చెవికింపులు | ear rings | Sakshi
Sakshi News home page

చెవికింపులు

Published Thu, Mar 20 2014 2:20 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

చెవికింపులు - Sakshi

చెవికింపులు

సంపెంగ వంటి ముక్కుకేనా మేకప్పు..? సంగతులెన్నో వినే చెవుల మాటేమిటి?! అనుకున్నారేమో డిజైనర్లు చారడేసి ఆభరణాలను చెవుల అందాన్ని పెంచడానికి సృష్టిస్తున్నారు. అతివలు మాత్రం ఊరకుంటారా.. వాటిని అలంకరించి మురిసిపోతుంటారు. అయితే వాటి బరువుకు ఇబ్బంది పడుతుంటారు. ఆభరణాలంటే ఎంత మోజు ఉన్నా చెవిని కుట్టించుకోవాలంటే జంకుతుంటారు.

ఇక నుంచి అలాంటి ఇబ్బందేమీ లేకుండా... అంటే, చెవిని కుట్టకుండానే తొడుక్కునే అందమైన ఆభరణాలను మీరూ ధరించవచ్చు. ఈ ఫొటోలలో కనిపిస్తున్న ఆభరణాలు అవే! హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పరిచయమైన ఈ ఇయర్ కఫ్స్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్. బంగారపువి మాత్రమే కాదు సిల్వర్ కఫ్స్ అందుబాటులోకి రావడంతో ఆధునిక దుస్తులు ధరించినప్పుడూ వీటిని అలంకరించుకోవచ్చు.

చెంపకు చారడేసి కళ్లు ఎంత అందమో! చెవులకు చాటలంత ఆభరణాలూ అంతే అందం అని వాదించేవారికి చక్కని అవకాశం ఈ ఆధునిక కర్ణాభరణాలు. మీ దగ్గరలోని మార్కెట్లో ఇవి లభించకపోతే ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement