సోనాక్షి ఫోటోషూట్‌ తళుకులు | Sonakshi Sinha Wear Gorgeous Black Dress For New Shoot | Sakshi
Sakshi News home page

సోనాక్షి ఫోటోషూట్‌ తళుకులు

Published Fri, Sep 13 2019 3:04 PM | Last Updated on Fri, Sep 13 2019 4:38 PM

Sonakshi Sinha Wear Gorgeous Black Dress For New Shoot - Sakshi

ముంబై : దబాంగ్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు సోనాక్షి సిన్హా.  మొదటి సినిమాతోనే కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో జతకట్టి ఈ బ్యూటీ భారీ విజయాన్నితన ఖాతాలో వేసుకున్నారు.  ఎల్లప్పుడు సోషల్‌ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు అభిమానులతో షేర్‌ చేస్తుంటారు ఈ బొద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రచార కార్యక్రమం ఫోటో షూట్‌లో దిగిన చిత్రాలను సోనాక్షి బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘బ్లాక్‌ మ్యాజిక్‌ వుమెన్‌’ అనే క్యాప్షన్‌ జతచేర్చారు.

ఈ ఫోటోలో ఆఫ్‌ షోల్డర్‌తో ధరించిన నల్లని దుస్తుల్లో, విరబోసిన కురులతో సోనాక్షి అందాలను ఆరబోశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ గ్లామర్‌ ఫోటోలు తన అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. హాట్‌ లుక్స్‌తో మెరిసిపోతున్న సోనాక్షిని ఫ్యాఫన్‌ క్వీన్‌గా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం సోనాక్షి దబాంగ్‌-3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement