పోర్ట్‌ఫోలియో | Aspairing actors life In the Portfolio krusial Roll | Sakshi
Sakshi News home page

పోర్ట్‌ఫోలియో

Published Tue, Apr 14 2015 10:49 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

పోర్ట్‌ఫోలియో - Sakshi

పోర్ట్‌ఫోలియో

పోర్ట్‌ఫోలియో.. ఒక వ్యక్తి ఏంటో అతని పోర్ట్‌ఫోలియో చెబుతుంది. అప్‌కమింగ్ మోడల్స్... ఆస్పైరింగ్ నటీనటుల జీవితంలో పోర్ట్‌ఫోలియోది క్రూషియల్ రోల్. ఆ ఒక్క చాన్స్ రావాలంటే... నవరసాలను ప్రతిబింబించే పోర్ట్‌ఫోలియో తప్పనిసరి. ఫ్యాషన్, సినిమా రంగాల వారే కాక.. ఇప్పుడు చాలామంది తమ ఫొటోషూట్స్‌తో పోర్ట్‌ఫోలియోలను తయారు చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ ఫొటోలతో, వినోద, విహార ప్రదేశాల సందర్శన చిత్రాలతో కలకాలం గుర్తుండిపోయేలా పోర్ట్‌ఫోలియోలను పదిలపర్చుకుంటున్నారు.
- వాంకె శ్రీనివాస్
 
ఫ్యాషన్.. సినిమా.. ఫీల్డ్ ఏదైనా పోర్ట్‌ఫోలియోది పవర్‌ఫుల్ రోల్. ఎంతోమంది మోడల్స్, సినిమా హీరోలు, హీరోయిన్లు కావడానికి తొలి ‘క్లిక్’ పోర్ట్‌ఫోలియోనే. ఈ రంగాల్లో దీనికెందుకు ఇంత ప్రాధాన్యం అంటే.. మనం ఏంటో తెలియాలంటే ఫొటోషూట్ తప్పనిసరి. ‘ఫొటోషూట్ అనేది ఓ వ్యక్తి హైట్, అప్పియరెన్స్ మాత్రమే కాదు.. హావభావాలను చూపిస్తుంది. సినిమాలు, మోడలింగ్, డిజైనర్స్.. ఇలా ఆర్ట్ ఏదైనా వాళ్లకు అవకాశాలు ఇప్పించేది పోర్ట్‌ఫోలియోనే’ అంటున్నారు ఈ రంగంలో కొనసాగుతున్న చందన్ వెనిగళ్ల. హీరో నాగశౌర్య, హీరోయిన్లు స్వాతి, మానస, నందిని రాయ్, మంజులా రాథోడ్.. వీరంతా ఆయన పోర్ట్‌ఫోలియోల్లో అందమైన ‘బొమ్మలు’గా ఒదిగిపోయారు. వీరందిరినీ బ్యూటీఫుల్ పిక్చర్స్‌లో బంధించిన చందన్.. ఎన్నో అవకాశాలకు తెర తీసారు.
 
ఎలా ఉన్నామో.. ఉండాలో చెబుతుంది..
సెలబ్రిటీలు కచ్చితంగా ఆరునెలలకు ఒకసారి పోర్ట్‌ఫోలియో తీయించుకుంటారు. ఎందుకంటే బాడీలో ఎలాంటి మార్పులొచ్చాయి, ఆన్‌స్క్రీన్ ఇంకా అందంగా కనిపించాలంటే ఎలాంటి వర్కవుట్స్ చేయాలి అని తెలియజెప్పేది పోర్ట్‌ఫోలియోనే. ఫ్యాషన్ పోర్ట్‌ఫోలియో మిగతా వాటితో పోలిస్తే కాస్త డిఫరెంట్. హెయిర్‌సై ్టల్, మేకప్, డ్రెస్సింగ్, సై ్టలిష్.. ఒక్కముక్కలో చెప్పాలంటే మేకప్ ఎక్కువగా ఉండి కలర్‌ఫుల్‌గా ఉండాలి. అదే ఫిల్మ్ విషయానికొస్తే ఫేస్ ఎక్స్‌ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ సై ్టల్, డిఫరెంట్ యాంగిల్స్, వాకింగ్ చేసేటప్పుడు, క్లోజ్‌ఆప్, అల్ట్రా క్లోజ్ అప్ ఫొటోలు అవసరమవుతాయి.
 
ఇప్పుడు అందరూ..
సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారే కాక ఇప్పుడు చాలామంది పోర్ట్‌ఫోలియోలను తయారు చేయించుకుంటున్నారు. సాధారణంగా ఇంతకుముందు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తీసిన ఫొటోలనే ఆల్బమ్‌గా చేసుకుని దాచుకునే వారు. ఇప్పుడు రకరకాల సందర్భాల్లో ప్రత్యేక ఫొటోషూట్స్ తీయించుకోవడం ట్రెండ్‌గా మారింది. ‘ఫొటో అనగానే పోజులివ్వడం, లెన్స్‌కు కళ్లప్పగించడం చేస్తుంటాం. కానీ డైలీ లైఫ్‌ను కళ్లకు కట్టే నేచురల్ పోర్ట్‌ఫోలియోలంటే క్రేజీగా ఉన్నారు సిటీవాసులు’ అంటున్నారు చందన్. హైటెక్‌సిటీలో ఉన్న ఈయన స్టూడియో వర్ధమాన తారల ఫొటోషూట్స్‌తో సందడిగా ఉంటుంది.
 
నేచురల్‌కి క్రేజీ..
నేచురల్ పోర్ట్‌ఫోలియోల మేకింగ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పెళ్లి, బర్త్‌డే.. ఈవెంట్ ఏదైనా మనకు తెలియకుండా లెన్స్‌లో బంధించడమే నేచురల్ పోర్ట్‌ఫోలియో. ఆ అకేషన్‌లో మన ఎక్స్‌ప్రెషన్స్‌ని... మన ఫ్యామిలీకి కళ్లకు కట్టినట్టు చూపిస్తారు పోర్ట్‌ఫోలియో ఫొటోగ్రాఫర్లు. కుటుంబ శుభకార్యాలే కాదు... ఆఫీస్‌లు సైతం తమ వర్కింగ్ స్పేస్‌ని నేచురల్ పోర్ట్‌ఫోలియోగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నాయి. ఆఫీసు వెదర్‌ను, వర్కింగ్ స్టైల్‌ను పలువురు ఫొటోలుగా తీయించుకుని దాచుకుంటున్నారు.
 
నాన్న కొనిచ్చిన కెమెరాతోనే..
పోర్ట్‌ఫోలియోల తయారీ ఇప్పుడు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు కెరీర్‌గానూ మారింది. ‘టెన్త్ సమయంలో నాన్న కొనిచ్చిన కెమెరాతో ఫొటోలు తీస్తుండే వాడిని. అలా చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ పాషన్‌గా మారింది. ఇందులో ఎలాంటి క్రియేటివ్ కోర్సులు చేయలేదు’ అని చెప్పారు చందన్. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కూకట్‌పల్లిలోని ప్రతిభ విద్యానికేతన్‌లో టెన్త్ వరకు చదివి.. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశాక ఫుల్‌టైమ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఫటేతక్ నాచ్‌నా’ అనే బాలీవుడ్ మూవీలో నాలుగు పాటలకు సినిమాటోగ్రఫీ కూడా చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement