Healthy Diet: ఓట్స్‌ – పొటాటో చీజ్‌ బాల్స్‌! | Healthy Diet: Oats And Potato Cheese Balls Recipe Making Process | Sakshi
Sakshi News home page

Healthy Diet: ఓట్స్‌ – పొటాటో చీజ్‌ బాల్స్‌!

Published Thu, Jul 25 2024 9:00 AM | Last Updated on Thu, Jul 25 2024 9:00 AM

Healthy Diet: Oats And Potato Cheese Balls Recipe Making Process

ఓట్స్, పొటాటోలు కలిపి తయారుచేసే చీజ్ బాల్స్ వంటకంతో ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఈ వంటకంలో పుష్కలమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. ఇక వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..

కావలసినవి..
ఉడికించి చిదిమిన బంగాళాదుంప – 2 కప్పులు;
ఓట్స్‌ – కప్పు;
చీజ్‌ తురుము – కప్పు;
ఉల్లిపాయ తరుగు – పావు కప్పు;
కొత్తిమీర – పావు కప్పు (తరగాలి);
మిరప్పొడి– అర టీ స్పూన్‌;
చాట్‌ మసాలా– అర టీ స్పూన్‌;
ఉప్పు – రుచికి తగినంత;
నూనె – టేబుల్‌ స్పూన్‌.

తయారీ..
– ఓట్స్‌ను బాణలిలో నూనె లేకుండా మీడియం మంట మీద ఒక మోస్తరుగా వేయించి, పొడి చేసి పక్కన పెట్టాలి.
– ఒక పాత్రలో చిదిమిన బంగాళాదుంప, ఓట్స్‌ పొడి, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్‌ మసాలా, మిరప్పొడి, ఉప్పు వేసి కలపాలి.
– మొత్తం చపాతీ పిండిలా ముద్దగా తయారవుతుంది. ఈ ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో బాల్స్‌ చేసుకోవాలి.
– ఒక్కో బాల్‌ని అరచేతిలో వేసి కొద్దిగా ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో వత్తాలి.
– ఆపం పెనం లేదా కొంచెం గుంటగా ఉన్న పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాసి ఒక్కో బాల్‌ని పెనం మీద అమర్చి మంటను మీడియంలో పెట్టాలి.
– ఒకవైపు దోరగా కాలిన తర్వాత మెల్లగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.
– ఈ చీజ్‌ బాల్స్‌ని వేడిగా ఉన్నప్పుడే కెచప్‌ లేదా సాస్‌లతో వడ్డించాలి.

గమనిక: పిండిలో కలిపిన చీజ్‌ కరిగి బయటకు వస్తుంది. కాబట్టి నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. పెనం మాడుతున్నట్లనిపిస్తే చీజ్‌ బాల్స్‌ కాలుతున్నప్పుడు పై నుంచి కొద్ది చుక్కలు నూనె వేయవచ్చు.
పోషకాలు: పై కొలతలతో చేసిన చీజ్‌ బాల్స్‌లో 150 కేలరీలుంటాయి. కార్బొహైడ్రేట్‌లు 25 గ్రాములు, ప్రోటీన్‌లు– 6 గ్రాములు, ఫ్యాట్‌– 7 గ్రాములు, ఫైబర –3 గ్రాములు, క్యాల్షియం– 100 మిల్లీ గ్రాములు, ఐరన్‌– 1.5 మిల్లీ గ్రాములు


– డాక్టర్‌ కరుణ, న్యూట్రిషనిస్ట్‌ అండ్‌, వెల్‌నెస్‌ కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement