jewelery
-
ఎగసి‘పడిన’ పసిడి.. వెండి
Gold Price Today: దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. మూడు రోజులుగా వరుసగా ఎగిసిన పసిడి రేట్లకు క్రితం రోజున బ్రేక్ పడగా నేడు (డిసెంబర్ 13) భారీగా తగ్గాయి. వారం రోజులుగా తగ్గుదల కోసం ఎదురుచూస్తున్న పసిడి కొనుగోలుదారులకు శుక్రవారం భారీ ఊరట కలిగింది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,870 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.550, రూ.600 చొప్పున క్షీణించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.72,450 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.79,020 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.550, రూ.600 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.72,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.78,870 వద్దకు వచ్చాయి.ఇదీ చదవండి: అకౌంట్లో క్యాష్.. ఎన్ని లక్షలు ఉండొచ్చు?వెండి పతనందేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.3000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.93,500 వద్దకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జ్యూవెల్ థీఫ్ - మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ఎం. శ్రీలేఖవిడుదల తేదీ: 08 నవంబర్ 2024సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. అందుకే సరికొత్త కంటెంట్‌తో దిగితే ప్రేక్షకులే సూపర్ హిట్ చేస్తారు. అలాంటి తరహాలో వచ్చిన తాజా చిత్రం జ్యూవెల్ థీఫ్(Beware of Burglar). ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారం నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. నేహ (నేహా) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. పట్టుబడి జైలుకు వెళ్లి వస్తాడు. కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని చాలెంజ్ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పనులు చేస్తూ, అతడిని బాగు చేస్తాడు. కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపినట్టు హత్య కేసులో ఇరుక్కుంటాడు. నమ్మించి భారీ దెబ్బ కొడతారు. ఇంతకీ కృష్ణను మోసం చేసింది ఎవరు? ఊహించని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హత్య కేసు నుంచి బయటపడతాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..జ్యూవెల్ థీఫ్ అనే టైటిల్ వినగానే ఇదేదో దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. అలాంటిదే అయినప్పటికీ ఇందులో ప్రేమకథను కూడా చూపించారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం చూపించారు. పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గానే వచ్చినప్పటికీ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు.అయితే సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుగుతుంది. కథను తాను అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..హీరో కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డాన్స్, మేనరిజం, హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ తన గ్లామర్, ఫర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులైన ప్రేమ, అజయ్ కథకు తమదైన నటనతో అలరించారు. ఇక పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
హత్రాస్ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్‌లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్‌లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. -
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
-
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..
అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి. వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలలోనూ, ఇమిటేషన్ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి. మొఘలాయ్ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూసలు, రత్నాలు వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి. ఆధునికత... స్నేక్, రౌండ్ స్టైల్లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్ మోడ్రన్ స్టైల్‌కి అదనపు హంగుగా అమరుతున్నాయి. ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్! -
జోయాలుక్కాస్ చైర్మన్‌కు ప్రత్యేక పురస్కారం
హైదరాబాద్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్ జ్యువెలరీ కానె్ఫడరేషన్(సీఐబీజేఓ) జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్ పాల్ అలుక్కాస్.. చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. సప్లై చైన్‌లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్ జ్యువెలరీ కాన్ఫెడరేషన్ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్‌అలుక్కాస్ తెలిపారు. -
కారట్‌లేన్‌లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్‌లేన్‌లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్‌లేన్‌లో తమ వాటా 98.28 శాతానికి జంప్‌చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్‌కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్‌లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్‌గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్‌నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్‌లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
చందానగర్ నగల దుకాణంలో భారీ చోరీ..
హైదరాబాద్: చందానగర్‌లోని నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధ రాత్రి సమయంలో నగల దుకాణం గోడకు కన్నం వేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణానికి ఆనుకోని ఓ వస్త్ర దుకాణం ఉంది. దీన్నే తమ ఆయుధంగా చేసుకున్న దుండగులు వస్త్ర దుకాణం గోడ నుంచి నగలు దుకాణానికి కన్నం వేశారు. అనంతరం దుకాణంలో చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని.. సీసీటీవీ ఆధారంగా నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదీ చదవండి: నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి -
ట్వింకిల్ ట్వింకిల్ సూపర్‌స్టార్
మహేష్ బాబు–నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కూతురు సితార న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసి నెటిజనులను కనువిందు చేసింది. ఒక జ్యుయెలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ‘సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫైర్ క్రాకర్’ అంటూ మహేష్‌బాబు సితార చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘పదాలలో చెప్పలేని సంతోషం ఇది. కీప్ షైనింగ్ మై సూపర్ స్టార్’ అంటూ స్పందించింది నమ్రతా శిరోద్కర్. చిన్న వయసులోనే యూ ట్యూబ్ చానల్ మొదలు పెట్టి ‘ఆహా!’ అనిపించిన సితార చక్కని డ్యాన్సర్ కూడా. ‘ఫ్రోజెన్–2’ సినిమా తెలుగు వెర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్–వోవర్ ఇచ్చింది. జ్యుయలరీ బ్రాండ్ ‘పీఎంజే’కు సితార బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో యంగెస్ట్ స్టార్ కిడ్‌గా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. -
ఈ విషయంలో మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా 'సితారా పాప'కు గుర్తింపు
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తనయ సితార సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఫొటోషూట్, విహార యాత్రలు, వేడుకలు.. ఇలా తాను ఎంజాయ్ చేసిన వాటన్నింటి వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేశ్ నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తుంటోంది. కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ వద్ద సీతార కొద్ది రోజులుగా డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్) తాజాగా సాయిపల్లవి నటించిన లవ్స్టోరీలోని సారంగదరియా సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. తన పెర్ఫార్మెన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సితార డాన్స్ వీడియోకు కేవలం గంట సమయంలోనే దాదాపు లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం. టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో సితార చాలా డిఫరెంట్.. ఇప్పటికే తను జ్యూయెలరీ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసింది. దీంతో యాడ్ కోసం అతి పెద్ద సంస్థకు సైన్ చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా నిలిచింది. అందుకు గాను సితార భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి అయినట్లు సమాచారం. దీంతో మా సితార పాప మల్టీ టాలెంటేడ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. Sitara Papa New Dance Video She is really a Rock Star💫 pic.twitter.com/xQlay0b07B — Srinadh (@Srinadhdhfm) June 15, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?) -
మేలో తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు
ముంబై: రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 11 శాతం తగ్గాయి. రూ.22,693 కోట్ల విలువైన ఎగమతులు నమోదయ్యాయి. 2022 మే నెలలో రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ.25,413 కోట్లుగా ఉంది. రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీఏఈపీసీ) ఈ వివరాలు వెల్లడించింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు 12 శాతానికి పైగా తగ్గాయి. వీటి విలువ రూ.14,190 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ రూ.16,154 కోట్లుగా ఉండడం గమనార్హం. ల్యాబ్‌లో తయారైన వజ్రాల ఎగుమతుల విలువ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం తగ్గి రూ.1,986 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్, మే నెలల్లో వీటి ఎగుమతుల విలువ రూ.2,500 కోట్లుగా ఉంది. మే నెలకు సంబంధించి బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 7 శాతానికి పైగా పెరిగి రూ.5,705 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.5,318 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో రూ.1,173 కోట్లు విలువ చేసే వెండి ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు రూ.3,729 కోట్లతో పోలిస్తే 68 శాతం క్షీణించాయి. -
వెబ్ సిరీస్ చూసి ముగ్గురు మిత్రుల దోపిడీ యత్నం
కోరికలనేవి అందరికీ ఉంటాయి. అయితే అవి తీరనివిగా మారినప్పుడు కొందరు పెడదారి పడుతుంటారు. కోరికలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతుంటారు. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్నోకు చెందిన ముగ్గురు స్నేహితులకు బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు రూ. 25 వేలు అవసరం అయ్యాయి. వారు చూసిన ఒక వెబ్ సిరీస్‌లోని కథనాన్ని అధారంగా చేసుకుని దోపిడీకి పథకం వేసుకున్నారు. తరువాత వీరు ముఖానికి ముసుగులు ధరించి స్థానికంగా ఉన్న ఒక జ్యూయలరీ దుకాణానికి వెళ్లారు. తరువాత వారు ఒక తుపాకీ తీసి, దుకాణం యజమానిని బెదించారు. అయితే వారి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణం యజమాని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీని ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిందితులలో ఇద్దరు ఖదరా, ఒకరు మండియావ్ ప్రాంతానికి చెందినవారన్నారు. వీరిలో ఇద్దరు మాస్క్ ధరించారని, ఒకరు రుమాలు ముఖానికి చుట్టుకున్నాడన్నారు. మే 30 వీరు స్థానికంగా ఉన్న మహేశ్వరి జ్యూయలర్స్‌లో దోపిడీకి ప్రయత్నించారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని పట్టుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించామని, వారి దగ్గర నుంచి నంబరు ప్లేటులేని స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు -
‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ఆభరణాల శ్రేణి
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్లైట్లు ఉన్నాయి. అరుదైన ఈ కలెక్షన్‌ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. -
బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
బంగారు నగలు కొనేవారికి ముఖ్యమైన వార్త ఇది. బంగారు ఆభరణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయించేందుకు వీలు ఉండదు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచనను ప్రభుత్వం 18 నెలల క్రితమే బయటపెట్టింది. తాజాగా మార్చి 31 తర్వాత హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) లేని బంగారు ఆభరణాలను విక్రయించేందుకు అనుమతించబోమని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు అంకెలు, ఆరు అంకెలు ఇలా హాల్‌మార్కింగ్ విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్‌మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది లేకుండా బంగారం లేదా బంగారు నగలు విక్రయించేందుకు వీలుందడదు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు హెచ్‌యూఐడీ అంటే ఏమిటంటే.. హెచ్‌యూఐడీ అంటే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇది ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ అంకెల్లో ఇంగ్లష్ అక్షరాలతో పాటు సంఖ్యలు కూడా ఉంటాయి. దీంతో మనం కొలుగోలు చేసిన బంగారం ప్రామాణికత, స్వచ్ఛత తెలుస్తుంది. హెచ్‌యూఐడీ కోడ్ ఉంటే నగల వ్యాపారులు వినియోగదారులను మోసం చేయలేరు. ప్రస్తుతం దేశంలో 1338 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
కొరియర్ చేసేందుకు వెళ్తుండగా.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో గాయపరిచి..
సాక్షి, రాంగోపాల్‌పేట్: కొరియర్లో పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే గోల్డ్, డైమండ్ నగలను తీసుకెళుతున్న యవకుడి కళ్లల్లో కారంకొట్టి, కత్తితో దాడి చేసి నగలను దోచుకెళ్లిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ మారేడుపల్లి రైల్వే కాలనీకి చెందిన సతీష్ కుమార్ సైనీ పాట్ మార్కెట్లో జై మాతా లాజిస్టిక్ పేరుతో కొరియర్ నిర్వహిస్తూ బంగారు నగలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. అతడి వద్ద పవన్‌కుమార్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పవన్‌కుమార్ జీరాలోని శ్రీ జై అంబే కొరియర్స్ నుంచి రూ.8.65 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. అనంతరం హయత్‌నగర్‌లోని శ్రీ రాధే డైమండ్స్‌కు వెళ్లి రూ.18,47,472 విలువైన 148.492 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను తీసుకుని బైక్‌పై పాట్‌మార్కెట్‌కు బయలుదేరాడు. ఈ ఆభరణాలను ముంబైకి పంపాల్సి ఉంది. రాత్రి 9.45 ప్రాంతంలో పవన్‌కుమార్ ఆర్పీరోడ్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి కళ్లలో కారంపొడిని చల్లారు. అయితే అతను హెల్మెట్ పెట్టుకోవడంతో కారంపొడి కళ్లలో పడలేదు. దీంతో అప్రమత్తమైన పవన్‌కుమార్ వేగంగా బైక్‌ను ముందుకు నడిపించాడు. అదే సమయంలో సిటీలైట్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో ట్రాఫిక్ ఆగిపోయింది. హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆటోను ఢీకొట్టడంతో అతను వాహనంతో సహా కిందపడిపోయాడు. దీంతో వెనక నుంచి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వాహనం దిగి పవన్‌కుమార్ దగ్గర ఉన్న బ్యాగును లాక్కునేందుకు యత్నించగా అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతను కత్తితో పవన్‌కుమార్ ఎడమవైపు చేతిపై పొడిచి బైక్‌పై పరారయ్యాడు. ట్రాఫిక్, వాహనాల మధ్య క్షణాల్లో జరిగిపోయింది. గాయపడిన పవన్‌కుమార్ యజమానికి సమాచారం అందించడంతో అతను మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలోకు తరలించారు. ప్రస్తుతం పవన్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నాగోల్‌లో బంగారం షాపు యజమానిపై కాల్పులకు తెగబడి దోపిడీకి యతి్నంచిన గ్యాంగుకు దీనికి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
Fashion: బ్రాండ్ వాల్యూ.. ప్రియాంక మోహన్ కట్టిన చీర ధర 98 వేలు!
ఫొటోలో ఉన్న నటి తెలుసు కదా.. నాని ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఇలా సంప్రదాయ కట్టు.. ఫ్యాషన్ లుక్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది. అలా ఆమెను నిలబెట్టిన అవుట్ ఫిట్, జ్యూయెలరీ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్. తమలోని ఫ్యాషన్ స్పృహ, భారతీయ హస్తకళల పట్ల తమకున్న మక్కువ, గౌరవాలకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. భారతీయ సంప్రదాయ నేత కళకు ఆధునిక ఆకృతులు, రంగులు, హంగులు అద్దుతున్నారు. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా బ్రాండ్ పేరుకు దేశీయమైనా ఫ్యాషన్ రంగంలో అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంటోంది. ధరలనూ అంతే స్థాయిలో అంచనా వేసుకోవచ్చు. ఆన్లైన్లో లభ్యం. ఏవీఆర్ స్వర్ణ మహల్ దక్షిణ భారతదేశానికి చెందిన జ్యూయెలరీ బ్రాండ్ ఇది. దీని ఎంబ్లమ్లో రెండు హంసలు ఉంటాయి. నగల స్వచ్ఛత, నాణ్యతకు గుర్తుగా. సరికొత్త డిజైన్సే కాదు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. చెన్నై, సేలం, బెంగళూరు మొదలు దక్షిణ భారతదేశంలోని పదహారు ప్రాంతాల్లో పద్దెనిమిది షోరూమ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్‌కు. నాణ్యత, డిజైన్లను బట్టి ధరలు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: జేడ్ బై మోనికా అండ్ కరిష్మా ధర: రూ. 98,800 జ్యూయెలరీ బ్రాండ్: ఏవీఆర్ స్వర్ణ మహల్ ధర: నగల డిజైన్, నాణ్యతను బట్టి నేను వెరీ సింపుల్.. నార్మల్.. హ్యాపీ హ్యూమన్ బీయింగ్‌ని. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఇవే నన్ను గ్రేస్‌ఫుల్‌గా ఉంచుతున్నాయనుకుంటా! – ప్రియాంక మోహన్ -దీపిక కొండి -
నీరు కావాలని ఇంట్లోకి ప్రవేశించి.. టీవీ సౌండ్ పెంచి.. కత్తితో
అనంతపురం క్రైం: నగర శివారులోని ఒక ఇంటి వద్దకు అపరిచిత వ్యక్తి వెళ్లాడు. దాహం వేస్తోంది.. నీరివ్వండని ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి బంగారు గొలుసు లాక్కుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... కక్కలపల్లి కాలనీ సమీపంలోని రజాక్ ఫంక్షన్ హాలు వెనుకవైపున ఎల్.రామసుబ్బారెడ్డి, జి.విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. రామసుబ్బారెడ్డి కనగానపల్లి మండలం కొండంపల్లిలో ఉపాధ్యాయుడిగాను, విజయ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల పాఠశాలలో హెచ్‌ఎంగాను విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు వీరిద్దరూ విధులకు వెళ్లిపోయారు. కుమార్తె దీక్షితను స్కూలుకు పంపించారు. ఇంట్లో రామసుబ్బారెడ్డి తల్లి ఎల్.నారాయణమ్మ (88 సంవత్సరాలు) ఉంది. ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎవరంటూ నారాయణమ్మ లోపలినుంచే ప్రశ్నించగా.. మీ అబ్బాయికి డబ్బు ఇవ్వాల్సి ఉందని అతడు సమాధానమిచ్చాడు. అయితే అబ్బాయికే ఫోన్ చేయి అంటూ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ఫోన్ తగల్లేదని చెప్పాడు. అయితే పై అంతస్తులో మా బంధువు ప్రశాంత్ ఉంటాడు అతడిని కలువు అని తెలిపింది. సరే అని బయటకు వచ్చి మొదటి ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కి.. అక్కడ ఎవరూ లేరని కిందకు వచ్చాడు. మంచి నీరు కావాలని.. పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అపరిచిత వ్యక్తి మంచి నీరు కావాలని కోరగా.. నారాయణమ్మ వాకర్ సాయంతో మెల్లగా తలుపు తీసింది. అలా లోనికి వెళ్లిన తర్వాత టీవీ ఆన్ చేయాలని కోరాడు. ఆ తర్వాత రిమోట్ తీసుకుని తనే సౌండ్ పెంచాడు. అలా ఆమాటా.. ఈమాటా మాట్లాడుతూ ఎవరైనా వస్తున్నారా? అని అప్పుడప్పుడు బయటకు వచ్చి తొంగి చూశాడు. అలా బయటకు వెళ్లి బైక్ బ్యాగ్‌లో ఉంచుకున్న కత్తిని తీసుకొచ్చి ఇంట్లోని వృద్ధురాలి నారాయణమ్మ మెడపై పెట్టి అరిస్తే చంపుతానని బెదిరించాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పై పోర్షన్లో ఉన్న వివాహిత నాగలక్ష్మి కిందకు వచ్చింది. జరిగిన విషయం తెలుసుకుని రామసుబ్బారెడ్డి దంపతులకు సమాచారం అందించింది. రామసుబ్బారెడ్డి డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసుల అప్రమత్తం బంగారు గొలుసు దోపిడీ విషయం తెలియగానే డీఎస్పీ వీరరాఘవరెడ్డి జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల వారిని సెట్లో అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రం ప్రవేశమార్గాలు, ప్రధాన కూడళ్లలో వాహనాల తనీఖీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్, తదితర తనిఖీలు చేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి పది నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) 32.37 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జరిగాయి. 2020–21 ఇదే కాలంతో పోలి్చతే (30.40 బిలియన్ డాలర్లు) ఈ విలువ 6.5 శాతం అధికం. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ఒకటి ఈ అంశాలను తెలిపింది. ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతుల రంగం కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో రూపాయిల్లో ఎగుమతుల విలువ 12.28 శాతం పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరితే, డాలర్ల రూపంలో 6.5 శాతం ఎగసి 32.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి మధ్య ఈ విలువలు వరుసగా రూ.2.14 లక్షల కోట్లు, 30.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► భారత్ ఎగుమతులకు తొలి మూడు ప్రధాన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (41.50 శాతం), బెల్జియం (15.81 శాతం), జపాన్ (12.20 శాతం) ఉన్నాయి. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో ఆ దేశానికి భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మరింత పెరుగుతాయి. ► మ్తొతం మధ్యప్రాచ్యం మార్కెట్లోకి ప్రవేశించడానికి యూఏఈ ప్రధాన కేంద్రంగా (గేట్‌వే) ఉంది. ఈ నేపథ్యంలో భారత్–యూఏఈ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం బహుళ ప్రయోజనాలను చేకూర్చుతుంది. సుంకాలు రద్దు చేయాలి భారతదేశం నుండి బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులపై యూఏఈలో 5 శాతం దిగుమతి సుంకాన్ని రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రకటన కోరింది. ప్రకటన ప్రకారం, సుంకాలు లేని పరిస్థితుల్లో భారత్ నుంచి యూఏఈకి ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ, గోల్డ్ స్టడెడ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ 2023 నాటికి 10 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.74,000 కోట్లు) చేరుతుంది. భారత్ ప్లెయిన్ గోల్డ్ ఆభరణాల ఎగుమతుల్లో యూఏఈ వాటా 80 శాతం. స్టడెడ్ జ్యూయలరీకి సంబంధించి ఈ వాటా 20 శాతంగా ఉంది. కాగా, బంగారం ఆభరణాల ఎగుమతుల విలువ 2021 ఏప్రిల్–2022 జనవరి మధ్య 24.24 శాతం క్షీణించి, 7.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్లెయిన్ గోల్డ్ జ్యూయలరీ ఎగుమతుల విలువ కూడా భారీగా 56 శాతం పడిపోయి 3.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!
Jewellery Made From Breast Milk: ఇంతవరకు తల్లిపాల ప్రాధాన్యత గురించి మాత్రమే తెలుసు. అంతేకాదు పుట్టిన నవజాత శిశువులకు తొలి ఆరునెలల తల్లిపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతేందుకు తల్లిపాల వారోత్సవాలు లేదా మథర్ బ్రెస్ట్ మిల్క్ డే అని ఒక రోజు కూడా ఏర్పాటు చేశారు. పైగా తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేద్దాం అంటూ విన్నూతన పద్ధతులు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు నిపుణులు. కొన్ని దేశాల ఇప్పటికే ఆ పద్ధతులను అవలంభించాయి కూడా. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలతో విలువైన ఆభరణాలను కూడా తయారుచేస్తున్నారట. అంతేకాదు ఇది తల్లులు తమ పిల్లతో గల విశిష్ట అనుబంధానికి గుర్తుగా రూపొందిస్తున్నారట!. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన అల్మా పార్టిడా తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. అయితే అప్పుడే ఆమెకు తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునే మార్గం కోసం అన్వేషించింది. అంతేకాదు ఇందుకోసం ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్‌సేక్స్ బై గ్రేస్ గురించి తెలుసుకుంది. ఇక ఆమె వెంటనే తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్‌సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఈ మేరకు ఒక నెల తర్వాత ఆ కంపెనీ ఆమె చేతికి మిల్కీ-వైట్ గుండె ఆకారంలో లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషించడమే కాక తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్ డ్రాప్‌గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని పేర్కొంది . ఈ మేరకు కీప్‌సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ...తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారు. నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాతే నాకు చాలా ఆర్డర్లు రావడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడూ విపరీతమైన నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్లు వచ్చాయి" అని న్యూయార్క్ టైమ్స్‌కి తెలిపింది. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి. అంతేకాదు సదరు మహిళ అల్మా చేతికి జ్యువెలరీని ధరించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) View this post on Instagram A post shared by Sarah | Breastmilk Jewelry (@keepsakesbygrace) -
Nita Ambani Expensive Things: రూ.100 కోట్ల కారు, డ్రైవర్ జీతం ఎంతంటే?
-
మంగళసూత్ర యాడ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
వ్యాపారంలో ఏ వస్తువుకయినా ప్రచారం ఎంతో ముఖ్యం. అందుకే కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను క్యాంపెయిన్ కోసం వెచ్చిస్తుంటాయి. అడ్వర్టైజింగ్ సంస్థలు సైతం ఎంతో జాగ్రత్తగా యాడ్స్‌ని రూపొందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి క్రియేటివిటీ అదుపు తప్పుతుంది. దీని వల్ల అసలుకే ఎసరు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇంటిమేట్ జ్యూయల్లరీ యాడ్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి చిక్కుల్లో పడ్డారు. స్టైల్ఐకాన్గా పేరున్న ఆయన ఇటీవల ఆయన రూపొందించిన యాడ్ క్యాంపెయిన్ బెడిసి కొడుతోంది. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాయల్ బెంగాల్ ఇంటిమేట్ ఫైన్ జ్యూయల్లరీ థీమ్‌తో యాడ్ క్యాంపెయిన్ని సబ్యసాచి ముఖర్జి ఇటీవల ఫోట్ షూట్ నిర్వహించారు. హెటిరో సెక్సువల్, సేమ్ సెక్సువల్ మోడల్స్‌ని ఉపయోగిస్తూ ఈ షూట్‌ని పూర్తి చేశారు. అనంతరం క్యాంపెయిన్‌లో భాగంగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్యసాచి ముఖర్జీ పోస్ట్ చేశారు. ఇందులో రాయల్ బెంగాల్ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమయ్యాయి. No! This is no lingerie or C0nd0m Ad. This is Sabyasachi Mangalsutra Ad. Ultra Woke #Sabyasachi are so creatively bankrupt that they have to use semi naked models for a Mangalsutra ad.#BoycottSabyasachi #Femina pic.twitter.com/dim9YpJhgF — श्रद्धा | Shraddha 🇮🇳 (@immortalsoulin) October 27, 2021 How nonsense #Sabyasachi think of for such a vulgur ads of #Mangalsutra ? Leftists minded peoples are continuously targeting Hindu rituals & tradition by their toxic thoughts in making Ads, Pictures etc. ऐसे "सुवरों" के लिए गाली भी छोटी पड़ेगी. Has @ascionline notice this. pic.twitter.com/KyfEx0PKpX — Hiren Pawar. (@HirenPawar1) October 29, 2021 Friend : How does a plump woman standing with an ill fitting bra, with a Jaguar on a sling convey "WHAT WOMAN WANTS"???? Me : IT'S HER CHOICE!! You've no right to make fun of her .What if she doesn't wear any????#Sabyasachi pic.twitter.com/ne74DKuDwC — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) October 29, 2021 ఇదేమైనా లింగరీనా ? బుధవారం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు అయిన మరుక్షణం నుంచే నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్నారు. లింగరీ, కండోమ్ యాడ్ కాదు కదా .. మంగళ సూత్ర యాడ్‌కి ఇలాంటి ఫోటో షూట్ అవసరమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు న్యూడిటీ చాటున ప్రమోషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహం వెల్లువలా పోటెత్తుతోంది. అందులో కొందరి అభిప్రాయం ఇలా ఉంది - ఇది మంచి పద్దతి కాదు. ఇందులో జ్యూయల్లరీ ఎక్కడుంది - మీరు అసలు ఏం ప్రచారం చేయాలనుకున్నారు ? ఇలాంటి జ్యూయల్లరీని ఎవరైనా ధరిస్తారా ? ప్రచారం నిర్వహించేప్పుడు జాగ్రత్తగా ఉండండి - జ్యూయల్లరీకి ఇలాంటి యాడ్ చేసినందుకు సిగ్గుపడాలి. ఈ జ్యూయల్లరీని నేను ఎప్పుడు కొనను - జ్యూయల్లరీ రూపొందించడం ఎంతో నేర్పుతో కూడిన కళ. దాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదు - ఫోటో కింద జ్యూయల్లరీ క్యాంపెయిన్ అనే క్యాప్షన్ చూడకుంటే ఈ ఫోటోలు బీగ్రేడ్ మూవీ పోస్టర్లలా ఉన్నాయి. - సబ్యసాచి అసలు నీకేమయ్యింది. ఇలా ఎవరైనా మంగళసూత్రం అమ్మకాల ప్రకటన చేస్తారా ? మంగళసూత్ర అంటే ఇది మరికొందరు నెటిజన్లు మంగళ సూత్రం ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చాలా మంది మంగళసూతం ఎలా ధరిస్తారో, ఎలా ధరించాలో, ఎలాంటి ఫోటోలు తీయాలో చెబుతూ ట్విట్టర్ , ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సబ్యసాచిని ట్యాగ్ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. Mangalsutra looks like this #Sabyasachi It's not a random piece of fashion jewellery, it indicates the love and commitment the husband and wife have towards each other. pic.twitter.com/HB3r4Aa4A4 — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 27, 2021 #Mangalasutra is NOT a "tiny intimate Jewelry" to be hidden. It's Long for whole world to see. It's PIOUS It's PRIDE It's Worn with Attitide (Ghamand) of being a Sanatani Hindu Woman ! pic.twitter.com/InN90Uiddp — 🍁 Sanatani Yoddha (@VidyaSanatani) October 27, 2021 -
రిలయన్స్ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్...
సంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ తదితర సంస్థలకు పోటీగా రిలయన్స్ రిటైల్ కూడా రంగంలోకి దిగుతోంది. కొత్తగా అవంత్రా పేరిట స్టోర్స్ చెయిన్‌ను ప్రారంభించనుంది. ప్రైవేట్ లేబుల్స్‌ను విక్రయించడంతో పాటు ప్రాంతీయంగా వీవర్ క్లస్టర్లతో పాటు నల్లి సిల్క్స్ .. పోతీస్ వంటి థర్డ్ పార్టీ బ్రాండ్లతో కూడా అవంత్రా జట్టుకట్టనుంది. ఆభరణాలు, యాక్సెసరీలు, టైలరింగ్ సరీ్వసులు కూడా అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి స్టోరు బెంగళూరులో ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించవచ్చని వివరించాయి. ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ సంప్రదాయ దుస్తుల్లోకి అడుగుపెట్టడం, ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా సవ్యసాచి, తరుణ్ తహిలియాని వంటి దేశీ డిజైనర్ వేర్ బ్రాండ్స్‌లో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ అవంత్రా స్టోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.