ఆ చెఫ్‌ హస్తకళ అదుర్స్‌..! ఆహా బంగాళదుంపతో ఇలా కూడా.. | French Chef Crafts Intricate Chains Using Potatoes | Sakshi
Sakshi News home page

ఆ చెఫ్‌ చేతులు అద్భుతం చేశాయి..! వావ్‌ బంగాళదుంపతో ఇలా కూడా..

Published Wed, Mar 12 2025 2:18 PM | Last Updated on Wed, Mar 12 2025 5:31 PM

French Chef Crafts Intricate Chains Using Potatoes

పాకశాస్త్ర నిపుణులు చేతులు అద్భుతమైన వంటలే కాదు..హస్తకళకు పెట్టింది పేరు అనొచ్చు. ఎందుకంటే రెస్టారెంట్‌లలో చెఫ్‌లు కేవలం వండటానికే పరిమితం కారు. వండిన ఐటెమ్స్‌ని అందంగా ప్లేటులో పెట్టడం కూడా ఓ కళ. అది ఉంటేనే మంచి చెఫ్‌గా పేరు తెచ్చుకోగలరు, ఆ రంగంలో రాణించగలరు. అయితే ఇదంతా ఎందుకంటే.?..చెఫ్‌లు కూరగాయలతో భలేగా అందమైన ఆకృతులు మలిచి మరీ ఫుడ్‌ని సర్వ్‌ చేస్తారని తెలిసిందే. ఆ కళా నైపుణ్యంతోనే ఈ చెఫ్‌ ఏకంగా జ్యువెలరీనే డిజైన్‌ చేశాడు. దేనితోనో తెలుసా..?..

అందరూ ఇష్టంగా తినే ఆలుతో ఈ ఫ్రెంచ్‌ చెఫ్‌ బ్రాస్‌లెట్‌ మాదిరి ఆకృతిని తయారు చేశాడు. చక్కగా టీ తాగేటప్పుడు చిప్స్‌లా తినే ఆలుతో చక్కగా ధరించే ఆభరణాన్ని డిజైన్‌ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ చెఫ్‌ ఆ బంగాళ దుంపను చెక్కి..చక్కగా దీర్ఘచతురస్రాకార ఆకృతులను చేశాడు. 

ఆ తర్వాత వాటిని లింక్‌ చైన్‌ మాదిరిగా రూపొందించాడు. అది ఆశాంత చూసేంత వరకు జ్యువెలరీ అని తెలియదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ చెఫ్‌ హస్తకళా నైపుణ్యానికి ఫిదా అవుతూ..ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరీ..

 

(చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement