న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉల్లి ,బంగాళ దుంపలను నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు.
ఉల్లి,బంగాళ దుంపలను అక్రమంగా నిల్వఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 50 లక్షల టన్నుల బియ్యాన్ని దారిద్ర్య రేఖకు దిగువ,ఎగువ కుటుంబాలకు పంపిణి చేస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
నిత్యావసర వస్తువుల చట్టం కిందకు ఉల్లి, బంగాళదుంపలు
Published Wed, Jul 2 2014 7:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement