్ ప్యూరీ, పనీర్ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి. పరాటాలను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్‌చేసుకోవాలి. -
Recipe: బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా!
ఎప్పటిలా రొటీన్ కజ్జికాయలు కాకుండా వెరైటీగా ఈసారి బనానా – ఓట్స్‌తో ట్రై చేసి చూడండి. బనానా – ఓట్స్ కజ్జికాయలు కావలసినవి: ►అరటిపండు గుజ్జు – 1 కప్పు ►ఓట్స్ పౌడర్ – అర కప్పు (1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి) ►కొబ్బరి కోరు – పావు కప్పు ►పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు ►సోయా పాలు – పావు కప్పు ►నూనె – 4 టేబుల్ స్పూన్లు ►మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా తయారీ: ►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ►అందులో కొబ్బరికోరు, ఓట్స్ పౌడర్ వేసుకుని దోరగా వేయించాలి. ►అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. ►చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి. ►ఈలోపు మైదాపిండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ►మధ్యలో బనానా–ఓట్స్ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. చదవండి: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారీ ఇలా తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా.. -
Recipe: బెల్లం, గోధుమ రవ్వతో ఓట్స్ జిలేబి తయారీ ఇలా!
వెరైటీగా ఓట్స్‌తో ఇలా జిలేబి ట్రై చేయండి! కావలసినవి: ►ఓట్స్ – 1 కప్పు ►గోధుమ రవ్వ – అర కప్పు ►నీళ్లు – సరిపడా ►బెల్లం కోరు – 2 కప్పులు ►ఉప్పు – చిటికెడు ►ఫుడ్ కలర్ – కొద్దిగా (జిలేబీ కలర్) ►నూనె లేదా నెయ్యి – 1 కప్పు తయారీ: ►ముందుగా ఓట్స్, గోధుమ రవ్వలను మిక్సీ బౌల్లో వేసుకుని.. ఒక కప్పు నీళ్లు పోసుకుని.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు, కొద్దిగా ఫుడ్‌కలర్ వేసుకోవాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని కోన్ లాంటి ఖాళీ టొమాటో సాస్ టిన్‌లో నింపి పెట్టుకోవాలి. ►ఈ లోపు స్టవ్ మీద కళాయిలో బెల్లం కోరు, ఒక కప్పు నీళ్లు పోసుకుని.. లేత పాకం వచ్చే వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►మరో స్టవ్ ఆన్ చేసుకుని.. మరో కళాయిలో నెయ్యి లేదా నూనెలో ఓట్స్ మిశ్రమాన్ని జిలేబీల్లా వేస్తూ దోరగా వేయించుకోవాలి. ►వెంటనే వాటిని బెల్లం పాకంలో వేసి దేవుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Oats Walnut Cutlets: ఓట్స్– వాల్నట్స్ కట్లెట్ తయారీ ఇలా.. ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! -
Recipe: ఓట్స్– వాల్నట్స్ కట్లెట్ తయారీ ఇలా..
ఓట్స్– వాల్‌నట్స్‌తో కట్లెట్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు – అర కప్పు ►ఓట్స్ – అర కప్పు (మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి) ►పచ్చి బఠాణీలు – అర కప్పు (నానబెట్టాలి) ►కొత్తిమీర – అర కప్పు ►పచ్చిమిర్చి – 1 ►వాల్నట్స్ – ఒక కప్పు ►బంగాళదుంపలు – 2 (ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) ►అల్లం పేస్ట్, కారం, జీలకర్ర, పసుపు – 1 టీ స్పూన్ చొప్పున ►ఉప్పు – తగినంత ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వాల్నట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►బంగాళదుంప గుజ్జు, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఓట్స్ పౌడర్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. తగినంత ఉప్పు కలుపుకోవాలి. ►అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు జోడించి ముద్దలా చేసుకుని.. చిన్న చిన్న కట్లెట్స్ తయారు చేసుకోవాలి. ►వాటిని నూనెలో దోరగా వేయించి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: జొన్న దోసె.. బరువు తగ్గాలనుకునే వారి కోసం.. రొటీన్‌గా కాకుండా.. ఇలా ఓట్స్ మసాలా దోసెలు ట్రై చేయండి! -
Recipe: రొటీన్‌గా కాకుండా.. ఇలా ఓట్స్ మసాలా దోసెలు ట్రై చేయండి!
ఓట్స్ మసాలా దోసెలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మసాలా కర్రీ – 2 లేదా ఒకటిన్నర కప్పులు (దోసెలు పోసుకునే కాసేపు ముందు, వండి పెట్టుకోవాలి) ►బియ్యం – 4 కప్పులు ►ఓట్స్ – 2 కప్పులు ►మినప్పప్పు – 1 కప్పు ►మెంతులు – 1 టీ స్పూన్ (నానబెట్టుకున్నవి) ►ఉప్పు – సరిపడా తయారీ: ►బియ్యం, మినపప్పులను విడివిడిగా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ►ముందుగా మిక్సీలో ఓట్స్, మెంతులు, బియ్యం, మినప్పప్పు.. కలిపి పేస్ట్‌లా గ్రాండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►తగినంత ఉప్పు కలుపుకుని.. పెనంపై నెయ్యితో దోసెలు వేసుకోవాలి. ►ప్రతి దోసె మీద ఒక గరిటె మసాలా కర్రీని పెట్టి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Apple Egg Rings: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! Bread Garlic Soup: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా! -
గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలక్ దోసెతో
Recipes In Telugu: గర్భిణి తినే ఆహారం ప్రత్యేకంగా ఉండాలి. మామూలుగా ఎప్పుడూ తినే ఆహారం సరిపోదు. ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండాలి. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఓట్స్, చిరుధాన్యాలు, పాలకూరలతో ఇలా హెల్దీగా ప్రయత్నించి చూడండి. ఓట్స్ పాలక్ ఊతప్పం కావలసినవి ►ఓట్స్ పొడి – కప్పు (కొంచెం రవ్వలా ఉండాలి) ►మినప పిండి – పావు కప్పు ►పచ్చిమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్లు ►పాలకూర పేస్ట్ – అర కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు ►ఉడికించిన గింజలు – ముప్పావు కప్పు (వేరుశనగ, పెసలు, శనగలు వంటివి) ►నూనె లేదా నెయ్యి– 4 టీ స్పూన్లు ►ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగినంత ►చాట్ మసాలా – టీ స్పూన్ (ఇష్టమైతేనే). తయారీ: ►ఓట్స్ పొడి, మినపపిండి, మిర్చి పేస్ట్, పాలకూర పేస్ట్, ఉప్పు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాలపాటు పక్కన ఉంచాలి. ►మినీ ఊతప్పాల పెనం (మామూలు పెనం మీద కూడా వేసుకోవచ్చు) స్టవ్ మీద పెట్టి ప్రతి గుంతలోనూ రెండు చుక్కల నెయ్యి వేసి గుంత మొత్తానికి అంటేటట్లు మునివేళ్లతో రుద్దాలి. ►పెనం వేడి అయిన తర్వాత చిన్న గరిటెతో పిండి మిశ్రమాన్ని గుంతల్లో పోయాలి. ►పిండి కాలేలోపుగా ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గింజలను వేసి మూత పెట్టి సన్న మంట మీద కాలనివ్వాలి. ►ఒకవైపు కాలిన తర్వాత స్పూన్‌తో జాగ్రత్తగా తిరగేసి మూత పెట్టకుండా కాలనివ్వాలి. ►రెండోవైపు కూడా కాలిన తరవాత తీసి చాట్ మసాలా చల్లి వేడిగా ఉండగానే కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వడ్డించాలి. ►మినపపిండి లేకపోతే పావు కప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఓట్స్ పౌడర్ కలుపుకోవాలి. పాలక్ దోసె కావలసినవి : ►పాలకూర పేస్ట్ – అర కప్పు (సుమారు రెండున్నర కప్పుల పాలకూర ఆకులను రుబ్బితే అరకప్పు పేస్టు వస్తుంది) ►మినప్పప్పు – పావు కప్పు ►మెంతులు – అర టీ స్పూన్ ►గోధుమపిండి– కప్పు ►ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగనంత ►నూనె – 2 టీ స్పూన్లు. తయారీ: ►మినప్పప్పు, మెంతులను కడిగి నిండుగా నీటిని పోసి మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టాలి. ►ఆ తర్వాత తగినంత నీటిని కలుపుకుంటూ మెత్తగా రుబ్బాలి. ►ఈ పిండిలో పాలకూర పేస్ట్, గోధుమపిండి, ఉప్పు వేసి అవసరమైతే మరికొన్ని నీటిని పోసి గరిటె జారుడుగా కలిపి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ►ఆ తర్వాత పెనం వేడి చేసి దోసె పోసుకోవాలి. ►దోసె మీద నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి లేదా వెన్న వేసుకోవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: Makhana Panjiri: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ -
Health: ప్రతి రోజూ ఓట్స్ తింటున్నారా? గుండెకు సంబంధించి ఈ విషయాలు తెలిస్తే
Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు. ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా? ఆకుపచ్చని కూరలు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. టొమాటల్లోని లైకోపిన్ వల్ల టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. చేపలు తింటే చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. స్ట్రా బెర్రీలతో స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా! డార్క్ చాక్లెట్లు తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు. గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు వేరుశెనగ గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి. అవకాడో విటమిన్–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్ –శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఓట్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
Recipe: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం తయారీ ఇలా!
రోజూ తినే టిఫిన్లను కాస్త వెరైటీగా చేసుకుంటే కొత్త రుచిని ఆస్వాదించడంతోపాటు, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. అందుకే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ ఊతప్పం రెసిపీ మీకోసం.. ఓట్స్ ఊతప్పం కావలసినవి: ►ఓట్స్ – అరకప్పు ►బియ్యప్పిండి – పావు కప్పు ►పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు ►క్యారట్ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు ►టొమాటో తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి తరుగు. కొత్తిమీర తరుగు – రెండేసి టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా ఓట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి ►ఓట్స్ పొడిలో ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గరిటజారుగా కలుపుకోవాలి ►పాన్‌పై నూనె వేసి పిండిని మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా మీడియం దోసెలా వేసుకోవాలి ►ఇప్పుడు క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగుని ఒకగిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ►ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత క్యారట్ ముక్కల మిశ్రమాన్ని ఊతప్పం మొత్తం చల్లుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ►పిండిమొత్తాన్ని ఇదే విధంగా వేసుకుని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! Chicken Omelette Recipe: చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం ఇలా! -
Beauty Tips: మామిడి, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
Beauty Tips In Telugu- Mango Scrub Benefits: వేసవిలో లభించే పండ్లలో దాదాపు అందరికీ ఇష్టమైనది మామిడి. పండ్లలో రారాజైన మామిడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మామిడిలో కేవలం అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలే కాదు అందాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు కూడా ఉన్నాయి. మామిడితో ఈ స్క్రబ్ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. మామిడి స్క్రబ్.. ట్యాన్ మాయం! ►నాలుగు టేబుల్ స్పూన్ల మామిడి పండ్ల గుజ్జులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ►ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖం మీద మచ్చలు, ట్యాన్‌ను ఈ స్క్రబ్ చక్కగా తొలగిస్తుంది. ►మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. ►వారానికి మూడుసార్లు ఈ స్క్రబ్ వాడితే మంచి ఫలితం వస్తుంది. చదవండి👉🏾Vitamin B12: విటమిన్ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే.. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
రైతుకు సిరులు... ఒంటికి సత్తువ!
ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. 1960ల్లో, మన దేశంలో ఒక మనిషి ఏడాదికి సగటున 32.9 కిలోల చిరుధాన్యాలను తినేవాడు. 2010 నాటికి వీటి వాడకం 4.2 కిలోలకు.... అంటే 87%కి పడి పోయింది. ‘పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణ వలన గోదుమ ఉపయోగం పెరిగింది. దీన్ని శ్రేష్ఠమైన తిండి అనుకుంటున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గింది. వీటిని నాసిరకం తిండిగా భావిస్తున్నారు’ అని 2014లో ‘అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి’ తెలిపింది. 1960వ దశకం మధ్యలో ఒక పట్టణవాసి సగటున సంవ త్సరానికి 27 కిలోల గోదుమలు తినేవాడు. ఇది 2010లో రెట్టింపయింది. కొన్ని దశాబ్దాల నుండి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోదుమ, బియ్యానికి రాయితీ లిస్తున్నది. అందువలన ప్రజల్లో ప్రత్యేకించి పట్టణ జనాభాలో వీటి ఉపయోగం పెరిగింది. చిరుధాన్యాల వాడకం తగ్గింది. ‘2013–ఆహార భద్రతా చట్టం’ చేయక ముందు గోదుమలు, బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చింది. ఫలితంగా ముతక ధాన్యాల వినియోగం పడిపోయిందని ప్రభుత్వేతర సంస్థ ‘ధన్’ నాయకుడు మునియప్పన్ కార్తికేయన్ అన్నారు. 1956 నుండి చిరుధాన్యాల పంట విస్తీర్ణం తగ్గింది. సజ్జ 23%, రాగి 49%, జొన్న 64%, ఇతర ధాన్యాల సాగునేల 85% తగ్గింది. ఈ విస్తీర్ణం ఇంకా తగ్గితే దేశం చిరుధాన్య పంటలను కోల్పోతుంది. చిరుధాన్యాలు తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలు గల గరుగు, పొడి నేలల్లో, కరువు ప్రదేశాల్లో పండుతాయి. వీటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. దిగుబడి ఎక్కువ. విత్తనాల పేటెంటు, బహుళ జాతి సంస్థల గొడవలు లేవు. ముందు ఏడాది గింజలను మరుసటి సంవత్సరం విత్తనాలుగా వాడవచ్చు. మెరుగుపర్చబడిన చిరుధాన్యాల విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఉత్పత్తిని బాగా పెంచాయి. 2013లో ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో 1,09,10,000 టన్నులతో భారత్ మొదటి స్థానంలో ఉంది. వరికి కావలసిన నీటిలో 28% నీరే వీటికి సరిపోతుంది. ప్రస్తుత కరువుకే కాక పెరగబోయే భవిష్యత్తు కరువులకు కూడా ఇవి పరిష్కారమవుతాయి. ఈ పంటలతో మనకు తిండి గింజలు, పశువులకు మేత లభిస్తాయి. వీటిలో ఆమ్ల శాతం తక్కువ. పీచు శాతం, పోషక విలువలు ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 531%, బియ్యం కంటే 1,033% ఇనుము ఎక్కువ. సజ్జల్లో గోదుమల కంటే 314%, బియ్యం కంటే 611% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 265%, బియ్యం కంటే 516% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 839%, బియ్యం కంటే 3,440% సున్నం ఎక్కువ. బియ్యంలో కంటే సజ్జలు, గోదుమల్లో 4 రెట్ల సున్నం ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 313%, బియ్యం కంటే 783% ఖనిజ లవణాలు ఎక్కువ. కొర్రల్లో గోదుమల కంటే 220%, బియ్యం కంటే 550% ఖనిజ లవణాలు ఎక్కువ. గోదుమలు, బియ్యం కంటే చిరుధాన్యాలలో పోషక పదార్థాలు, నత్రజని అధికం. కేవలం బియ్యం తిన్న ఆడపిల్లల కంటే 60% జొన్నలు, 40% బియ్యం తిన్న ఆడపిల్లల ఎదుగుదల రేటు ఎక్కువని హైదరాబాదు ‘భారతీయ చిరుధాన్యాల పరిశోధక సంస్థ’, ‘జాతీయ పోషకాహార సంస్థ’ 2015 ఏడాది అధ్యయనాల్లో తెలిపాయి. (చదవండి: ఒప్పుకొందామా? తప్పందామా?) ఇతర పంటలతో పోల్చితే చిరుధాన్యాల పంటలు పర్యావరణానికి తక్కువ హానికరం. ఈ పరిస్థితుల్లో ఈ పంటలు ఉపయోగకరం. చిరుధాన్యాల పునరుద్ధరణ పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే పలు ప్రయోజనాల చిరు ధాన్యాలను పండిద్దాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకుందాం. (చదవండి: పడిలేచిన కెరటం... ‘పోలవరం’) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
బ్లాక్‌హెడ్స్‌ను తొలగించే ఎఫెక్టివ్ టిప్
అందంగా, కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉన్నంతలో చక్కగా తయారవ్వడం ఎవరికైనా ఇష్టమే. అందం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కొంత మందికి అనేక కారణాలతో ముఖం మీద మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి బ్లాక్‌హెడ్స్‌ను వదిలించుకోవడానికి చాలా మంది సెలూన్తోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అయితే అలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని చాలా మంది భయపడుతుంటారు. చాలామంది ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా చర్మం పొడిబారి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండలో బయట తిరిగినప్పుడు ముఖం మీద ధూళి కణాలు చేరి చివరికి బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటి చర్మ సమస్యలు గల వారికి చర్మం జిడ్డులాగా మారుతుంది. అయితే ఇంట్లో లభించే కొన్ని వస్తువుల ద్వారా ఇలాంటి వాటిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మచ్చలు, బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అంతేగాక మీ చర్మం బయటి నుంచే కాకుండా లోపల నుంచి తాజాగా మెరిసిపోవడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు... అవేంటో వాటి వైపు ఓ కన్నేద్దాం... కావలసిన పదార్థాలు ► అరటిపండు ► తేనే(ఒక టేబుల్ స్పూన్) ► ఓట్స్(ముద్దగా చేయాలి) ఉపయోగించే విధానం ముందుగా అరటి పండును గుజ్జుగా, ఓట్స్‌ను మెత్తగా పొడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నె తీసుకొని అందులో ఓట్స్, తేనె, గుజ్జుగా చేసిన అరటిపండుతో కలిపి మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత దానిని జాగ్రత్తగా ముఖానికి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట మాస్క్‌లాగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. చివరగా ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉపయోగాలు.. ► ఓట్స్ వల్ల చర్మంలోని మృతకణాల తొలగించడంతోపాటు, ముఖంపై ఉన్న ధూళిని తొలగిస్తుంది. ► అంతేగాక చర్మం నుంచి అధికంగా ఉన్న ఆయిల్‌ను గ్రహించే శక్తి ఓట్స్‌కు ఉంటుంది. ► ఇక తేనె ముఖంలోని బాక్టీరియాను పొగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ► మోముపై మెరుపును తీసుకువచ్చి..కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. ► ఓట్స్, అరటిపండు మిక్స్ చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేటింగ్ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇది జిడ్డుగల చర్మం వారితోపాటు అన్ని రకాల చర్మం గల వారికి సహాయపడుతుది. ఇంకేందుకు ఆలస్యం ఇకపై ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు దీన్ని ప్రయత్నించండి. ఇక బ్లాక్‌హెడ్స్‌కు బై-బై చెప్పండి. -
ఆపిల్‌తో కుకీస్ టేస్టు.. మస్తు మస్తు
ఆపిల్ కుకీస్ కావలసినవి : ఓట్స్ – 2 కప్పులు, కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు, చీజ్ – 2 టేబుల్ స్పూన్, యాపిల్ గుజ్జు – 1 కప్పు, గుడ్లు – 3, ఆలివ్ నూనె – 1 టేబుల్ స్పూన్, వాల్నట్స్ గుజ్జు – అర కప్పు, దాల్చిన చెక్కపొడి – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఓట్స్, కొబ్బరి తురుము, బ్రెడ్ పౌడర్ వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు చీజ్, గుడ్లు, వాల్నట్స్ గుజ్జు, యాపిల్ గుజ్జు, ఆలివ్ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కపొడి, ఉప్పు కూడా ఆ మిశ్రమంలో వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న కుకీస్‌లా చేసుకుని ఓవెన్లో 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ కుకీస్ రెడీ అయిపోతాయి. మొక్కజొన్న ఢోక్లా కావలసినవి : మొక్కజొన్న పిండి – 2 కప్పులు, వేరుశనగ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీ – పావు కప్పు(నానబెట్టుకోవాలి), కరివేపాకు పొడి – 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ – పావు టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి), రవ్వ – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – పావు కప్పు, పెరుగు – ఒకటిన్నర కప్పులు (1 లేదా 2 రోజుల నిలువ చేసినది), ఉప్పు – తగినంత, నూనె – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, ఆవాలు – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, వేరుశనగ పేస్ట్, కరివేపాకు పొడి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, రవ్వ, కొత్తిమీర తురుము, పచ్చి బఠానీ, పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకుని కేక్ ట్రేలో వేసుకుని, ఇరవై ఐదు నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. తర్వాత కావల్సిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర వేయించుకుని, ఉడికిన కార్న్ కేక్ మీద వేసుకోవాలి. కోకోనట్ పాన్ కేక్ కావలసినవి : ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కొబ్బరి పాలు – 5 టేబుల్ స్పూన్లు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె – పావు టేబుల్ స్పూన్, గుడ్లు – 4, తేనె – 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూన్, నిమ్మకాయ తొక్క పొడి – పావు టీ స్పూన్, బాదం పాలు – అర కప్పు, నెయ్యి – పాన్‌కేక్స్ వేసుకునేందుకు సరిపడా తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి తురుము, బేకింగ్ పౌడర్, ఉప్పు, నిమ్మకాయ తొక్క పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి నూనె, తేనె, గుడ్లు, కొబ్బరి పాలు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పాన్ వేడి చేసుకుని నెయ్యి వేసుకుని, ఆ మిశ్రమంతో చిన్న చిన్న పాన్‌కేక్స్‌లా వేసుకుని, రెండువైపులా దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే అరటి పండు ముక్కలు, ఇతర డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
మెరిసే చర్మం కోసం..
నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం బోలేడు డబ్బు ఖర్చు చేసి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఇంట్లో దొరికే పదార్ధాలతోనే అందమైన మేనిని సొంతం చేసుకోవచ్చు. అదేలాగో చూడండి. శరీరం కాంతీవిహీనంగా మారడానికి ప్రధాన కారణం చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్, జిడ్డు. దానికి తోడు బయట వాతావరణంలోని దుమ్ము, ధూళీ మన శరీరం మీద బ్లాక్ హెడ్స్‌తో కలవడంతో మరిన్ని సమస్యలు. వీటి నివారణ కోసం జనాలు పార్లర్ల చుట్టూ తిరుగుతూ.. బ్యూటీ ఉత్పత్తుల మీద డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే కాస్త ఓపిక చేసుకుంటే.. మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే.. చాలా తక్కువ ఖర్చుతో ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అన్ని సహజమైన పదార్ధాలే కాబట్టి దుష్ప్రభావాల మాటే ఉండదు. అవేంటో మీరు చూడండి. కావాల్సిన పదార్థాలు.. అరటి పండు(మెత్తనిది), ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్స్(పొడి చేసుకోవాలి), తేనె - 1 టేబుల్ స్పూన్ విధానం.. పైన చెప్పిన పదార్థాలన్నింటిని ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలి. ముందుగా చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ ప్యాక్‌ను అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ఓట్స్ చర్మం మీద ధూళిని తొలగించడంతో పాటు శరీరంపై వచ్చే జిడ్డును నివారిస్తుంది. ఓట్స్, తేనె మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగపడటంతో పాటు సూక్ష్మజీవుల నివారిణిగా కూడా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించడంలో అరటి ఎంతో సహాయపడుతుంది. -
రాగుల వంటలు
రాగి లడ్డు కావలసినవి: మొలకెత్తిన రాగుల పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పుఏలకుల పొడి – పావు టీ స్పూను, మరిగించిన పాలు – పావు కప్పుజీడి పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)బాదం పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)ఎండు కొబ్బరి తురుము – అలంకరించడానికి తగినన్ని తయారీ: ఒక గిన్నెలో నెయ్యి వేసి బాగా కాగిన తరవాత జీడి పప్పు పలుకులు, బాదం పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. రాగి పిండి జత చేసి మరోమారు దోరగా వేయించాలి. బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మరోమారు వేయించాలి. వేడి పాలు జత చేసి కలియబెట్టాలి. మంట తగ్గించి, గిన్నె మీద మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి, దింపేయాలి. ఎండు కొబ్బరి ముక్కలు జత చేస్తూ, కావలసిన పరిమాణంలో లడ్డూలు తయారుచేసుకోవాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? రాగులు (Finger Millet) నియాసిన్ ((Niacin)mg (B3) 1.1 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.19 థయామిన్ (Thiamine) mg (B1) 0.42 కెరోటిన్ (Carotene)ug 42 ఐరన్ (Iron)mg 5.4 కాల్షియం (Calcium)g 0.33 ఫాస్పరస్ (Phosphorous)g 0.27 ప్రొటీన్(Protein)g 7.1 ఖనిజాలు (Minerals) g 2.7 పిండిపదార్థం (Carbo Hydrate) g 72.7 పీచు పదార్థం (Fiber) g 3.6 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 20.19 రాగి మురుకులు కావలసినవి: రాగి పిండి – రెండు కప్పులు, వాము – ఒక టీ స్పూనుబియ్యప్పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంతనూనె – డీప్ ఫ్రైకి సరిపడా, వేడి నీళ్లు – పిండి కలపడానికి తగినన్ని తయారీ: ఒక పెద్ద పాత్రలో రాగి పిండి, వాము, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. వేడి నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. మురుకుల గొట్టంలో పిండి ఉంచి, కాగిన నూనెలో మురుకులు చుట్టాలి. బాగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. రాగి సేమ్యా ఖీర్ కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు, కొబ్బరిపాలు – 2 కప్పులుకొబ్బరి తురుము – పావు కప్పు, బెల్లం పొడి – అర కప్పుఏలకుల పొడి – చిటికెడు, జీడి పప్పు పలుకులు – 20 నెయ్యి – తగినంత తయారీ: స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి. జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మరుగుతున్న పాలలో సేమ్యా వేసి కలపాలి. సేమ్యా ఉడికిన తరవాత బెల్లం పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించాలి. బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. రాగి – ఉల్లి చపాతీ కావలసినవి: రాగి పిండి – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుఉప్పు – తగినంతసన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1పెరుగు – 2 టీ స్పూన్లుకొత్తిమీర – అర కప్పు నూనె – తగినంత తయారీ: వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. చపాతీలా ఒత్తాలి. రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి. ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసేయాలి. పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. రాగి కేక్ కావలసినవి: రాగి పిండి – ముప్పావు కప్పుగోధుమ పిండి – ముప్పావు కప్పుబేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూనుబేకింగ్ సోడా – అర టీ స్పూనుఉప్పు – చిటికెడుకోకో పొడి – 2 టేబుల్ స్పూన్లుబెల్లం పొడి – ఒక కప్పుకొబ్బరి పాలు – ముప్పావు కప్పువెనిలా ఎసెన్స్ – ఒక టేబుల్ స్పూనుకరిగించిన బటర్ – 150 మి.లీ.పెరుగు – పావు కప్పుటాపింగ్ కోసం...కొబ్బరి పాలు – ఒక కప్పుకోకో పొడి – 3 టేబుల్ స్పూన్లుపంచదార – 2 టేబుల్ స్పూన్లు తయారీ: కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి. రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి జత చేయాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు జత చేయాలి. కరిగించిన బటర్, పెరుగు జత చేయాలి.ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి.ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు బాగా గిలకొట్టాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేయాలి. -
రాగి రగస్యాలు
రాగిలో చాలా దాగి ఉన్నాయి... ఆరోగ్యం, ఆస్వాదనం, సంబరం, సంతోషం... ఇవే మరి రాగి రగస్యాలు... ఆపిల్ రాగుల పిండి హల్వా కావలసినవి: రాగుల పిండి – 2 టేబుల్ స్పూన్లు; ఆపిల్స్ – 2; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు. తయారి: ∙ఆపిల్స్‌ను శుభ్రంగా కడిగి (తొక్క, గింజలు వేరు చేసి) చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ ఒక బాణలిలో రాగుల పిండికి, ముప్పావు కప్పు నీళ్లు జత చేసి ఉండలు లేకుండా బాగా కలిపి, స్టౌ మీద సన్నని మంట మీద ఆపకుండా కలుపుతూ బాగా ఉడికించాలి ∙ ఉడుకుతున్న రాగుల పిండిలో... ఆపిల్ గుజ్జు, బెల్లం పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙ సుమారు నాలుగైదు నిమిషాలు బాగా ఉడికి, దగ్గర పడిన తరవాత దింపేయాలి ∙ చల్లారాక బౌల్స్‌లో అందించాలి. రాగులు పల్లీల లడ్డు కావలసినవి: రాగుల పిండి – ఒక కప్పు; పల్లీలు – 2 కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; పాలు – అర కప్పు; నువ్వులు – అర కప్పు; తయారి: ∙ స్టౌ మీద బాణలి వేడయ్యాక, మంట తగ్గించి, రాగుల పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి (సుమారు పది నిమిషాల సమయం పడుతుంది) వేరే పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి ∙ అదే బాణలిలో పల్లీలు, వేసి వేయించి, మరో పాత్రలోకి తీసుకుని, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి ∙అదే బాణలిలో నువ్వులు కూడా వేసి వేయించి, వేరే పాత్రలోకి తీసుకుని, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ ఒక గిన్నెలో రాగుల పిండి, పల్లీల పొడి, నువ్వుల పొడి, బెల్లం పొడి వేసి, బాగా కలపాలి ∙పాలు జత చేస్తూ చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చేసుకోవాలి ∙ గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రాగి కోకోనట్ కుకీస్ కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; రాగుల పిండి – ముప్పావు కప్పు; గోధుమ పిండి – అర కప్పు; అన్ సాల్టెడ్ బటర్ – 150 గ్రా; పంచదార పొడి – 150 గ్రా.; పంచదార – ఒక టేబుల్ స్పూను; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (చిన్నది); తయారి: ∙ఒక పాత్రలో బటర్, పంచదార పొడి వేసి బాగా కలిసేవరకు గిలకొట్టాలి ∙కోడి గుడ్డుసొనలు, వెనిలా ఎసెన్స్ జత చేసి మరోమారు గిలకొట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ పంచదార జత చేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙కుకర్‌లో ఇసుక పోసి స్టౌ మీద ఉంచి, బాగా వేడయ్యాక మంట తగ్గించాలి ∙ కుకర్ వేడెక్కేలోపు, ఫ్రిజ్‌లో నుంచి రాగుల పిండి మిశ్రమం బయటకు తీసి, చిన్న చిన్న ఉండలుగా చేసి, చేతితో ఒత్తి, అల్యూమినియం ట్రేలో దూరం దూరంగా ఉంచి, కుకర్‌లో పెట్టాలి (విజిల్ పెట్టకూడదు) ∙ సుమారు పావు గంట తరవాత స్టౌ మీద నుంచి దింపేయాలి ∙ కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసి, అందించాలి. రాగి బ్రెడ్ కావలసినవి: రాగుల పిండి – అర కప్పు; గోధుమ పిండి – ఒక కప్పు; పాల పొడి – అర కప్పు; అరటిపండ్లు – 3 (బాగా పండినవి); రిఫైన్డ్ ఆయిల్ – అర కప్పు; తేనె – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; జాజి కాయ పొడి – అర టీ స్పూను; ఉప్పు – చిటికెడు; డ్రై నట్స్ పొడి – అర కప్పు (బాదం పప్పులు + వాల్నట్స్) తయారి: ∙ఒక పాత్రలో గోధుమపిండి, రాగుల పిండి, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, రెండుమూడు సార్లు జల్లెడ పట్టాలి ∙మరొక పాత్రలో తొక్క తీసిన అరటిపండ్లను వేసి మెత్తటి గుజ్జులా చేసాక – తేనె, రిఫైన్డ్ ఆయిల్ జత చేసి మరోమారు కలిపాక, బీటర్ (కవ్వం) సహాయంతో బాగా గిలకొట్టాలి ∙ పాల పొడి జత చే సి, మరోమారు గిలకొట్టాలి ∙ రాగుల పిండి మిశ్రమం జత చేస్తూ, ఉండ కట్టకుండా బాగా కలపాలి డ్రై నట్స్ పొడి జత చేయాలి ∙నలు చదరంగా ఉన్న అల్యూమినియం ట్రేకి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, సమానంగా పరిచి పక్కన ఉంచాలి ∙కుకర్‌లో అంగుళం మందంలో ఇసుక పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించాలి ∙ సిద్ధంగా ఉంచుకున్న అల్యూమినియం ట్రేను కుకర్‌లో ఉంచి, మూత పెట్టాలి. (విజిల్ పెట్టకూడదు) ∙ సుమారు 40 నిమిషాలయ్యాక దింపాలి ∙కొద్దిగా చల్లారాక ట్రేను బయటకు తీసి, వేరే ప్లేటులోకి మార్చుకోవాలి ∙చాకుతో బ్రెడ్ మాదిరిగా కట్ చేసి అందించాలి. రాగి ఆలు మేథీ పరాఠా కావలసినవి: రాగుల పిండి – పావు కప్పు; గోధుమ పిండి – పావు కప్పు; మిరప పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; గరం మసాలా – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఆలు గడ్డ – 1; మెంతి ఆకుల తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారి: ∙ఆలుగడ్డను ఉడికించి, తొక్క తీసి పక్కన ఉంచాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, మెంతి ఆకుల తరుగు వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙ ఒక పాత్రలో తొక్క తీసిన ఆలు గడ్డ వేసి చేతితో మెత్తగా అయ్యేలా చిదిమాక, వేయించి ఉంచుకున్న మెంతి ఆకులు, గోధుమ పిండి, రాగి పిండి, మిరప పొడి, గరం మసాలా, ఉప్పు, తగినన్ని నీళ్లు జతచేసి చపాతీ పిండిలా కలపాలి ∙ టీ స్పూను నూనె జత చేసి బాగా కలిపి సుమారు గంటసేపు పక్కన ఉంచాక, పెద్ద పెద్ద ఉండలు చేయాలి ∙ ఒక్కో ఉండను పరాఠాలుగా ఒత్తాలి ∙ స్టౌ మీద పాన్ వేడయ్యాక, ఒక్కో పరాఠాను వేసి రెండు వైపులా నూనె వేసి, దోరగా కాల్చి తీసేయాలి ∙ వేడివేడిగా అందించాలి. బాగా ఎండలు పెరిగాక మార్కెట్లో మెంతి కూర దొరకదు కదా. మరి ఆ సీజన్లో కూడా మెంతికూర తినాలంటే ఏం చేయాలి? ఎండలు పెరిగేకొద్దీ మెంతికూర ధర బాగా పెరుగుతుంది. అంతేకాదు, లేతగా తాజాగా ఉండే మెంతి కూర దొరకడం కూడా కష్టమే. అందువల్ల ఇంకా ఎండలు బాగా ముదరకుండా, ఇప్పుడే ఎక్కువ మెంతి కూర కొని, తెచ్చుకోవాలి. ఆకులు తెంపి, శుభ్రంగా కడగాలి. పొడి వస్త్రం మీద, నీడలో ఆరబెట్టాలి. పూర్తిగా తడి పోయిన మెంతి ఆకులను గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఆకులను వంటలో వాడుకోవచ్చు. -
చిరు'చి '
సజ్జలు, జొన్నలు, రాగులు... ఇవి చిరుధాన్యాలు. చిరకాలం తినే రుచినిచ్చే ఆరోగ్యాన్ని సంరక్షించే.. ఆనందాన్ని అందించే కొన్ని చిరుధాన్యాలతో.. కొన్ని వంటకాలు ఈ చిరుచులు ఆస్వాదించండి. సజ్జ టిక్కా కావలసినవి: సజ్జలు – అర కప్పు; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; తరిగిన క్యారెట్ – అర కప్పు; పచ్చి బఠానీలు – పావు కప్పు; కారం – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; చాట్ మసాలా – పావు టీ స్పూన్; గరమ్ మసాలా – చిటికెడు; తరిగిన కొత్తిమీర – కొంచెం; నూనె – తగినంత; ఉప్పు – సరిపడా. తయారి :సజ్జలను బాగా కడిగి 15–20 నిమిషాలు నాననివ్వాలి ∙బాణనిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరిగిన ఉల్లిపాయముక్కలు, క్యారెట్, బఠానీలు వేసి కాసేపు వేగనివ్వాలి. దీనికి 1 కప్పు నీళ్లను పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి ∙నానపెట్టుకున్న సజ్జలను వేసి మూతపెట్టి చిన్న మంట మీద నీరు పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడకనివ్వాలి ∙పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ ఇంకా నీళ్లు ఉన్నట్టయితే ఇంకాసేపు మూతపెట్టి సన్నమంట మీద ఉంచుకోవాలి ∙కారం, జీలకర్రపొడి, చాట్ మసాలా, గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ∙ఇలా తయారుచేసుకున్న దానిని ఉండలుగా చేసి అరచేతిలో టిక్కా మాదిరిగా ఒత్తుకోవాలి. (ఈ టిక్కాను బ్రెడ్ పొడిలో అద్దుకోవచ్చు) ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె వేసి ఒక్కొక్క టిక్కాను పెనం మీద వేసి సన్న మంట మీద బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాలనివ్వాలి ∙వీటిని టమోటో కెచెప్తో లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. మిల్లెట్ స్వీట్ పొంగల్ కావలసినవి : వరిగెలు – పావు కప్పు; సామలు – పావు కప్పు; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు; పాలు – పావు కప్పు; తరిగిన బెల్లం – అర కప్పు, లేదా బెల్లం పాకం – అర కప్పు; తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; కిస్మిస్ – 15; యాలకులు – 6 (పొడి చేసుకోవాలి); నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు తయారి: ∙బెల్లంలో కొంచెం నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. తీగ పాకానికి దగ్గరగా ఉండగానే స్టౌ ఆఫ్ చేసి వడపోసి పక్కన పెట్టుకోవాలి ∙నెయ్యి వేడిచేసి జీడిపప్పు, కిస్మిస్ను వేయించుకోవాలి ∙వరిగెలు, సామలు, పెసరపప్పు ఈ మూడింటిని కలిపి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ∙ఉడికిన ఈ మిశ్రమానికి బెల్లం పాకం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పాలు పోసి మరో పది నిమిషాలు ఉడికించాలి ∙చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ∙ఈ పొంగలి వేడిగా కంటే చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది. మిల్లెట్ లడ్డు కావలసినవి: కొర్రలు – 3 టేబుల్ స్పూన్లు; సజ్జలు – 3 టేబుల్ స్పూన్లు; రాగులు – 3 టేబుల్ స్పూన్లు; సామలు – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు, బార్లీ – 1 టేబుల్ స్పూను; తరిగిన బెల్లం – 1 కప్పు; యాలకులు – 4; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు (కలపడానికి తగినంత). తయారి: ∙చిరుధాన్యాలు, పెసరపప్పు, బార్లీ, యాలకులు వేసి 10 నిమిషాల సేపు చిన్న మంటపై కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి ∙అన్నీ కలిపి కాకుండా ఒక్కొక్కటిగా కూడా వేయించుకోవచ్చు ∙ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా సన్న రవ్వలా పట్టుకోవాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించాలి ∙పిండి ఉన్న జార్లో బెల్లం, జీడిపప్పు, నెయ్యి వేసి మళ్లీ ఒక్కసారి మిక్సీ పట్టాలి ∙ఈ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. (నెయ్యి వాడని వారు గోరు వెచ్చటి పాలతో కూడా లడ్డూలు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు) ∙వీటిని ఎయిర్‌టైట్ కంటెయినర్లో పెట్టుకోవాలి. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి జొన్న ఉప్మా కావలసినవి: జొన్న రవ్వ 1 కప్పు; కరివేపాకు – 1 రెమ్మ; ఉడికించిన కూరగాయ ముక్కలు – 1 కప్పు (క్యారెట్, బీన్స్); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి – 2; అల్లం తరుగు – 1 చెంచా; నూనె – 2 చెంచాలు; కొత్తిమీర తరుగు – 2 చెంచాలు; ఆవాలు – 1 చెంచా; జీలకర్ర – అర చెంచా; శనగపప్పు – 2 చెంచాలు; మినప్పప్పు – 1 చెంచా; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2, జీడిపప్పు – 10. తయారి: ∙జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి ∙నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్టు్టకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయండి. ఈ ఉప్మా ఏ చట్నీతోనైనా తినవచ్చు. మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు. కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు. రాగి రొట్టె కావలసినవి: రాగుల పిండి – 1 1/2 కప్పు; ఉల్లిపాయ – 1; పచ్చిమిరపకాయలు – 2; కొత్తిమీర – 1 చిన్న కట్ట; ఆవాలు – 1 స్పూన్, జీలకర్ర – 1 స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ, నూనె – తగినంత. తయారి : ముందుగా రాగుల పిండిని బాణలిలో వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ఉప్పును పిండిలో కలుపుకోవాలి ∙ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి ఈ వేడి నీళ్లను కొంచెం కొంచెంగా పిండిలో పోస్తూ గరిటెతో కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా చేతితో రొట్టెలా ఒత్తడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి ∙ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరుపై నూనె రాసి చేతితో రొట్టెలా చేసుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి వేడయ్యాక, 1 స్పూన్ నూనె వేసి, కవరుపై చేసిన రాగి రొట్టెను జాగ్రత్తగా పెనంపై వేసి రెండు వైపులా కాలనివ్వాలి ∙వేడి వేడి రాగి రొట్టెలకు కొత్తిమీర పచ్చడి లేదా కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్. -
రాగులతో మైగ్రేన్ దూరం
గుడ్‌ఫుడ్ రాగులు మైగ్రేన్ తలనొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. రాగులలో క్యాల్షియమ్ పాళ్లు పుష్కలం. 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రాముల క్యాల్షియమ్ ఉంటుంది. రాగుల పై పొట్టులో పాలీఫీనాల్స్ అనే పోషకాలు, డయటరీ ఫైబర్ (పీచు) ఎక్కువ. అవి మనం తీసుకున్న ఆహారాన్ని మెల్లగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దాంతో మన ఆహారం ద్వారా వెలువడే చక్కెర చాలా నెమ్మదిగా విడుదల అవుతుంది. దాంతో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి రాగులు మంచి ఆహారం. ఇక పీచుపదార్థాల వల్ల మన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయడంతో పాటు మలబద్దకం ముప్పు ఉండదు. రాగులు తీసుకునే వారిలో చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అంతేగాక వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలను నివారిస్తుంది. దాంతో దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యమవుతుంది.రాగులలో స్వాభావికమైన ఐరన్ ఎక్కువ. అందుకే రక్తహీనత (అనీమియా)తో బాధపడే రోగులకు రాగులతో చేసే ఆహారాలను సిఫార్సు చేస్తారు. ఇక రాగులను మొలకెత్తేలా (స్ప్రౌట్స్‌గా) చేస్తే వాటిలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రాగులలోని ఐరన్‌ను ఒంటికి పట్టేలా చేస్తుంది.రాగులు తినేవారిలో యాంగై్జటీ, డిప్రెషన్, నిద్రలేమి (ఇన్సామ్నియా) వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. రాగులలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఊబకాయంతో బాధపడేవారికి మంచి ఆహారం.