శ్రుతిహాసన్ , సమంతా అక్కినేని
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ పెయింటింగ్‌ను మైమరిపించేలా ప్రముఖ సినీతారలు, డాన్సర్లు ఒదిగిపోయారు. అచ్చం రవి వర్మ చిత్రాలను కళ్లకు కట్టేలా 12 మంది సెలబ్రిటీలు ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ ఫొటో షూట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కళాకారుల మనసును సమ్మోహన పరుస్తోంది.
రమ్యకృష్ణ ,రవివర్మ చిత్రాన్ని తలపిస్తున్న కుష్బూ
తమిళనాడు, కొరుక్కుపేట: నామ్ చారిటబుల్ ట్రస్ట్ 10 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి చెన్నై అన్నాసాలైలోని అమెథీస్ట్‌లోని దీ ఫాలీ హాలు వేదికగా వేడుకలు నిర్వహించారు. మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న నామ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నటి సుహాసినీ మణిశర్మ, ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ జి వెంకట్ రామ్ సంయుక్త సారథ్యంలో రాజారవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని 12 మంది ప్రముఖు, సినీతారులు, డాన్సర్లతో ఒక క్యాలెండర్ తీసుకు వచ్చారు.
ఐశ్వర్య రాజేష్ ,శ్రుతిహాసన్
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర తమిళ అధికార భాష, తమిళ సంస్కృతి మంత్రి పాండియరాజన్ పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత చిత్రకారుడు రాజరవివర్మ చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, మహిళలను ఎంత అందంగా చూపించగరో వర్ణించడానికి వీలుకాదని అన్నారు. రవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని అచ్చం అదే స్టైల్‌లో ఫొటో షూట్ చేయడం ఫొటోగ్రాఫర్ వెంకట్‌రామ్ కెమెరా మాయజాలం చేశారని కొనియాడారు. అలాగే సుహాసినీ చేస్తున్న సామాజిక సేవపై ప్రశంల వర్షం కురిపించారు. ప్రదర్శనగా ఏర్పాటు చేసిన ఈ చిత్రాలన్నీ రవివర్మే దిగివచ్చి గీచిన అనుభూతిని కలిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నటి సుహాసినీ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప చిత్రకారుల్లో ఒకరైన రవివర్మ దేశానికే గర్వకరాణంగా నిలిచారన్నారు. తన పెయింటింగ్‌లో స్త్రీల అందాలకు కొత్త భావం చెప్పారని కొనియాడారు. వారినీ స్ఫూర్తిగా తీసుకుని తమ సంస్థ నామ్ చారిటబుల్ ట్రస్ట్ రీ క్రియేట్ రాజారవివర్మ 2020 పేరుతో క్యాలెండర్‌ను తీసుకువచ్చామన్నారు. ఇందులో ఫొటో గ్రాఫర్ వెంకట్ రామ్‌తో పాటు పలువురు కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా వారిందరికి కృతజ్ఞతలు తెలిపారు.
కనువిందు చేస్తున్నశోభన
Comments
Please login to add a commentAdd a comment