Potato
-
ఇంటి భోజనం మరింత భారం!
కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టమోటాలు, బంగాళదుంప ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 అదే నెలలో భోజనం ఖర్చులు 6 శాతం పెరిగి రూ.31.6కు చేరినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంతకుముందు నవంబర్‌లో మాత్రం ఇది రూ.32.7గా ఉందని తెలిపింది.ధరల పెరుగుదలకు కొన్ని కారణాలను నివేదిక విశ్లేషించింది.వెజిటేరియన్ థాలీ: వెజిటేరియన్ థాలీ(Veg Thali) తయారీకి అయ్యే సగటు ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.31.6కు చేరింది.నాన్ వెజిటేరియన్ థాలీ: నాన్‌వెజ్ థాలీ(Non Veg) ధర ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.63.3కు చేరింది.టమోటా ధరలు: డిసెంబర్లో కిలో టమోటా(Tamato) ధర 24 శాతం పెరిగి రూ.47కు చేరింది.బంగాళాదుంప ధరలు: కిలో బంగాళాదుంప ధర 50 శాతం పెరిగి రూ.36గా ఉంది.వంట నూనెలు: దిగుమతి సుంకం పెంపు కారణంగా వెజిటబుల్ ఆయిల్ ఖర్చులు 16% పెరగడం కూడా ఆహార ధరలు పెరిగేందుకు దోహదం చేసింది.చికెన్ ధరలు: బ్రాయిలర్ (చికెన్) ధర గతంలో కంటే 20% పెరిగింది. ఇది మొత్తం భోజన ఖర్చును గణనీయంగా ప్రభావితం చేసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!2024 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో టమోటా ధరలు 12% తగ్గాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వీటి సరఫరా పెరిగినందునే, శాకాహార థాలీ ధర 3% తగ్గింది. ఉల్లి ధరలు నెలవారీగా 12%, బంగాళాదుంపల ధరలు 2% తగ్గాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు కొంత తగ్గడం, టమోటాల సరఫరా పెరగడం ప్రస్తుతం కొంత ధరలు నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది జనవరి నెల నివేదికలో ప్రతిబింబిస్తుంది. -
తొక్కలో ఇంధనం
తొక్కే కదా అని అలుసుగా చూడొద్దు! ఏమో రేపు అవే మన బైకులు.. కార్లు.. లారీలను నడిపే ఇం‘ధనం’గా మారొచ్చు! దేనిగురించి అనుకుంటున్నారా? అదేనండీ మనం కరకరలాడించే చిప్స్.. ఫ్రై.. కూరల్లో లొట్టలేసుకుంటూ లాగించే బంగాళాదుంపల సంగతిది. ఈ ఆలుగడ్డ తొక్కలు, వ్యర్థాల నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి(Biofuel Production) చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. దీన్ని పరీక్షించేందుకు త్వరలో ప్రయోగాత్మక (పైలట్) ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవంతమైతే.. బంగాళా దుంపలతో బైక్ నడిపేయొచ్చన్నమాట!!సాక్షి, బిజినెస్ డెస్క్: బంగాళాదుంపల(potato) ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది భారత్. అయితే, సరైన నిల్వ సదుపాయాల్లేక పంట చేతికొచ్చాక పాడైపోయే ఆలుగడ్డలు మొత్తం ఉత్పత్తిలో 10–15 శాతం ఉంటాయని అంచనా. మరోపక్క పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులను పెద్ద ఎత్తున తయారుచేసే స్నాక్స్ కంపెనీల నుంచి తొక్కలు ఇతరత్రా రూపంలో వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటి నుంచి జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్–ఇథనాల్) ఉత్పత్తి చేసే టెక్నాలజీని సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఐ) రూపొందించింది. ల్యాబ్ పరీక్షలు కూడా పూర్తి కావడంతో, ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడం కోసం పైలట్ ప్లాంటును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.బంగాళాదుంప తొక్కలు, వ్యర్థాల నుంచి ఇథనాల్చెరకు, మొక్కజొన్నతో పాటు..దేశంలో ప్రస్తుతం చెరకు, మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు బంగాళాదుంపల వ్యర్థాలను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఫీడ్ స్టాక్‌గా ఉపయోగించేందుకు జాతీయ జీవ ఇంధన పాలసీలో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. ‘ఆలుగడ్డల నుంచి గణనీయమైన వ్యర్థాలు ఉంటున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి వీటిని విలువైన ప్రత్యామ్నాయాలుగా పరిగణించవచ్చు’అని సీపీఆర్ఐ శాస్త్రవేత్త ధర్మేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏటా సగటున సుమారు 5.6 కోట్ల టన్నుల ఆలుగడ్డలు ఉత్పత్తి అవుతున్నాయి.ఇందులో 8–10 శాతం, అంటే 50 లక్షల టన్నులను పొటాటో చిప్స్, ఫ్రైస్, ఇంకా డీహైడ్రేటెడ్ ప్రాడక్టులుగా ప్రాసెస్ చేస్తున్నారు. ఆయా ప్లాంట్ల నుంచి భారీ మొత్తంలో తొక్కలు, ఇతరత్రా వ్యర్థాలు బయటికొస్తాయి. ఇక పంట చేతికొచ్చాక ఉత్పత్తి నష్టాలు 20–25 శాతం, అంటే సుమారు 1.1–1.4 కోట్ల టన్నుల మేరకు ఉంటాయని అంచనా. ప్రధానంగా సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, సరిగ్గా రవాణా చేయకపోవడం వంటివి దీనికి కారణం. ‘అత్యధికంగా బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తున్న ఉత్తరప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్, అలాగే భారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న గుజరాత్ వంటి చోట్ల పొటాటో ద్వారా ఇథనాల్ తయారు చేసే పైలట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’అని కుమార్ తెలిపారు.20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్.. క్రూడ్ ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే బయో ఫ్యూయల్ పాలసీని పక్కాగా అమలు చేస్తోంది. 2013–14 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై)లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ (ఫ్యూయల్ గ్రేడ్) దేశంలో ఉత్పత్తి కాగా, 2020–21 నాటికి ఇది 302.3 కోట్ల లీటర్లకు చేరింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం నుంచి 8.17 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో దేశంలో పెట్రోల్ వినియోగం 64 శాతం ఎగబాకడం గమనార్హం. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది.అయితే, 2022 జూన్ నాటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) 10 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంతో 2025–26 నాటికి 20 శాతం లక్ష్యాన్ని కుదించారు. 2023–24లో ఈ బ్లెండింగ్ 13 శాతంగా నమోదైంది. డీజిల్‌లో సైతం 5% ఇథనాల్‌ను కలిపే పాలసీని తీసుకొచ్చే ప్రణాళికల్లో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి మరిన్ని రకాల ఫీడ్ స్టాక్లనువినియోగించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.2025 కల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు తప్పనిసరి..పెట్రోలు, డీజిల్‌తో నడిచే సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల స్థానంలో రాబోయే రోజుల్లో ఫ్లెక్సి ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్‌సీవీ)లు పరుగులు తీయనున్నాయి. బయో ఫ్యూయల్ పాలసీకి అనుగుణంగా 2025 చివరినాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఐసీఈ వాహన ఇంజిన్లను పెట్రోల్‌తోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ (85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్–ఈ 85)కు అనుగుణంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. -
ఆలూ.. సబ్సిడీ ఇస్తే మేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆలూ రైతులపై విత్తన భారం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు విత్తనాల ధరలను అమాంతం పెంచడంతో ఈ పంట సాగుచేసే రైతులకు సాగు ఖర్చు తడిసిమోపెడవుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,400 వరకు ఉన్న ఆలు విత్తనం ఇప్పుడు ఏకంగా రూ.3,500 దాటింది. క్వింటాలుపై సుమారు రూ.వెయ్యికిపైగా ధర పెరిగింది. ఎకరానికి కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు విత్తన దశలోనే సాగు ఖర్చు రూ.8 వేలు పెరుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట కావడం, దీనికి తోడు విత్తన భారం పెరగడంతో ఆలురైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తెరపైకి సబ్సిడీ సీడ్ డిమాండ్ పెరిగిన ఆలూ విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గతంలో రెండుసార్లు ఈ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సబ్సిడీపై ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిందని, ఈసారి కూడా సబ్సిడీ విత్తన పంపిణీని పునరుద్ధరించాలని ఆలూ రైతులు కోరుతున్నారు.పంజాబ్ నుంచి కొనుగోలు.. ఏటా రైతులు పంజాబ్‌లోని జలంధర్, యూపీలోని ఆగ్రా నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. పెద్ద రైతులైతే స్వయంగా అక్కడి వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే ఆలూ విత్తన వ్యాపారులు ధరను అమాంతం పెంచారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆలుగడ్డల ధర కాస్త ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు విత్తన రూపంలో మాత్రం భారం తప్పడం లేదు. ఏటా రైతులు సెపె్టంబర్ చివరి వారం నుంచి ఆలూను విత్తుకోవడం ప్రారంభిస్తారు. ఈ విత్తనాల కోసం రైతులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఆలుగడ్డలు అత్యధికగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌తో పాటు, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. ఇక్కడి నేలతో పాటు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావడంతో ఈ పంటకు మంచి దిగుబడి వస్తుంది.విత్తనాన్ని సబ్సిడీపై అందించాలి ఆలూ విత్తనం రేటు పెరిగినందున ప్రభు త్వం సబ్సిడీపై రైతులకు అందించాలి. గతేడాది ఆలూ విత్తనం క్వింటాల్ రూ.2,400 – రూ.2,600 ఉండగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.3 వేలు – రూ.3,500 పలుకుతోంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని అందిస్తే బాగుంటుంది. – దిలీప్‌కుమార్, రైతు, అత్నూర్ఆలూ సాగు ఖర్చు పెరిగింది ఆలుగడ్డ విత్తనం ధర భారీగా పెంచారు. విత్తన ఖర్చు ఎకరానికి 8 వేల వరకు అదనంగా అవుతోంది. గతంలో మాదిరిగా ఆలూ విత్తనాన్ని సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆలూ విత్తనం సబ్సిడీపై ఇచ్చేవారు. దీన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఎం.ఏసురత్నం, ఆలూ రైతు, మాచిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లాసబ్సిడీ విత్తన సరఫరా పథకం లేదు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం లేదు. గతంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినట్లు నాకు తెలియదు. ఉద్యానవనశాఖ కిందకు వచ్చే ఈ పంటకు సబ్సిడీ వర్తించదు. ఒకవేళ సబ్సిడీ కిందకు చేరిస్తే రైతులకు సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం వీలవుతుంది. – సోమేశ్వర్రావు, డిప్యూటీ డైరెక్టర్, హారి్టకల్చర్ -
ఈ వంటలను ఎప్పుడైనా వండి చూశారా..!?
పొటాటో–లెమెన్ పోహా..కావలసినవి:బంగాళదుంపలు– 2 (ఉడికించి, చల్లారాక తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి),జీలకర్ర, ఆవాలు– పావు టీ స్పూన్ చొప్పున,కరివేపాకు,ఎండుమిర్చి– కొద్దికొద్దిగావేరుశనగలు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)అల్లం తరుగు– కొద్దిగా, వెల్లుల్లి ముక్కలు– పావు టీ స్పూన్నూనె– సరిపడా,ఉప్పు– రుచికి తగ్గట్టుగాపసుపు, కారం– అర టీ స్పూన్ చొప్పుననిమ్మరసం– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)కొత్తిమీర తురుము– 4 టేబుల్ స్పూన్లు, అటుకులు– ఒకటిన్నర కప్పులుతయారీ..– ముందుగా అటుకులను జల్లెడ తొట్టెలో వేసుకుని మంచినీళ్లు పోసి, 2 సార్లు కడిగి పెట్టుకోవాలి.– ఆపై ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిప్పుతూ, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.– అందులో పసుపు, కారం, తగినంత ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసుకుని, 2 నిమిషాలు మూత పెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.– అనంతరం కొత్తిమీర తురుము, అటుకులు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి, మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఈ పోహా.డ్రైఫ్రూట్స్ చాక్లెట్స్..కావలసినవి:కోకో పౌడర్,పంచదార పొడి,కొబ్బరి నూనె (స్వచ్ఛమైనది) – ముప్పావు కప్పు చొప్పున,మిల్క్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు,పిస్తా, బాదం, జీడిపప్పు, వేరుశనగలు(దోరగా వేయించి, తొక్క తీసేసినవి) – 2 టేబుల్ స్పూన్ల చొప్పునతయారీ:– ముందుగా పిస్తా, జీడిపప్పు, బాదం, వేరుశనగలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అనంతరం అదే మిక్సీ బౌల్‌ని కాసిన్ని నీళ్లతో క్లీన్ చేసుకుని, దానిలో కోకో పౌడర్, పంచదార పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, మిల్క్ పౌడర్ ఒకదాని తరవాత ఒకటి వేసుకుని క్రీమీగా మారేలా మిక్సీ పట్టుకోవాలి.– అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, దానిలో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం నచ్చిన షేప్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్ ట్రేని తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, కొద్దికొద్దిగా ఈ మిశ్రమం వేసుకుని, మూడు నుంచి 5 గంటల పాటు ఆ ట్రేను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం వాటిని ట్రే నుంచి వేరు చేసుకోవచ్చు.ఎల్లో ఎగ్ – కీమా లాలీపాప్స్..కావలసినవి:గుడ్లు– 6 లేదా 7 (పసుపు సొన మాత్రమే, ఉడికించి చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)మటన్ కీమా– పావుకిలో (మసాలా, ఉప్పు, కారం వేసుకుని కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి)బ్రెడ్ పౌడర్– అర కప్పుఓట్స్ పౌడర్– పావు కప్పు,అల్లం–వెల్లుల్లి పేస్ట్– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– ఒకటిన్నర టీ స్పూన్లు,మిరియాల పొడి, జీలకర్ర పొడి– పావు టీ స్పూన్ చొప్పున,ఆమ్చూర్ పౌడర్– 2 టీ స్పూన్లుఉప్పు– తగినంత,గడ్డ పెరుగు– తగినంతనీళ్లు– కొన్ని (అభిరుచిని బట్టి),టమాటో సాస్,కొత్తిమీర తురుము– గార్నిష్‌కి సరిపడా,నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ:– ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల పసుపు సొన, ఉడికిన మటన్ కీమా, ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గడ్డ పెరుగు వేసుకుని ముద్దగా చేసుకోవాలి.– ముద్దలా చేసుకోవడానికి పెరుగు చాలకుంటే నీళ్లు కూడా వాడుకోవచ్చు. – ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా లేదా చిత్రంలో చూపిన విధంగా చేసుకుని, ప్రతి లాలీపాప్‌కు ఒక పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి.– అనంతరం వాటిని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.– వెంటనే టమాటో సాస్‌లో వాటిని ముంచి, కొత్తిమీర తురుము జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
ప్రధాని మోదీ మెచ్చిన ఆలూ.. అందరూ తినొచ్చంటున్న వైద్యులు
సాధారణంగా చాలామంది వైద్యులు బంగాళదుంపలు(ఆలూ) ఆరోగ్యానికి అంతమంచివి కావని చెబుతుంటారు. మరోవైపు ఆరోగ్య స్పృహ కలిగినవారిలో కొందరు బంగాళాదుంపలకు దూరంగా ఉంటారు. అయితే మార్కెట్లోకి ఇటీవలే వచ్చిన ఒకరకం బంగాళదుంపలను నిరభ్యంతరంగా తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ బంగాళదుంపను ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పూసా) వారు రూపొందించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మోదీపురంలోని రీజనల్ సెంటర్లోని పూసాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కనుగొన్న ఈ కొత్త రకం బంగాళదుంప పేరు కుఫ్రీ జామునియా. ఈ రకాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు సుమారు తొమ్మదేళ్లు పట్టింది. దీనికి సంబంధించిన పరిశోధనలు 2015లో ప్రారంభమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ నూతన తరహా బంగాళదుంపను ప్రధానికి చూపించి, దాని ప్రత్యేకతను కూడా వివరించారు.ఈ బంగాళాదుంపను కనుగొన్న పూసా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్కె లూత్రా మీడియాతో మాట్లాడుతూ కుఫ్రీ జామునియా అనేది యాంటీ-ఆక్సిడెంట్లుతో పాటు ఊదారంగు గుజ్జు కలిగిన బంగాళాదుంప రకం. 100 గ్రాముల దుంపలోని గుజ్జులో అధిక యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి (52 మి.గ్రా), ఆంథోసైనిన్ (32 మి.గ్రా), కెరోటినాయిడ్స్ (163 మైక్రోగ్రాములు) ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. కుఫ్రీ జామునియాను హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పండించేందుకు అనువైన వాతావరణం ఉంది. -
Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్!
ఓట్స్, పొటాటోలు కలిపి తయారుచేసే చీజ్ బాల్స్ వంటకంతో ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. ఈ వంటకంలో పుష్కలమైన పోషకాలు ఇమిడి ఉంటాయి. ఇక వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..కావలసినవి..ఉడికించి చిదిమిన బంగాళాదుంప – 2 కప్పులు;ఓట్స్ – కప్పు;చీజ్ తురుము – కప్పు;ఉల్లిపాయ తరుగు – పావు కప్పు;కొత్తిమీర – పావు కప్పు (తరగాలి);మిరప్పొడి– అర టీ స్పూన్;చాట్ మసాలా– అర టీ స్పూన్;ఉప్పు – రుచికి తగినంత;నూనె – టేబుల్ స్పూన్.తయారీ..– ఓట్స్‌ను బాణలిలో నూనె లేకుండా మీడియం మంట మీద ఒక మోస్తరుగా వేయించి, పొడి చేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో చిదిమిన బంగాళాదుంప, ఓట్స్ పొడి, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరప్పొడి, ఉప్పు వేసి కలపాలి.– మొత్తం చపాతీ పిండిలా ముద్దగా తయారవుతుంది. ఈ ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో బాల్స్ చేసుకోవాలి.– ఒక్కో బాల్ని అరచేతిలో వేసి కొద్దిగా ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో వత్తాలి.– ఆపం పెనం లేదా కొంచెం గుంటగా ఉన్న పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనె రాసి ఒక్కో బాల్ని పెనం మీద అమర్చి మంటను మీడియంలో పెట్టాలి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత మెల్లగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.– ఈ చీజ్ బాల్స్‌ని వేడిగా ఉన్నప్పుడే కెచప్ లేదా సాస్‌లతో వడ్డించాలి.గమనిక: పిండిలో కలిపిన చీజ్ కరిగి బయటకు వస్తుంది. కాబట్టి నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. పెనం మాడుతున్నట్లనిపిస్తే చీజ్ బాల్స్ కాలుతున్నప్పుడు పై నుంచి కొద్ది చుక్కలు నూనె వేయవచ్చు.పోషకాలు: పై కొలతలతో చేసిన చీజ్ బాల్స్‌లో 150 కేలరీలుంటాయి. కార్బొహైడ్రేట్లు 25 గ్రాములు, ప్రోటీన్లు– 6 గ్రాములు, ఫ్యాట్– 7 గ్రాములు, ఫైబర –3 గ్రాములు, క్యాల్షియం– 100 మిల్లీ గ్రాములు, ఐరన్– 1.5 మిల్లీ గ్రాములు– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్, వెల్నెస్ కోచ్ -
మొలకలొచ్చిన ఆలుగడ్డలు : ఇలా జాగ్రత్త పడదాం!
గింజలు, ఇతర తృణ ధాన్యాల్ని నానబెట్టి మొలకెత్తిన తరువాత తినడం వలన అందులోని పోషకాలు ఎక్కువగా అందుతాయి. కానీ మొలకెత్తిన తరువాత విషపూరితంగా మారే దుంపకూర గురించి తెలుసా? మార్కెట్ నుంచి తెచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు, బంగాళాదుంపల్లో తెల్లగా చిన్న చిన్న మొలకలొస్తాయి. ఇలాంటి వాటిని తినడం మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?మొలకలొచ్చిన బంగాళాదుంపలను మొలకల్ని తీసివేసి వండుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా మొలకెత్తిన దుంపలను వంటలో ఉపయోగించడం మంచిది కాదు. నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వాడకుండా ఉండటమే ఉత్తమం. మొలకెత్తిన బంగాళదుంపలు ఎందుకు తినకూడదుగ్లైకోఅల్కలాయిడ్స్, యాంటీబయాటిక్ లక్షణాలు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాలతో సహా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వీటిని అధికంగా తింటే విషపూరితమయ్యే అవకాశాలే ఎక్కువ. మొలకెత్తిన బంగాళా దుంపల్లో అధిక స్థాయిలో గ్లైకోఅల్కలాయిడ్స్ పెరుగుతాయి. వీటి అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావొచ్చు. అయితే వీటి బాగా ఉడికించడం వల్ల ఈ విష ప్రభావం బాగా తగ్గుతుంది.మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న తర్వాత కొన్ని గంటల నుండి ఒక రోజులో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి మరీ ఎక్కువైతే రక్తపోటు, పల్స్ వేగం, జ్వరం, తలనొప్పి, గందరగోళం, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి.గర్భధారణ సమయంలో మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే మొలకలొచ్చిన దుంపలు తాజాగా ఉన్నంతవరకు బేషుగ్గా తినవచ్చని మరికందరు చెబుతున్నారు. ఆ మొలకల్ని శుభ్రంగా తీసేసి తినవచ్చు. అయితే దుంపలు కుళ్లిపోకుండా ఉన్నాయా లేదా అనేది గమనించడం ముఖ్యమంటున్నారు.మొక్కలు రాకుండా ఉండాలంటేఎక్కువ నిల్వ ఉండకుండా, తాజాగా ఉండే దుంపలను మాత్రమే వంటల్లో వాడు కోవడం. బంగాళాదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఉంచకూడదు. ఎందుకంటే రెండింటినీ కలిపి ఉంచడం వల్ల దుంపలు తొందరగా మొలక లొస్తాయట. బంగాళాదుంపల సంచిలో ఆపిల్‌ను జోడించడం వలన అవి మొలకెత్తకుండా నిరోధించవచ్చట.చిన్న చిట్కా: ఇలా మొలకలొచ్చిన దుంపలను పెరట్లోని చిన్న కుండీల్లో వేస్తే చక్కగా పెరుగుతాయి. దుంపలు కూడా ఊరతాయి. -
చల్లని వాతావరణానికి.. కమ్మని 'గ్రీన్ కర్రీస్'!
వాతావరణం మారింది... వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ కోల్డ్... ఇంకా అనుబంధ సమస్యలు కూడా. ఇమ్యూనిటీ పుష్కలంగా ఉండడమే అన్నింటికీ పరిష్కారం. ఆహారంలో రుచికి తోడుగా ఆరోగ్యాన్ని జోడించాలి. రోజూ ఏదో ఒక ఆకు కూర తింటే ఆరోగ్యం పరిపూర్ణం. రోజూ ఆకు కూరలేనా... అని పిల్లలు ముఖం చిట్లిస్తే... పిల్లలు ఇష్టపడే కాంబినేషన్లతో వండి పెట్టండి.ఆలూ మేథీ..కావలసినవి..బంగాళదుంప– 200 గ్రా;మెంతి ఆకు – మీడియం సైజు కట్ట ఒకటి;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 2 టేబుల్ స్పూన్లు;జీలకర్ర – టీ స్పూన్;ఇంగువ – పావు టీ స్పూన్;వెల్లుల్లి తరుగు – టీ స్పూన్;అల్లం తరుగు – టీ స్పూన్;పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;ఎండుమిర్చి – 2; పసుపు – అర టీ స్పూన్;ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లుతయారీ..– బంగాళదుంప ఉడికించి తొక్క తీసి ముక్కలు చేయాలి.– మెంతి ఆకులు వలిచి శుభ్రంగా కడిగి, నీరంతా పోయిన తర్వాత తరిగి పక్కన పెట్టుకోవాలి.– బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి సన్నమంట మీద వేయించాలి.– పసుపు, బంగాళాదుంప ముక్కలు వేయాలి. మసాలా దినుసులు ముక్కలకు పట్టేటట్లు మధ్య మధ్య కలియబెడుతూ ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.– ఇప్పుడు ధనియాల పొడి, మెంతి ఆకు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద మగ్గనిచ్చి దించేయాలి. పిల్లల లంచ్ బాక్సుకు ఇది మంచి పోషకాహారం.క్యారట్ మొరింగా కర్రీ.. కావలసినవి..క్యారట్ – పావు కేజీ;మునగ ఆకు – వంద గ్రాములు;జీలకర్ర – అర టీ స్పూన్;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;పచ్చిమిర్చి – 4 (తరగాలి);వెల్లుల్లి రేకలు – 3 (తరగాలి);అల్లం తరుగు – టీ స్పూన్;పసుపు – పావు టీ స్పూన్;ధనియాల పొడి – 2 టీ స్పూన్లు;నూనె – 2 టీ స్పూన్లు.తయారీ..– క్యారట్‌ని శుభ్రం చేసి తరగాలి. మునగ ఆకును కడిగి నీరు పోయేటట్లు చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.– బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి, వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి.– మునగాకు కలిపి రెండు నిమిషాలు(పచ్చివాసన పోయే వరకు) వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.– అరకప్పు నీరు పోసి కలిపి మూత పెట్టాలి. రెండు నిమిషాల్లో క్యారట్ ముక్కలు ఉడుకుతాయి.– మూత తీసి నీరు ఆవిరయ్యే వరకు కలిపి దించేయాలి. ఇష్టమైతే కూరలో చివరగా కొబ్బరి పొడి చల్లుకోవచ్చు. గమనిక: మునగ ఆకు లేకపోతే మెంతి ఆకుతో చేసుకోవచ్చు. -
Potato Rice ఆలూ రైస్.. పిల్లలు భలే తింటారు!
దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్‌గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది. బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.కావలసిన పదార్థాలుబాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు) చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పుతరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతయారీబియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.ప్యాన్‌లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది. -
ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!
పిల్లలు నుంచి పెద్దలు వరకు అంతా ఇష్టంగా తినే కూరగాయ ఏదంటే ఆలునే. ఎందుకంటే దీంతో చాలా రకాల రెసీపీలు, స్నాక్స్లు తయారు చేస్తారు. అందువల్ల ఇదంటే అందరికీ ఇష్టం. అయితే ఈ బంగాళ దుంప మన దేశానికి చెందింది మాత్రం కాదట. మరీ ఇది ఎక్కడ పుట్టింది? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి తదితరాలు గురించి తెలుసుకుందామా..!ఈ దుంప పుట్టింది దక్షిణమెరికాలో. ప్రపంచంలో మొత్తం నాలుగు వేల రకాల బంగాళాదుంపలు ఉన్నాయట. అవన్నీ విభిన్నమైన సైజుల్లో ఉంటాయట. బఠానీ గింజ పరిమాణం నుంచి యాపిల్ కాయంత వరకు చాలా రకాల సైజుల్లో ఉంటాయి. మనం సాధారణంగా పసుపుగా ఉండే దుంపల్నే చూశాం. కానీ ఇవి ఎరుపు, నీలం, నలుపు ఇలా బోలెడు రంగుల్లో ఉంటాయి. క్రీస్తుపూర్వం 3000 కాలంలో దక్షిణమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇంకా ఇండియన్లు' అనే జాతి ప్రజలే మొదటిసారి వీటిని పండించారని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం తరవాత ఎక్కువ మంది బంగాళాదుంపనే తింటున్నారు. ఇది 1537లో యూరోప్ దేశాలకు చేరింది. మొదట ఆ దేశాల్లో దీనిని విషంలా చూసేవారు. జర్మనీ రాజు ఫ్రెడెరిక్ విలియం ఈ దుంపలోని సుగుణాల్ని తెలుసుకుని వీటిని పండించాల్సిందిగా ఆదేశించాడు. ఆ తర్వాత నంచే వీటివాడకం పెరిగింది. బంగాళా దుంపలు 1621లో ఉత్తర అమెరికాకు, 1719లో ఇంగ్లాండుకు పరిచయం అయ్యాయి. బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. అమెరికాలో ప్రతి ఏడాది బంగాళాదుంపతో చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్ 40 లక్షల టన్నులు అమ్ముడవుతాయట. ఒక అమెరికన్ ఏడాదికి 70 కిలోల దుంపల్ని తింటే, జర్మన్ 100 కిలోలు తింటాడని అంచనా. 1995లో కొలంబియా నౌకలో వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువ పండిస్తున్న దేశం చైనా. ఆ తరువాతి రెండు స్థానాల్లో రష్యా, ఇండియాలు ఉన్నాయి.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..) -
ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..!
కావలసినవి: గోధుమ పిండి ఆలూ గుజ్జు – 1 కప్పు చొప్పున బాదం పౌడర్, జొన్న పిండి – పావు కప్పు చొప్పున పాలు – ముప్పావు కప్పు (కాచి చల్లార్చినవి) నూనె లేదా బటర్ – పావు కప్పు (బటర్ అయితే కరిగించుకోవాలి) గడ్డ పెరుగు, వాల్ నట్స్ తరుగు, చాక్లెట్ చిప్స్ – పావు కప్పు చొప్పున బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక బౌల్లో జల్లించుకోవాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఆలూ గుజ్జు, బాదం పౌడర్, జొన్నపిండి వేసుకుని, అర కప్పు పాలు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె లేదా బటర్, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన పావు కప్పు పాలనూ పోసేసుకుని మరోసారి పేస్ట్‌లా కలుపుకుని.. వాల్ నట్స్ ముక్కలు, చాక్లెట్ చిప్స్ వేసుకుని.. ఆ మిశ్రమాన్ని బేకింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..! -
Potato Peel ‘తొక్క’ లే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!
#Potato Peel : చిన్నపుడు అమ్మమ్మ బీర కాయ పొట్టు పచ్చడి చేసి. ఇది ఏం పచ్చడో చెప్పండర్రా.. అంటూ పెద్ద పజిల్ వేయడం గుర్తుందా? నిజంగా అమోఘమైన ఆ రుచికి, అసలు అది ఏం పచ్చడో అర్థం కాక.. తీరా గుట్టు విప్పాక, ‘బీర్’ కాయా అంటూ నోరు వెళ్లబెట్టడం కూడా తెలుసు. అలాగే సొరకాయ తొక్కులు, పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి, ఆఖరికి పుచ్చకాయల తొక్క లోపల ఉండే తెల్లటి పదార్థంతో కూడా దోసెలు చేసి పెట్టడం కూడా తెలుసు. ఇపుడు అలాంటి తొక్కలు మరొక దాని గురించే తెలిస్తే.. నిజంగా ఔరా అంటారు.. అదిఏమిటంటే.. చిన్న పిల్లలకు ఆలూ ఫ్రై చేసి పెడితే చాలు..మారు మాట్లాడకుండా లాగించేస్తారు. పెద్దలకి కూడీ ఆలూ లేదా బంగాళా దుంప అంత ఫ్యావరేట్. కానీ ఆలూ తొక్కల వాడకం, ప్రయోజనాల గురించి మాత్రం చాలామంది తెలియదు. బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. కాలిన గాయాలకు చికిత్స ఆలుగడ్డ తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అంతేకాదు వేసవిలో ఎండలకు కమిలిని చర్మానికి సహజమైన చిట్కాగా పని చేస్తుంది. సిల్కీ స్కిన్ మొటిమలతో ఎక్కువగా బాధపడుతున్నవారు ఆలూ తొక్కలను అప్లై చేసుకోవచ్చు.మొటిమల్ని గిల్లకుండా, ఎక్కువ రుద్దకుండా వాటిపై తొక్కలతో మెల్లిగా రాయాలి. అలాగే కళ్లకిందే ఉండే డార్క్ సర్కిల్స్ నివారణలో కూడా ఫలితాలు అందిస్తుంది. కెమికల్స్ లేని సహజమైన ఈ తొక్కల రసాన్ని చర్మానికి అప్పై చేయవచ్చు. ఈ జ్యూస్‌తో సిల్కీగా, ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. ఐరన్ పాత్రల తుప్పు పట్టకుండా, స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. అలా వంట ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఆలూ తొక్కలు మొక్కలకు ఎంతో బలం మొక్కలకు కూడా ఇవి మంచి బాలన్నిస్తాయి. భాస్వరం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది. ఆలూ తొక్కల పీల్ కంపోస్ట్ వేసిన వెంటనే గులాబీ, మల్లె లాంటి పూల మొక్కలు వెంటనే మొగ్గ తొడుగుతాయి. -
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
చల్లటి చలిలో కారం కారంగా కరకరలాడే పొటాటో పాన్‌కేక్స్ చేయండిలా!
చలి కొరుకుడుని తట్టుకోవాలంటే నోటికి కాస్త వేడివేడి రుచులు తగలాల్సిందే. వేడితోపాటు కారం, కరకర లాడే కమ్మదనం తోడయితే చలిని కూడా కొరికేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు. కావలసిన పదార్థాలు: ఉడికించి చిదుముకున్న బంగాళ దుంపలు – రెండు కప్పులు గుడ్డు – ఒకటి మైదా – ముప్పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు చీజ్ తరుగు – కప్పు; క్యారట్ తురుము – అరకప్పు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నూనె – అరకప్పు పుల్లటి పెరుగు – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం: గిన్నెలో చిదిమిన దుంపల మిశ్రమం, గుడ్డుసొన, మైదా, స్ప్రింగ్ ఆనియన్, చీజ్ తరుగు, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ఈ మిశ్రమం చేతులకు అంటుకుంటున్నట్లు అయితే మరో టేబుల్ స్పూను మైదా వేసి కలపాలి. పిండి ముద్దను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి పాన్‌కేక్‌లా వత్తుకోవాలి ∙బాణలిలో నూనె వేయాలి. బాగా కాగిన∙నూనెలో ఒక్కో పాన్‌కేక్‌ను వేసి మీడియం మంట మీద కాల్చాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్లోకి మారాక పాన్కేక్లను తీసేయాలి. పాన్కేక్పైన కొద్దిగా పుల్లటి పెరుగువేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!) -
చిలకడదుంపతో కేక్, ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ బావుంటుంది
వాల్నట్ – స్వీట్‌పొటాటో కేక్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప›– 1(పెద్దది, సుమారు 450గ్రాములు ఉండాలి.) వాల్నట్ – 100 గ్రాములు,పంచదార – 200 గ్రాములు బ్రౌన్ షుగర్ – 50గ్రాములు, వెజిటబుల్ నూనె – 120 మిల్లీలీటర్లు నీళ్లు – 80 మిల్లీలీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత మైదాపిండి – 220 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్,జాజికాయ పొడి – పావు టీ స్పూన్ తయారీ విధానమిలా: చిలగడ దుంపను సిల్వర్ పేపర్లో చుట్టి.. ఓవెన్లో బాగా బేక్ చేసుకుని.. చల్లారిన తర్వాత.. మెత్తగా చిదుముకోవాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు, పంచదార, బ్రౌన్ షుగర్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె, నీళ్లు పోసుకుని మరోసారి హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకోవాలి. ఇంతలో మరో బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ మిశ్రమంలో మైదా మిశ్రమం కలిపి.. హ్యాండ్ బ్లెండర్తో మరోసారి కలపాలి. దానిలో చిలగడదుంప గుజ్జుని వేసుకుని.. బాగా కలిపి.. నచ్చిన షేప్‌లోని బేకింగ్ బౌల్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం మొత్తం పోసుకుని.. సమాంతరంగా పరచి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. అనంతరం చాక్లెట్ బిట్స్, క్రీమ్స్‌తో నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. -
పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి
పొటాటో పాప్ కార్న్ తయారీకి కావల్సినవి: బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చాట్ మసాలా – పావు టీ స్పూన్, కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. -
ఇవాళే "ఆలూ" డే!.. ఏం చేస్తారో తెలుసా!
బంగాళదుంపలంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరికి బంగాళదుపంతో చేసిన వంటకాలనే ఇష్టపడతారు. ఆ దుంపలతో వెరైటీ రెసీపీలను చేసుకుని మరీ ఆస్వాదిస్తారు చాలామంది. ఏదో ఒక కూరలో ఆ దుంపను యాడ్ చేయకుండా కొందరూ అస్సలు తినరు. అలాంటి బంగాళదుంపల కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ రోజంత బంగాళ దుంపలకు సంబంధించిన రెసీపీలు, స్నాక్స్‌తో రకరకాల వంటకాలతో విందులు, దానిలో ఉండే పోషక విలువలు ఆవశ్యకత చాటిచెప్పడం తదితరాలు నిర్వహిస్తారు. ఇంతకీ ఏ రోజు బంగాళదుంపల దినోత్సవం జరుపుకుంటారు. ఎప్పటి నుంచి ఇది మొదలైంది తదితర విషయాలు చూద్దాం!. ఏరోజంటే.. ప్రతి ఏటా ఆగస్టు 19న జాతీయ బంగాళదుంపల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చరిత్ర: దక్షిణ పెరులో బొలీవియాలోని వాయువ్య ప్రాంతాలలో క్రీస్టూ పూర్వం 5 వేల నుంచి 8వేల మధ్య కాలంలో ఈ బంగాళ దుంపలను తొలిసారిగా పండిచారని విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ కూరగాయ అనేక దేశాల వరకు విస్తరించిందని అంటున్నారు. ఆ కూరగాయే ఇప్పుడూ అందరూ ఆదరించే ఇష్టపడే వంటకంగా మారింది. దక్షణ అమెరికా నుంచి ఐరోపాకు విస్తరించడమేగాక తదనంతరం వివిధ దేశాల్లోని ప్రాంతాలకు విస్తరించింది. పాన్కేక్ల నుంచి బ్రెడ్ రోల్స్ వరకు బంగాళ దుంపలు చాలా వంటలలో అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఉండే పోషకాలు ఒక వ్యక్తికి నెలల తరబడి ఇతర ఆహార పదర్థాలపై ఆధారపడకుండా ఉండేలా శక్తిని ఇస్తుంది. ఎక్కడకి వెళ్లిన ఆహారంలో బంగాళ దుంపతో చేసిన ఏదో ఒక రెసీపి లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో!. అంతలా ప్రజలన మనుసును దోచుకున్నా కూరగాయ బంగాళ దుంప. ఇప్పటికి దీంతో వెరైటీ వెరైటీ రెసీపీ చేస్తునే ఉంటారు పాకశాస్త్ర నిపుణులు. (చదవండి: శనగపిండి మంచిదేనా?..వాటితో చేసే పిండి వంటకాలు తినొచ్చా!) -
పెప్సికో కంపెనీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. కారణం ఏంటంటే?
న్యూయార్క్‌కు చెందిన 'పెప్సికో ఇంక్' (PepsiCo Inc) లేస్ పొటాటో చిప్స్ కోసం ప్రేత్యేకంగా పండించిన పొటాటో రకానికి సంబంధించిన పేటెంట్ మీద కంపెనీ చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (PPVFR) అథారిటీ 2021లో పెప్సికో FC5 బంగాళాదుంప రకానికి మంజూరు చేసిన మేధో రక్షణను ఉపసంహరించుకుంది. సీడ్ వెరైటీ మీద కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్ చేయలేమని రైతుల హక్కుల కార్యకర్త 'కవిత కురుగంటి' వాదించడంతో పెప్సికో పేటెంట్ కవర్‌ను అథారిటీ తొలగించింది. పేటెంట్ కవర్ రద్దుపై పెప్సికో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అధికార నిర్ణయంపై పెప్సికో చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా జులై 5 నాటి ఉత్తర్వులో తోసిపుచ్చారు. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) మాకు ఆర్డర్ గురించి తెలుసు, అంతే కాకుండా దానిని సమీక్షించే ప్రక్రియలో ఉన్నామని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 1989లో భారతదేశంలో తన మొట్టమొదటి పొటాటో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన US స్నాక్స్ అండ్ డ్రింక్స్ తయారీదారు, FC5 సీడ్ రకాన్ని రైతుల సమూహానికి సరఫరా చేసింది. వారు ఆ ఉత్పత్తులను కంపెనీకి ఒక స్థిరమైన ధరకు విక్రయించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దీనిని కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని 2016లోనే వెల్లడించింది. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) నిజానికి లేస్ కోసం వినియోగించే FC5 రకం బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ చేయడానికి అవసరమైన తేమను కలిగి ఉంటాయి. కావున కంపెనీ వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి వినియోగించుకుంటోంది. అయితే 2019లో పెప్సికో కొంతమంది భారతీయ రైతుల మీద దావా వేసింది. కానీ సాగుదారులు ఈ పేటెంట్ ఉల్లంఘించారని ఆరోపించి ఉల్లంఘన కోసం 121050 డాలర్లను కోరినట్లు సమాచారం. చివరకు నెలరోజుల్లోనే పెప్సికో రైతులపై దావాలను ఉపసంహరించుకుంది. -
బంగాళదుంపతో ముఖం మిలమిల.. మచ్చలు పోయి నిగారింపు
బ్యూటీ టిప్స్ ఒక బంగాళదుంపను తీసుకుని తొక్క తీసి,పేస్టులా చేసుకోవాలి. దీన్ని పలుచని వస్త్రంలో వడగట్టి నీటిని తీసేయాలి. ఆ గుజ్జులో 6 టేబుల్ స్పూన్లు పాలు కలపాలి. ఈ మిశ్రమంలో 6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఐస్‌ట్రేలో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఫ్రీజ్ అయిన బంగాళదుంపతో ముఖమంతా రుద్దాక, చేతులతో సున్నితంగా మర్దన చేసి, ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన దుమ్మూధూళి, మొటిమల తాలూకు మచ్చలు పోయి ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
Recipe: నోరూరించే పొటాటో పాప్‌కార్న్.. ట్రై చేయండిలా!
భిన్న రుచులు ట్రై చేయడం అలవాటా? అయితే, ఇంట్లో ఇలా పొటాటో పాప్ కార్న్ చేసి చూడండి! కావలసినవి: ►బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) ►చాట్ మసాలా – పావు టీ స్పూన్ ►కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►ఉప్పు – తగినంత ►కారం – కొద్దిగా ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ►కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. ►అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. ►అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. ►తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు.. -
Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో..
ముఖం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే ఇబ్బంది పడతారు చాలా మంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే, ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటూ ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. తేనె, రోజ్ వాటర్ వేసి.. ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►శుభ్రంగా కడిగి పొడిగా తుడిచిన ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ►తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద నల్లటి మచ్చలు, ట్యాన్ వల్ల ఏర్పడిన నలుపు పోతుంది. ►రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన మెరుపునిస్తే, తేనె చర్మానికి లోపలినుంచి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కూడా పాటిస్తే... ►ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ►ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం కనిపిస్తుంది. ►ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మెరుస్తుంది. బంగాళా దుంపతో.. ►ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ►కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ►ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ►అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులతో.. ►వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Smart Necklace: నెక్లెస్ ఉంటే ఆరోగ్యం పదిలం... -
Kitchen Tips: ఇనుప బాణలి, కళాయి తుప్పు పడితే ఇలా చేయండి!
ఇనుప బాణలి, కళాయి, పెనం, ఇతర ఇనుముతో చేసిన కిచెన్ వస్తువులు తుప్పు పట్టి ఇబ్బంది పెడుతుంటాయి. తుప్పు పట్టిన ఇనుప బాణలిలో కొద్దిగా హార్పిక్ వేసి బాణలి అంతా రాసి గంటపాటు నానబెట్టాలి. తరువాత స్టీల్ పీచుతో గట్టిగా రుద్దిన తరవాత డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసి మరోసారి మెత్తటి పీచుతో రుద్ది కడగాలి. ఇలా కడిగిన బాణలిని తడిలేకుండా తుడిచి, నూనె రాసి ఆరనివ్వాలి. ఇలా చేస్తే ఇనుప వస్తువులు తుప్పు రాకుండా వాడుకోవడానికి చక్కగా పనికొస్తాయి. ఇక పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. మరిన్ని టిప్స్ బంగాళదుంప ముక్కలను పదినిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టి, తరువాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి. అదే విధంగా... డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే... కాగిన నూనెలో ముందుగా కొద్ది చింతపండు వేయాలి. తరువాత డీప్ ఫ్రై చేసుకుంటే నూనె పొంగదు. పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. చదవండి: Veduru Kanji- Health Benefits: వెదురు కంజి.. టేస్టు అదుర్స్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! -
Recipe: ఉత్తరాఖండ్ వంటకం ఆలుకీ గుట్కే తయారీ ఇలా!
ఉత్తరాఖండ్ వంటకం ఆలుకీ గుట్కే ఇలా తయారు చేసుకోండి. ఆలుకీ గుట్కే తయారీకి కావలసినవి: ►బంగాళ దుంపలు – మూడు ►ఆవనూనె – రెండు టీస్పూన్లు ►కారం – పావు టీస్పూను ►ధనియాలపొడి – రెండు టీస్పూన్లు ►జీలకర్ర – పావు టీస్పూను ►పసుపు – పావు టీస్పూను ►ఎండు మిర్చి – రెండు ►ఇంగువ – రెండు చిటికెలు ►ఉప్పు – రుచికి సరిపడా ►కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ... ►కొద్దిగా ఉప్పువేసి బంగాళ దుంపలను ఉడికించాలి ►∙ఉడికిన దుంపల తొక్క తీసి ముక్కలు తరగాలి ►చిన్న గిన్నెలో ధనియాల పొడి, కారం, పసుపు, రెండు టీస్పూన్ల నీళ్లుపోసి చక్కగా కలపాలి ►స్టవ్ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగాక జీలకర్ర, ఇంగువ, కారం వేసి అరనిమిషం పాటు వేయించాలి ►ఇప్పుడు బంగాళ దుంపల ముక్కలు, కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. ►చివరిగా కొత్తిమీర చల్లుకుని దించేయాలి. చదవండి: Jhangora Ki Kheer: వలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి! -
క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చలు మటుమాయం!
Home Remedies for Black Spots on Face: క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటి తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాత ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి. చివరిగా ఈ విటమిన్ క్యాప్యూల్స్ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే. దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం త్వరగా వస్తుంది. చదవండి: Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
పొటాటో పోషణ
బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి. ఈ రసంలో టీస్పూను రోజ్ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి. వారంలో రెండు మూడుసార్లు ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దీనిలోని కాపర్, జింక్‌లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేస్తాయి పొటాషియం, మెగ్నీషియంలు చర్మానికి పోషకాలను అందిస్తాయి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంలో త్వరగా మంచి మార్పు కనిపిస్తుంది. -
Recipes: ఇంట్లోనే ఇలా సులువుగా రాగుల అప్పడాలు, లసన్ పాపడ్!
విందు భోజనమైనా, ఇంటి భోజనమైనా పప్పు, చారు, రసం, చట్నీ, కూరలు ఎన్ని ఉన్నా అప్పడం లేకపోతే భోజనం బోసిపోతుంది. అందుకే దాదాపు అందరి ఇళ్లల్లో లంచ్, డిన్నర్లలోకి అప్పడం తప్పనిసరిగా ఉంటుంది. మార్కెట్లో దొరికే అప్పడాలు కాస్త ఖరీదు, పైగా కొన్నిసార్లు అంత రుచిగా కూడా ఉండవు. ఈ వేసవిలో మనమే రుచిగా, శుచిగా అప్పడాలు తయారు చేసుకుంటే, డబ్బు పొదుపు, ఆరోగ్యం, కాలక్షేపం కూడా. భోజనానికే వన్నె తెచ్చే అప్పడాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. రాగులతో కావలసినవి: రాగి పిండి – అరకప్పు, మజ్జిగ – అరకప్పు, నీళ్లు – అరకప్పు, ఉప్పు – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – పావు టీస్పూను, తెల్లనువ్వులు – రెండు టీస్పూన్లు. తయారీ.. ►ముందుగా ఒక గిన్నెలో రాగిపిండి వేయాలి. దీనిలో మజ్జిగ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ►పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువలను మిక్సీజార్‌లో వేసుకుని పేస్టుచేయాలి ►రెండు కప్పుల నీటిని బాణలిలో పోసి మరిగించాలి. ►నీళ్లు మరిగాక రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ►ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమం వేసి ఉడికించాలి. రాగి మిశ్రమం దగ్గర పడిన తరువాత నువ్వులు వేసి స్టవ్ బీద నుంచి దించేయాలి. ►ఈ మిశ్రమాన్ని పలుచగా నీళ్లు చల్లిన పొడి వస్త్రంపై గుండ్రంగా అప్పడంలా వేసి ఎండబెట్టాలి. ►ఒకవైపు ఎండిన తరువాత రెండోవైపు కూడా పొడి పొడిగా ఎండాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి. లసన్ పాపడ్ కావలసినవి: శనగపిండి – పావు కేజీ, వెల్లుల్లి తురుము – రెండున్నర టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – ఐదు (సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, కారం – టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, తయారీ.. ►శనగపిండిలో పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి కలపాలి ►మిశ్రమానికి సరిపడా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి. ►►పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, çపల్చగా అప్పడంలా వత్తుకోవాలి వీటిని నాలుగు రోజులపాటు ఎండబెట్టాలి. చక్కగా ఎండిన తరువాత ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి. పొటాటో పాపడ్ కావలసినవి: బంగాళ దుంపలు – కేజీ, బియ్యప్పిండి – రెండు కప్పులు ఉప్పు – టీస్పూను, కారం – టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – రెండు టీస్పూన్లు. తయారీ.. ►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. ►దీనిలో రెండు కప్పుల నీళ్లు పోసి, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►విజిల్ వచ్చాక 5 నిమిషాలపాటు మీడియం మంటమీద మెత్తగా ఉడికించాలి. ►దుంపలు చల్లారాక తొక్క తీసి, మెత్తగా చిదుముకుని, బియ్యప్పిండిలో వేయాలి. ►దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర వేసి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాల. ►చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని దుంప మిశ్రమాన్ని ఉండలు చేయాలి. ►పాలిథిన్ షీట్‌కు రెండు వైపులా ఆయిల్ రాసి మధ్యలో ఉండ పెట్టి పలుచగా వత్తుకుని ఎండబెట్టాలి. ►రెండు వైపులా ఎండిన తరువాత గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్.. టేస్టు అదిరిపోద్ది!
ఆలు చిప్స్ తినీతిని బోర్ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్‌కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి. పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు: ►బంగాళ దుంపలు – 4 లేదా 5 ►మైదాపిండి – అర కప్పు ►మొక్కజొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ ►ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ►గార్లిక్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►చీజ్ సాస్ – 4 టేబుల్ స్పూన్ల పైనే ►డ్రై పార్సీ – అర టేబుల్ స్పూన్ ►ఎండు మిర్చి పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్లో గార్లిక్ పౌడర్, చీజ్ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్లా (వలయంలా, మొత్తం కట్ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్ చేసుకుని పెట్టుకోవాలి. ►అనంతరం వెడల్పుగా ఉండే బౌల్లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ►ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్‌ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్–చీజ్ మిశ్రమాన్ని చల్లుకోవాలి. ►ఆ పైన చీజ్ సాస్ స్ప్రిల్స్ పొడవునా స్ప్రెడ్ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: Summer Drink: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’
సాధారణంగా పొద్దున్నే ఎవరి ఇళ్లలోనైనా రోజు ఎలా మొదలవుతుంది? టీ, కాఫీ లేదా పాలు తాగడంతోనే కదా.. మరి ఇందుకోసం మీరు ఏ పాలు వాడతారని అడిగితే... గేదె పాలు, ప్యాకెట్ పాలు లేదా ఆవు పాలని టక్కున బదులిస్తారు. మరి ఆలూ పాల గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆలుగడ్డతో చేసే వంటకాల గురించి తెలుసుగానీ ఆలూతో పాలు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి వెరైటీ అంటే... సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ తరహాలోనే తాజాగా ఆలూ మిల్క్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రపంచంలోనే వాణిజ్య పద్ధతిలో ఆలుగడ్డల నుంచి పాలను తయారు చేసే ఏకైక స్వీడన్ కంపెనీ అయిన ‘డగ్’ ఈ పాలను తాజాగా యూకేలో ప్రవేశపెట్టింది. జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కాఫీ తరహాలో ఉండే లాట్టెస్, కాపిచీనో తయారు చేసుకొనేందుకు ఈ పాలు ఎంతో బాగుంటాయని తెలిపింది. త్వరలోనే ఇతర యూరోపియన్ దేశాలతోపాటు చైనాలో ఆలూ పాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వివరించింది. స్పందన భారీగానే... మాల్టోడెక్స్ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్‌సీడ్ ఆయిల్, ఫ్రక్టోస్, సూక్రోస్ సహా వివిధ విటమిన్లతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట. ముఖ్యంగా ఇది వెగాన్ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో శాకాహారులంతా ఈ ఆలూ పాలు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అలాగే జంతువుల నుంచి సేకరించే పాలలో ఉండే లాక్టోస్ (ఒక రకమైన చక్కెర) కొందరికి జీర్ణం కాదు. ‘డగ్’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోస్రహితమైనవి కావడం వల్ల కూడా చాలా మంది ఈ పాలు తాగుతున్నారట. దీని ధర సైతం ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్‌తో పోలిస్తే చవకగానే (లీటరుకు సుమారు రూ. 170కి విక్రయిస్తోంది) ఉందని వినియోగదారులు చెబుతున్నారు. రుచి అంతంతే..! అయితే దీన్ని రుచి చూసిన వారిలో కొందరు మాత్రం ఆలూ పాలు అంత గొప్పగా లేవని చెబుతున్నారు. దాని రుచి ‘తటస్థం’గా ఉందని కొందరంటే ఇంకొందరేమో ఆలూ పాలు కాస్త ‘ఉప్ప’గా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. సోయా మిల్క్‌లో ఉండే 8 గ్రాముల ప్రొటీన్, ఓట్ మిల్క్‌లో ఉండే 3 గ్రాముల ప్రొటీన్లతో పోలిస్తే ఆలూ మిల్క్‌లో కేవలం ఒక గ్రాము ప్రొటీన్ (ఒక సర్వింగ్‌కు) మాత్రమే ఉందని ఇంకొందరు పేర్కొన్నారు. అయితే సోయా పాలలో లభించే ప్రొటీన్లకన్నా నాలుగురెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఆలూ పాలలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఆలూనే ఎందుకు? సోయా, ఓట్ మిల్క్‌తో పోలిస్తే ఆలుగడ్డను తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువగా సాగు చేసేందుకు అవకాశం ఉండటం, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని లాభదాయక వ్యాపారంగా ఎంచుకున్నట్లు ‘డగ్’ చెబుతోంది. అలాగే తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ తెలిపింది. అన్నింటికీ మించి ఇతర పాలతో పోలిస్తే కారుచౌకగా ‘ముడిసరుకు’ లభిస్తుందని పేర్కొంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
జుట్టు విపరీతంగా రాలుతోందా? వారానికి 2 సార్లు ఇలా చేశారంటే..
Hair Care Tips For Women: మగువల అందాన్ని రెట్టింపుచేసేది కురులే.. నల్లని, ఒత్తైన కురుల సంరక్షణకు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించి, మరింత ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడేందుకు ఈ చిట్కా పాటించండి.. రెండు బంగాళ దుంపలను తొక్కతీసి సన్నగా తురుముకోవాలి. ఈ తురుములో రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పది నిమిషాలు మర్దన చేయాలి. తరువాత తలకు టవల్‌తో చుట్టి కవర్ చేయాలి. రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, పెరుగుతుంది. చదవండి: Science Facts: మోచేతికి ఏదైనా తగిలితే అందుకే షాక్ కొట్టినట్టు ‘జిల్’ మంటుంది..! -
పైన బంగాళాదుంపలు.. అడుగున గంజాయి ప్యాకెట్లు
అగనంపూడి (గాజువాక)/యలమంచిలి రూరల్/పాయకరావుపేట: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తరలిస్తున్న 790 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్టు చేశారు. దువ్వాడ సీఐ టి.లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాదుంపల లోడు వ్యాన్‌లో అడుగున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు దువ్వాడ పోలీసులకు సమాచారం అందడంతో గురువారం వేకువజామున దువ్వాడ పోలీసులు దాడి చేశారు. అగనంపూడి టోల్‌గేటు వద్ద కాపుకాసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి వీఎస్‌ఈజెడ్‌కు సమీపంలోని డాక్‌యార్డ్ కాలనీలోని స్టాక్ యార్డ్‌కు వీటిని తరలించి తరువాత, అక్కడి నుంచి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో తమిళనాడుకు చేరవేయడానికి నిందితులు ప్లాన్ వేశారు. గురువారంఇదే రీతిలో సరుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి సరుకుతోపాటు తమిళనాడుకు చెందిన భాస్కర్ చంద్రశేఖర్, జాన్సన్ శంకర్‌తోపాటు డాక్‌యార్డ్ కాలనీకి చెందిన దుక్కా నరేష్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ చెప్పారు. ఈ దాడిలో ఎస్ఐ రామదాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆటోలో గంజాయి తరలిస్తుండగా విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద అడ్డుకున్నట్టు యలమంచిలి ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పాంగి మహేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇదిలావుండగా.. కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పాయకరావుపేట సమీపంలో పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పాడేరు ఏఎస్పీ జగదీష్.. చింతపల్లి ఏఎస్పీ తుషార్‌డుడి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించాలని సుమారు 600 మంది విద్యార్థులతో అవగాహన కల్పించారు. పాడేరులో తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులను సమావేశపర్చి గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల గిరిజనులకు జరుగుతున్న నష్టంపై ఏఎస్పీ అవగాహన కల్పించి .. తల్లిదండ్రులను చైతన్యపర్చాలని సూచించారు. అనంతరం ‘గంజాయి సాగు వద్దు–వ్యవసాయమే ముద్దు’ అంటూ ప్రదర్శన చేశారు. ప్లకార్డులతో గిరిజన విద్యార్థులు, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఇతర అధికారులు -
నోరూరించే ఎగ్ మఫిన్స్, పనీర్ జల్ప్రెజీ తయారీ ఈజీగా ఇలా..
కావల్సిన పదార్థాలు: గుడ్లు – ఆరు, స్ప్రింగ్ ఆనియన్ – ఒకటి, ఉల్లిపాయలు – రెండు, టోపు – ఆరు ముక్కలు, చీజ్ తురుము – అరకప్పు, ఉప్పు – అరటిస్పూను, ఆలివ్ ఆయిల్ – టీ స్పూను. తయారీ విధానం: ►ముందుగా స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ►తరువాత టోపును కూడా క్యూబ్‌లుగా తరగాలి. ►ఒక గిన్నెలో టోపు ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్ తురుము గుడ్లు పగల కొట్టి వేసి కలపాలి. ఉప్పువేసి మరోసారి కలపాలి. ►ఇప్పుడు మఫిన్ ఉడికించే పాత్రకు ఆలివ్ ఆయిల్ రాసి దానిలో ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసి ఇరవై నిమిషాలపాటు బేక్ చేస్తే ఎగ్ మఫిన్స్ రెడీ. పనీర్ జల్ప్రెజీ కావల్సిన పదార్థాలు: పనీర్ – పావుకేజీ, క్యాప్సికం – ఒకటి, టొమాటోలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ధనియాలు – టేబుల్ స్పూను, ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీ స్పూను, కారం – అర టీస్పూను, పసుపు – అరటీస్పూను, గరం మసాలా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – గార్నీష్కు సరిపడా. తయారీ విధానం: ►ముందుగా పనీర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి వేడినీళ్లలో పదిహేను నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ►క్యాప్సికం, టొమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ►ధనియాలను దోరగా వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇవి వేగాక క్యాప్సికం, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు సగం వేయాలి. ►ఇవి దోరగా వేగిన తరువాత ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, గరంమసాలా వేసి మీడియం మంటమీద కూరగాయ ముక్కలు రంగు పోకుండా వేయించాలి. ►టొమాటోలు మెత్తబడిన తరువాత పనీర్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ►తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పనీర్ జల్ప్రేజీ రెడీ. ఇది నాన్, తందూరీ రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. గార్లిక్ స్మాష్డ్ పొటాటో కావల్సిన పదార్థాలు: బంగాళ దుంపలు – ఆరు, వెన్న – రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా, బరకగా దంచిన ఎండుమిర్చి కారం – టేబుల్ స్పూను, వెల్లుల్లి పొడి – టేబుల్ స్పూను. తయారీ విధానం: ►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఉప్పు కలిపి ఉడకబెట్టి నీళ్లు తీసేసి పక్కనబెట్టుకోవాలి. ►ఉడికించిన బంగాళ దుంప స్మాషర్తో మెత్తగా చిదుముకోవాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి వేసి కలపాలి. ►ఇప్పుడు ఈ దుంపల మిశ్రమాన్ని సన్నని స్లైసుల్లా చేసి నలభై ఐదు నిమిషాలపాటు బేక్ చేస్తే గార్లిక్ స్మాష్డ్ పొటాటోస్ రెడీ. ఆరెంజ్ క్యాలీఫ్లవర్ కావల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ – పెద్దది ఒకటి బ్యాటర్ కోసం: గోధుమ పిండి – ఒకటింబావు కప్పు, బాదం పాలు – కప్పు, పసుపు – టీ స్పూను, వెల్లుల్లి పొడి – టీస్పూను, ఉప్పు – పావుటీస్పూను. ఆరెంజ్ సాస్: నీళ్లు – ముప్పావు కప్పు, ఆరెంజ్ జ్యూస్ – కప్పు, బ్రౌన్ సుగర్ – ముప్పావు కప్పు, మేపిల్ సిరప్ – ముప్పావు కప్పు, రైస్ వెనిగర్ – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – రెండు టీస్పూన్లు, అల్లం తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ – టీస్పూను, కార్న్‌స్టార్చ్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా బ్యాటర్కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి బ్యాటర్‌ను రెడీ చేసుకోవాలి. ►క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కోముక్కను బ్యాటర్లో ముంచి ముక్కకు పట్టించాలి. ►అన్ని ముక్కలకు బ్యాటర్ పట్టించిన తరువాత ముక్కలను ఇరవై నిమిషాలపాటు బేక్ చేయాలి. ►ఇప్పుడు కార్న్‌స్టార్చ్‌ను నీళ్లల్లో వేసి మందంగా కలుపుకోవాలి. ►స్టవ్ మీద బాణలిపెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత వెల్లుల్లి, అల్లం తురుమును వేసి మూడు నిమిషాలు వేయించాలి.ఇవి వేగాక కార్న్‌స్టార్చ్ మిశ్రమం వేసి కలుపుతూ ఉడికించాలి. తరువాత ఆరెంజ్ సాస్‌కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడికిస్తే ఆరెంజ్ సాస్ రెడీ అయినట్లే. ►ఇప్పుడు బేక్ చేసిపెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలను ఆరెంజ్ సాస్‌లో ముంచి మరో పదినిమిషాల పాటు బేక్ చేయాలి. ►ఐదు నిమిషాల తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను మరోవైపు తిప్పి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు బేక్ చేస్తే ఆరెంజ్ క్యాలీఫ్లవర్ రెడీ. -
వాన చినుకులు కాదు... నూనె చినుకులు
ఆకాశమంతా మబ్బు ముసిరితే నేల తల్లి నాలుక మీద వర్షపు చినుకులు కురుస్తాయి... మరి మన నోటికి రుచి మబ్బులు ముసిరితే... నూనెలో వేయించిన వంటకాలతో నాలుక మీద చినుకులు కురిపించాల్సిందే.. ఈ వంటకాలు ప్రయత్నించి, రుచి చూడండి... వాన చినుకులు కాదు... నూనె చినుకులు రుచిగా ఉన్నాయి అనకుండా ఉండలేం. పొటాటో లాలీపాప్ కావలసినవి: బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి); బ్రెడ్ పొడి – ఒకటిన్నర కప్పులు; పచ్చి మిర్చి తరుగు – టీ స్పూను; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చాట్ మసాలా – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; నిమ్మ చెక్క – ఒకటి; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ► ఒక పాత్రలో బంగాళ దుంప ముద్ద, బ్రెడ్ పొడి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్‌మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి ∙చేతికి కొద్దిగా నూనె పూసుకుంటూ, ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి ► ఒక పాత్రలో మైదాపిండికి కొద్దిగా నీళ్లు జత చేసి దోసెల పిండిలా కలుపుకోవాలి ∙తయారు చేసి ఉంచుకున్న బాల్స్‌ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో కాగిన నూనెలో ఈ బాల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙ఈ బాల్స్‌కి పుల్లలు గుచ్చి లాలీపాప్‌లా చేసి, టొమాటో కెచప్ తో తింటే రుచిగా ఉంటాయి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ కావలసినవి: మైదా పిండి – 8 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; క్యారట్ తురుము – అర కప్పు; సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; రిఫైండ్ ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా; కొత్తిమీర తరుగు – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ తరుగు – అర కప్పు; క్యాబేజ్ తరుగు – అర కప్పు; అల్లం తురుము –టీ స్పూను; మిరియాల పొడి – కొద్దిగా; మైదా పిండి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, నీళ్లు, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా గిలకొడుతూ కలపాలి ► స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి గరిటెడు వేసి పల్చటి పాన్‌కేక్‌లా అయ్యేలా పాన్‌ను కొద్దిగా అటూ ఇటూ కదపాలి ► అంచులు విడివడే వరకు మీడియం మంట మీద ఉడికించి (రెండో వైపు తిప్పక్కర్లేదు) ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ► ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి (ఒక్కో పొర మీద కొద్దిగా మైదా పిండి చల్లి, ఆ పైన మరో పొర ఉంచాలి లేదంటే అతుక్కుపోతాయి) ► స్టౌ మీద బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తరుగు, ఉల్లి తరుగు, క్యాబేజీ తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కరకరలాడే వరకు వేయించాలి ► ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి జత చేసి, తడిపోయే వరకు వేయించి దింపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని, చల్లారబెట్టాలి ► ముందుగా తయారుచేసి ఉంచుకున్న మైదా పిండి చపాతీని ఒకటి తీసుకుని, అందులో టేబుల్ స్పూను క్యారట్ తురుము మిశ్రమం ఉంచి జాగ్రత్తగా రోల్ చేయాలి ∙అంచులకు తడి చేసి, మూసేయాలి ► స్టౌ మీద బాణలిలో నూనె పోసి, కాగాక, తయారు చేసుకున్న రోల్స్‌ను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ► టొమాటో కెచప్ లేదా చిల్లీ సాస్‌తో రుచిగా ఉంటాయి. స్టఫ్డ్ పనీర్ ఢోక్లా కావలసినవి: సెనగ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – కప్పు; కొత్తిమీర + పుదీనా చట్నీ – ఒక కప్పు; పనీర్ – 200 గ్రా.; నూనె – 3 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; నీళ్లు – కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; పచ్చిమిర్చి – 2 (మధ్యకు సన్నగా కట్ చేయాలి); నువ్వులు – టీ స్పూను; పంచదార – 2 టీ స్పూన్లు; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ► ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు వేసి బాగా కలపాలి ∙పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ► కప్పు నీళ్లుపోసి మెత్తగా అయ్యేవరకు కలిపి, పావు గంట సేపు పక్కన ఉంచాలి ► ఒక ప్లేటుకి కొద్దిగా నూనె పూయాలి ∙స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడి చేసి అందులో ఒక స్టాండ్ ఉంచి, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి ∙సెనగ పిండి మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి, రెండు విడివిడి పాత్రల్లో పోయాలి ► ఒక పాత్రలో ఉన్న పిండిలో ముప్పావు టీ స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి, బాగా పొంగినట్టు కాగానే, పిండిని ప్లేట్లో పోసి, సమానంగా పరిచి, పెద్ద పాత్రలోని స్టాండ్ మీద ఉంచి, మూత పెట్టాలి ► ఐదు నిమిషాల తరవాత మూత తీసి, కొత్తిమీర పుదీనా చట్నీ ఒక పొరలాగ వేసి, ఆ పైన ఒక కప్పు పనీర్ తురుము వేయాలి ► రెండవ ప్లేట్లోని మిశ్రమానికి ఈనో ఫ్రూట్ సాల్ట్ జత చేసి, బాగా కలిపి, పనీర్ మీదుగా ఒక పొరలా పోసి, మూత పెట్టి, సుమారు పావు గంట సేపు పెద్ద మంట మీద ఉడికించాలి (పుల్లతో గుచ్చితే ఉడికినదీ లేనిదీ అర్థమవుతుంది) ► స్టౌ మీద బాణలి లో టేబుల్ స్పూను నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ► కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, నువ్వులు వేసి బాగా వేయించిన తరవాత, కప్పు నీళ్లు, టీ స్పూను పంచదార వేసి పంచదార కరిగేవరకు ఉంచాలి ∙ఢోక్లాను ముక్కలుగా కట్ చేయాలి ► సిద్ధంగా ఉన్న పోపును వాటి మీద సమానంగా పోయాలి ∙చివరగా తాజా కొబ్బరి తురుముతో అలంక రించి, అందించాలి. -
ఇంటి పంట: తీగకు కాచే ‘దుంప’!
దుంప అనగానే మట్టి లోపల ఊరుతుందని అనుకుంటాం. అయితే, ఈ దుంప విభిన్నమైనది. తీగకు కాస్తుంది. అవును! ఎయిర్ పొటాటో, అడవి పెండలం, గాయి గడ్డలు, అడవి దుంపలు, అప్ప గడ్డలు.. అని దీన్ని రకరకాలుగా పిలుస్తున్నారు. అరుదైన ఈ కూరగాయ మొక్క అటవీ ప్రాంతాల ప్రజలకు చిరపరిచితమైనదే. నగరాలు, పట్టణాల్లో పుట్టి పెరిగిన వారికి దీనికి గురించి తెలియదు. వైవిధ్యభరితమైన సేంద్రియ ఇంటిపంటలను మక్కువతో పండించుకునే అభిరుచి కలిగిన సీనియర్ సిటీ ఫార్మర్ లత గాల్లో తేలాడే ఈ దుంప మొక్కను ఏడాదిగా తన మేడ మీద కుండీలో పెంచుతున్నారు. హైదరాబాద్ బిహెచ్ఇఎల్ ప్రాంతంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె తమ ఇంటిపైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఏడాది క్రితం శిల్పారామంలో గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించిన మేళాలో ఆదిలాబాద్ అటవీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నిర్వహిస్తున్న స్టాల్లో ఎయిర్ పొటాటో దుంప విత్తనాన్ని ఆమె కొనుగోలు చేశారు. తెచ్చిన వారం వరకు నాట లేదు. అప్పటికే దుంపకు మొలక వచ్చింది. జీడిమామిడి మొక్క పెరుగుతున్న డ్రమ్ములో ఈ దుంపను నాటారు. ‘ఈ మొక్క ఆకు తమలపాకును పోలి ఉంటుంది. నాలుగు నెలలకోసారి ఈ దుంపలు కోతకు వస్తున్నాయి. పులుసు లేదా ఇగురు కూరగా వండుకోవచ్చు. రుచి కంద, బంగాళదుంపలతో పోలిక లేకుండా విభిన్నంగా ఉంది..’ అంటున్నారు లత (89194 97262). భద్రాచలం గిరిజన ప్రాంతాల వారికి ఈ తీగ జాతి కూరగాయ మొక్క చిరపరిచితమైనదేనని చెబుతున్నారు. కాపు పూర్తయ్యాక తీగ ఎండిపోతుందని, ఈ మొక్క పాదిలో భూమి లోపల ఉండే దుంప నుంచి కొన్నాళ్లకు మళ్లీ తీగ పెరిగి దుంపలు కాస్తుందట. -
కూరలో ఉప్పు ఎక్కువైందా.. ఇలా చేయండి
► ఇడ్లీ, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగడం వల్ల విటమిన్లు నీటిలో పోతాయి. అంతేకాకుండా దుకాణాల్లో వాటికి పురుగుపట్టకుండా నిల్వ చేయడానికి కీటక నాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి కాబట్టి అవన్నీ శరీరంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ► కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళాదుంప ముక్కలను వేయాలి. అధికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల్లో పీల్చుకుంటుంది. ► గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచుల దగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్‌స్పూను నెయ్యి కలపాలి. ► కూరలు, పులుసులు, సూప్‌లు మరీ పలచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్ కలపాలి. కార్న్‌ఫ్లోర్‌ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది. -
కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు
అహ్మదాబాద్: గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై పెట్టిన కేసులను పెప్సీకో బేషరతుగా ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేసుల పేరుతో అన్నదాతలను వేధించినందుకు తగిన పరిహారం చెల్లించాలని అన్నాయి. పెప్సికో కేసు నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు గుజరాత్‌లోని 25 రైతు సంఘాలతో పాటు భారతీయ కిసాన్ సంఘ్(బీఎస్కే), హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు కలిసి ‘విత్తన సార్వభౌమాధికార జాతీయ ఫోరం’గా ఏర్పడ్డాయి. కార్యాచరణ ఖరారు చేసేందుకు శుక్రవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్‌లో జాతీయ ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు హక్కుల నేత కపిల్ షా విలేకరులతో మాట్లాడుతూ.. రైతులపై కేసులు ఉపసంహరించుకుంటామని పెప్సికో చేసిన ప్రకటనలో కొత్త విషయాలు లేవన్నారు. రెండు షరతుల మీద రైతులపై కేసులు వెనక్కు తీసుకుంటామని గతంలో కోర్టుకు పెప్సికో తెలిపిందన్నారు. తమ కంపెనీ కాంట్రాక్టు ఫార్మింగ్‌లో భాగస్వాములు కావడం లేదా తమ విత్తనాలు వాడటం మానేస్తేనే కేసులు ఉపసంహరించుకుంటామని కోర్టుకు పెప్సికో చెప్పిందన్నారు. బేషరతుగా కేసులు ఉపసంహరించి, రైతులకు పరిహారం చెల్లించాలని కపిల్ షా డిమాండ్ చేశారు. విత్తన వ్యాపారుల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చట్టాలు చెబుతున్నాయని, ఈ విషయంలో ఎటువంటి సంప్రదింపులకు తావులేదన్నారు. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్తం 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీకో వెనక్కి తగ్గింది. -
కళ్లజోడు మచ్చలకు కలబంద
కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే... ►కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలుతగ్గుతాయి ►మచ్చలపై తేనె రాసి, 10–15 నిమిషాల తర్వాతశుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటేమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి ►రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసిబాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడువల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు ►బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్నచోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి ►నారింజ తొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్న చోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలోని సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది ►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్నిచుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈవిధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగాతగ్గిపోతాయి ►స్ట్రాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
ఇంటిప్స్
►టొమాటోలను ఉడికించి, తగినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలలో పోసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. టొమాటో ఐస్‌క్యూబ్స్‌ను ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లోనే ఉంచాలి. అవసరమైనప్పుడు సూప్‌లు, కూరలలో గ్రేవీగా వాడుకోవచ్చు. ►పాలు పొంగి అంచుభాగం అంతా పాల మరక పట్టుకునే ఉంటుంది. ఇలాంటప్పుడు, పాలు మరిగించడానికి ముందు పాత్ర పై అంచు భాగాన నెయ్యి రాస్తే పాలు త్వరగా పొంగవు, పొంగినా అంచుకు మరక పట్టదు. ►వంటలలో ఉప్పు ఎక్కువైతే టొమాటో ముక్కలు లేదా బంగాళదుంప ముక్కలు లేదా టీ స్పూన్ పంచదార వేయాలి. ►నిమ్మకాయలను ఫ్రిజ్‌లో నిల్వచేసేముందు వాటి పైన కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. ►అన్నం ముద్దగా కాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. -
తాబేలు ఆకారంలో ఆలుగడ్డ
నెన్నెల: మండల కేంద్రంలోని వడ్లవాడకు చెందిన మోసీన్ అనే కారు డ్రైవర్ ఇంట్లో అ చ్చం తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ చూపరును ఆకట్టుకుంటుంది. పది రోజుల క్రితం దుకాణంలో రెండు కిలోల ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచామని అందులో కొన్ని ఆలుగడ్డలు మొలకెత్తాయి. ఒక ఆలుగడ్డ మాత్రం తాబేలు ఆకారంలో కనిపించిందని మోసీన్ తెలిపారు. ఆలుగడ్డకు ముందు భాగంలో తలలాగా ఒక పిలక, వెనుక భాగంలో ఇరువైపుల రెండు పిలకలు, మధ్య భాగంలో కాళ్ల వలె రెండు పిలకలు వచ్చాయని అన్నారు. దీంతో ఆలుగడ్డ అచ్చం తాబేలులా కనిపిస్తుందని తెలిపారు. -
మళ్లీ తడబడ్డ రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాల్లో పొరపాట్లు దొర్లడం సహజంగా మారింది. రాహుల్ ప్రసంగాల్లోని పొరపాట్లను ఆసరాగా చేసుకుని ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం సాధారణంగా మారింది. అదే సమయంలో ఆయన ప్రసంగాలను సోసల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో అవి మరింత వైరల్ అవుతున్నాయి. తాజాగా గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ ప్రసంగంలో దొర్లిన పొరపాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గుజరాత్లో ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లో సభలో ప్రసంగిస్తూ.. రాహుల్ గాంధీ ‘బంగాళ దుంపలను ఒక యంత్రంలో పెట్టగానే.. మరోవైపు బంగారం వచ్చేలా చేస్తానన్నారు. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. ఈ వీడియో పై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ వీడియోపై కాంగ్రెస్ నేతలు మాత్రం మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంలో ముందు.. వెనుక వ్యాఖ్యానాలు తొలగించి.. కేవలం ప్రచారం కోసమే బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఏ సందర్భంలో ఆలా అన్నారో.. పూర్తి వీడియో చూసి తెలుసుకోవాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. BRAKING NEWS..... Rahul Gandhi going to invent Gold making machine from potato..the real scientist...#Congress #GujaratElections2017 #RahulGandhi pic.twitter.com/0EpHJvyRA5 — Yogendra Singh Chauh (@Singhcyogi) November 15, 2017 From Now on Lays Will Not sell Potato chips they are going to sell Gold Biscuits in India . ~Rahul Gandhi — sober_man 😁 (@StonerPsychic) November 15, 2017 Finally got to see the mechanism through which potato will be converted into Gold. Pappu (Hope EC won't punish me) @OfficeOfRG is indeed genius. pic.twitter.com/IOmc5xckut — Rahul Kaushik (@kaushkrahul) November 15, 2017 -
ఈ వైపు బంగాళ దుంపలను వేస్తే ఆ వైపు బంగారం
-
ఉల్లి, ఆలూ కూడా అమ్ముతాం
అగ్రి బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి ► కొత్త వ్యాపార విభాగాలపైనా కసరత్తు ► ఐటీసీ సీఈవో సంజీవ్ పురి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ మరిన్ని హెల్త్‌కేర్ తదితర కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి కొన్ని నెలలకు మార్కెట్లో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టే దిశగా.. త్వరలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కూడా విక్రయించడం ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ‘రాబోయే రోజుల్లో ఆలూ, గోధుమ మొదలుకుని పళ్లు, ఇతర కూరగాయలు, సముద్ర ఆహారోత్పత్తులు వంటివాటిపై మరింతగా దృష్టి పెట్టనున్నాం’ అని ఆయన వివరించారు. అలాగే ఉల్లి డీహైడ్రేట్స్పైనా కసరత్తు చేస్తున్నామని, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని పురి తెలిపారు. ఐటీసీ ఆదాయాల్లో ప్రస్తుతం 58% వాటా పొగాకుయేతర వ్యాపార విభాగాలైన ఎఫ్ఎంసీజీ, హోటల్, అగ్రి బిజినెస్, పేపర్ మొదలైన వాటిదే. హెల్త్‌కేర్ టీమ్ ఏర్పాటు ప్రక్రియ.. ఇక, హెల్త్‌కేర్ వ్యాపార విభాగంపై స్పందిస్తూ ఇందుకు సంబంధించి ప్రస్తుతం టీమ్‌ను తయారుచేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతోనే వివిధ వ్యాపార విభాగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవలం షేర్‌హోల్డర్ల ప్రయోజనాల కోణానికే పరిమితం కాకుండా దాని పునాదిపై సామాజిక ప్రయోజనాలకూ పాటుపడాలన్నది ఐటీసీ వ్యూహమని పురి పేర్కొన్నారు. ఇండియా ఫస్ట్ వ్యూహం కింద 2030 నాటికల్లా వ్యాపారాలు, వ్యవస్థలను పటిష్టం చేయడం ద్వారా 1 కోటిపైగా మందికి జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐటీసీ, దాని గ్రూప్ సంస్థల్లో 32,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తూ, సుమారు 60 లక్షల మందికి జీవనోపాధి దక్కేలా కృషి చేస్తోంది. అగ్రి బిజినెస్, విలువ జోడింపు వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఐటీసీ ప్రస్తుతం సుమారు 20 కన్జూమర్ గూడ్స్, లాజిస్టిక్స్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. -
ఇంటిప్స్
వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉడికేటప్పుడే వేస్తే వాటి సువాసన ఆవిరై పోతుంది. కాబట్టి దించిన తర్వాత పైన చల్లి సర్వ్ చేయాలి.కొత్తిమీర, పుదీన వంటి వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే తాజాగా దొరకనప్పుడు వాడుకోవచ్చు. ఈ పొడులను వాడేటప్పుడు తరిగిన తాజా ఆకు ఒక టేబుల్ స్పూన్ వాడే చోట మూడవ వంతు పొడిని వాడితే సరిపోతుంది. బంగాళాదుంపలను వీలయినంత వరకు తొక్క తీయకుండానే ఉడికించాలి. ముక్కలుగా తరిగి లేదా తొక్క తీసి ఉడికించడం ద్వారా పోషకాలు నీటిలో కలిసిపోతాయి. ఆపిల్‌ను మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే రుచి తగ్గుతుంది. కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. -
బ్యూటిప్స్
బంగాళదుంప తురుము – రెండు టేబుల్ స్పూన్లు, తేనె – సరిపడా. ముందుగా బంగాళదుంప తురుముని ఐస్ వాటర్‌లో అయిదు నిమిషాల పాటుంచి తీయాలి. దీంట్లో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి. రెండు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ మొదలుకొని ముఖానికి పట్టించి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మ కాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. -
జొన్నత్
జొన్నలు రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. వండామా... సాఫ్ట్ అండ్ స్మూత్ అయిపోతాయి! తిన్నామా... ఒంటికి చేవగా చేరిపోతాయి! ఈ పొలం ఫుడ్... మహా స్ట్రాంగ్ ఫుడ్. జొన్న ఐటమ్ ఏదైనా జన్నత్ని తలపిస్తుంది. జన్నత్ అంటే స్వర్గం. ఇది మాత్రం జొన్నత్! జొన్న పోహా తయారీకి పట్టే సమయం: 20 నిమిషాలు. ఇద్దరికి సరిపోతుంది. కావలసినవి జొన్న అటుకులు - 1 కప్పు బంగాళదుంప, బఠాణీలు - అర కప్పు (ఉడకపెట్టుకున్నవి) పటిక బెల్లం పొడి - 1 చెంచా నూనె - 2 చెంచాలు నిమ్మరసం - 1 చెంచా ఉప్పు - తగినంత ఆవాలు - 1 చెంచా జీలకర్ర 1/2 చెంచా శనగపప్పు 2 చెంచాలు మినప్పప్పు 1 చెంచా పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా ఇంగువ - పావు చెంచా ఎండుమిర్చి - 2 అల్లం ముక్కలు (చిన్నవి) - 1 చెంచా పసుపు - 1 చెంచా కరివేపాకు - 1 రెమ్మ పల్లీలు - పిడికెడు. తయారి జొన్న ఆకులు నీళ్లలో పోసుకుని శుభ్రంగా కడిగి, ఒకటి రెండు నిముషాలు నీళ్లలో ఉంచి, వడకట్టుకుని, వాటికి పప్పు చేర్చి, 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, అల్లం ముక్క, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా పోపు మగ్గనివ్వాలి. దీనికి పల్లీలు కూడా చేర్చి, అన్నీ దోరగా వేగిన తర్వాత ఇంగువ చేర్చి, ఉడక పెట్టుకున్న బంగాళదుంప, బఠాణీ చేర్చుకుని ఒక నిమిషం మగ్గనిచ్చి, పైన తయారుగా పెట్టుకున్న అటుకులు చేర్చి, తగినంత ఉప్పు చేర్చి, అన్నీ బాగా కలుపుకుని 3-4 నిముషాలు సన్నని సెగమీద ఉంచుకోవాలి. దించబోయే ముందు నిమ్మరసం, పటికబెల్లం పొడి చల్లుకుని కలుపుకుంటే, ఎంతో రుచికరమైన జొన్న పోహ తయారవుతుంది. ఈ మిశ్రమంపై కొత్తిమీర చల్లుకోవచ్చు. గమనిక: జొన్న ఆకు నీళ్లలో ఎక్కువ సేపు నానకూడదు. గట్టిగా పిండకూడదు, విరిగిపోతాయి. మార్పులు చేర్పులు: పోపులో ఆకుకూర, ఇష్టమైన కూరగాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మరసంతో పాటు పుట్నాల పప్పు పొడి కూడా చల్లుకోవచ్చు. పటిక బెల్లం పొడి వద్దు అనుకుంటే చల్లకపోయినా ఫర్వాలేదు. సజ్జ, రాగి అటుకులతో కూడా ఈ పోహ తయారు చేసుకోవచ్చు. జొన్న ఉప్మా తయారీకి పట్టే సమయం: 30 నిమిషాలు. ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది. కావలసినవి: జొన్న రవ్వ 1 కప్పు; కరివేపాకు - 1 రెమ్మ ఉడికించిన కూరగాయ ముక్కలు - 1 కప్పు (క్యారెట్, బీన్స్) ఉల్లి తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి - 2 అల్లం తరుగు - 1 చెంచా; నూనె - 2 చెంచాలు కొత్తిమీర తరుగు - 2 చెంచాలు; ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా; శనగపప్పు - 2 చెంచాలు మినప్పప్పు - 1 చెంచా; ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - 2 తయారి: జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్ట్టుకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. ఉప్మా ఏదైనా చట్నీతో తినవచ్చు. గమనిక: మరిగే నీటికి రవ్వ చేర్చేటపుడు గరిటతో ఉండకట్టకుండా కలియ పెట్టుకోవాలి. మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు. కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు. జొన్న కార కుడుము తయారీకి పట్టే సమయం: 40 నిమిషాలు. మొత్తం 10-12 కుడుములు తయారవుతాయి. కావలసినవి: జొన్న రవ్వ - 1 కప్పు కరివేపాకు - 1 రెమ్మ; ఇంగువ - పావు చెంచా పెసరపప్పు - పావు కప్పు నూనె లేదా నెయ్యి - 2 చెంచాలు ఉప్పు - తగినంత; ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా; ఎండుమిర్చి - 2 మినప్పప్పు - 1 చెంచా పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా అల్లం తరుగు - 1 చెంచా తయారి: పెసరపప్పు ఒక గంట నీళ్లలో నానపెట్టుకుని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. రుబ్బుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి రుబ్బుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువలతో పోపు పెట్టుకుని ఇందులో రుబ్బుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని, 3-4 నిముషాలు దోరగా వేపుకుని, జొన్న రవ్వ కూడా కలుపుకొని 4-5 నిమిషాలు వేపుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత, చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకుని కుడుములు చేసుకొని ఇడ్లీపాత్రలో 10-12 నిమిషాలు ఆవిరి పట్టుకుంటే కమ్మని జొన్న కార కుడుములు తయారవుతాయి. సాంబారు, కొబ్బరి చట్నీతో తినవచ్చు. గమనిక: రవ్వ ఉడికేటప్పుడు ఉండకట్టకుండా చూసుకోవాలి.మార్పులు చేర్పులు: పెసరపప్పు బదులు శనగపప్పు కూడా వాడుకోవచ్చు. లేదా రెండూ కలిపి కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు లేదా ఆకుకూర, కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ కార కుడుములు చేసుకోవచ్చు. జొన్న పేలాల లడ్డు తయారీకి పట్టే సమయం: 30 నిమిషాలు. 12 లడ్డూలు తయారవుతాయి. కావలసినవి: జొన్నలు- 1 కప్పు బెల్లం పొడి - 1 కప్పు పాలు - లడ్డూలు చుట్టుకోవటానికి తగినంత యాలకుల పొడి - అర చెంచా నెయ్యి - 2 చెంచాలు జీడిపప్పు - 2; బాదం - 4; పిస్తా - 4; ఎండు ఖర్జూరం - 3 (అన్నీ కలిపి పొడిచేసుకుని పెట్టుకోవాలి) తయారి మందపాటి బాణలిలో కానీ, మట్టిపెంకలో కానీ, శుభ్రం చేసుకున్న జొన్నలు తీసుకుని, నూనె లేకుండా జొన్న పేలాలు తయారయ్యేదాకా వేపుకుని, పేలాలు చల్లారిన తర్వాత, బరకగా పిండిచేసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో తయారు చేసుకున్న పేలాల పిండి, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, తయారు చేసుకున్న డ్రైఫ్రూట్స్ పొడిని కలుపుకుని తగినంత పాలు చేర్చి, లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు. గమనిక: జొన్న పేలాలు తయారయ్యేటప్పుడు మంట తగ్గించి, పేలాలు మాడకుండా వేపు ఉండాలి. పేలాలు మాడకుండా బాణలిలో కొంచెం ఇసుక వేసి, ఇసుక వేడి అయిన తర్వాత జొన్నలు వేసి వేపుకుని, పేలాలు తయారైన తర్వాత, పేలాలు ఇసుక నుండి వేరు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. మార్పులు చేర్పులు: వేపిన నువ్వులు కూడా లడ్డు పిండిలో కలుపుకోవచ్చు. - బెల్లం బదులు పటిక బెల్లం పొడి కూడా కలుపుకోవచ్చు. - పాలు వద్దు అనుకుంటే, బెల్లం లేతపాకం పట్టుకుని, అందులో పేలాల పిండి, యాలకుల పొడి, నెయ్యి, డ్రైఫ్రూట్స్ పొడి వేసుకుని చపాతీ పిండిలాగా చేసుకుని కూడా లడ్డూలు చేసుకోవచ్చు. - జొన్న పేలాలు పిండి చేయకుండా పేలాలగానే బెల్లం పాకంలో కలుపుకుని కూడా లడ్డూ చేసుకోవచ్చు. కానీ బెల్లం తీగపాకం పట్టుకోవాలి. సజ్జ పేలాలతో కూడా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. జొన్న అటుకుల మిక్చర్ తయారీకి పట్టే సమయం: 10.15 నిమిషాలు. ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది. కావలసినవి జొన్న అటుకులు - 1 కప్పు పచ్చిమిర్చి తరుగు - 1 చెంచా నూనె - 2 చెంచాలు ఉప్పు - తగినంత. ఆవాలు - 1 చెంచా జీలకర్ర - అర చెంచా శనగపప్పు - 2 చెంచాలు ఎండుమిర్చి - 2 పల్లీలు - పావు కప్పు పసుపు - అర చెంచా కరివేపాకు - 1 రెమ్మలు తయారి: ముందుగా జొన్న అటుకులు నూనె లేకుండా దోరగా వేపుకుని పెట్టుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, పల్లీ, పుట్నాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేపుకోవాలి. పోపుకు పసుపు, ఉప్పు చేర్చుకుని, తయారుగా పెట్టుకున్న జొన్న అటుకులు కలుపుకుని, ఒక పళ్లెంలోకి తీసుకుని 5 నిముషాలు చల్లారనిస్తే, ఎంతో రుచిగా ఉండే జొన్న అటుకులు తయారవుతాయి. మార్పులు చేర్పులు: జీడిపప్పు, కిస్మిస్ కూడా పోపులో చేర్చుకోవచ్చు. {Osెగ్లిజరైడ్స్తో బాధపడేవారు, పల్లీ, జీడిపప్పు వేసుకోకపోవటం చాలా మంచిది. పోపులో 1 చెంచా పటిక బెల్లం పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. షెఫ్ రాంబాబు కర్టెసీ క్రాంతి కుమార్ రెడ్డి హైదరాబాద్ -
ఇంటిప్స్
రిఫ్రిజిరేటర్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ని ఫ్రిజ్‌లో ఉంచాలి. చెడువాసనను బ్రెడ్ పీల్చుకుని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది. బాదం పప్పులను ఒక నిమిషం వేడినీటిలో నాననిస్తే, పొట్టు త్వరగా వచ్చేస్తుంది.అల్లం, వెల్లుల్లి పేస్టులో అల్లం నలభై శాతం, వెల్లుల్లి అరవై శాతం వేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి. వండటం పూర్తయ్యాక కూరలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వెంటనే ఒక బంగాళ దుంపని ఉడికించి, చిదిమి గ్రేవీలో వేస్తే ఉప్పును పీల్చేస్తుంది. పలచగా ఉన్నా కూడా ఉడికించిన బంగాళదుంపను చిదిమి అందులో వేయాలి. ఏదైనా పదార్థాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌కి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపితే నూనెను ఎక్కువగా పీల్చుకోవు. మెత్తగా, దూదిపింజెల్లాంటి ఇడ్లీలు కావాలంటే పిండిని ప్లేట్లలో వేసేటప్పుడు కలపకుండా ముందురోజే బాగా కలిపి ఉంచుకోవాలి. కూరగాయలను తొక్కతోపాటుగా ఉడికిస్తే అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. అప్పడాలను పాలిథిన్ కవర్లో పెట్టి పప్పులు, బియ్యంతోపాటు పెడితే విరిగిపోకుండా ఉంటాయి. -
ఇంటిప్స్
పొటాటో చిప్స్ బాగా కరకరలాడాలంటే... దుంపలను తరిగి, నీళ్లలో వేసి తీసి, వాటిపైన మొక్కజొన్న పిండి చల్లి అప్పుడు వేయించ వడియాలు పెట్టే పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే చక్కగా తెల్లగా వస్తాయి. పకోడీలు కరకరలాడకుండా కాస్త మెత్తగా కావాలనుకుంటే... పిండిలో కాస్త పెరుగు కలపాలి. -
ఊదా బంగాళదుంప!
అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పోషకాలతో నిండిన సరికొత్త బంగాళదుంప వంగడాన్ని సృష్టించారు. ఊదా రంగులో ఉండే ఈ సరికొత్త ఆలుగడ్డల్లోని పోషకాలు దానిమ్మ, బ్లూబెర్రీలకు ఏమాత్రం తీసిపోవని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొలరాడో శాస్త్రవేత్తలు తమ సీఎస్‌యూ పొటాటో ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఎరుపు, పసుపు, తెల్ల బంగాళదుంపల్ని సృష్టించారు. తాజాగా అభివృద్ది చేసిన ఊదా బంగాళదుంపల్లో అత్యధిక మోతాదులో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతోపాటు విటమిన్ సీ, ఫోలిక్ యాసిడ్, ఖనిజాలు, పొటాషియం, ఇనుము, జింక్ వంటి పోషకాలూ మెండుగా ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ఈ పోషకాలను తరచూ తీసుకోవడం ద్వారా కేన్సర్‌తోపాటు గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చునన్నది తెలిసిందే. అంతేకాదు... బంగాళదుంపల్ని వేయించినా, ఓవెన్లో బేక్ చేసినా దాంట్లో వృద్ధి చెందే కేన్సర్ కారక రసాయనం ఆక్రిలామైడ్ కొత్త వంగడంలో చాలా తక్కువగా ఉంటుందట. దీంట్లో ఉండే ఫైటో కెమికల్స్ మధుమేహ వ్యాధిగ్రస్తుల కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తాయట. -
ఇంటిప్స్
బాదం పప్పుల మీదున్న పొట్టు సులువుగా రావాలంటే వేడినీళ్లలో 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. మజ్జిగలో నీళ్లు ఎక్కువైతే కొద్దిగా శనగపిండి కలపాలి. రాగి పాత్రల మీద కొద్దిగా నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి. డబ్బా అడుగున బ్లాటింగ్ పేపర్‌ను ఉంచి, బిస్కెట్లు ఉంచితే మెత్తబడవు. కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి. చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి. బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి. ఎండుమిరపకాయల్లో ఉప్పు, కొద్దిగా వంట నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి. -
ఒకప్పుడు చెడ్డవి... ఇప్పుడు అవే మంచివి!
తిండి గోల ఒకప్పుడు ఆ పదార్థాలను కాస్త ప్రతికూలమైనవిగా పరిగణించేవారు. తిన్నా పరిమితి పాటించమంటూ పెద్దలు సుద్దులు చెప్పేవారు. ఆరోగ్యనియమాలు పాటించేవారైతే వాటిని చాలా దూరంగా ఉంచేవారు కూడా. అవే... గుడ్లు, ఆలూ (బంగాళాదుంప). ఇప్పుడు ఆహార నిపుణులంతా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం గుడ్లు, ఆలుగడ్డ (బంగాళదుంప)లను విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకనాడు హెల్త్ పాలిటి విలన్లుగా పరిగణించిన పదార్థాలనే మళ్లీ హీరోలను చేస్తున్నారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన కింగ్స్ కాలేజ్‌లో స్కాట్ హెర్డింగ్ అనే నిపుణుడు ‘ద కన్వర్సేషన్’ అనే జర్నల్ కోసం రాసిన పరిశోధన పత్రంలోని ముఖ్య అంశాలపై ప్రసంగించారు. అందులోని కొన్ని ప్రధానాంశాలివి... ఒకప్పుడు ఒక గుడ్డులో కనీసం 185 ఎంజీ కొలెస్ట్రాల్ ఉంటుందనీ, గుండెకు అదెంతో కీడు అని చెప్పేవారు. అయితే గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన వైద్యపరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా గుడ్లు తినేవారి కొలెస్ట్రాల్ పాళ్లు క్రమబద్ధంగా ఉంటాయని పేర్కొంటున్నారట. గుడ్లు తినకపోవడం వల్ల కోల్పోయే మినరల్స్, విటమిన్స్ ఎక్కువన్నది పరిశోధకుల తాజా మాట. ఆలుగడ్డ (బంగాళదుంప)లను చాలా అనారోగ్యకరమైనవిగా ఇటీవలి వరకూ పరిగణిస్తూ వస్తున్నారు. వాటిలో చక్కెరను పెంచే గుణం ఉన్నందున వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహార పదార్థాలుగా చెబుతూ వీలైనంత తక్కువగా వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాటిల్లో కార్బోహైడ్రేట్లతో పాటు, విటమిన్-సి, కొన్ని రకాల విటమిన్-బిలు, కొన్ని ఖనిజాలూ ఉన్నాయనీ, ఆరోగ్యానికి అవి అవసరమంటూ ఇప్పుడు ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఆలుగడ్డలను మనం ఎలా వండుకుంటామన్న అంశమే అనారోగ్యకరం తప్ప అవి అనారోగ్య కారకాలు కావంటూ ఆహార నిపుణులు కితాబిస్తున్నారు. మన జీర్ణవ్యవస్థలో నివాసం ఉండే మనకు మేలు చేసే బ్యాక్టీరియా విషయంలోనూ బంగాళదుంపతో సానుకూలం ప్రభావం ఉంటుందంటున్నారు స్కాట్ హెర్డింగ్. -
దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!
ఈ బంగాళదుంప ఫొటోను చూస్తే సాదాసీదాగా కనిపిస్తోంది కదూ. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫొటోల్లో ఒకటి. దీన్ని గతేడాది 10 లక్షల డాలర్లకు విక్రయించారు. కెవిన్ అబోస్ అనే ఫొటోగ్రాఫర్ దీన్ని చిత్రీకరించారు. ఆయన సిలికాన్ వ్యాలీ టెక్‌లోని ప్రముఖ వ్యాపారులకు ఫొటో షూట్ తీసి భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఒక ఫొటో షూట్ కోసం లక్షా 50వేల డాలర్ల నుంచి అత్యధికంగా 5లక్షల డాలర్ల వరకు తీసుకుంటాడు. ఇతనిలో దీంతో పాటు ఫైన్ ఆర్ట్ ఫొటోగ్రాఫర్(లలిత కళా ఛాయాకారుడు) కూడా దాగి ఉన్నాడు. దాని మూలంగానే ఈ ఫొటో రూపుదిద్దుకుంది. ఎన్ని రకాలుగా ఉన్నా మనుషులుగా గుర్తించవచ్చని.. అలాగే బంగాళదుంపలను కూడా అని.. అందుకే తనకు ఇవి ఇష్టమని ఆయన తెలిపాడు. కాగా, ఇలాంటి ఫొటోలను సేకరించే పీటర్ అనే ఒక సంపన్న వ్యక్తి 2015లో కెవిన్ ఇంటిని సందర్శించినప్పుడు ఈ బంగాళదుంప ఫొటోను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం టాప్ 20 అత్యంత విలువైన ప్రారంభ కొనుగోలు ధరల్లో దీనికి చోటుకు లభించింది. -పారిస్ -
దుంప తెంచింది!
ఆశ చావని రైతు బంగాళాదుంప సాగుతో మరో సారి దెబ్బతినాల్సి వచ్చింది. గతంలో పంట సాగుచేసినా వర్షాల కారణంగా తీవ్ర నష్టాల్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పంట దిగుబడి పెరిగినా ధర పతనమవ్వడంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. పంటబీమా కూడా చేసుకోకపోవడంతో కుదేలవ్వాల్సిన దుస్థితి ఎదురైంది. చేసిన అప్పులు తీర్చలేక.. కొత్త అప్పులు పుట్టక రైతులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాలు చల్లదనానికి పెట్టింది పేరు. ఇక్కడ బంగాళాదుంప సాగుకు అనుకూలం. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో ఈ దఫా సుమారు 1,500 ఎకరాల్లో దుంపను సాగుచేశారు. గతంలో తీరని నష్టం మామూలుగా ఈ ప్రాంతాల్లో బంగాళాదుంపను రెండు అదునులుగా సాగుచేస్తారు. మొదటి అదునుగా గత ఏడాది సెప్టెంబర్‌లో.. రెండో అదునుగా నవంబర్, డిసెంబర్‌ల్లో సాగుచేశారు. అయితే నవంబర్‌లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భూమిలోపల దుంప సైజు పెరగలేదు. సగం పంట నీటిశాతం ఎక్కువై చేలళ్లోనే కళ్లిపోయింది. ఉన్న దుంపలు పచ్చటి రంగులోకి మారి పనికిరాకుండా పోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాక తోటలు ఏపుగా పెరిగాయేగానీ పంట దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. రెండో అదనులో నాటిన తోటలు కూడా వర్షానికి సగం మాత్రమే మొలకెత్తాయి. ఎకరాకు రూ.70 వేల పెట్టుబడి బంగాళాదుంప సాగుచేసేందుకు రైతులు ఎకరాకు రూ.70 వేలదాకా ఖర్చు చేశారు. విత్తనాలు, ఎరువు లు, క్రిమిసంహారకమందు లు, సస్యరక్షణ తదితరాలకు భారీగానే పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో విత్తనపు గడ్డ తుండు(42 కిలోలు) రూ.1500 దాకా తెచ్చి నాటారు. ఎకరాపొలానికి 15 తుండ్లు కావాలి. దీంతో రూ.22,500 విత్తనాలకు, ఎరువులకు మరో రూ.25 వేలు, క్రిమిసంహారకమందులకు ఇంకో రూ.15 వేలు, కూలీలు ఇతరత్రా ఖర్చులు రూ.8వేలు మొత్తం రూ.70 వేలు పంటకోసం వెచ్చించారు. తుండుకు 5 బస్తాలు కూడారాని దిగుబడి మామూలుగా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తే తుండు విత్తనాలకు 20 నుంచి 22 బస్తాల దిగుబడి రావాలి. కానీ ఈ దఫా తుండుకు 5 నుంచి 7 బస్తాలు మాత్రమే వచ్చింది. దానికి తోడు దుంపల నాణ్యత తగ్గింది. ఆ లెక్కన ఎకరానికి 75 నుంచి 100 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర (తుండు రూ.550 నుంచి రూ.600) రూ.42 వేల నుంచి 60 వేల దాకా రైతులకు రాబడి వచ్చింది. పంట పెట్టుబడే రూ.70 వేలు అయితే వచ్చిన రాబడి రూ.42 నుంచి రూ.60 వేలు మాత్రమే. మొత్తమీద రైతులు ఎకరాకు రూ.30 వేలదాకా నష్టపోవాల్సి వచ్చింది. నష్టం రూ.45 కోట్లు ఎకరాకు రూ.30 వేలు నష్టం కాగా 1,500 ఎకరాలకు రూ.45 కోట్ల దాకా నష్టంమొచ్చింది. గతంలో రైతులు ఈ పంటకు కనీసం పంటల బీమా కూడా చేసుకోలేదు. దీంతో పూర్తిగా నష్టపోయారు. వేరుశెనగకు మాత్రం బీమా కట్టించుకున్న అధికారులు కూరగాయల పంటలను గురించి పట్టించుకోలేదు. అప్పులు చేసి పంటను సాగు చేసిన రైతన్నలు అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ఎఫెక్ట్‌తో మళ్లీ పంటల సాగుకు బ్యాంకులు కొత్త రుణాలివ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. కాల్‌మనీ వ్యవహారంతో ప్రవేటు వడ్డీ వ్యాపారులు సైతం అప్పులు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. -
హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..!
బ్యూటీ టిప్స్ బంగాళదుంపను సన్నగా తురిమి, పిండి రసం తీయాలి. దానిలో కోడిగుడ్డు తెల్లసొన, పెరుగు కలిపి కుదుళ్లకు పట్టించి... గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే జుత్తు ఆరోగ్యంగా పెరుగుతుంది.పెదవులు పాలిపోయినట్టుగా అయితే... చక్కెర కరిగించిన నీటిలో బీట్రూట్ ముక్కను కాసేపు నానబెట్టి, తర్వాత దానితో పెదవులు రుద్దాలి. దాంతో చక్కని రంగును సంతరించుకోవడమే కాక ఆరోగ్యంగా ఉంటాయి. రెండు క్యారెట్లను, ఒక బంగాళదుంపను ఉడికించి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త పెరుగు కలిపి ప్యాక్ వేసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెండు వారాలకోసారి ఇలా చేస్తే ముఖమ్మీది ముడతలు తొలగిపోతాయి. -
టమాటో + పొటాటో = టామ్‌టాటో..
టమాటో+పొటాటో = టామ్‌టాటో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు టైపులో ఒకే మొక్కకు అటు టమాటో.. ఇటు బంగాళదుంపలు అన్నమాట. బ్రిటన్‌కు చెందిన థాంప్సన్ అండ్ మోర్గాన్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అదీ మన ఇంట్లో పెంచుకునే టైపులో.. అలాగనీ ఇది జన్యుమార్పిడి మొక్క కానేకాదు.. ఎప్పట్నుంచో అనుసరిస్తున్న మొక్కలు అంటు కట్టే విధానంలోనే ఆధునిక పద్ధతులను వీరు అవలంభించారట. గతంలో బ్రిటన్‌లోనూ టమాటో, పొటాటోను అంటు కట్టినా.. రుచి వంటి వాటి విషయాల్లో వాటిల్లో లోటుపాట్లు ఉన్నాయట. టామ్‌టాటో విషయంలో ఆ సమస్యలేమీ లేవట. అంతేకాదు.. తొలిసారిగా వాణిజ్యపరంగా విజయవంతమయ్యేలా టామ్టాటోను తీర్చిదిద్దారు. అంటే.. త్వరలో దీన్ని మార్కెట్లోకి విక్రయిం చేందుకు తేనున్నారన్నమాట. ఇది 10 ఏళ్ల కృషి ఫలితమని ఈ సంస్థ డెరైక్టర్ పాల్ చెప్పారు. ‘ప్రతి టామ్‌టాటో మొక్క అంటు కట్టే ప్రక్రియను హాలండ్‌లోని ఓ ప్రయోగశాలలో పూర్తి చేస్తాం. తర్వాత అది బ్రిటన్‌కు వస్తుంది. ఇక్కడ మేం దాన్ని గ్రీన్‌హౌజ్‌లో పెంచుతాం. బాగా పెరిగిన తర్వాత విక్రయిస్తాం’ అని తెలిపారు. -
ఇంకా దారిలోనే సరుకులు!
సాక్షి, హైదరాబాద్: తుపాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. మొదట్లో 5 లక్షల బాధిత కుటుంబాలకు నిర్ణయించిన మేరకు సరుకులన్నీ ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినా ఆ మేరకే సేకరణ చేయలేదు. ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించ కపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి అందిన లెక్కల మేరకు తాజాగా 6,44,045 బాధిత కుటుంబాలను అధికారికంగా గుర్తించారు. ఈ సంఖ్య 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రులు, అధికారులు హడావుడి చేస్తున్నారేతప్ప బాధితులకు నిత్యావసర వస్తువులు అందించడంలో చర్యలు తీసుకోవడం లేదు. 4 రోజులుగా వాహనాలు ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నాయంటున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు విశాఖకు 400 కిలోలీటర్ల పామాయిల్ అవసరం ఉందని జిల్లా కలెక్టర్ నివేదికలు పం పగా ఇప్పటివరకు 202.4 కిలోలీటర్లు మాత్రమే అక్కడకు చేరింది. కందిపప్పు 800 మెట్రిక్ టన్నులకు గాను 147 టన్నులు, ఉప్పు 400 మెట్రిక్ టన్నులకు గాను 96 మెట్రిక్ టన్నులు, కారం పొడి 200 మెట్రిక్ టన్నులకు గాను 10 మెట్రిక్ టన్నులు, ఉల్లిపాయలు 800 మెట్రిక్ టన్నులకు 37 టన్నులు, బంగాళాదుంపలు 1,200 మెట్రిక్ టన్నులకు 94 మెట్రిక్ టన్నులు మాత్రమే విశాఖపట్నం చేరాయి. శ్రీకాకుళం జిల్లాకు 224 కిలో లీటర్ల పామాయిల్‌కు గాను 113.2 కిలో లీటర్లు, కందిపప్పు 448 మెట్రిక్ టన్నులకు గాను 17 మెట్రిక్ టన్నులు, ఉప్పు 224 మెట్రిక్ టన్నులకు గాను 50 మెట్రిక్ టన్నులు చేరింది, కారం పొడి 112 మెట్రిక్ టన్నులకు ఒక్క ప్యాకెట్ కూడా అందలేదు. ఉల్లి పాయలు 449 మెట్రిక్ టన్నులకు గాను 57 టన్నులు, బంగాళదుంపలు 672 మెట్రిక్ టన్నులకు 40 మెట్రిక్ టన్నులే అక్కడకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లాకు 20 కిలోలీటర్ల పామాయిల్ అవసరం ఉండగా 18 కిలో లీటర్లు, 40 మెట్రిక్ టన్నుల కంది పప్పు, 20 మెట్రిక్ టన్నుల ఉప్పు అందింది. కారంపొడి 10 మెట్రిక్ టన్ను ల అవసరం ఉండగా ఒక్క ప్యాకెట్టూ పంపలేదు. 3 జిల్లాల్లోనూ 71,438 కుటుంబాలకే 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. -
మొర ‘ఆలు’కించదే!
భారీగా పడిపోయిన సరఫరా అమాంతం పెరిగిన బంగాళ దుంపల ధరలు సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో ఆలుగడ్డ ధరదడ పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కిలో రూ.40కి చేరింది. ప్రస్తుతం మిగిలిన కూరగాయల ధరలు కిందికి దిగివస్తుంటే... ఆలు ధరలు ఆకాశం వైపు దూసుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు హడలిపోతున్నారు. సగటు జీవికి అందనంత ఎత్తులో బంగాళాదుంప ధర ఉంటోంది. సరఫరా తగ్గడ మే ధరలు పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. గత ఎనిమిది నెలలుగా నగరానికి ఆలు అరకొరగానే సరఫరా అవుతున్నాయి. ఫలితంగా ధరలు అస్థిరంగా ఉంటున్నాయి. సంపన్నులు తప్ప సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఆలు సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల దిగుమతుల పైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది. ప్రధానంగా మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్, పూనే, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కర్ణాటకలోని అకోలా నుంచి నగరానికి నిత్యం 500-600 టన్నుల ఆలు దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి అనూహ్యంగా తగ్గిపోయింది. ఫలితంగా మన రాష్ట్రానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఫలితంగా 7-8 నెలలుగా ఆలు ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఆగ్రా, నాగపూర్‌ల నుంచి రోజుకు 200 టన్నుల ఆలు దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అరకొరగా వచ్చిన సరుకుకు డిమాండ్ బాగా ఉండడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తుస్తున్నారు. రైతుబజార్లో కేజీ రూ.29కు అమ్ముతుండగా రిటైల్ మార్కెట్లో మాత్రం కేజీ రూ.40ల చొప్పున వసూలు చేస్తున్నారు. ఆలు దిగుమతులపై మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టకపోవడంతో ధరలు అస్థిరంగా ఉంటూ వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. స్థానికంగా జహీరాబాద్, వికారాబాద్, తూప్రాన్, దౌల్తాబాద్ వంటి ప్రాంతాల్లో సాగవుతున్న ఆలు దిగుబడి వస్తే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. -
కొండెక్కిన ధరలు
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. తత్ఫలితంగా నగరానికి ప్రతిరోజూ కూరగాయాల లోడుతో రావాల్సిన ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో 20 శాతం మేర ధరలు పెరిగిపోయాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతి రోజూ పుణే, నాసిక్ జిల్లాల పరిసరాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇవి ముంబై, ఠాణే, నవీముంబై ప్రాంతాలకు సరఫరా అవుతాయి. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. దీంతో ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఉల్లిపాయలు గృహిణులకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. వారం క్రితమే కూరగాయల ధరలు పెరిగాయి. దీనికితోడు తాజాగా మరో 20 శాతం మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. మొన్నటివరకు ప్రతిరోజూ మార్కెట్‌కి 300-350 వరకు కూరగాయలు ట్రక్కులు రాగా , ప్రస్తుతం కేవలం 80-100 లోపే వస్తున్నాయి. ఏపీఎంసీలో ఏదైనా కూరగాయ ధర కేజీకి ఐదు రూపాయలు పెరిగితే అవి కొనుగోలుదార్ల చెంతకు వచ్చేసరికి చిన్న వ్యాపారులు ఏకంగా మూడురెట్లు పెంచేస్తున్నారు. కొన్నిచోట్ల టమాటాలు మొన్నటి వరకు కేజీకి రూ.30 చొప్పున లభించాయి. సరుకు కొరత కారణంగా తాజాగా మరో ఐదు రూపాయల మేర వాటి ధర పెరిగింది. దీన్ని బట్టి కేజీకి రూ.35 చొప్పున విక్రయించాలి. అయితే చిన్న చిన్న వ్యాపారులు ఏకంగా రూ.50 విక్రయించి తమ జేబులను నింపుకుంటున్నారు. ఇవే టమాటాలు రెండు వారాలక్రితం టోకు మార్కెట్లో కేజీకి రూ.12 లభించాయి. వారం క్రితం రూ.22 చేరుకున్నాయి. తాజాగా టోకు మార్కెట్లో కిలో రూ.35 పలుకుతోంది. కూరగాయల ధరల పెరుగుదలతో పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు కూడా సతమతమతున్నారు. -
ఉల్లి ఎగుమతి ధర పెంపు
* నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి ఉల్లి, బంగాళాదుంప న్యూఢిల్లీ: నిత్యావసర ఆహారపదార్థాల ధరలు పెరుగుతుండటంపై ఆందోళనకు గురవుతున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని అదుపులో పెట్టేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 500 డాలర్లకు(రూ. 29,773) పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశీ మార్కెట్లో వీటి సరఫరా మెరుగవడంతో పాటు ధర కూడా తగ్గుతుందని భావిస్తోంది. కనీస ఎగుమతి ధర కన్నా తక్కువ ధరకు ఎవరూ ఎగుమతి చేయకూడదు. యూపీఏ ప్రభుత్వం మార్చి నెలలో ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించగా.. నెలక్రితం వాటి ఎగుమతులకు అనుమతిస్తూ, ఎంఈపీని 300 డాలర్లుగా నిర్ణయించారు. మరోవైపు, ధరల తగ్గింపు లక్ష్యంగా బుధవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని.. * ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి చేర్చారు. తద్వారా వాటి లభ్యత పెరగడంతో పాటు, వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమవుతుంది. బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడం సాధ్యమవుతుంది. చట్టప్రకారం ఎంత మొత్తాల్లో నిల్వ చేయొచ్చనేది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. 1999 -2004 మధ్య కూడా ఉల్లి, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోనే ఉన్నాయి. * ఆహార భద్రత చట్టం అమల్లో లేని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసేందుకు అదనంగా 50 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలి. రేపు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కోసం తీసుకునే చర్యలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 4న ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం కూడా హాజరుకానుంది. రాష్ర్ట ఆర్థిక, పౌరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి, ఇతర అధికారులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ర్టంలో కూడా బియ్యంతోపాటు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. -
నిత్యావసర వస్తువుల చట్టం కిందకు ఉల్లి, బంగాళదుంపలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉల్లి ,బంగాళ దుంపలను నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. ఉల్లి,బంగాళ దుంపలను అక్రమంగా నిల్వఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 50 లక్షల టన్నుల బియ్యాన్ని దారిద్ర్య రేఖకు దిగువ,ఎగువ కుటుంబాలకు పంపిణి చేస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. -
ఆలు సాగుకు బ్రేక్
జహీరాబాద్, న్యూస్‌లైన్: ఆలుగడ్డ సాగుకు వర్షాలు అడ్డంకిగా మారాయి. పక్షం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆలు సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. వచ్చిన విత్తనాలు దెబ్బతింటున్నాయం టూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీ ర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో రైతులు ఆలుగడ్డ పంటను విస్తారంగా సాగు చేస్తుంటారు. నాలుగు దశాబ్దాలుగా ఈ పంటను సంప్రదాయకంగా పండిస్తున్నారు. ఏటా సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు ఆలు సాగుకు నోచుకోలేక పోయింది. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడమే ఇందుకు కారణం. మరో పక్షం రోజుల వరకు కూడా పంట సాగుకు భూములు అనుకూలించే పరిస్థితి లేదు. ఇప్పటికీ పొలాల్లో అధిక తేమ కన్పిస్తుంది. రేగడి భూముల్లో అయితే మరో 20 రోజుల వరకు కూడా పంటను సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. తుపాన్ ప్రభావం కూడా... పై-లీన్ తుపాన్ ప్రభావం కూడా జహీరాబాద్ ప్రాంతంపై ఉంటే పంట సాగును మరింత ముందుకు పొడిగించుకోక తప్పదని రైతులు భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 15వరకు సగం పంటను సాగు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆలుగడ్డ సాగుకు వాతావరణం అనుకూలంగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సాగు చేసినా దిగుబడులు రాని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ వర్షాలు వీడకపోవడంతో పంటను సాగు చేసుకునే విషయంలో కొంత మంది రైతులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఈ ఏడాది కూరగాయల ధరలు అధికంగా ఉండడంతో రైతులు ఆలు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలంగా లేనట్లయితే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపే అవకాశం లేక పోలేదంటున్నారు. దెబ్బతింటున్న విత్తనం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుంచి రైతులు ఆలుగడ్డ విత్తనాన్ని తెచ్చుకుంటున్నారు. కొందరు రైతులు మాత్రం దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం ఆలుగడ్డ విత్తనాన్ని కొనుగోలు చేసుకుని వచ్చిన రైతులకు సంబంధించిన విత్తనం దెబ్బతింటోంది. కోల్డ్ స్టోరేజీల నుంచి తెచ్చిన విత్తనాన్ని పక్షం రోజుల్లోపే సాగు చేసుకోవాలి. లేకపోతే విత్తనం నిల్వ ఉంచిన ప్రాంతంలోనే మొలకెత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. దెబ్బతిన్న విత్తనాన్ని సాగు చేసుకుంటే పంట దిగుబడులు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతటితో వర్షాలు ఆగిపోతే పంటను సాగు చేసుకున్నా కొంత ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. లేనట్లయితే నష్టాల పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. మండుతున్న విత్తనం ధర ఆలుగడ్డ విత్తనం ధర మండుతోంది. క్వింటాల్ విత్తనం ధర రూ.2,000 నుంచి రూ.2,400 వరకు పలుకుతోంది. దళారులు విత్తనాన్ని ఆగ్రాలో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. నేరుగా కొనుగోలు చేసుకునే రైతులకు మాత్రం క్వింటాల్ విత్తనం ధర రూ.1,800 అవుతోంది. వాతావరణం పొడిబారితే దళారులు విత్తనం ధరను మరింత పెంచే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేక పోవడంతో రైతులు ఆలుగడ్డ విత్తనాన్ని దళారుల వద్ద కొనుగోలు చేసుకోక తప్పడం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు రైతులకు అధిక ధరలకు విత్తనాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు