Photo Shoots
-
వెడ్డింగ్స్.. డెస్టినేషన్
పెళ్లి..చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఘనంగా పెళ్లిళ్లు చేయడం దక్షిణాది ప్రత్యేకత. అయితే కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో సెలబ్రెటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు మాత్రమే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు విదేశాలకు వెళ్లేవారు. అనంతర కాలంలో ఆ ఖర్చును భరించగలిగే ఆర్థికస్తోమత ఉన్నవారు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లోనే కాకుండా భారత్‌లోని జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్, ముస్సోరీ, గోవా వంటి ప్రదేశాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు వేదికలుగా ఆదరణ పొందాయి.కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాలు వీటికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకశాఖ నగరంతోపాటు, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఈ వేదికల్లో వేడుకలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితం నగరం వేదికగా జరిగిన అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ సమ్మేళనంలో ఆ దిశగా దృష్టి సారించారు. ..: సాక్షి, హైదరాబాద్ :.. డెస్టినేషన్వెడ్డింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు..ఖర్చెంత?సాక్షి, హైదరాబాద్వారసత్వ సంపదతోపాటు అద్భుత కట్టడాలకు కేంద్రం హైదరాబాద్ నగరం.ఇక్కడి చారిత్రాత్మక కట్టడం తారామతి బారాదరి వెడ్డింగ్ డెస్టినేషన్‌కు అడ్డాగా మారింది. ఎత్తయిన కొండపైన ఆనాటి రాజసం నింపుకున్న నిర్మాణ శైలి, వందలమంది ఒకేసారి కూర్చొని పెళ్లి వైభవం ఆస్వాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ వేడుక చేసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తారామతిలో ఐదు గంటల ఫొటో షూట్‌కు ఉదయం అయితే రూ.8000, సాయంత్రం నుంచి అయితే రూ. 10 వేలు చార్జ్ చేస్తున్నారు.పెళ్లిళ్లు, రిసెప్షన్ లేదా ఇతర ఫంక్షన్లకు ఓపెన్ ఏరియా అయితే రూ.70 వేలు, ఇండోర్ బాంకెట్ హాల్ అయితే లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఫుడ్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఇక్కడ ఫుడ్ కాకుండా బయట నుంచి తెప్పించుకోవాలనుకునేవారు అదనంగా రూ.11 వేలు చెల్లించాలి. నిర్వాహకులే స్వయంగా ఫుడ్ ఏర్పాటు చేసుకోవాలంటే...అదనంగా రూ.15 వేలు చెల్లించాలి. వేదిక, వసతుల అద్దె సాధారణంగానే ఉన్నా, ఆకర్షణీయమైన అలంకరణ, ఖరీదైన వంటకాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ పెళ్లిళ్లకు కనీసం పాతిక లక్షల పైనే ఖర్చు పెడుతున్నారు.తారామతి బారాదరి, ఫలక్‌నుమా ప్యాలెస్..⇒ నగరంలోని ‘ఫలక్‌నుమా ప్యాలెస్’ కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయితో ఖ్యాతి గడించిన విలాసవంతమైన వేదిక. గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన సోదరి వివాహం ఇక్కడే జరిపించిన విష యం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్‌తోపాటు పలువురు వ్యాపారవేత్తలు వచ్చారు. మరెందరో ప్రముఖులు కూడా ఈ వేదికను వినియోగించుకున్నారు.అనంతగిరి హిల్స్..⇒ అటు అనంతగిరిహిల్స్ వేది కగా కూడా వివాహాల సంఖ్య పెరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపించి వందల మంది వేడు కల్లో పాల్గొనేలా సౌకర్యాలు అభివృద్ధి చేయడంతో పెళ్లిళ్లు, వెడ్డింగ్ షూట్లకు ఇక్కడ ఆదరణ పెరిగింది. ఇక్కడి ప్రకృతి పారవశ్యం నూతన జంటలకు ఆకర్షిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే పలు వెడ్డింగ్ షూట్ సెట్టింగ్ రిసా ర్టులూ వెలిశాయి. ఇక్కడ డెస్టినే షన్ వెడ్డింగ్‌లకు సాధార ణంగా 5 లక్షల పైనే ఖర్చు అవుతుందని అంచనా. అయితే, వీటిల్లో వెడ్డింగ్ ప్లానర్ల ఖర్చులే అత్యధికంగా ఉంటాయి. తమ అభిరుచికి తగ్గ ట్టుగా కేవలం సెట్టింగ్‌లకు లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. కొందరైతే సెట్టింగ్‌లకే కోటి రూపా యల దాకా ఖర్చు చేస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు.ఫ్యూచర్ ప్లాన్.. లక్నవరం వరంగల్‌కు సమీపంలోని లక్న వరం సరస్సు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు మరో ఫేవరెట్ స్పాట్ కానుంది. ఇక్కడ 17 నుంచి 20 దాకా ఐల్యాండ్లు ఉన్నాయని, వాటిని కూడా ఈ దిశగా అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని టూరిజం శాఖ ప్రతినిధి తెలిపారు. లక్నవరంలోని కాటేజె స్తో పాటు దీనికి దగ్గరలోనే వరంగల్ టూరిజం హోటళ్లు, రిసార్ట్లు ఉన్నాయి. తీసుకునే కాటేజీల సంఖ్య, అవసరానికి అనుగుణంగా సమీపంలోనే హరిత హోట ళ్లలో ఏర్పాటు చేసే సౌకర్యా లను బట్టి రూ. 3–5 లక్షల వరకు ఖర్చు అవుతుందని పర్యా టక అధికారులు చెబుతు న్నారు. వినూత్నమైన సెట్టింగులు, పూల అలంకరణలు, భోజన ఏర్పాట్లు ఇలా అన్నీ.. చేసే స్థాయిని బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. సోమశిల..ప్రముఖ పర్యాటక ప్రదేశం సోమశిలలో జరి గిన డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా అందరినీ ఆక ర్షించింది. ఇక్కడి డ్రోన్ షాట్లు ప్రకృతి పారవశ్యాన్ని చిత్రీ కరించిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే నాగార్జునసాగర్వంటి పలు పర్యాటక ప్రదే శాలు ఇలాంటి వినూత్న వివాహాల వేడుకలకు అద్భు త వేదికలుగా అవతరిస్తు న్నాయి. కాగా, ప్రస్తు తం కొద్ది మందికి మాత్రమే ఇలాంటి సౌక ర్యాలు అందు బాటులో ఉన్నా, వీటికున్న ఆదరణ దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తూ విదేశాలకు చెందిన వారిని సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు మన వైపు ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర పర్యా టక శాఖ అధికారులు చెప్పారు.వెలుగులోకి మరిన్ని డెస్టినేషన్ వేదికలుమన సంస్కృతీ సంప్ర దాయాలకు గౌరవిస్తూనే.. ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు మంచి వేదికలుగా వాడుకుంటున్నారు. ఈ మార్పు పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెంచడంతోపాటు వారి పెళ్లిని చిరకాల మధుర జ్ఞా్ఞపకంగా నిలుపుతుంది. ఈ ఆనవాయితీ ఇలానే కొనసాగితే మరి కొనేళ్లలో మరో పది వరకు డెస్టినేషన్ వేదికలు వెలుగులోకి వస్తాయి. అంతటి విశిష్టత కలిగిన కోటలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్లను సైతం ఆకర్షిస్తున్నాయి – అరవింద్, పర్యాటక నిపుణుడు -
కల్యాణం.. ప్రతి తంతూ కళాత్మకం
సాక్షి అమలాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇదో మధుర ఘట్టం. కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా! వివాహంలో నయనానందకరంగా సాగే ప్రతి తంతూ జీవితాంతం సుమధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలంటే కాస్త వెలుగు జిలుగులు అద్దాల్సిందే. పెళ్లంటే తాళిబొట్లు.. తలంబ్రాలు.. పూలదండలు.. ఆభరణాలు.. వేదమంత్రాలు.. సన్నాయి మేళాలు.. షడ్రుచుల భోజనాలే కాదు.. ఇప్పుడా సందడి సరికొత్త శోభను అద్దుకుంటోంది. ప్రతి తంతూ కళాత్మకంగా మారిపోతోంది. మనోఫలకంపై బలమైన ముద్ర వేస్తోంది. పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టంలో వాడే వస్తువులు, వాటి తయారీ వెనుక ఉన్న శ్రామికుల పనితనం.. చేయి తిరిగి నైపుణ్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఫొటో, వీడియో షూట్ల ప్రాధాన్యం పెరిగిన తరువాత పెళ్లిలో వాడే ప్రతి వస్తువునూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మూడు నెలల మూఢం కొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభ కాబోతోంది. ఈ తరుణాన వివాహ వస్తువులు తయారు చేసేవారు బిజీగా మారిపోయారు. ఎన్నో డెకరేషన్లు ► వధూవరుల మంగళ స్నానాలకు చేస్తున్న డెకరేషన్లే చిన్న సైజు పెళ్లిని తలపిస్తున్నాయి. పసుపు నీళ్లు వేసేందుకు అందాల జల్లెడ.. సప్తవర్ణ శోభితమైన బిందెలు.. మహారాజుల వైభవాన్ని గుర్తుకు తెచ్చే కంచు పాత్రలు.. వాటిలో పన్నీరు కలిపిన నీళ్లు.. అందులో తేలియాడే రంగురంగుల పూలతో కొత్త వన్నెలు అద్దుతున్నారు. ► బాసికాలు.. పెళ్లి కుమారునికి అలంకరించే మహారాజా తలపాగాలు.. సంప్రదాయ టోపీలు.. కాళ్లకు తొడిగే పాముకోళ్లు.. రోళ్లు.. రోకళ్లకు రకరకాల రంగులతో ముస్తాబులు.. పెళ్లి కుమార్తెకు కొత్తందాన్ని తెచ్చే అలంకరించే పూలజడలు.. ఖరీదైన జాకెట్లు.. చేతులకు కళాత్మక మెహందీలు.. ముఖానికి ఫేషియల్స్.. పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్లే బుట్ట.. గొడుగు.. ఇలా వివాహ వైభవంలో ఎన్నో నూతన ఆకర్షణలు బంధుమిత్రులను కట్టిపడేస్తున్నాయి. ► శాస్త్ర సమ్మతమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే.. వివాహ సమయంలో వధూవరుల మధ్య ఏర్పాటు చేసే తెరను సైతం అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాటి మీద సీతారాములు, అలమేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామి వంటి దేవతలను లేసు దారాల అల్లికలతో తీర్చిదిద్దుతూ.. ఆ సమయానికి దైవానుగ్రహం ప్రసరిస్తుందనే భావన కలిగిస్తున్నారు. ► వివాహ సమయంలో వధూవరుల చేతుల్లో పెట్టే కొబ్బరి బొండాలకు ముత్యాలు, పగడాలు, కెంపులతో కొత్త ఆకర్షణలు తీసుకువస్తున్నారు. ► సంప్రదాయ కర్పూర దండలు కొత్త రూపాల్లో కనువిందు చేస్తున్నాయి. ► తలంబ్రాలకు వాడే కొబ్బరి చిప్పలను సైతం అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. ► వధూవరులతో పాటు పెళ్లి తంతులో జరిగే ప్రతి కార్యక్రమానికీ వినియోగించే ప్రతి వస్తువునూ ఎంతో మంది అద్భుత ప్రతిభతో కళ్లు తిప్పుకోలేని రీతిలో ముస్తాబు చేస్తున్నారు. ఫొటో షూట్లు వచ్చాక ఆకర్షణకు ప్రాధాన్యం పెళ్లికూతుళ్ల ముస్తాబు నుంచి కార్ల డెకరేషన్ వరకూ ప్రతి దానికి అదనపు ఆకర్షణలు అద్దుతున్నారు. ఫొటోల కోసం ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. వధూవరుల అలంకరణే చిన్న సైజు పెళ్లిని తలపిస్తుంది. – శ్రీపతి ప్రకాష్, కల్వకొలను వీధి, అమలాపురం -
ఫొటోషూట్లకు కేరాఫ్ అడ్రస్ బీచ్‌రోడ్డు
-
మంగళసూత్ర యాడ్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
వ్యాపారంలో ఏ వస్తువుకయినా ప్రచారం ఎంతో ముఖ్యం. అందుకే కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను క్యాంపెయిన్ కోసం వెచ్చిస్తుంటాయి. అడ్వర్టైజింగ్ సంస్థలు సైతం ఎంతో జాగ్రత్తగా యాడ్స్‌ని రూపొందిస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి క్రియేటివిటీ అదుపు తప్పుతుంది. దీని వల్ల అసలుకే ఎసరు వస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఇంటిమేట్ జ్యూయల్లరీ యాడ్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి చిక్కుల్లో పడ్డారు. స్టైల్ఐకాన్గా పేరున్న ఆయన ఇటీవల ఆయన రూపొందించిన యాడ్ క్యాంపెయిన్ బెడిసి కొడుతోంది. మంగళసూత్ర పేరుతో సబ్యసాచి చేసిన పనేం బాగాలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాయల్ బెంగాల్ ఇంటిమేట్ ఫైన్ జ్యూయల్లరీ థీమ్‌తో యాడ్ క్యాంపెయిన్ని సబ్యసాచి ముఖర్జి ఇటీవల ఫోట్ షూట్ నిర్వహించారు. హెటిరో సెక్సువల్, సేమ్ సెక్సువల్ మోడల్స్‌ని ఉపయోగిస్తూ ఈ షూట్‌ని పూర్తి చేశారు. అనంతరం క్యాంపెయిన్‌లో భాగంగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్యసాచి ముఖర్జీ పోస్ట్ చేశారు. ఇందులో రాయల్ బెంగాల్ మంగళసూత్ర పేరుతో పోస్టు చేసిన ఫోటోలు వివాదానికి కారణమయ్యాయి. No! This is no lingerie or C0nd0m Ad. This is Sabyasachi Mangalsutra Ad. Ultra Woke #Sabyasachi are so creatively bankrupt that they have to use semi naked models for a Mangalsutra ad.#BoycottSabyasachi #Femina pic.twitter.com/dim9YpJhgF — श्रद्धा | Shraddha 🇮🇳 (@immortalsoulin) October 27, 2021 How nonsense #Sabyasachi think of for such a vulgur ads of #Mangalsutra ? Leftists minded peoples are continuously targeting Hindu rituals & tradition by their toxic thoughts in making Ads, Pictures etc. ऐसे "सुवरों" के लिए गाली भी छोटी पड़ेगी. Has @ascionline notice this. pic.twitter.com/KyfEx0PKpX — Hiren Pawar. (@HirenPawar1) October 29, 2021 Friend : How does a plump woman standing with an ill fitting bra, with a Jaguar on a sling convey "WHAT WOMAN WANTS"???? Me : IT'S HER CHOICE!! You've no right to make fun of her .What if she doesn't wear any????#Sabyasachi pic.twitter.com/ne74DKuDwC — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) October 29, 2021 ఇదేమైనా లింగరీనా ? బుధవారం ఈ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు అయిన మరుక్షణం నుంచే నెటిజన్లు సబ్యసాచిపై దుమ్మెత్తి పోస్తున్నారు. లింగరీ, కండోమ్ యాడ్ కాదు కదా .. మంగళ సూత్ర యాడ్‌కి ఇలాంటి ఫోటో షూట్ అవసరమా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు న్యూడిటీ చాటున ప్రమోషన్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహం వెల్లువలా పోటెత్తుతోంది. అందులో కొందరి అభిప్రాయం ఇలా ఉంది - ఇది మంచి పద్దతి కాదు. ఇందులో జ్యూయల్లరీ ఎక్కడుంది - మీరు అసలు ఏం ప్రచారం చేయాలనుకున్నారు ? ఇలాంటి జ్యూయల్లరీని ఎవరైనా ధరిస్తారా ? ప్రచారం నిర్వహించేప్పుడు జాగ్రత్తగా ఉండండి - జ్యూయల్లరీకి ఇలాంటి యాడ్ చేసినందుకు సిగ్గుపడాలి. ఈ జ్యూయల్లరీని నేను ఎప్పుడు కొనను - జ్యూయల్లరీ రూపొందించడం ఎంతో నేర్పుతో కూడిన కళ. దాన్ని ఇలా చేయడం మంచి పద్దతి కాదు - ఫోటో కింద జ్యూయల్లరీ క్యాంపెయిన్ అనే క్యాప్షన్ చూడకుంటే ఈ ఫోటోలు బీగ్రేడ్ మూవీ పోస్టర్లలా ఉన్నాయి. - సబ్యసాచి అసలు నీకేమయ్యింది. ఇలా ఎవరైనా మంగళసూత్రం అమ్మకాల ప్రకటన చేస్తారా ? మంగళసూత్ర అంటే ఇది మరికొందరు నెటిజన్లు మంగళ సూత్రం ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చాలా మంది మంగళసూతం ఎలా ధరిస్తారో, ఎలా ధరించాలో, ఎలాంటి ఫోటోలు తీయాలో చెబుతూ ట్విట్టర్ , ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సబ్యసాచిని ట్యాగ్ చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. Mangalsutra looks like this #Sabyasachi It's not a random piece of fashion jewellery, it indicates the love and commitment the husband and wife have towards each other. pic.twitter.com/HB3r4Aa4A4 — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) October 27, 2021 #Mangalasutra is NOT a "tiny intimate Jewelry" to be hidden. It's Long for whole world to see. It's PIOUS It's PRIDE It's Worn with Attitide (Ghamand) of being a Sanatani Hindu Woman ! pic.twitter.com/InN90Uiddp — 🍁 Sanatani Yoddha (@VidyaSanatani) October 27, 2021 -
పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..
టెక్సాస్: ప్రస్తుత కాలంలో మొదటిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న జంట బేజీ షవర్, మెటర్నిటీ ఫొటోషూట్ వంటి కార్యక్రమాలకు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం కోసం అందమైన, ఆకర్షించే ప్రదేశాలను ఎంచుకోవడం లేదా వారి ఫొటోషూట్ భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్‌ను మరింత ప్రత్యేకంగా ఉంచేందుకు అత్యంత సాహసమైన ఆలోచన చేసింది. తన పొట్టపై ఏకంగా 10 వేల తేనెటీగల గూడును పెట్టుకుని ఫొటోషూట్‌కు ఫోజ్లిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె పేరు బేథానీ కరులక్. ఆమె ముందునుంచే ఇలాంటి సాహసాల్లో నిపుణురాలు. (వైరల్ : నల్ల చిరుతను చూశారా?) బేథానీ ఇటీవల తీసుకున్న తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘ఇది ప్రమాదకరమైనది. దయచేసి అనుభవం లేకుండా ఎవరూ ప్రయత్నించకండి’ అనే క్యాప్షన్‌తో ఆమె పోస్టు చేసింది. ‘ఫొటోషూట్ మొత్తంలో ఆ తేనెటీగల నన్ను ఒక్కసారి కూడా కుట్టలేదు. మొదట రాణీ తేనెటీగను నా పొట్టపై బంధించాము. ఆ తర్వాత మిగతా తేనెటీగలను ఉంచడంతో కాసేపట్లలో అవి గూడు కట్టాయి. ఇక్కడ దాదాపు 10 వేలకు పైగా తేనెటీగల ఉన్నాయి. అయితే ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని డాక్టర్ సలహాతోనే ప్రయత్నించాం’ అంటూ బేథాని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సాహసానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తూంటే మరికొందరూ ‘అసలు ఎందుకిలా చేయడం’, ‘తేనెటీగలకు బదులుగా సీతాకోక చిలుకలను ప్రయత్నించచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో షూట్.. కొత్త జంటకు చేదు అనుభవం) -
సినీతారల ఫొటో షూట్
-
రవివర్మకే అందని అందానివో..
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ పెయింటింగ్‌ను మైమరిపించేలా ప్రముఖ సినీతారలు, డాన్సర్లు ఒదిగిపోయారు. అచ్చం రవి వర్మ చిత్రాలను కళ్లకు కట్టేలా 12 మంది సెలబ్రిటీలు ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ ఫొటో షూట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కళాకారుల మనసును సమ్మోహన పరుస్తోంది. రమ్యకృష్ణ ,రవివర్మ చిత్రాన్ని తలపిస్తున్న కుష్బూ తమిళనాడు, కొరుక్కుపేట: నామ్ చారిటబుల్ ట్రస్ట్ 10 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి చెన్నై అన్నాసాలైలోని అమెథీస్ట్లోని దీ ఫాలీ హాలు వేదికగా వేడుకలు నిర్వహించారు. మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న నామ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నటి సుహాసినీ మణిశర్మ, ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ జి వెంకట్ రామ్ సంయుక్త సారథ్యంలో రాజారవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని 12 మంది ప్రముఖు, సినీతారులు, డాన్సర్లతో ఒక క్యాలెండర్ తీసుకు వచ్చారు. ఐశ్వర్య రాజేష్ ,శ్రుతిహాసన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర తమిళ అధికార భాష, తమిళ సంస్కృతి మంత్రి పాండియరాజన్ పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత చిత్రకారుడు రాజరవివర్మ చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, మహిళలను ఎంత అందంగా చూపించగరో వర్ణించడానికి వీలుకాదని అన్నారు. రవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని అచ్చం అదే స్టైల్లో ఫొటో షూట్ చేయడం ఫొటోగ్రాఫర్ వెంకట్రామ్ కెమెరా మాయజాలం చేశారని కొనియాడారు. అలాగే సుహాసినీ చేస్తున్న సామాజిక సేవపై ప్రశంల వర్షం కురిపించారు. ప్రదర్శనగా ఏర్పాటు చేసిన ఈ చిత్రాలన్నీ రవివర్మే దిగివచ్చి గీచిన అనుభూతిని కలిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నటి సుహాసినీ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప చిత్రకారుల్లో ఒకరైన రవివర్మ దేశానికే గర్వకరాణంగా నిలిచారన్నారు. తన పెయింటింగ్‌లో స్త్రీల అందాలకు కొత్త భావం చెప్పారని కొనియాడారు. వారినీ స్ఫూర్తిగా తీసుకుని తమ సంస్థ నామ్ చారిటబుల్ ట్రస్ట్ రీ క్రియేట్ రాజారవివర్మ 2020 పేరుతో క్యాలెండర్‌ను తీసుకువచ్చామన్నారు. ఇందులో ఫొటో గ్రాఫర్ వెంకట్ రామ్‌తో పాటు పలువురు కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా వారిందరికి కృతజ్ఞతలు తెలిపారు. కనువిందు చేస్తున్నశోభన (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తీపి జ్ఞాపకాల మాయాబజార్
చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి పేర్లు శృతి, అనూష. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఒకరు ఎంబిఎ, ఇంకొకరు ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు. రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఒకానొక సమయంలో ఈ రొటీన్ ఉద్యోగాలు కాదు మనం చేయాల్సింది అనుకున్నారు. ఏదైనా వినూత్నమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తే..? అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి వీరు సృష్టించినదే.. ‘ది మాయాబజార్.’ పాతికేళ్ల వయసులో కచ్చితమైన ప్రణాళికతో సరికొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన శృతి, అనూషలు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇటీవలి కాలంలో.. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వెడ్డింగ్ షూట్స్ తీయించుకునేవారు ఎక్కువయ్యారు. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు ఆ అందమైన జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవడానికి ప్రెగ్నెన్సీ ఫొటో షూట్, చిన్నారుల క్యూట్ ఫొటోలు, కాలేజీ అమ్మాయిలైతే.. ఫ్యాషన్ స్టిల్స్æ.. ఇలా రకరకాలుగా ఫొటోలకు, వీడియో షూట్స్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో షూట్స్ తీసుకునే లొకేషన్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ థీమ్‌నే పట్టుకున్నారు శృతి, అనూష. అన్ని రకాలుగా విశ్లేషించుకున్న తర్వాత రీసెర్చ్ ప్రారంభించారు. నెట్ అంతా జల్లెడ పట్టారు. తెలిసిన వారిని, తెలియని వారిని పరిచయం చేసుకొని మరీ సమాచారం సేకరించారు. ‘‘దేశవ్యాప్తంగా ఫొటో షూట్స్‌కి ఢిల్లీలో, ముంబయిలో చక్కటి స్థలాలు ఉన్నాయి. రకరకాల షూట్స్ కోసం చాలా మంది మన దగ్గర నుంచి అక్కడికి వెళుతుంటారు. ఇవన్నీ కూడా చూసి స్టడీ చేయడానికి మాకు ఏడాది సమయం పట్టింది’’ అన్నారు శృతి. ‘‘మా స్నేహితులు, బంధువులతో పాటు మేం కూడా ఫొటో, వీడియో షూట్స్‌కి తగిన ప్లేస్ కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాం. ఫొటో, వీడియో షూట్స్‌కి సరైన ప్లేస్ దొరక్క, ఖర్చు ఎక్కువ పెట్టలేక ప్రాజెక్ట్స్‌ను వదిలేసుకున్నవారెందరో. తెలిసిన ఫొటోగ్రాఫర్లు, వెడ్డింగ్ ప్లానర్లు, షార్ట్ ఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌ల నిర్మాతలను, కెమెరామెన్స్‌ని కలిసి మాట్లాడాం. వీరందరికి అవసరమైన, అందించాల్సిన వసతులను బేరీజు వేసుకుకుని మాయాబజార్‌ని నిర్మించాం’’ అని చెప్పారు అనూష. ఆర్నెళ్లకు ఒకసారి ‘‘దేశంలో ఫొటోషూట్ అవసరాల కోసం ఇప్పుడున్న స్టూడియోలన్నీ చిన్నవే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐదు ఎకరాల స్థలాన్ని ఏడేళ్లపాటు లీజుకు తీసుకున్నాం. ఎకరం స్థలంలో స్టూడియో నిర్మించాం. అందులో మేకప్ రూమ్, ఛేంజింగ్ రూమ్, ఇండోర్, అవుట్ డోర్ వసతులు కాకుండా పదిహేను వరకు భిన్నమైన సెట్స్ వేశాం. వీటిని ప్రతీ ఆర్నెల్లకు ఒకసారి మార్చేలా ప్లాన్ చేశాం. మిగిలిన స్థలంలో గార్డెన్స్‌తో పాటు పలు రకాల ఆకర్షణలు జోడించబోతున్నాం..’’ అని శృతి తెలిపారు. స్టూడియో ఏర్పాటుతో పాటు సెట్స్‌కు అవసరమైన ఇతరత్రా సామగ్రి చాలా అవసరం అవుతుంది. ఆ విషయాన్ని చెబుతూ.. ‘‘అందుకు మేం ఇద్దరం దేశంలో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్.. వంటి చాలా ప్రాంతాలు తిరిగి అపురూపమైన యాంటిక్ పీసులను సేకరించాం. పాతకాలం నాటి తలుపులు, నిజమైన ఎద్దుల బండి.. ఇలా ఏ లొకేషన్ సెట్‌కి ఏది ముఖ్యమో అలా ప్రతీది మేమిద్దరం ఎంపిక చేసి, డిజైన్ చేయించుకున్నాం..’’ అని తెలిపారు అనూష. అమ్మాయిలే బెస్ట్ వ్యాపారం అనేది ఒడిదొడుకులతో కూడినది. ఆర్థిక లావాదేవీల్లో కచ్చితత్త్వం ఉండాలి కదా... మీకేమైనా సమస్యలు వస్తే అనే ప్రశ్నకు..‘‘మా ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఇక ముందూ రావు. నిజానికి ఇలాంటి సృజనాత్మక భాగస్వామ్యానికి అమ్మాయిలే బెస్ట్’’ అని నవ్వుతూ చెప్పారు శృతి, అనూష. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శృతి, అనూషలు సృష్టించిన ఈ ‘మాయాబజార్’ ఈ ఇద్దరమ్మాయిల సృజనకు అద్దం పడుతోంది. – నిర్మలారెడ్డి సొంత పెట్టుబడి ఈ ఇద్దరు కలలు కన్న మాయాబజార్ స్టూడియో కిందటేడాదే సాకారం అయింది. వ్యాపారాలు చేయాలంటే పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండాలి అనుకునేవారికి వీళ్లు కాస్త ధైర్యాన్ని ఇచ్చే మాటల్నే చెబుతున్నారు. ‘‘మేం అనుకున్న స్టూడియో రూపకల్పనకు పెద్ద మొత్తంలోనే ఖర్చు అయ్యింది. అయినా వెనకంజ వేయలేదు. మా ఇళ్లలో అమ్మనాన్నలని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాం. మేం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు, మిగిలినది రుణాల రూపంలో తీసుకున్నాం. మా తపన చూసిన మా అమ్మానాన్న కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు’’ అని చెప్పారు అనూష, శృతి. -
సోనాక్షి ఫోటోషూట్ తళుకులు
ముంబై : దబాంగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో జతకట్టి ఈ బ్యూటీ భారీ విజయాన్నితన ఖాతాలో వేసుకున్నారు. ఎల్లప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు అభిమానులతో షేర్ చేస్తుంటారు ఈ బొద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆన్లైన్ షాపింగ్ ప్రచార కార్యక్రమం ఫోటో షూట్లో దిగిన చిత్రాలను సోనాక్షి బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘బ్లాక్ మ్యాజిక్ వుమెన్’ అనే క్యాప్షన్ జతచేర్చారు. ఈ ఫోటోలో ఆఫ్ షోల్డర్తో ధరించిన నల్లని దుస్తుల్లో, విరబోసిన కురులతో సోనాక్షి అందాలను ఆరబోశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు తన అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. హాట్ లుక్స్‌తో మెరిసిపోతున్న సోనాక్షిని ఫ్యాఫన్ క్వీన్‌గా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం సోనాక్షి దబాంగ్-3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram Black magic woman! For the @myntrafashionsuperstar promo shoot! Styled by @mohitrai @miloni_s91 (tap for deets), hair by @themadhurinakhale, makeup @mehakoberoi and photos by @saurabhdalvi_photography 🖤 A post shared by Sonakshi Sinha (@aslisona) on Sep 11, 2019 at 6:24am PDT -
పోర్ట్‌ఫోలియో
పోర్ట్‌ఫోలియో.. ఒక వ్యక్తి ఏంటో అతని పోర్ట్‌ఫోలియో చెబుతుంది. అప్‌కమింగ్ మోడల్స్... ఆస్పైరింగ్ నటీనటుల జీవితంలో పోర్ట్ఫోలియోది క్రూషియల్ రోల్. ఆ ఒక్క చాన్స్ రావాలంటే... నవరసాలను ప్రతిబింబించే పోర్ట్‌ఫోలియో తప్పనిసరి. ఫ్యాషన్, సినిమా రంగాల వారే కాక.. ఇప్పుడు చాలామంది తమ ఫొటోషూట్స్‌తో పోర్ట్‌ఫోలియోలను తయారు చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ ఫొటోలతో, వినోద, విహార ప్రదేశాల సందర్శన చిత్రాలతో కలకాలం గుర్తుండిపోయేలా పోర్ట్‌ఫోలియోలను పదిలపర్చుకుంటున్నారు. - వాంకె శ్రీనివాస్ ఫ్యాషన్.. సినిమా.. ఫీల్డ్ ఏదైనా పోర్ట్ఫోలియోది పవర్ఫుల్ రోల్. ఎంతోమంది మోడల్స్, సినిమా హీరోలు, హీరోయిన్లు కావడానికి తొలి ‘క్లిక్’ పోర్ట్‌ఫోలియోనే. ఈ రంగాల్లో దీనికెందుకు ఇంత ప్రాధాన్యం అంటే.. మనం ఏంటో తెలియాలంటే ఫొటోషూట్ తప్పనిసరి. ‘ఫొటోషూట్ అనేది ఓ వ్యక్తి హైట్, అప్పియరెన్స్ మాత్రమే కాదు.. హావభావాలను చూపిస్తుంది. సినిమాలు, మోడలింగ్, డిజైనర్స్.. ఇలా ఆర్ట్ ఏదైనా వాళ్లకు అవకాశాలు ఇప్పించేది పోర్ట్‌ఫోలియోనే’ అంటున్నారు ఈ రంగంలో కొనసాగుతున్న చందన్ వెనిగళ్ల. హీరో నాగశౌర్య, హీరోయిన్లు స్వాతి, మానస, నందిని రాయ్, మంజులా రాథోడ్.. వీరంతా ఆయన పోర్ట్‌ఫోలియోల్లో అందమైన ‘బొమ్మలు’గా ఒదిగిపోయారు. వీరందిరినీ బ్యూటీఫుల్ పిక్చర్స్‌లో బంధించిన చందన్.. ఎన్నో అవకాశాలకు తెర తీసారు. ఎలా ఉన్నామో.. ఉండాలో చెబుతుంది.. సెలబ్రిటీలు కచ్చితంగా ఆరునెలలకు ఒకసారి పోర్ట్‌ఫోలియో తీయించుకుంటారు. ఎందుకంటే బాడీలో ఎలాంటి మార్పులొచ్చాయి, ఆన్‌స్క్రీన్ ఇంకా అందంగా కనిపించాలంటే ఎలాంటి వర్కవుట్స్ చేయాలి అని తెలియజెప్పేది పోర్ట్‌ఫోలియోనే. ఫ్యాషన్ పోర్ట్‌ఫోలియో మిగతా వాటితో పోలిస్తే కాస్త డిఫరెంట్. హెయిర్సై ్టల్, మేకప్, డ్రెస్సింగ్, సై ్టలిష్.. ఒక్కముక్కలో చెప్పాలంటే మేకప్ ఎక్కువగా ఉండి కలర్ఫుల్గా ఉండాలి. అదే ఫిల్మ్ విషయానికొస్తే ఫేస్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ సై ్టల్, డిఫరెంట్ యాంగిల్స్, వాకింగ్ చేసేటప్పుడు, క్లోజ్ఆప్, అల్ట్రా క్లోజ్ అప్ ఫొటోలు అవసరమవుతాయి. ఇప్పుడు అందరూ.. సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారే కాక ఇప్పుడు చాలామంది పోర్ట్‌ఫోలియోలను తయారు చేయించుకుంటున్నారు. సాధారణంగా ఇంతకుముందు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తీసిన ఫొటోలనే ఆల్బమ్‌గా చేసుకుని దాచుకునే వారు. ఇప్పుడు రకరకాల సందర్భాల్లో ప్రత్యేక ఫొటోషూట్స్ తీయించుకోవడం ట్రెండ్‌గా మారింది. ‘ఫొటో అనగానే పోజులివ్వడం, లెన్స్‌కు కళ్లప్పగించడం చేస్తుంటాం. కానీ డైలీ లైఫ్‌ను కళ్లకు కట్టే నేచురల్ పోర్ట్ఫోలియోలంటే క్రేజీగా ఉన్నారు సిటీవాసులు’ అంటున్నారు చందన్. హైటెక్‌సిటీలో ఉన్న ఈయన స్టూడియో వర్ధమాన తారల ఫొటోషూట్స్‌తో సందడిగా ఉంటుంది. నేచురల్కి క్రేజీ.. నేచురల్ పోర్ట్‌ఫోలియోల మేకింగ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పెళ్లి, బర్త్‌డే.. ఈవెంట్ ఏదైనా మనకు తెలియకుండా లెన్స్‌లో బంధించడమే నేచురల్ పోర్ట్‌ఫోలియో. ఆ అకేషన్లో మన ఎక్స్‌ప్రెషన్స్‌ని... మన ఫ్యామిలీకి కళ్లకు కట్టినట్టు చూపిస్తారు పోర్ట్‌ఫోలియో ఫొటోగ్రాఫర్లు. కుటుంబ శుభకార్యాలే కాదు... ఆఫీస్‌లు సైతం తమ వర్కింగ్ స్పేస్‌ని నేచురల్ పోర్ట్‌ఫోలియోగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నాయి. ఆఫీసు వెదర్‌ను, వర్కింగ్ స్టైల్‌ను పలువురు ఫొటోలుగా తీయించుకుని దాచుకుంటున్నారు. నాన్న కొనిచ్చిన కెమెరాతోనే.. పోర్ట్‌ఫోలియోల తయారీ ఇప్పుడు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు కెరీర్‌గానూ మారింది. ‘టెన్త్ సమయంలో నాన్న కొనిచ్చిన కెమెరాతో ఫొటోలు తీస్తుండే వాడిని. అలా చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ పాషన్‌గా మారింది. ఇందులో ఎలాంటి క్రియేటివ్ కోర్సులు చేయలేదు’ అని చెప్పారు చందన్. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కూకట్‌పల్లిలోని ప్రతిభ విద్యానికేతన్‌లో టెన్త్ వరకు చదివి.. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశాక ఫుల్‌టైమ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఫటేతక్ నాచ్నా’ అనే బాలీవుడ్ మూవీలో నాలుగు పాటలకు సినిమాటోగ్రఫీ కూడా చేశాడు.