'రంగ్ రసియా' సినిమా విడుదలపై కోర్టు స్టే | Kerala court stays release of 'Rang Rasiya' | Sakshi
Sakshi News home page

'రంగ్ రసియా' సినిమా విడుదలపై కోర్టు స్టే

Published Wed, Nov 5 2014 12:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'రంగ్ రసియా' సినిమా విడుదలపై కోర్టు స్టే - Sakshi

'రంగ్ రసియా' సినిమా విడుదలపై కోర్టు స్టే

బాలీవుడ్ చిత్రం 'రంగ్ రసియా' విడుదలను కేరళలోని ఓ కోర్టు నిలుపుదల చేసింది. 19వ శతాబ్దికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని శుక్రవారం నాడు కేరళలో విడుదల చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. అళప్పుజ జిల్లాలోని మావెలిక్కర మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రవివర్మ మనవరాలు ఇంద్రాదేవి కుంజమ్మ ఫిర్యాదు చేయడంతో ఆయన స్టే ఇచ్చారు.

రాజా రవివర్మ జీవితగాధకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని జడ్జి ప్రసున్ మోహన్ స్పష్టం చేశారు. రంజిత్ దేశాయ్ రాసిన 'రాజా రవివర్మ' అనే పుస్తకం ఆధారంగా కేతన్ మెహతా ఈ సినిమా తీశారు. ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement