rang rasiya
-
'రంగ్ రసియా' సినిమా విడుదలపై కోర్టు స్టే
బాలీవుడ్ చిత్రం 'రంగ్ రసియా' విడుదలను కేరళలోని ఓ కోర్టు నిలుపుదల చేసింది. 19వ శతాబ్దికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని శుక్రవారం నాడు కేరళలో విడుదల చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. అళప్పుజ జిల్లాలోని మావెలిక్కర మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రవివర్మ మనవరాలు ఇంద్రాదేవి కుంజమ్మ ఫిర్యాదు చేయడంతో ఆయన స్టే ఇచ్చారు. రాజా రవివర్మ జీవితగాధకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని జడ్జి ప్రసున్ మోహన్ స్పష్టం చేశారు. రంజిత్ దేశాయ్ రాసిన 'రాజా రవివర్మ' అనే పుస్తకం ఆధారంగా కేతన్ మెహతా ఈ సినిమా తీశారు. ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. -
నాకు రాసిపెట్టి ఉంది..
రాజా రవివర్మ జీవితగాథ ఆధారంగా రూపొందించిన ‘రంగ్ రసియూ’లోని పాత్ర తనకు రాసిపెట్టి ఉందని నందనా సేన్ చెబుతోంది. చిన్నప్పటి నుంచి తనకు రవివర్మ చిత్రాలంటే చాలా ఇష్టవుని, హార్వర్డ్‌లో చదువుకునేటప్పుడు తన గది గోడకు రవివర్మ దవుయుంతి పెరుుంటింగ్ ఉండేదని, తన ఇంట్లోనూ భారీ సైజు రవివర్మ పెరుుంటింగ్స్ రెండు ఉన్నాయుని అంటోంది. రవివర్మ కుంచెకు స్ఫూర్తినిచ్చిన సుగంధ పాత్ర తనకు దక్కడంపై నందనా సేన్ తబ్బిబ్బవుతోంది. -
పరిమితులేమీ లేనే లేవు
ముంబై: ‘రంగ్ రసియా’ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా వాడుకోవద్దని పరిమితులు విధించినట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ నటి నందనాసేన్ కొట్టిపారేసింది. ‘అది అవాస్తవం. ఎవరి సృజనాత్మక స్వేచ్ఛను నేను అడ్డుకోలేదు’ అని వందన పేర్కొంది. వివాహం అనంతరం తన జీవితం, కెరీర్ తదితర అంశాల విషయంలో తనను చుట్టుముడుతున్న వదంతులపై ఆర్థిక శాస్త్రంలో నోబుల్ పురస్కార గ్రహీత కుమార్తె అయిన నందన పైవిధంగా వివరణ ఇచ్చింది. మీకు అత్యంత ఇష్టమైన ‘రంగ్ రసియా’ ఎన్నో ఏళ్ల తర్వాత సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మీరు ఎటువంటి అనుభూతికి లోనవుతున్నారని మీడియా ప్రశ్నించగా చలికాలం తర్వాత వానాకాలం వచ్చినట్టు ఉంది అని నందన ఆనందంగా చెప్పింది. ఈ సినిమాకు సంబంధించి కేతన్ మెహతా మీ వద్ద నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందా అని అడగ్గా అదంతా అభూత కల్పనే అని అంది. కేతన్కు ఏది ఇష్టమో అది తనకు కూడా ఇష్టమేనని తెలిపింది. సెన్సిటివ్ సీన్లకు సంబంధించినంతవరకూ ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని, కుటుంబసభ్యులతో కూడా చర్చించానని చెప్పింది. అయితే పబ్లిసిటీ మెటీరియల్‌కు సంబంధించి నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులెవరూ తనను సంప్రదించలేదంది. అందువల్ల సృజనాత్మక స్వేచ్ఛను హరించాననే మాట సరైంది కాదంది. వృత్తికి అంకితమవుతానంది. ‘రంగ్ రసియా’ అసాధారణమైన సినిమా అని చెప్పింది. తన జీవితానికి సంబంధించిన సరిహద్దులన్నింటినీ తానే విధించుకున్నానని తెలిపింది.