Raja Ravi Varma
-
వర్ణచిత్రాల బ్రహ్మ: రాజా రవివర్మ (1848–1906)
చిత్రకళ పట్ల ఓ ఆకర్షణను సృష్టించడమే కాక.. వర్గం, భాష, ప్రాంత భేదాలు లేకుండా సామాన్యుడికి సైతం చేరేలా చేసిన ఘనత రవివర్మదే! చిత్రకళను విలాసవంతం చేసిన తొలి కళాకారుడు కూడా ఆయనే. ఆయన గీసిన వర్ణచిత్రాలను అటు బ్రిటిష్‌వారు, ఇటు రాజాస్థానాలవారు ఆత్రంగా అందుకొనేవారు. ఆయనను ఒకరు తిరువాన్కూర్ మహారాజాకు పరిచయం చేశారు. ఆస్థాన చిత్రకారుడి ద్వారా రవివర్మకు చిత్రకళలో మెళకువలు నేర్పాలని మహారాజు భావించారు. అయితే ఆ ఆస్థాన విద్వాంసుడు కానీ, ఆస్థానంలోని డచ్ కళాకారుడు థియోడర్ జెన్సెన్కానీ రవివర్మకు నేర్పడానికి ఇష్టపడలేదు. తైలవర్ణాలతో వారు బొమ్మలు గీయడాన్ని జాగ్రత్తగా గమనించడం ద్వారానే రవివర్మ చిత్రకళ నేర్చుకున్నారు. మద్రాసు గవర్నర్ చిత్రపటాన్ని గీసినప్పుడు రవవర్మ ప్రతిభ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆయన చిత్రించిన ‘నాయర్ ఉమన్ విత్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇన్ హర్ హెయిర్’ వర్ణచిత్రం మద్రాసు చిత్రకళా ప్రదర్శనలో ఆయనకు స్వర్ణపతకం సంపాదించి పెట్టింది. అలాగే 1887లో వియన్నా చిత్రకళా పోటీలోనూ పతకం వరించింది. తైల మాధ్యమాన్ని ఉపయోగించడం ద్వారా ఆయన తన మోడల్ స్త్రీలను అందంగా చిత్రించగలిగారు. ఆయన గీసిన ‘మలబార్ బ్యూటీ’ చిత్రం భారతదేశ ప్రతీకగా నిలిచింది. చదవండి: (స్వతంత్ర భారతి: ప్రపంచ కప్ విజయం (1983/2022)) అయితే, రవివర్మకు విస్తృతంగా పేరు తెచ్చిపెట్టినవి ఆయన గీసిన చారిత్రక వర్ణ చిత్రాలు. రామాయణం, మహాభారతం, తదితర పురాణ గాథలకు ఆయన వేసిన చిత్రాలు తమదైన ముద్ర సంపాదించుకున్నాయి. రవివర్మ చిత్రాలకు లభించిన ప్రాచుర్యం వల్ల బరోడా, మైసూర్, త్రివేండ్రం లాంటి రాజాస్థానాలు ఆయనతో భారీస్థాయిలో పౌరాణిక వర్ణ చిత్రాలను గీయించాయి. ఆయన ఒక పక్క పాశ్చాత్య విద్యా సంప్రదాయాన్ని వినియోగిస్తూనే, మరోపక్క తంజావూరు వర్ణచిత్రాల ప్రభావాన్ని మిళితం చేసి తనదైన శైలిని ఆ చిత్రాల్లో చూపారు. రవి వర్మ 1892లో బొంబాయిలో ఒక లిథోగ్రాఫిక్ ప్రెస్ స్థాపించారు. ప్లేగు వ్యాధి ప్రబలడంతో ఆయన బొంబాయి నుంచి 1899 లో కర్లాకు ప్రెస్‌ను మార్చారు. చివరకు జర్మనీ దేశస్థుల్లో ఒకరికి దానిని అమ్మేశారు. అప్పటికే ప్రతి ఇంటా రవివర్మ చిత్రాలు చేరాయి. – యశోధరా దాల్మియా, కళాఖండాల సంరక్షకులు -
రవి వర్మ పెయింటిగ్స్: మన అందాల తారల అద్భుతం
-
'రాజా రవి వర్మ'..వాళ్లను ఊహించుకొని పెయింటింగ్స్ వేసేవారట
రాజా రవి వర్మ.. భారతీయ చిత్రకారుడిగా ఆయన పేరు నేటికీ సజీవమే.1848 ఏప్రిల్ 29న కేరళలోని కిలమానూరులో జన్మించిన రవి వర్మ ఏడేళ్ల వయసు నుంచే చిత్రాలు గీయడం ప్రారంభించారు. ప్రతీ రోజూ ఆయన చూసిన దృశ్యాలనే గోడలపై అందమైన చిత్రాలుగా రూపొందించేవారు. రకరకాల పువ్వులు, చెట్ల ఆకులతో తన చిత్రాలకు రంగులద్దేవారు. రవి వర్మ ప్రతిభను మెచ్చిన అప్పటి ట్రావెన్కోర్ మహారాజా ఆయన ఆస్థానంలోకి సగర్వంగా ఆహ్వానించారు. అక్కడే ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద శిష్యరికం చేసిన రాజా రవి వర్మ..బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద ఆయల్ పెయింటింగ్ ఎలా గీయాలో నేర్చుకున్నాడు. వాటర్ కలర్లకు బదులుగా ఆయిల్ పెయింటింగ్‌ని ఉపయోగించిన తొలి భారతీయ చిత్రకారుడిగా రికార్డులకెక్కారు. రాజా రవి వర్మ ఆయన 18వ ఏట రాజ కుటుంబానికి చెందిన భాగీరథీబాయిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం ముగ్గురు పిల్లలు. అతి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత చిత్రకారుడిగా రాజా రవి వర్మ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. దేశంలోని నలమూలల నుంచి పెయింటింగ్స్ గీయాలని రోజూ కొన్ని వందల అభ్యర్థలను వచ్చేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆయన పెయింటింగ్స్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నా, ఆయన గీసే చిత్రాలు కేవలం దర్శనాత్మకంగా, ఛాందసంగా చిత్రాలు ఉంటాయన్న విమర్శలనూ ఎదుర్కోక తప్పలేదు. భారతీయ సాంప్రదాయ చిత్రకళకు పాశ్చాత్యాన్ని జోడించి పెయింటింగ్స్ వేయడంలో రాజా రవి వర్మ సిద్దహస్తులు. అందుకే ఆయన్ను 'ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియన్ ఆర్ట్'గా పిలుస్తారు. రామాయణ, మహాభారతములోని ఘాట్టాలను అందంగా చిత్రీకరంచే రాజా రవి వర్మ..నలదమయంతుల, శకుంతలా దుష్యంతుల చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1873 లో వియన్నాలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో మొదటి బహుమతిని గెలుచుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన పెయింటింగ్స్‌కు విదేశీయులు కూడా ముగ్ధులయ్యేవారు. హిందూ దేవతా స్త్రీల చిత్రాలను దక్షిణ భారతయ స్త్రీలలాగా ఊహించి ఎన్నో పెయింటింగ్స్ వేసేవారు. దక్షిణ భారత స్త్రీలు ఎంతో అందంగా ఉంటారని బాగా విశ్వసించేవారు. దేశంలోనే మొదటిసారిగా పెయింటింగ్స్ కోసం ముంబైలో అత్యాదునిక ప్రెస్‌ను ప్రారంభించిన రాజా రవి వర్మ ఇందుకోసం దేశం నలుమూలల నుంచి చిత్రకారులను పిలిపించుకున్నారు. ఇక 58 ఏళ్ల వయసులో మధుమేహం కారణంగా 1906లో కన్నుమూశారు. రాజా రవి వర్మ చనిపోయేనాటికి దాదాపు 7వేల పెయింటింగ్స్‌ను గీసినట్లు సమాచారం. రవి వర్మ మరణానంతరం ఆయన పెయింటింగ్స్‌ను తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. -
ఖాదీ రవివర్మ
రవివర్మ చిత్రాలు గోడల మీద పెయింటింగ్స్‌గా, క్యాలెండర్లుగా కనిపించడం కొత్తకాదు. కాని అవి ఖాదీ వస్త్రాల మీదకు తర్జుమా కావడం పూర్తిగా కొత్త. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రవివర్మ ముని మనవరాలు రుక్మిణి వర్మ, డ్రస్ డిజైనర్ గౌరంగ్ షా ఖాదీ చీరల మీద రవివర్మ బొమ్మలను రూపు కట్టించారు. వీటి ప్రదర్శన ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ ముని మనుమరాలు రుక్మిణి వర్మ నాట్యకారిణి. భరతనాట్యం, కథక్, కథాకళి ప్రదర్శనలు అనేకం ఇచ్చారు. బెంగళూరులో డాన్స్ స్కూల్, ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవివర్మ చిత్రాల ప్రదర్శన మీద ఆమె ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం డ్రస్ డిజైనర్ గౌరంగ్ షా ఆమెను కలిసి ఒక ప్రతిపాదన చేశారు. ‘గాంధీజీ 150 జయంతి మరో ఐదేళ్లలో రానున్న సందర్భంగా ఆయనకు నివాళిగా ఖాదీ వస్త్రాల మీద రవివర్మ చిత్రాలను రూపుదిద్దుతాను. అందుకు అంతగా వ్యాప్తిలోకి రాని చిత్రాలు ఇవ్వండి’ అని ఆ ప్రతిపాదన సారాంశం. అందుకు సమ్మతించిన రుక్మిణి రవివర్మ చిత్రాల్లో అరుదైన ఇంత వరకు ఎక్కువగా ప్రదర్శితం కాని ముప్పై చిత్రాలను ఇచ్చారు. ఆ చిత్రాలను ఖాదీ వస్త్రం మీద ఆవిష్కరింప చేయడం అనే మహా యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు గౌరంగ్. ఐదేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత ఆ బొమ్మలను ఖాదీ వస్త్రాల మీదకు తీసుకురాగలిగారు. ‘‘గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్. రవివర్మ ఫాదర్ ఆఫ్ ఆర్ట్. ఈ ఇద్దరి జయంతి–వర్థంతి ఒకే రోజు. గాంధీకి ఇష్టమైన ఖాదీలో రవివర్మ చిత్రాలను రూపొందించడానికి కారణం వాళ్లిద్దరినీ ఒక వేదిక మీదకు తీసుకు రావడమే. ఇందు కోసం రుక్మిణి వర్మను సంప్రదించినప్పుడు ఆమె వినూత్నమైన చిత్రాల హక్కులను ఇచ్చి మరీ ప్రోత్సహించారు. రవివర్మ చిత్రాల డిజిటల్ రూపాలను ఖాదీ వస్త్రాల మీద జాందానీ నేతలో పునఃసృష్టించాం. ఈ బొమ్మలు ఉన్న చీరల మొదటి ప్రదర్శనను 2019 అక్టోబర్ రెండవ తేదీన ముంబయిలో పెట్టాం. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీలో ప్రదర్శించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టాము. వచ్చే నెల బరోడాలో ఉంది. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత విదేశాలకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ’’ అన్నారు గౌరంగ్ షా. ప్రదర్శనలో... హైదరాబాద్ ‘సప్తపరి’్ణలో ప్రదర్శితమవుతున్న ముప్పై చిత్రాల్లో దాదాపుగా పాతిక చిత్రాలు స్త్రీ ప్రధానంగా ఉన్నాయి. రిద్ధి– సిద్ధిలతో వినాయకుడు, ఉయ్యాల ఊగుతున్న మోహిని, సఖులతో పరిహాసాల మధ్య శకుంతల, వనవాసంలో సీత, సుభద్రను ఓదారుస్తున్న అర్జునుడు, కేరళ సంప్రదాయ దుస్తులలో వీణ మీటుతున్న సరస్వతి మొదలైన చిత్రాలు చీరల మీద నేతలో ఒదిగిపోయాయి. ఒక చిత్రంలో కృష్ణుడి ఆస్థానంలో ఇరవై మంది కొలువుదీరి ఉన్నారు. ఒక్కొక్కరి ముఖంలో ఒక్కో భావం, కళ్లలో కూడా చిత్రవిచిత్రమైన భావాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భావాలు చీర మీద కూడా యథాతథంగా రూపుదిద్దుకున్నాయి. హరి–హర బేటీ చిత్రంలో అయితే ఒకే తల రెండుగా భ్రమింప చేస్తుంది. శివుడు అధిరోహించిన నంది వైపు నుంచి చూస్తే నంది తల కనిపిస్తుంది. విష్ణుమూర్తి వైపు నుంచి చూస్తే ఏనుగు తల కనిపిస్తుంది. రవివర్మ చిత్రకళలో చూపించిన ఇంతటి వైవిధ్యాన్ని నేతలో తీసుకురావడానికి నేతకారులకు మూడేళ్లు పట్టింది. 150/150 నేతలో ఆరువందల రంగులను ఉపయోగించారు. శ్రీకాకుళంలోని జాందానీ నేతకారుల చేతుల్లో వస్త్రం మీద రూపం పోసుకున్న చిత్రాలివి.– వాకా మంజులారెడ్డి -
సినీతారల ఫొటో షూట్
-
రవివర్మకే అందని అందానివో..
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ పెయింటింగ్‌ను మైమరిపించేలా ప్రముఖ సినీతారలు, డాన్సర్లు ఒదిగిపోయారు. అచ్చం రవి వర్మ చిత్రాలను కళ్లకు కట్టేలా 12 మంది సెలబ్రిటీలు ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ ఫొటో షూట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కళాకారుల మనసును సమ్మోహన పరుస్తోంది. రమ్యకృష్ణ ,రవివర్మ చిత్రాన్ని తలపిస్తున్న కుష్బూ తమిళనాడు, కొరుక్కుపేట: నామ్ చారిటబుల్ ట్రస్ట్ 10 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి చెన్నై అన్నాసాలైలోని అమెథీస్ట్లోని దీ ఫాలీ హాలు వేదికగా వేడుకలు నిర్వహించారు. మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న నామ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నటి సుహాసినీ మణిశర్మ, ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ జి వెంకట్ రామ్ సంయుక్త సారథ్యంలో రాజారవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని 12 మంది ప్రముఖు, సినీతారులు, డాన్సర్లతో ఒక క్యాలెండర్ తీసుకు వచ్చారు. ఐశ్వర్య రాజేష్ ,శ్రుతిహాసన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర తమిళ అధికార భాష, తమిళ సంస్కృతి మంత్రి పాండియరాజన్ పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత చిత్రకారుడు రాజరవివర్మ చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, మహిళలను ఎంత అందంగా చూపించగరో వర్ణించడానికి వీలుకాదని అన్నారు. రవివర్మ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని అచ్చం అదే స్టైల్లో ఫొటో షూట్ చేయడం ఫొటోగ్రాఫర్ వెంకట్రామ్ కెమెరా మాయజాలం చేశారని కొనియాడారు. అలాగే సుహాసినీ చేస్తున్న సామాజిక సేవపై ప్రశంల వర్షం కురిపించారు. ప్రదర్శనగా ఏర్పాటు చేసిన ఈ చిత్రాలన్నీ రవివర్మే దిగివచ్చి గీచిన అనుభూతిని కలిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నటి సుహాసినీ మాట్లాడుతూ ప్రపంచంలోని గొప్ప చిత్రకారుల్లో ఒకరైన రవివర్మ దేశానికే గర్వకరాణంగా నిలిచారన్నారు. తన పెయింటింగ్‌లో స్త్రీల అందాలకు కొత్త భావం చెప్పారని కొనియాడారు. వారినీ స్ఫూర్తిగా తీసుకుని తమ సంస్థ నామ్ చారిటబుల్ ట్రస్ట్ రీ క్రియేట్ రాజారవివర్మ 2020 పేరుతో క్యాలెండర్‌ను తీసుకువచ్చామన్నారు. ఇందులో ఫొటో గ్రాఫర్ వెంకట్ రామ్‌తో పాటు పలువురు కృషి దాగి ఉందన్నారు. ఈ సందర్భంగా వారిందరికి కృతజ్ఞతలు తెలిపారు. కనువిందు చేస్తున్నశోభన (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిత్రమైన చీర
సాధారణంగా డిజైనర్లు సృష్టించిన దుస్తుల కలెక్షన్ చూడాలంటే బొటిక్స్‌కు వెళ్లాలి. లేదా ఫ్యాషన్ షో, ఎక్స్‌పోల్లోనో చూడాలి. కానీ ఆ‘కట్టుకునే’ అపురూప చిత్రాల చీరలు చూడాలంటే మాత్రం మ్యూజియమ్స్కి వెళ్లాల్సిందే. అంత మాత్రాన అవి ఎప్పటివో చరిత్ర తాలూకు అవశేషాలు కావు.. నేటి మన సిటీ డిజైనర్ఆవిష్కరించిన అద్భుతాలు. సాక్షి, సిటీబ్యూరో: చిత్రలేఖనంలో ప్రవేశమున్నవారికి మాత్రమే కాదు.. కళలపై కాసింత అవగాహన ఉన్నవారికి కూడా రాజా రవివర్మ అంటే పరిచయం అక్కర్లేని పేరు. రాజవంశీకుడిగానే కాదు తన చిత్రలేఖనా ప్రతిభతోనూ చరిత్ర కెక్కిన రవివర్మ చిత్రాలు మనదేశపు కళా సంపద. అలాంటి చిత్ర సంపదను ఆధునిక ఫ్యాషన్లకు ఆలంబనగా మార్చారు నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా. ప్రస్తుతం ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఆయన తన చిత్రాల చీరలను ప్రదర్శిస్తున్నారు. అసాధ్యం నుంచి అద్భుతం ‘రవివర్మవి సహజమైన రంగులతో తీర్చిదిద్దిన అద్భుత చిత్రాలు. అవి రంగుల, భావాలు, వివరాల గల గొప్ప సమ్మేళనం. అంతగా వెలుగులోకి రాని రవివర్మ గీచిన అద్భుత పెయింటింగ్స్‌లో మహిళలు, దేవతలు, కథలు.. ఇలా మూడు విభాగాలుగా విభజించి 30 పెయింటింగ్స్‌ను ఎంచుకున్నాం. ఆరు నెలల కాలాన్ని పూర్తిగా పరిశోధనకే కేటాయించాం. తొలుత వీటి గురించి మాస్టర్ వీవర్స్‌తో చర్చించినప్పుడు వారు ఇది సాధ్యమా అన్నట్టు అనుమానం వ్యక్తపరిచారు. దీనికి తగ్గట్టే ఖాదీలో నేచురల్ డైలను ఉపయోగించి ఈ చీరలు నేయాల్సి ఉండడం కూడా మరో సవాలు. తొలి రెండు చీరల ప్రయోగం విఫలమైన తర్వాత మూడో చీరకు సక్సెస్ అయ్యాం. ప్రతి పెయింటింగ్‌కు ఒక కలర్ చార్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ చిత్రాల మీద ఉన్న అచ్చమైన రంగులను తలపించేందుకు మేం 600 షేడ్స్ సృష్టించాం’ అంటూ గౌరంగ్ తన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన ఎప్పటి నుంచో తన చీరలను మ్యూజియమ్స్‌లో చూడాలని అనుకుంటున్నానని, రెండేళ్ల పాటు సాగిన ఈ ప్రాజెక్ట్ తన కల సాకారం చేసిందని గౌరంగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చీరలపై చిత్రాలను సృష్టించేందుకు ఒక్కో చీరకు 3 నెలలు పడితే మరో చీరకు 10 నెలలు కూడా పట్టిందని వివరించారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ‘చిత్ర’మైన చీర ప్రదర్శన నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి చేరనుంది. అలా అలా ఈ చీరలను నగరంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాక వీటిని ఆన్లైన్ ద్వారా వేలం వేయాలని గౌరంగ్ భావిస్తున్నారు. సిటీ ఆర్టిస్ట్‌తో మొదలు.. ప్రాచుర్యం పొందిన చిత్రాలను చీరలపై కొలువుదీర్చడం అనే ప్రక్రియలో గౌరంగ్‌కు తొలి స్ఫూర్తిని అందించింది కూడా నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడే కావడం విశేషం. ‘2013లో సిటీకి చెందిన లక్ష్మణ్ ఏలె పెయింటింగ్స్‌ను చూసినప్పుడు చాలాబాగా నచ్చాయి. దాంతో ఆయన వేసిన ఆరు చిత్రాలను నా చీరల కలెక్షన్లో పునఃసృష్టించాను. ఆ చీరల ప్రదర్శనకు వచ్చినవారిలో ఒకరైన లావినా ఒక చీర కొనుగోలు చేయడంతో పాటు అప్పటి నుంచి ఆమె నాతో కలిసి ఓ గొప్ప ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తి చూపేవారు. బెంగళూరులోని రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులను నాకు పరిచయం చేయడంతో మూడేళ్ల తర్వాత ఆమె ఆలోచన కార్యరూపం దాల్చింది’ అంటూ గౌరంగ్ చెప్పారు. అలా సిటికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె చిత్రాలను తన చీరల మీద ప్రతిష్టించడం ద్వారా సరికొత్త చిత్ర ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన గౌరంగ్ షా.. రాజా రవివర్మ చిత్రాలను ఒక్కో చీర పల్లూపై కొలువుదీర్చారు. గాంధీ జయంతి, రవివర్మ వర్ధంతి రెండూ అక్టోబరు 2నే కావడంతో ‘ఖాదీ ఏ కాన్వాస్’ పేరుతో ప్రదర్శనకి తెర తీశారు. -
'రంగ్ రసియా' సినిమా విడుదలపై కోర్టు స్టే
బాలీవుడ్ చిత్రం 'రంగ్ రసియా' విడుదలను కేరళలోని ఓ కోర్టు నిలుపుదల చేసింది. 19వ శతాబ్దికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని శుక్రవారం నాడు కేరళలో విడుదల చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. అళప్పుజ జిల్లాలోని మావెలిక్కర మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రవివర్మ మనవరాలు ఇంద్రాదేవి కుంజమ్మ ఫిర్యాదు చేయడంతో ఆయన స్టే ఇచ్చారు. రాజా రవివర్మ జీవితగాధకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని జడ్జి ప్రసున్ మోహన్ స్పష్టం చేశారు. రంజిత్ దేశాయ్ రాసిన 'రాజా రవివర్మ' అనే పుస్తకం ఆధారంగా కేతన్ మెహతా ఈ సినిమా తీశారు. ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. -
నాకు రాసిపెట్టి ఉంది..
రాజా రవివర్మ జీవితగాథ ఆధారంగా రూపొందించిన ‘రంగ్ రసియూ’లోని పాత్ర తనకు రాసిపెట్టి ఉందని నందనా సేన్ చెబుతోంది. చిన్నప్పటి నుంచి తనకు రవివర్మ చిత్రాలంటే చాలా ఇష్టవుని, హార్వర్డ్‌లో చదువుకునేటప్పుడు తన గది గోడకు రవివర్మ దవుయుంతి పెరుుంటింగ్ ఉండేదని, తన ఇంట్లోనూ భారీ సైజు రవివర్మ పెరుుంటింగ్స్ రెండు ఉన్నాయుని అంటోంది. రవివర్మ కుంచెకు స్ఫూర్తినిచ్చిన సుగంధ పాత్ర తనకు దక్కడంపై నందనా సేన్ తబ్బిబ్బవుతోంది.