మంగళసూత్ర యాడ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు | Ace Designer Sabyasachi Trolled For Viral Mangalsutra Campaign | Sakshi
Sakshi News home page

మంగళసూత్ర యాడ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Published Fri, Oct 29 2021 2:24 PM | Last Updated on Sat, Oct 30 2021 7:41 AM

Ace Designer Sabyasachi Trolled For Viral Mangalsutra Campaign - Sakshi

వ్యాపారంలో ఏ వస్తువుకయినా ప్రచారం ఎంతో ముఖ్యం. అందుకే కార్పొరేట్‌ కంపెనీలు వేల కోట్ల రూపాయలను క్యాంపెయిన్‌ కోసం వెచ్చిస్తుంటాయి. అడ్వర్‌టైజింగ్‌ సంస్థలు సైతం ఎంతో జాగ్రత్తగా యాడ్స్‌ని రూపొందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి క్రియేటివిటీ అదుపు తప్పుతుంది. దీని వల్ల అసలుకే ఎసరు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇంటిమేట్‌ జ్యూయల్లరీ యాడ్‌. 

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జి చిక్కుల్లో పడ్డారు. స్టైల్‌ఐకాన్‌గా పేరున్న ఆయన ఇటీవల ఆయన రూపొందించిన యాడ్‌ క్యాంపెయిన్‌ బెడిసి కొడుతోంది. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆయన్ని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

 

రాయల్‌ బెంగాల్‌
ఇంటిమేట్‌ ఫైన్‌ జ్యూయల్లరీ థీమ్‌తో యాడ్‌ క్యాంపెయిన్‌ని సబ్యసాచి ముఖర్జి ఇటీవల ఫోట్‌ షూట్‌ నిర్వహించారు. హెటిరో సెక్సువల్‌, సేమ్‌ సెక్సువల్‌ మోడల్స్‌ని ఉపయోగిస్తూ ఈ షూట్‌ని పూర్తి చేశారు.  అనంతరం క్యాంపెయిన్‌లో భాగంగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్యసాచి ముఖర్జీ పోస్ట్‌ చేశారు. ఇందులో రాయల్‌ బెంగాల్‌ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమయ్యాయి.

ఇదేమైనా లింగరీనా ?
బుధవారం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు అయిన మరుక్షణం నుంచే నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్నారు. లింగరీ, కండోమ్‌ యాడ్‌ కాదు కదా .. మంగళ సూత్ర యాడ్‌కి ఇలాంటి ఫోటో షూట్‌ అవసరమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు న్యూడిటీ చాటున ప్రమోషన్‌ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహం వెల్లువలా పోటెత్తుతోంది. అందులో కొందరి అభిప్రాయం ఇలా ఉంది
- ఇది మంచి పద్దతి కాదు. ఇందులో జ్యూయల్లరీ ఎక్కడుంది
- మీరు అసలు ఏం ప్రచారం చేయాలనుకున్నారు ? ఇలాంటి జ్యూయల్లరీని ఎవరైనా ధరిస్తారా ? ప్రచారం నిర్వహించేప్పుడు జాగ్రత్తగా ఉండండి
- జ్యూయల్లరీకి ఇలాంటి యాడ్‌ చేసినందుకు సిగ్గుపడాలి. ఈ జ్యూయల్లరీని నేను ఎప్పుడు కొనను
- జ్యూయల్లరీ  రూపొందించడం ఎంతో నేర్పుతో కూడిన కళ. దాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదు
- ఫోటో కింద జ్యూయల్లరీ క్యాంపెయిన్‌ అనే క్యాప్షన్‌ చూడకుంటే ఈ ఫోటోలు బీగ్రేడ్ మూవీ పోస్టర్లలా ఉన్నాయి.
- సబ్యసాచి అసలు నీకేమయ్యింది. ఇలా ఎవరైనా మంగళసూత్రం అమ్మకాల ప్రకటన చేస్తారా ?

మంగళసూత్ర అంటే ఇది
మరికొందరు నెటిజన్లు మంగళ సూత్రం ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ ట్వీట్లు చేశారు.  చాలా మంది మంగళసూతం ఎలా ధరిస్తారో, ఎలా ధరించాలో, ఎలాంటి ఫోటోలు తీయాలో చెబుతూ ట్విట్టర్‌ , ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో సబ్యసాచిని ట్యాగ్‌ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement