dabangg 3
-
సల్మాన్‌తో సినిమా.. 37 ఏళ్ల ఏజ్ గ్యాప్ అని ట్రోల్ చేశారు: హీరోయిన్
సినిమా తారలకు ట్రోల్స్ కామన్. ఏదో ఒక విషయంలో వాళ్లను ట్రోల్ చేస్తునే ఉంటారు. అయితే సీనియర్ యాక్టర్స్ ఇలాంటివి పట్టించుకోరు కానీ..కొత్తగా వచ్చిన వాళ్లు మాత్రం ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోతారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు కూడా వాటిని పట్టించుకోకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తారు. (చదవండి: కంగువా రిలీజ్ వాయిదా.. రజనీకాంత్ కోసమే!)అలా తాను కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ట్రోలింగ్‌కు గురయ్యానని, తట్టుకోలేక కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకే దూరంగా ఉన్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం ‘దబాంగ్ 3’తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే తొలి సినిమానే వయసులో తనకంటే 37 ఏళ్లు పెద్ద నటుడైన సల్మాన్‌తో నటించడంతో అప్పట్లో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై సయీ స్పందించింది.(చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)‘నా తొలి సినిమా సల్మాన్‌తో అనగానే వెంటనే ఓకే చెప్పా. అప్పటికీ నాకు పీఆర్ టీమ్ లేదు. అందుకే నాకేమీ తెలియదు. సినిమా విడుదలైన తర్వాత నాపై విమర్శలు వచ్చాయి. 37 ఏళ్ల పెద్ద వయసు అయిన హీరోతో నటించావంటూ నన్ను ట్రోల్ చేశారు. చాలా బాధపడ్డాను. ఆ ట్రోల్స్ నా కెరీర్‌పై ప్రభావం చూపొద్దని ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత అలాంటి విమర్శలు వస్తే బాధపడడం మానేసి.. సరి చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను’ అని సయీ చెప్పుకొచ్చింది. -
సల్మాన్ కోసం వెళ్తే.. కుక్కలా తరిమేశారు: 'దబంగ్' నటి
ఈమె బాలీవుడ్ లో ఓ నటి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3'లో నటించింది. కానీ ఈమెకు ఆ సినిమా సెట్ లోనే దారుణమైన అవమానం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆమెనే బయటపెట్టింది. ఇదంతా కూడా కేవలం ఆ ఒక్క పనిచేసినందుకే అని బయటపెట్టింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. (ఇదీ చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?) కుక్కలా తరిమేశారు! 'దబంగ్ 3'లో నటించిన హేమశర్మ.. షూటింగ్ లో తనది ఓ సీన్ పూర్తయిన తర్వాత సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు ప్రయత్నించింది. అయితే హీరో బాడీగార్డ్స్ తనతో దురుసుగా ప్రవర్తించారని, సెట్ లో 100 మంది ముందు తనని కుక్కలా తరిమేశారని పేర్కొంది. ఒక్క ఫొటో తీసుకుంటానని అని అడిగినందుకు సల్మాన్ బాడీగార్డ్స్ ఇలా బిహేవ్ చేశారని హేమశర్మ చెప్పుకొచ్చింది. 10 రోజులు నిద్రపట్టలేదు! తనని సల్మాన్ ఖాన్ దగ్గరకి తీసుకెళ్తానని పండిట్ జనార్ధన్ అనే వ్యక్తి సహాయం చేశారు. ఆయనతో కూడా సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ దారుణంగా ప్రవర్తించారు. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని ఆయన్ని హెచ్చరించారని హేమశర్మ చెప్పుకొచ్చింది. తనకు ఘోర అవమానం జరిగిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదని హేమ చెప్పుకొచ్చింది. ఈమెనే కాదు రీసెంట్ గా హీరో విక్కీ కౌశల్ ని కూడా సల్మాన్ బాడీగార్డ్స్ పక్కకు నెట్టేశారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) -
హీరోయిన్ సాయి మంజ్రేకర్ స్టన్నింగ్ ఫోటోలు
-
సల్మాన్‌తో అది రుజువైంది: సుదీప్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు సల్మాన్ ఖరీదైన కారును బహమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సుదీప్ తన అధికారిక ట్విటర్లో పేర్కొన్నాడు. ‘మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచే జరుగుతుందని నేను ఎక్కువగా నమ్ముతాను. ఆ నమ్మకం సల్మాన్ ఖాన్‌తో మరోసారి రుజువైంది. మా ఇంటికి సర్ప్రైజ్(బీఎండబ్ల్యూ ఎమ్5తో) గిఫ్ట్‌తో సల్మాన్ వచ్చారు. నాపై నాకుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు సర్. మీతో వర్క్ చేయడం అదే విధంగా మమ్మల్ని కలవడానికి మీరు రావడం నాకెంతో గర్వంగా ఉంది’అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా సల్మాన్ ఇచ్చిన కారుతో పాటు అతడితో దిగిన ఫోటోలను కూడా సుదీప్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ‘నా అనుకున్న వారిపై సల్మాన్ చూపించే ప్రేమ అనంతం’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఇటీవలే విడుదలైన దబాంగ్-3 చిత్రంలో సల్మాన్‌తో కలిసి సుదీప్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నెగటీవ్ రోల్ పోషించిన సుదీప్ తన దైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంతోనే సల్మాన్, సుదీప్‌ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సల్మాన్ ఇలా తన సన్నిహితులకు, స్నేహితులకు బహుమతులు ఇవ్వడం కొత్తేం కాదు. అంతేకాకుండా వారితో చాలా సరదాగా ఉంటాడు. ఆటలు ఆడుతుంటాడు. ఇక గతంలో తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేడయం, తన మేనల్లుడితో కలిసి అల్లరి చేయడం వంటి విషయాలు తెలిసినవే. Good always happens when u do good.@beingsalmankhan made me believe this line further with this surprise landing at home along with him. BMW M5 🤗. Thank u for the luv u have showered on me n my family sir. It was an honour to have worked with u n to have had u vist us.🤗🤗🥂 pic.twitter.com/tavTR07M29 — Kichcha Sudeepa (@KicchaSudeep) January 7, 2020 -
‘అక్షయ్ వల్లే సల్మాన్ సినిమాకు కష్టాలు’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’. డిసెంబర్ 20 విడుదలైన భాయిజాన్ సినిమా తొలిరోజే కలెక్షన్ల వర్షం కురింపించడంతో ‘దబాంగ్ 3’ అంచనాలు మరింత పెరిగాయి. 10 రోజుల్లో సల్మాన్ సినిమా రూ.137.80 కోట్లకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ అంచనాలు వేశారు. అయితే రెండోవారం గడిచేసరికి ఈ సినిమా ఆయన అంచనాలను తలకిందులు చేసింది. ఈ విషయం గురించి ఆదర్శ్ మాట్లాడుతూ.. ‘ న్యూ ఇయర్ సందర్భంగా సల్మాన్ ‘దబాంగ్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తుందని అనుకున్నాం. మొదటి వారం కలెక్షన్లు బాగా రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ రెండవ వారం వచ్చేసరికి సల్మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా అయిపోయింది. బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ జోరందుకోవడంతో మా అంచనాలు తారుమారయ్యాయి’. అంటూ అదర్శ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram #Dabangg3 goes down in Week 2... Biz at multiplexes hit due to #GoodNewwz... Single screens better, not great... Might benefit due to #NewYear celebrations... [Week 2] Fri 3.50 cr, Sat 3.25 cr, Sun 4.50 cr. Total: ₹ 137.80 cr. #India biz. Note: All versions. A post shared by Taran Adarsh (@taranadarsh) on Dec 30, 2019 at 6:31am PST కాగా గత వారం ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ మల్టీ స్టారర్ ‘గుడ్‌న్యూస్’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘అక్షయ్ ‘గుడ్‌న్యూస్’ సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’కి గట్టి పోటీనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు డిసెంబర్ 27 నుంచి తలపడ్డాయి. అయితే రోజు రోజుకు ‘గుడ్‌న్యూస్’ కలెక్షన్లను కొల్లగొడుతుండటంతో సల్మాన్ సనిమా వసూళ్లకు గండి పడింది’ అంటూ అదర్శ్ రాసుకొచ్చారు. అ అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కైరా అద్వానీ, దిల్జిత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్న్యూస్కు రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో రూ.88 కోట్లను వసూలు చేసింది. -
బర్త్‌డే స్పెషల్ : కండలవీరుడి తాజా రికార్డ్
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 54వ ఏట అడుగుపెట్టడంతో సహ నటులు, అభిమానుల అభినందనల మెసేజ్‌లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సల్మాన్ తాజా చిత్రం దబాంగ్ 3 వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో బర్త్‌డే రోజున ఆయన అరుదైన రికార్డును సాధించారు. తాజా హిట్‌తో బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని సల్మాన్ సత్తా చాటారు. సల్మాన్ నటించిన 15 సినిమాలు వంద కోట్ల క్లబ్లో చేరడంతో బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్లో చేరిన అత్యధిక సినిమాలు సల్లూ భాయ్ ఖాతాలోనే ఉన్నాయి. 2017లో విడుదలైన టైగర్ జిందా హై రూ 339 కోట్లు రాబట్టి బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సల్మాన్ మూవీగా ముందువరసలో నిలిచింది. విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలు దక్కినా బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం సల్మాన్ సినిమాలు దుమ్మురేపేవి. ఇక సల్లూ భాయ్ నటించిన భజ్రంగి భాయ్‌జాన్, సుల్తాన్, కిక్, భారత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏక్ థా టైగర్, రేస్ 3, దబాంగ్ 2, బాడీగార్డ్, దబాంగ్, రెడీ, ట్యూబ్‌లైట్, జైహో, దబాంగ్ 3 సినిమాలు రూ వంద కోట్ల క్లబ్లో చోటు దక్కించుకున్నాయి. సల్మాన్ తర్వాత రూ 100 కోట్లు సాధించిన అత్యధిక సినిమాలు అక్షయ్ కుమార్‌వి కావడం గమనార్హం. ఖిలాడీ నటించిన14 సినిమాలు వంద కోట్ల క్లబ్లో చేరాయి. ఆ తర్వాత షారుక్ ఖాన్ ఏడు చిత్రాలు, అమీర్ ఖాన్ ఆరు చిత్రాలతో వంద కోట్ల క్లబ్లో ముందున్నారు. ఇక ఈ జాబితాలో హృతిక్ రోషన్, అజయ్ దేవ్గన్, రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్లు తర్వాతి స్ధానాల్లో నిలిచారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నా దబాంగ్ 3 వసూళ్లు నిలకడగా సాగడం గమనార్హం. -
ఎట్టకేలకు వంద కోట్లు దాటింది
ముంబై: సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’ ఎట్టకేలకు వంద కోట్ల క్లబ్లో చేరింది. మొదటి 6 రోజుల్లో ఈ సినిమా రూ.107 కోట్ల నికర వసూళ్లు సాధించినట్టు ‘బాక్సాఫీస్ ఇండియా’ వెల్లడించింది. బుధవారం రూ.15.50 కోట్లు వసూలు చేసినట్టు తెలిపింది. అంతకుముందు రోజు(మంగళవారం) కలెక్షన్లతో పోల్చుకుంటే ఇది 65 శాతం అధికం. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఆరో రోజు కలెక్షన్లు మెరుగుపడ్డాయి. క్రిస్మస్ సెలవులు అయిపోవడంతో గురువారం నుంచి వసూళ్లు తగ్గుతాయిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం విడుదల కానున్న అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్’ సల్మాన్‌ఖాన్ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దబాంగ్ 3’లో మహేశ్ మంజ్రేకర్, అర్బాజ్‌ఖాన్, కిచ్చా సుదీప్, సొనాక్షి సిన్హా ముఖ్యపాత్రల్లో నటించారు. -
వసూళ్ల కన్నా భద్రతే నాకు ముఖ్యం: ప్రముఖ హీరో
ముంబై: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నడుమ దబాంగ్ 3 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తనకు సినిమా వసూళ్ల కన్న అభిమానుల భద్రతే ముఖ్యమని తెలిపాడు. నిరసనల మద్య దబాంగ్ 3 సినిమా విడుదలైనా ఘనవిజయం సాధించిందని తెలిపాడు.దీని క్రెడిట్ అభిమానులకే దక్కుతుందని కొనియాడాడు. ఉత్తర భారతంలో నిరసనల కారణంగా దబాంగ్ 3 సినిమా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదని తెలిపాడు. మిగతా రాష్ట్రాలలో సినిమా ఆశించిన మేర కలెక్షన్లు రాబట్టిందని పేర్కొన్నాడు. తాను సినిమా రివ్యూలను చదవనని, సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటానని తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా ప్రజలు సినిమాపై వీడియోలను పోస్ట్ చేస్తున్నప్పుడు తనకు అర్థమవుతుందని వివరించాడు. దబాంగ్ 3 సినిమా ద్వారా పలువురు కొత్త నటులు అరంగేట్రం చేశారని వారిలో వినోద్ ఖన్నా సోదరుడు ప్రమోద్ ఖన్నా, మంజ్రేకర్‌లు ఉన్నారు. కొత్త నటులను ప్రజలు ఆదరించడంపై సల్మాన్ హర్షం వ్యక్తం చేశాడు. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన దబాంగ్ 3 నాలుగు రోజుల్లో రూ.91.85 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. చుల్బుల్ పాండేగా సల్మాన్ కనిపించగా ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. చదవండి: సల్మాన్ సినిమాకు అన్నేసి టికెట్లా? -
నన్ను స్కూల్ నుంచి పంపేశారు: హీరో
ముంబై: బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. తారా శర్మ షోలో సల్మాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు స్కూల్ అడ్మిషన్ రావడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. తనకు తల్లిదండ్రులంటే చాలా ఇష్టమని పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు. నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు తనను స్కూల్ యాజమాన్యం పంపేసిందని తెలిపాడు. ఆ సమయంలో తానేమి తప్పు చేశానో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే పాఠశాలకు వెళ్లాల్సిందిగా స్కూలు యాజమాన్యం సిఫార్సు చేసినప్పటికీ.. తాను అక్కడే చదువుతానని అభ్యర్థించగా వారు అంగీకరించారని పేర్కొన్నాడు. అలా అదే పాఠశాలలోనే చదివి ఉత్తీర్ణత సాధించానని గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా... తన స్కూల్ ప్రిన్సిపల్‌తో జరిగిన సంఘటనను కూడా సల్మాన్ పంచుకున్నాడు. తాను కాలేజీలో సైన్స్ ఎంపిక చేసుకున్నట్లు తెలియగానే నన్ను చెరకు కర్రతో దండించాడని చెప్పాడు. తన నైపుణ్యమేంటో ప్రిన్సిపల్ సార్‌కు బాగా తెలుసునని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం సల్మాన్ నటించిన దబాంగ్ 3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదలై నాలుగు రోజుల్లో రూ.91.85 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. చుల్బుల్ పాండేగా సల్మాన్ కనిపించగా ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. చదవండి: నీరసించిన ‘దబాంగ్ 3’ కలెక్షన్లు -
‘దబాంగ్ 3’ కలెక్షన్లు అంతేనా!
ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. అంచనాలకు తగినట్టుగా ఆరంభ వసూళ్లు రాబట్టలేక ‘చుల్బుల్ పాండే’ చతికిల పడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.91.85 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సల్మాన్ గత చిత్రం ‘భారత్’ మొదటి రోజునే రూ.42.30 కోట్లు కొల్లగొట్టగా, దబాంగ్ 3 కేవలం రూ.24.50 కోట్లు మాత్రమే రాబట్టింది. గతంలో వచ్చిన రెండు చిత్రాలు మంచి వసూళ్లు సాధించడంతో దబాంగ్ 3 భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంటుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఈ సినిమాపై పడనప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి వారాంతంలోపు పుంజుకోకపోతే కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే డిసెంబర్ 27న అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్’ విడుదలవుతోంది. ఈ సినిమా హిట్ అయితే ‘దబాంగ్ 3’ కలెక్షన్లు భారీగా పడిపోయే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 60 శాతం వరకు కలెక్షన్లు పడిపోయాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుదేవా తెరకెక్కించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడిగా సొనాక్షి సిన్హా నటించింది. కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయక పాత్ర పోషించాడు. -
మేకింగ్ ఆఫ్ మూవీ దబాంగ్ 3
-
దబాంగ్ 3: రెండో రోజు సేమ్ కలెక్షన్లు..
చుల్బుల్ పాండేగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో ముచ్చటగా మూడోసారి వచ్చాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ నటించారు. భారీ అంచనాలతో వచ్చిన చుల్‌బుల్‌పాండే మరోసారి మురిపిస్తాడనుకుంటే ఈసారి తడబడినట్లు తెలుస్తోంది. అయితే, సినీ విశ్లేషకుల విమర్శలు, తక్కువ రేటింగ్‌లు, దేశంలో కొనసాగుతున్న నిరసనలు ఇవేవీ దబాంగ్ 3 కలెక్షన్లకు అడ్డుగా నిలవకపోవడం గమనార్హం. దబాంగ్ 3 విడుదలైన శుక్రవారం నాడు రూ.24 కోట్లు రాబట్టగా రెండో రోజు కూడా స్థిరంగా నిలబడి రూ.24 కోట్లు వసూలు చేయడం విశేషం. వీకెండ్ కాబట్టి కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దబాంగ్ 3 క్రేజ్ వీక్‌డేస్‌లో కొనసాగుతుందా? సోమవారం నుంచి ఈ సినిమా ఏమేరకు వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
తెలుగు ‘దబాంగ్ 3’ ప్రీ–రిలీజ్ వేడుక
-
ఆటకైనా.. వేటకైనా రెడీ
సల్మాన్‌ఖాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన చిత్రం ‘దబాంగ్ 3’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటించారు. అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రేపు విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ సౌజన్యంతో సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ ‘దబాంగ్ 3’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక బుధవారం జరిగింది.ఈ వేడుకకు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘వెంకీమామ.. అంటే వెంకటేష్‌గారు.. నాకు పాతికేళ్లుగా స్నేహితులు. రామ్‌చరణ్ నాన్నగారు చిరంజీవి నాకు చాలా క్లోజ్. రామ్‌చరణ్ నాకు తమ్ముడులాంటివాడు. చరణ్ కూడా నాకు క్లోజే. ఈ సినిమాలో హీరోగా నా స్థాయిని పెంచేలా నటించారు కన్నడ నటుడు సుదీప్. ‘దబాంగ్ 3’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అంటూ చిత్రంలోని ‘ఆటకైనా.. వేటకైనా రెడీ’ అనే డైలాగ్ చెప్పారు. వెంకటేష్- ‘‘దబాంగ్ 3’లో సల్మాన్ డైలాగ్స్ మామూలుగా లేవు. సల్మాన్‌ను ప్రేమించే అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను ’’ అన్నారు వెంకటేష్. రామ్‌చరణ్- ‘‘సల్మాన్‌భాయ్ నుంచి ఎన్ని నేర్చుకుంటున్నానో వివరించడానికి ఒక వేదిక, కొన్ని మాటలు సరిపోవు. సల్మాన్, సుదీప్, వెంకటేష్‌గారు, చిరంజీవిగారు.. ఇలాంటి సూపర్ స్టార్లు అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ కాదు... క్రమశిక్షణ గురించి చెబుతున్నాను. వీరి నుంచి మా తరం క్రమశిక్షణను నేర్చుకుంటాం. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన సల్మాన్‌ఖాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘దబాంగ్ 3’ మన తెలుగు సినిమాలానే ఉంటుంది. థియేటర్లో చూసి ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు ప్రభుదేవా. ‘‘సల్మాన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు సుదీప్. ‘‘ఇది మా అందరికీ చాలా ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సోనాక్షీ సిన్హా. ‘‘ఈ చిత్రంలో ‘హుడ్ హుడ్, గుభాళించనే’ అనే పాటలు రాసే అవకాశం ఇచ్చిన సల్మాన్, ప్రభుదేవాగార్లతో పాటు సంధానకర్తగా వ్యవహరించిన రాజేశ్వరీ సుధాకర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘జీవితంలో కండలు పెంచాలనే కోరిక ఉండేది. అది తీరలేదు. కానీ కండల వీరుడికి పాట రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇందులో ‘ఊ కొడితే, తొలిగా తొలిగా..’ అనే పాటలు రాశాను. ప్రభుదేవా, వీవీవీ రాయుడుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి జగదీష్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సల్మాన్ ఖాన్‌తో వెంకీ మామ డ్యాన్స్
-
ఇరగదీసిన సూపర్ స్టార్స్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం దబాంగ్ 3. హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్, వెంకటేశ్‌లతో కలిసి సల్మాన్ చిందులేశారు. వేదికపై ముగ్గురు స్టార్స్ కలిసి చేసిన డ్యాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దబాంగ్ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్(పోకిరి రీమేక్)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. సోనాక్షి సల్మాన్ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు. దబాంగ్ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్, మహీగిల్ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిలీజ్‌కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని
ఇష్టమైన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అభిమానులు దాన్ని ఓ పండగలా జరుపుకుంటారు. హీరో కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తారు. థియేటర్ల ముందు క్యూ కడుతారు. పనులన్నీ పక్కన పెట్టి ఫస్ట్‌డే ఫస్ట్ షోకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మనం చెప్పుకునే వీరాభిమాని అంతకుమించిన పని చేసి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలిచాడు. విజయ్ అనే వ్యక్తి చుల్బుల్ పాండే(సల్మాన్ ఖాన్)కు డైహార్డ్ ఫ్యాన్. తాజాగా సల్మాన్ నటించిన ‘దబాంగ్ 3’ శుక్రవారం విడుదల కానుండటంతో విజయ్ ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ తన ఒక్కడికో, కుటుంబానికో లేదా ఫ్రెండ్స్‌కో సరిపడా టికెట్లు కొనలేదు. ఏకంగా 150 టికెట్లు కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాదాపు ఓ మినీ థియేటర్‌నే బుక్ చేశాడనుకోండి. జమ్ము అనే ఫ్యాన్స్ క్లబ్ కూడా దబాంగ్ 3 కోసం ముందస్తుగా 100 టికెట్లు కొనుగోలు చేసింది. గతంలో సల్మాన్ నటించిన రేస్ 3 చిత్రం అంతంతమాత్రంగానే ఉందని విమర్శకులు పెదవి విరిచారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా రూ.300 కోట్ల మైలురాయిని చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే అతని అభిమాన ఘనం బలమేంటో అర్థమవుతోంది. ఇక ‘దబాంగ్ 3’ ట్రైలర్ 50మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాతో ఈ యేడు మంచి ముగింపును పలకడానికి సల్మాన్ రెడీ అయిపోయాడన్నమాట. -
‘సోనాక్షి సల్మాన్ ఖాన్ చెంచా!’
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ దబాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హా తనపై విమర్శలు చేసిన నెటిజన్లపై ఫైర్ అయింది. తనను సల్మాన్ ఖాన్ చంచా అని, నటించడం రాదని కేవలం మీ నాన్న సినిమా రంగంలో ఉండడం వల్లే అవకాశాలు వస్తున్నాయనే ఓ నెటిజన్ విమర్శలకు సోనాలి ఘాటైన సమాధానమిచ్చింది. తనకు నటన రాకుంటే 9 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో అవకాశాలు ఎందుకొచ్చాయంటూ ప్రశ్నించింది. మరికొందరు నెటిజన్లు లావుగా ఉన్నావంటూ.. ఆమె టీవీలో కనిపిస్తే టీవీనే పగలగొడుతానని, సోనాక్షిని తీవ్రంగా ద్వేషిస్తానని అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేయగా వాటికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై సోనాక్షి స్పందిస్తూ.. మీరు టీవీని పగలగొడుతున్నారంటే మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నావనుకుంటా నచ్చకుంటే టీవీని ఆపేయవచ్చు..అంతేగానీ పగలగొట్టాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడిగా సోనాక్షి దబాంగ్ 3లో నటిస్తుండగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకో!?
ముంబై: బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం దబాంగ్-3కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల దబాంగ్ 3 చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోలో హిందూ దేవతలు, సాధువులను కించపరిచారంటూ శుక్రవారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో #బాయ్కాట్దబాంగ్3 అనే దుమారం చెలరేగింది. కొన్నిసీన్లు అభ్యంతకరంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ జనజాగృతి అనే హిందూ ధార్మిక సంస్థ దబాంగ్3 చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చింది. Recently a video song 'Hud Hud Dabangg Dabangg' in upcoming movie Dabangg 3 was released. The scenes in this song have insulted Sages and Hindu deities, hence Hindus are protesting against this movie.#BoycottDabangg3 — HinduJagrutiOrg (@HinduJagrutiOrg) November 29, 2019 వివరాల్లోకి వెళితే.. 'మై హు దబాంగ్ దబాంగ్' అనే సాంగ్‌లో హీరో సల్మాన్ వెనుకగా కొంతమంది సాధువులు గిటార్ పట్టుకుని తమ కాళ్లను కదిపే సీన్లు ఉన్నాయి. దీంతో సల్మాన్ హిందువుల వ్యతిరేకి అని, డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న దబాంగ్3ను అడ్డుకోవాలని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎవరు ఎన్ని ఎత్తులేసినా.. దబాంగ్3 మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందని సల్మాన్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక హీరో అక్షయ్‌కుమార్ ఇదివరకు 'భూల్ భులయ్యా' సాంగ్‌లో సాధువులను వెంటేసుకుని డాన్స్ చేస్తే రాని నిరసనల హోరు.. ఇప్పుడెందుకొస్తుందని వెనకేసుకొస్తున్నారు. కేవలం ముస్లిం కావడంతోనే ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారని సల్మాన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడని, అంతా ద్వేషం పనికిరాదని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం సినిమాను బాయ్‌కాట్ చేయకుండా కేవలం 10 సెకన్ల నిడివిగల సాధువులు ఉన్న సీన్ కట్‌చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. -
ఒక్క హౌస్‌ఫుల్ చాలు అనుకున్నా
ఎక్కువ ఊహించుకుంటే.. తక్కువగా కోరుకోలేం. సుదీప్ ఊహలకు రెక్కలు కట్టుకునే మనిషి కాదు. అందుకే ఏనాడూ.. తక్కువైందని బాధపడే అవసరం రాలేదు. అవసరం ఎందుకు రాలేదంటే ఎక్కువగా కోరుకోలేదు! ఒక్క హౌస్ ఫుల్ ఉంటే చాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. కన్నడలో ఇప్పుడు స్టార్ హీరో! స్టార్ కాకపోయుంటే? అసలు హీరోనే అవకపోయుంటే? కనీసం కాఫీ కప్పులైనా అందిస్తుండేవారట! అంతిష్టం.. సుదీప్‌కి సినిమా అంటే. ప్రస్తుతం ‘దబాంగ్ 3’లో యాక్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలకేం గానీ.. సుదీప్‌లో ఇంకో సుదీప్‌ని కనిపెట్టింది ‘సాక్షి’! ఆ ఇంకో సుదీప్ ఎవరో చదివి మీరూ కనిపెట్టండి. మీరు జిమ్ చేయరని, యోగా మీద ఆసక్తి లేదని విన్నాం. కానీ ఈ మధ్య విడుదలైన ‘పహిల్వాన్’ కోసం జిమ్ చేశారట? ఫిట్నెస్ అంటే జిమ్, యోగా మాత్రమే కాదు. జాగింగ్, స్పోర్ట్స్ వల్ల కూడా ఫిట్‌గా ఉండొచ్చు. అలా నేనెప్పుడూ ఫిట్‌గా ఉన్నాను. నాకిష్టం లేకపోయినా ‘పహిల్వాన్’కు జిమ్ చేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్ నాకు కొత్త కాదు కానీ జిమ్ కొత్తగా అనిపించింది. మరి జిమ్ వల్ల కొత్తగా అలవర్చుకున్న విషయాలేమైనా? మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్రపోవడం వల్ల కోరుకున్నట్టుగా బాడీ మారిపోతుంది. బ్యాలెన్స్‌తో ఉంటాం. నేను 89 ఉండేవాణ్ణి. ఇప్పుడు 74 కేజీలు ఉన్నాను. చాలా తేలికగా అనిపిస్తుంది. నా డ్రెస్‌లన్నీ మారిపోయాయి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అయితే నేను జిమ్‌కి ఎందుకు దూరంగా ఉంటానంటే.. రోజూ ఒకే టైమ్‌కి నిద్రలేవాలి. ఒక టైమింగ్ ప్రకారం జిమ్ చేయాలి. అది నాకు కష్టంగా ఉంటుంది (నవ్వుతూ). అదే స్పోర్ట్స్ అనుకోండి మన ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అన్నారు. బరువుకి, కాన్ఫిడెన్స్‌కి సంబంధం ఏటి? స్లిమ్‌గా ఉంటే స్క్రీన్ మీద సన్నివేశం కోసం షర్ట్ తీయాల్సి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ఒక ఆర్టిస్ట్‌గా ఇలాంటి సీన్స్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. నా సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. నా బలం నా విజయాలు. దానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? ఆ సంగతి అలా ఉంచితే ఫిట్నెస్ అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. మెదడు షార్ప్‌గా ఉన్నట్టే బాడీ కూడా ఫిట్‌గా ఉంటే ప్లస్. ‘స్లిమ్’గా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. లావుగా ఉన్నవాళ్లను కొందరు ‘బాడీ షేమింగ్’ చేస్తుంటారు. దాని గురించి? బాడీ షేమింగ్ తప్పు. అది ఆ మాటలు పడేవాళ్ల పర్సనాలిటీ కంటే షేమింగ్ చేసేవాళ్ల పర్సనాలిటీ ఏంటో చెబుతుంది. బరువుగా ఉన్నారే అనుకుందాం. వాళ్లకి ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నప్పుడు మధ్యలో నీ సమస్య ఏంటి? అంత కఠినంగా ఎందుకు వాళ్లను హేళన చేయాలి. మనలోనే బోలెడు తప్పులు ఉంటాయి. బాడీ ఫిట్‌గా ఉండొచ్చు. కానీ బ్రెయిన్ సరిగ్గా లేకపోవచ్చుగా? మనం కామెంట్ చేసేవాళ్లకు ఫిట్ బాడీ లేదేమో. ప్రపంచంలోనే బెస్ట్ బ్రెయిన్ ఉంటే? అప్పుడు వాళ్లకన్నా మనం తక్కువే కదా. ప్రస్తుతం నా బాడీ ఫిట్‌గా ఉండటం నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ సార్‌తో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాను. ఇద్దరం షర్ట్ లేకుండా ఓ ఫైట్ సీన్ ఉంది. ‘పహిల్వాన్’ కోసం ఫిట్‌గా మారడం వల్ల ఆ ఫైట్ చేయగలి గాను. íసినిమా యాక్టర్‌ని కాబట్టి నేను స్లిమ్‌గా ఉండటం అవసరం. అదే బయటివాళ్లు లావుగా ఉండి, వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోతే వాళ్లు కాన్ఫిడెన్స్‌గా ఉండొచ్చు. ఆరోగ్యానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? అయితే నా ఉద్దేశం ఏంటంటే.. మనిషిగా ఉన్నంతకాలం వేరేవాళ్లను కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మనిషి అంటేనే ఏదో ఓ వీక్నెస్ ఉంటుంది. అందుకే మనం మనుషులం. దాన్ని కవర్ చేసుకు నేంత తెలివిని మనకు దేవుడు ఇచ్చాడు. ప్రతి దశను ఎంజాయ్ చేస్తూ, సూపర్ స్టార్ స్టేజ్‌ని చేరుకునే క్రమంలో మీరు ఎన్ని చేదు అనుభవాలను దాటారు? ఒక్క హౌస్‌ఫుల్ ఉంటే చాలు అని నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్లో 15 మంది ఉన్నారు సుమారుగా. ఆల్రెడీ రెండు మూడు సినిమాలు ఆగిపోయాయి కూడా. అయితే నిరాశపడలేదు. ఎందుకంటే లక్ష్యం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి. మనం కూడా ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఆలోచనల్ని ఎదగనిస్తూనే ఉండాలి. ప్రస్తుతం ఉన్న మూమెంట్లో ఉండటం నేర్చుకోవాలి. ప్రస్తుతంలో బతకలేనప్పుడు మన జీవితాల్లో గ్రోత్ ఎక్కడ ఉంటుంది? అందుకే అప్పటి ఆ చేదు అనుభవాలను నన్ను నేను ముందుకు పుష్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. సంతోషం ఎక్కడో లేదు. మనలోనే ఉంటుంది. వేరే వాళ్లలో వేరే వస్తువుల్లో వెతికితే ఫూల్స్ కిందే లెక్క. మీ మాటలన్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.. బహుశా అనుభవాలు నేర్పించిన పాఠాలేమో? అవును. టైమ్ ప్రతీది మనకు నేర్పిస్తుంది. అయితే ఆ టైమ్‌కి జరగాల్సినవి జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్లో లేకపోవడం వల్ల గతంలో నేను చాలా విషయాలను మిస్ అయ్యాను. మా పాప ఎదగడాన్ని నేను గ్రహించే ముందే ఎదిగిపోయింది. సడెన్‌గా చూస్తే.. మన పాప ఇంత పెద్దది అయిపోయిందా అనిపిస్తుంది. నటుడిగా బిజీ అయిపోయి పాప ఎదిగే క్రమాన్ని ఆస్వా దించలేదు. మన మూమెంట్‌ని ఎంజాయ్ చేయడం ముఖ్యం అని ఆ తర్వాత తెలిసింది. హౌస్‌ఫుల్స్, వరుస బ్లాక్‌బస్టర్స్ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఏదీ ఆశించడంలేదు. ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఇదే మన ఆఖరి రోజు అని ఫీల్ అయి పని చేయడమే. ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆఖరి రోజే అవుతుంది. నేను హీరో అవ్వాలనుకున్నాను. అసాధ్యం అన్నది చాలామంది అభిప్రాయం. కానీ అయ్యాను కదా (నవ్వుతూ). నన్ను నేను నమ్మాను. ప్రయత్నించాను. అయ్యాను. నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాల్లో ఉండాలనుకున్నాను. యాక్సిడెంటల్‌గా హీరో అయ్యాను. ఒకవేళ హీరోక ఆకపోయి ఉంటే.. సినిమా స్టూడియోల్లో కాఫీలు ఇస్తూ అయినా ఉండేవాణ్ణి. సినిమా అంటే అంత ఇష్టం. టాలెంట్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు ఇక్కడికి రాలేకపోయారు. నేను వచ్చాను కదా. ఇంకా ఏం కోరుకోవాలి? మనం వచ్చాం అని ఆనందం వేస్తుంది, భయం కూడా వేస్తుంది. సినిమాల్లో రఫ్‌గా కనిపించే సుదీప్‌కి భయమా? (నవ్వుతూ) భయమే ఒక మనిషిని కాన్ఫిడెంట్‌గా మార్చుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ భయాన్ని అధిగమించాలని కష్టపడుతుంటాం. నా ఇవాళ్టి భయాలు రేపటికి నా భయాలు కావు. ఎందుకంటే రేపు ఉదయానికల్లా దాన్ని అధిగమించేసి ఉంటాను కాబట్టి. అందరూ అలా ఆలోచించాలని కోరుకుంటాను. లేకపోతే జీవితాంతం పరిగెట్టడమే. ఎంతకాలం పరిగెడతావు? ప్రయత్నించు. ఒకటి అది నిన్ను ఓడించాలి లేదా నువ్వు దాన్ని ఓడించాలి. అంతేకానీ చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనల్లో ఉండిపోకూడదు. కొన్ని టిని అంగీకరించాలి, కొన్నిటిని అధిగమించాలి. అవునూ.. మీరు పుట్టినరోజు (సెప్టెంబర్ 2)లు చేసుకోరట? కారణం ఏంటి? ఒకప్పుడు చేసుకునేవాడిని. ఆ తర్వాత అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆపేశాను. నాక్కూడా మొదట్లో నా బర్త్‌డేను చాలామంది మధ్యలో జరుపుకోవాలని, పాపులర్ అవ్వాలి అని, పూలమాలలు, కటౌట్స్ ఏర్పాటు చేయాలనీ ఉండేది. అదంతా ఓ ఫేజ్. ఓ రోజు నా బర్త్‌డే హంగామా అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పాప రోడ్డు మీద పడిపోయిన కేక్ ముక్కను ఏరుకొని తినడం కనిపించింది. ఆ దృశ్యం నన్ను చాలా బలంగా తాకింది. నాక్కూడా ఓ కూతురు ఉంది. నా లగ్జరీ ఒకరికి ఒక పూట తిండి. ఇక కేక్ కటింగులు, కటౌటులు వద్దనుకున్నా. ఫ్యాన్స్‌కి కూడా చెప్పాను. ఆ తర్వాతి సంవత్సరం ఇంట్లో లేకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాను. చాలా మంది తిట్టారు. కోపగించుకున్నారు. అంత దూరం నుంచి నీ ఇంటికి వస్తే ఇంట్లో లేకుండా వెళ్లిపోతావా? అన్నారు. అవన్నీ తీసుకున్నాను. రెండు రోజులు వాళ్లను తిట్టనిచ్చాను. ఆ తర్వాత ఓ వీడియో నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ‘నన్ను సంతోషపెట్టడానికే మీరు ఇక్కడికి వస్తే నా కోసం ఏదీ తేవద్దు. అవన్నీ తీసుకొస్తానంటే నేను కలవను. అంతగా ఇవ్వాలనుంటే ఓ కేక్ కొని మీ వీధిలో వాళ్లకు పంచండి. నన్ను ప్రేమిస్తే అలా చేయండి అన్నాను. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ తర్వాత అర్థమయింది. ఫ్యాన్స్ అందరూ మంచి పనులు చేయడం గమనించాను. ఒక్క రోజా పువ్వు కూడా తేలేదు. జీవితంలో ఒక స్టేజ్‌కి వచ్చాక పూలమాలలు, కటౌట్లు మనల్ని ఎగ్జయిట్ చేయవు. నేను అద్భుతాలు చేయలేకపోవచ్చు. కానీ నాకు ఉన్న దానిలో నాకు చేతనైనంత చేయగలను. నాకోసం వృథా ఖర్చు చేయడం మానేశాను. నా దగ్గర ఉండేవన్నీ 200, 300 ఖరీదు గల వస్తువులే. నా బట్టలు కూడా అంతే. 200, 300 టీషర్ట్స్ వేసుకుంటాను. మీ భార్య, మీ పాప ఏమీ అనరా? నా వైఫ్ చాలా స్వీట్. నా కూతురు కూడా సింపుల్‌గా బతకడానికే ఇష్టపడుతుంది. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటుంది. లగ్జరీ లైఫ్ పట్ల ఆసక్తి చూపించదు. ఇద్దరూ సంప్రదాయాలకు విలువ ఇస్తారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై... ఇలా ఎక్కువ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏదో ఒకరోజు ప్రతి ఒక్క హీరో ఆడియన్స్‌కి బోర్ కొడతారు. ఏదో ఒకరోజు ప్రతి హీరో వెనక్కి వెళ్లక తప్పదు. అలాంటప్పుడు మనకు పని ఉన్నప్పుడు వదులుకోకూడదు. నేను కష్టపడుతున్నాను అని అనుకోకూడదు. ఇష్టపడుతూ పని చేసినప్పుడే పనిని ఎంజాయ్ చేయగలం. వరుసగా పది ఫ్లాప్‌లు వచ్చినా ఓ హీరోకి ఏం కాదు. కానీ నీ కోసం ఎవరూ స్టోరీ రాయకపోతే మన పని అయిపోయినట్లే. మన కోసం ఎవరూ స్టోరీ రాయడం లేదని తెలిసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఒకరు ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు యాక్టింగ్ విషయంలో నీ పేరు ఒక్కసారి అయినా వారి ఆలోచనల్లోకి వచ్చి పోవాలి. దాని అర్ధం ఏంటంటే ప్రతి పాత్రకు నువ్వు సూట్ అవుతావని. అయితే ఒక్క విషయం ఏంటంటే.. నేను ఇండస్ట్రీకి ఖాళీగా వచ్చాను. సో.. నేను దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. కన్నడంలో స్టార్ హీరో అనిపించుకుని, తెలుగు ‘ఈగ’లో విలన్‌గా చేసిన అనుభవం గురించి? ఆ సినిమా ప్రాసెస్‌ను ఎంజాయ్ చేయకుండా అయ్యో ఈ సినిమాలో మనం హీరో కాదు... వెంటనే తెలుగులో హీరోగా పెద్ద సినిమా చేయాలి అని ఆలోచిస్తే కుదరదు. టిఫిన్ తినడానికి కూర్చుని దాన్ని ఆస్వాదించకుండా లంచ్‌కి ఆలోచిస్తున్నట్టుంటుంది. ఇడ్లీలు వడ్డించగానే ‘ఆ లంచ్ ఏంటి? అంటే.. ఆ ఇడ్లీ తయారు చేయడానికి నీ భార్య, తల్లి లేక వేరే ఎవరో ఎంతో కష్టపడి ఉంటారు. దాన్ని తయారు చేయడానికి ఉదయాన్నే వాళ్లు నిద్రలేచి చేస్తే, దాన్ని ఆస్వాదించకుంటే వాళ్లను గౌరవించనట్టే లెక్క. మీరు మీ వీక్నెస్లను ఎలా కవర్ చేసుకుంటారు? నేను లుక్స్ పరంగా ది బెస్ట్ కాకపోవచ్చు. నా కంటే లుక్స్‌లో అద్భుతంగా ఉండేవాళ్లు ఉండొచ్చు. కానీ నేనెక్కడున్నా నా ప్రెజెన్స్ తెలిసేంత కాన్ఫిడెంట్‌గా ఉండగలను. మనకంటే బెస్ట్ వాళ్లతో పోల్చుకుని బాధపడటం ఎందుకు? బెటర్‌గా మారేందుకు కష్టపడదాం. అన్నీ అరచేతిలో ఉండి కూడా ఇంకా ఏదో కావాలని ఏడుస్తాం. అది పర్సనాలిటీ డిజార్డర్. ఆ వీక్నెస్ ఉంటే కష్టం. లక్కీగా నాకది లేదు. నాతో నన్ను పోల్చుకుని బెటర్ అవడానికి ట్రై చేస్తుంటాను. ఇతరులను పట్టించుకోను. – డి.జి. భవాని -
బాలీవుడ్ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్..
దక్షిణాది చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అని బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం దబాంగ్–3. దీనికి ఈయనే నిర్మాత కావడం విశేషం. మరో విశేషం ప్రభుదేవా దర్శకుడు కావడం. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన దబాంగ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దబాంగ్–2 చేశారు. తాజా గా దానికి మూడవ సీక్వెల్‌గా దబాంగ్ 3 రెడీ అయ్యింది. సోనాక్షిసిన్హా నాయకిగా నటించిన ఇందులో నటుడు ప్రకాశ్‌రాజ్, అర్బాస్ఖాన్, మహీగిల్ ముఖ్యపాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న దబాంగ్–3 చిత్ర ప్రమోషన్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఇది హిందీతో పాటు పలు భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో చిత్ర తమిళ వెర్షన్ ప్రసారంలో భాగంగా నటుడు సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా బుధవారం చెన్నైలో హల్చల్ చేశారు. దబాంగ్–3 చిత్ర దర్శకుడు ప్రభుదేవా మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. దబాంగ్ చిత్రం సక్సెస్ తరువాత ఇప్పుడు దబాంగ్–3 చిత్రం చేసినట్లు తెలిపారు. ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయని అన్నారు. దీంతో చిత్ర యూనిట్ అంతా చాలా శ్రమించినట్లు తెలిపారు. దబాంగ్–3ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రేక్షకులను నేరుగా కలుసుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర ట్రైలర్ అందరినీ అలరించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ దక్షిణాది చిత్రాలు తనకెప్పుడూ ఇష్టమేనన్నారు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ నటించిన చిత్రాలను తాను చాలా ఇష్టపడిచూస్తానని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం హిందీ చిత్రాలకంటే కూడా బాహుబలి, కేజీఎఫ్ వంటి దక్షిణాది చిత్రాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు. తమిళంలో విజయ్ నటించిన పోకిరి చిత్ర హీంది రీమేక్‌లో తాను నటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నటించిన తెరి, తిరుపాచ్చి చిత్రాలు తనకు బాగా నచ్చినట్లు చెప్పారు. దబాంగ్–3 చిత్రం తన మనసుకు బాగా దగ్గరైన చిత్రం అని అన్నారు. ఇది దక్షిణాది చిత్రాల మాదిరిగానే ఉంటుందని, ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఎక్కువగా పనిచేసినట్లు తెలిపారు. ప్రభుదేవా మా సొత్తు అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విజయానికి చిహ్నంగా పేర్కొన్నారు. తన తదుపరి చిత్రానికి ఆయనే దర్శకుడని చెప్పారు. మరోసారి త్వరలోనే తమిళ ప్రేక్షకులను తాను ప్రత్యక్షంగా కలుసుకుంటానని నటుడు సల్మాన్‌ఖాన్ అన్నారు. -
ఖాకీ వేస్తే పోలీస్... తీస్తే రౌడీ
‘‘ప్రతి సినిమా విజయం సాధించాలనే కష్టపడి చేస్తాం. ఆ ఒత్తిడి మాపై ఉంటుంది. కానీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే విజయం దక్కుతుంది. మేం స్టార్స్ కావడానికి వారి ఆశీర్వాదమే కారణం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షీ సిన్హా హీరోయిన్గా నటించారు. అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఖాకీ వేస్తే పోలీస్.. తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్ రౌండర్ని’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ కిక్ ఇచ్చేలా ఉంది. ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులు, విలేకరులతో ‘దబాంగ్ 3’ కీలక చిత్రబృందం మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇది క్లాస్ మాస్ ఫిల్మ్. సౌత్ సినిమా ఫార్మాట్‌కు దగ్గరగా ఉంటుంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నేను చేసిన ‘వాంటెడ్’ తెలుగు ‘పోకిరి’ చిత్రానికి రీమేక్. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలో అనువాదం అవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తాను’’ అన్నారు. ప్రభుదేవా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కలిసే ప్రయత్నం చేస్తా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సల్మాన్. ‘‘దబాంగ్ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా. -
దబాంగ్ 3 ట్రైలర్
-
నా సొంత పగ అంటున్న సల్మాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దబాంగ్ 3. ఇప్పటికే ఈ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దబాంగ్ 3కి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. మూడు నిమిషాలు సాగిన ఈ ట్రైలర్లో.. ప్రజెంట్, ప్లాష్‌బ్యాక్ పాత్రల్లో సల్మాన్ తనదైన నటనను కనబరిచారు. సోనాక్షి సల్మాన్ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు. కామెడీతోపాటు, ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చుల్బుల్ పాండేగా మరోసారి సల్మాన్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. దబాంగ్ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్, మహీగిల్ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్(పోకిరి రీమేక్)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభుదేవా మరోసారి సల్మాన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కొరియన్ చిత్రం ‘ద అవుట్ లాస్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. -
‘దబాంగ్-3’తో నటుడి కుమార్తె తెరంగ్రేటం
ముంబై: బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్-3’తో సీనియర్ నటుడు, సినీ నిర్మాత మహేష్ మంజ్రేకర్ ముద్దుల తనయ సాయి ఎం మంజ్రేకర్ వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సల్మాన్ మంగళవారం ట్విటర్లో రిలీజ్ చేసిన పోస్టర్లో నటి సాయి మంజ్రేకర్‌ను పరిచయం చేస్తూ.. 'ఎటువంటి మాలిన్యం లేని స్వచ్ఛమైన మా అమాయకపు చిన్నారి ఖుషీ' అనే వ్యాఖ్యలు జోడించారు. దబాంగ్-3లో ప్రధాన పాత్రధారులుగా ఉన్న హీరోయిన్ సోనాక్షీ సిన్హాతో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ పోస్టర్లను ఇప్పటికే రిలీజ్ చేశారు. సల్మాన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న దబాంగ్-3 ట్రైలర్ అక్టోబరు 23న బయటకు రానుంది. కాగా ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. Hamari pure innocent masoom Khushi...#Dabangg3TrailerOutTomorrow@saieemmanjrekar @arbaazSkhan @sonakshisinha @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SKFilmsOfficial @saffronbrdmedia pic.twitter.com/xrg1oYbjbQ — Chulbul Pandey (@BeingSalmanKhan) October 22, 2019 -
కన్నడంలో ఖాన్ డైలాగ్స్
ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ పంచ్ డైలాగ్స్ ఎక్కువగా హిందీలోనే విన్నాం. త్వరలో కన్నడంలోనూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడానికి సల్మాన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. కన్నడ నటుడు సుదీప్ విలన్‌గా నటించారు. కన్నడంలో సల్మాన్ పాత్రకు సల్మానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ఇందుకోసం కన్నడ ఉచ్చారణ మీద దృష్టి పెట్టారట సల్మాన్. కన్నడంలో సంభాషణలు సరిగ్గా పలికేందుకు సల్మాన్‌కు సుదీప్ సహాయం చేస్తున్నారని కూడా తెలిసింది. డిసెంబర్ 20న ‘దబాంగ్ 3’ రిలీజ్ కానుంది. -
నమ్మలేకపోతున్నా!
బాలీవుడ్లో అగ్రకథానాయికల జాబితాలో పేరు సంపాదించుకున్నారు నటి సోనాక్షీ సిన్హా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’ (2010) సినిమాతో సోనాక్షి హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. హీరోయిన్గా తొమ్మిదేళ్ల సక్సెస్ జర్నీని కంప్లీట్ చేశారామె. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా నా తొలి చిత్రం ‘దబాంగ్’ విడుదలై అప్పుడే తొమ్మిదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. అంత టైమ్ ఇంత త్వరగా గడిచిపోయిందా? అనిపిస్తోంది. ఏదో నిన్ననే ‘దబాంగ్’ చిత్రం విడుదలైన ఫీలింగ్‌లో ఉన్నా. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ నటిగా అద్భుతమైన నా జర్నీని ఇలానే కొనసాగించడానికి కష్టపడతాను’’ అన్నారు. ప్రస్తుతం ‘దబాంగ్ 3’ చిత్రంలో సల్మాన్‌ఖాన్, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది. -
సోనాక్షి ఫోటోషూట్ తళుకులు
ముంబై : దబాంగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో జతకట్టి ఈ బ్యూటీ భారీ విజయాన్నితన ఖాతాలో వేసుకున్నారు. ఎల్లప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు అభిమానులతో షేర్ చేస్తుంటారు ఈ బొద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆన్లైన్ షాపింగ్ ప్రచార కార్యక్రమం ఫోటో షూట్లో దిగిన చిత్రాలను సోనాక్షి బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘బ్లాక్ మ్యాజిక్ వుమెన్’ అనే క్యాప్షన్ జతచేర్చారు. ఈ ఫోటోలో ఆఫ్ షోల్డర్తో ధరించిన నల్లని దుస్తుల్లో, విరబోసిన కురులతో సోనాక్షి అందాలను ఆరబోశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు తన అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. హాట్ లుక్స్‌తో మెరిసిపోతున్న సోనాక్షిని ఫ్యాఫన్ క్వీన్‌గా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం సోనాక్షి దబాంగ్-3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram Black magic woman! For the @myntrafashionsuperstar promo shoot! Styled by @mohitrai @miloni_s91 (tap for deets), hair by @themadhurinakhale, makeup @mehakoberoi and photos by @saurabhdalvi_photography 🖤 A post shared by Sonakshi Sinha (@aslisona) on Sep 11, 2019 at 6:24am PDT -
దబాంగ్ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్
దబాంగ్ సిరీస్‌తో చుల్‌బుల్‌పాండేగా అలరించిన కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దబాంగ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. చుల్బుల్ పాండే గెటఫ్లో సల్మాన్ మరోసారి అదిరిపోయారు. పోస్టర్‌పై 'స్వాగతించారా' అనే క్యాప్షన్ హైలెట్‌గా నిలిచింది. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. దబాంగ్ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్, మహీగిల్ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ విలన్ పాత్ర పోషించనున్నాడు. కాగా డిసెంబర్ 20న దబాంగ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. -
ఒక్క సెల్ఫీ భాయ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ముంబై రోడ్లపై సైకిల్ తొక్కారు. పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించే సల్మాన్ సడన్‌గా ఇలా సైకిల్‌తో రోడ్డు ఎక్కడానికి కారణం ఉంది. ముంబైలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రీకరణ ముంబైలోనే జరుగుతోంది. వర్షాల వల్ల కారులో వెళితే ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయని సల్మాన్ ఊహించి ఉంటారు. అందుకే సైకిల్‌పై ‘దబాంగ్ 3’ సెట్స్‌కు వెళ్లారు. సల్మాన్ వంటి సూపర్‌స్టార్ రోడ్డుపై కనిపిస్తే అభిమానులు ఊరుకోరు కదా.. వెంటనే ఒక్క సెల్ఫీ భాయ్ అని అడిగారు. స్మైల్‌తో సల్మాన్ పోజిచ్చారు. ఇలా చాలా మంది సెల్ఫీస్‌లో బందీ అయిపోయారు సల్మాన్. ఇక ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
వాళ్ల బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది : సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోతురాజు వేషదారణలో ఉన్న కొంతమంది వ్యక్తులను సల్మాన్ కలిసి వీడియో అది. వీడియోలో సల్మాన్ వారితో సరదాగా ముచ్చటించటంతో పాటు వారి కొరడాతో తాను కూడా కొట్టుకున్నాడు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ తమతో కొంత సమయం గడపటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సల్మాన్ ‘వారి అనుభూతుల్ని, బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది. ఇది మీపై మీరు ప్రయత్నించకండి. మరొకరి మీద కూడా ప్రయోగించకండి’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు సల్మాన్. ప్రస్తుతం సల్మాన్, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. View this post on Instagram Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don't try this on your self or on any 1 else A post shared by Salman Khan (@beingsalmankhan) on Aug 30, 2019 at 11:00pm PDT -
మిల మిల మెరిసే మీనాక్షి!
సోనాక్షి సిన్హా నటి మాత్రమే కాదు...చక్కగా బొమ్మలు గీస్తుంది. అంతకంటే చక్కగా పాడుతుంది. ‘దబాంగ్–3’లో ‘రజ్జో పాండే’గా మరోసారి అలరించనుంది. ‘సంతోషం సగం బలం... ఆ బలం పనిలోనే ఉంది’ అంటున్న సోనాక్షి చెప్పిన కొన్ని ముచ్చట్లు... గొప్ప ఔషధం ఎలాంటి సమస్య నుంచి బయట పడడానికైనా ఒక ఔషధం ఉంది. అదే పని! పనిలో తలమునకలైపోతే ఎలాంటి సమస్యను అయినా అధిగమించవచ్చు. ఇది నేను సొంత అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో జిమ్‌లో గడపడం, పెయింటింగ్, స్కెచ్చింగ్ వేయడం, సినిమాలు చూడడంలాంటివి చేస్తుంటాను. ఆత్మవిశ్వాసం వుమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ‘అకిరా’ సినిమా తరువాత ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్నాను. టైటిల్ రోల్ పోషించిన నా సోలో ఫిల్మ్ ఇది. ఇది నాలోని ‘స్కిల్స్’ని నాకు తెలియజేసిన సినిమా. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది. చాలెంజింగ్‌గా ఉండే స్క్రిప్ట్‌లను ఇష్టపడతాను. అప్పుడు మనలో మరోకోణం పరిచయమవుతుంది. మల్టీస్టారర్ సినిమాలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వల్ల నటులలో అభద్రతాభావం తలెత్తితే...హాలీవుడ్లోగానీ, బాలీవుడ్లోగానీ ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండేవి కావు. నాకు అలాంటి భయాలేమీ లేవు. ‘కళంక్’ సినిమాలో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, ఆలియా భట్, వరుణ్‌లతో నటించడం మంచి అనుభవం! సంతోషం జీవితంలో నా మొదటి ప్రాధాన్యత...ఎప్పుడూ సంతోషంగా ఉండడం! నేను సంతోçషంగా ఉండడం ఎంత ముఖ్యమో అవతలి వ్యక్తిని సంతోషంగా ఉంచడం అంతే ముఖ్యమని నమ్ముతాను. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రభావం చేసే పని మీద పడి చురుగ్గా ఉండగలుగుతాం. చదువు చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. నటి కావడానికి ముందు మూడు సంవత్సరాలు ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది ఇప్పుడు ఏదో ఒకచోట ఉపయోగ పడుతూనే ఉంది. ఉదాహరణకు సెట్లో ఉన్నప్పుడు ‘క్విక్ అల్టరేషన్’ అవసరమైంది అనుకోండి... సై్టలిస్ట్లు, డిజైనర్లకు ఏంచేయాలో చెబుతాను. ఇది నా వృత్తిలో భాగం అనుకుంటాను. -
ఐటమ్ భాయ్?
మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ ‘ఐటమ్ సాంగ్’. ఆ స్పెషల్ సాంగ్‌ను టాప్ హీరోయిన్స్ లేదా ఐటమ్ గాళ్స్‌తో డ్యాన్స్ చేయించాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. తాజాగా ‘మా సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఎవ్వరూ అవసరం లేదు’ అనుకుంటున్నారట సల్మాన్ ఖాన్, ‘దబాంగ్ 3’ చిత్రబృందం. బాలీవుడ్ భాయ్ సల్మాన్ తన కొత్త చిత్రం ‘దబాంగ్ 3’ కోసం ఐటమ్ భాయ్ కాబోతున్నారని బాలీవుడ్ టాక్. ‘దబాంగ్’లో ‘మున్నీ బద్నామ్ హుయి డార్లింగ్ తేరేలియే....’ అంటూ సాగే స్పెషల్‌సాంగ్ ఆ సినిమాకే హైలైట్. మలైకా అరోరా వేసిన స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్. ‘దబాంగ్ 2’లో కరీనా కపూర్‌తో ‘ఫేవికాల్ సే’ సాంగ్‌ను తెరకెక్కించారు. ఆ పాట కూడా సూపర్ హిట్. తాజాగా ‘దబాంగ్ 3’లో ఐటమ్ నంబర్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దబాంగ్ 3’ స్పెషల్ సాంగ్‌లో కాలు కదపడం లేదని మలైకా స్పష్టం చేశారు. ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారని చూస్తుంటే ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ‘దబాంగ్’ ఐటమ్ సాంగ్ సిరీస్‌లో ట్విస్ట్ వచ్చింది. ‘దబాంగ్’ ఫస్ట్‌పార్ట్‌లో ఉన్న ‘మున్నీ బద్నామ్...’ను మున్నాగా మార్చి కొత్త పాట రాస్తున్నారట. ఈ కొత్త లిరిక్స్‌కు మ్యాచింగ్‌గా సల్మానే స్టెప్స్ వేయబోతున్నారట. ఇదే నిజమైతే సల్మాన్ ట్రేడ్‌మార్క్ స్టెప్స్ అభిమానులకు విందు అవుతాయని చెప్పొచ్చు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. -
జిమ్ బోనస్
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, శాండల్‌వుడ్‌లో ‘కిచ్చ’ సుదీప్ టాప్ స్టార్స్. అదీ కాకుండా బాడీ ఫిట్‌గా ఉంచుకోవడంలో వాళ్లు చూపించే శ్రద్ధ ఎక్కువే. ఈ ఇద్దరూ ‘దబాంగ్ 3’ కోసం కలిశారు. సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సుదీప్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సెట్లో ఇటీవల జాయిన్ అయ్యారు సుదీప్. ‘‘బయట భరించలేని ఎండ. అయినప్పటికీ మా సెట్లో ఉన్న ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతోంది. అద్భుతమైన సెట్, అద్భుతమైన మనుషుల మధ్య ఫస్ట్ డే షూట్ గడిచింది. సెట్లో జిమ్ ఉండటం బోనస్. థ్యాంక్యూ సల్మాన్ సార్. ఇంటి దగ్గరే ఉన్నట్టు మమ్మల్ని చూసుకుంటున్నందుకు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, బాద్షా షారుక్ ఖాన్ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహంగా ఉంటున్నారు. ఈ మధ్య ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించడం కనిపిస్తోంది. సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’ సినిమాలో మెజీషియన్ పాత్రలో షారుక్ కనిపిస్తే, ‘జీరో’ సినిమాలో ఓ పాటలో షారుక్‌తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. తాజాగా మరోసారి సల్మాన్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారట. ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్’కి సీక్వెల్‌గా సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో షారుక్ ఖాన్ పాత్ర కనిపిస్తుందట. ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో ‘దబాంగ్ 3’ షూటింగ్ నడుస్తోంది. అతిథి కాదు విలన్! షారుక్ ఖాన్ కెరీర్ స్టార్టింగ్‌లో విలన్‌గా ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్స్‌లో ఆయన నటించిన ‘బాజీగర్, డర్’ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్గా అట్లీ– విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ స్పోర్ట్స్ డ్రామాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా వినిపిస్తున్నదేంటంటే ఈ సినిమాలో షారుక్ గెస్ట్ కాదట, విలన్‌గా నటిస్తారట. క్లైమాక్స్‌లో మాత్రమే కనిపించే ఈ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం. -
సల్మాన్ ఖాన్ సినిమాలో అలీ!
సల్మాన్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ దబాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్‌లో భాగంగానే.. దబాంగ్2 ను తెరకెక్కించని సల్మాన్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. అయినా ఆ పాత్రపై ఉన్న మక్కువతో దబాంగ్3ని సిద్దం చేస్తున్నాడు. ఇటీవలె మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న దబాంగ్3.. రీసెంట్గా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది. దబాంగ్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన గబ్బర్‌సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో అలీ పోషించిన సాంబ క్యారెక్టర్ కూడా హైలెట్ అయింది. అయితే ఇప్పుడీ పాత్రను దబాంగ్3లో కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రలో అలీ నటిస్తున్నారు. తాజాగా జరగుతున్న షెడ్యూల్లో అలీ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్లో అలీ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా నటిస్తోంది. -
‘దబాంగ్3’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీ రికార్డులను క్రియేట్ చేయగా.. సినిమాలోని తన పాత్రపై సల్మాన్ ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. దీనిలో భాగంగానే సీక్వెల్‌ను కూడా తీశారు. అయితే.. సీక్వెల్‌గా తీసిన దబాంగ్2 అంతగా మెప్పించలేకపోయింది. మళ్లీ మూడో సిరీస్‌ను సిద్దం చేస్తున్నాడు సల్మాన్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్లో ‘దబాంగ్3’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ను మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ప్రారంభించాడు. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. ఓ పురాతన విగ్రహం ధ్వంసమైందనే వార్త వైరల్ అయింది. అయితే మొత్తానికి దబాంగ్3 చిత్రబృందం మొదటి షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్గా తీసుకున్నారు. వాంటెడ్ చిత్రం తరువాత ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ‘దబాంగ్3’ని చేస్తున్నాడు. -
సల్మాన్ షూటింగ్లో అపశ్రుతి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం దంబాగ్ 3. దంబాగ్, దబాంగ్ 2 చిత్రాలు ఘనవిజయం సాధించటంతో ఈ సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సల్మాన్ సోదరుడు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అహల్య కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ కోసం సామాన్లు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కోటలోని ఓ పురాతన విగ్రహం ధ్వసమైంది. ప్రస్తుతం ధ్వంసమైన విగ్రహం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాళ్ల సాయంతో షూటింగ్‌కు సంబంధించిన వస్తువులు పైకి లాగుతుండగా అవి విగ్రహానికి తగిలి చేయి విరిగిపోయినట్టుగా తెలుస్తోంది. పురాతన విగ్రహం ధ్వంసం కావటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ముసలి వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నట్లుంది’
సల్మాన్ ఖాన్ అభిమానలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్ 3’ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో లీక్ అవ్వడమే కాక తెగ వైరలవుతోంది. సల్మాన్ ఓ సాంగ్ షూటింగ్లో పాల్గొన్న వీడియో ఇది. నర్మదా నది ఒడ్డున షూట్ చేస్తోన్న ఈ పాటలో సల్మాన్ డ్యాన్స్ చూసిన జనాలు ఆయనను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు డ్యాన్స్ రావడం లేదని కొందరు కామెంట్ చేయగా.. ఓ ముసలి వ్యక్తి డ్యాన్స్ చేయడానికి ప్రత్నిస్తే ఎలా ఉంటుందో సల్మాన్ డ్యాన్స్ చేస్తే అలానే ఉంది.. ఆయన బరువు తగ్గాలి అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. దాంతో ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. అయితే ఇలా వీడియో లీక్ అవ్వడం పట్ల సల్మాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ విషయంలో జాగ్రత్త తీసుకోనందుకు సదరు ఫోటోగ్రాఫర్ మీద మండిపడుతున్నారు. ప్రస్తుతం దబాంగ్ 3 ఇండోర్‌లోని మండలేశ్వర్ మహేశ్వర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ప్రదేశాలతో సల్మాన్‌కు ఓ అనుబంధం ఉంది. అర్బాజ్ ఖాన్, సల్మాన్ ఇద్దరు జన్మించింది ఇండోర్‌లో కాగా వీరి తాత మండలేశ్వర్ మహేశ్వర్ ప్రాంతంలోనే పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు. -
ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ‘దబాంగ్-3’
ముంబై: సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రం షూటింగ్ ఆదివారం ఇండోర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ దర్శకుడు ప్రభుదేవాతో కలిసున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సల్లూని చూసి అభిమానులు ఈల వేయాల్సిందే. ఇక సినిమా విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ముహూర్త క్లాప్నిచ్చే ఫోటోను పోస్ట్ చేస్తూ చుల్బుల్ పాండే (సల్మాన్) ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. తిరిగి జన్మస్థలానికి వచ్చేశాం అంటూ సల్మాన్ ఖాన్, అర్బజ్ ఖాన్ ఇండోర్‌లో ల్యాండ్ అయిన వీడియో క్లిప్‌ను సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సల్లూభాయ్ బాగానే కష్టపడుతున్నారు. అందులో భాగంగా వీరి తాతగారు పోలీసుగా పని చేసిన ఆయా ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఈ మధ్యే ‘దబాంగ్ 3’ కోసం సల్మాన్ ఏస్ కొరియాగ్రాఫర్ సరోజ్‌ఖాన్‌ని కలిశారు. 2010లో అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో ‘దబాంగ్’ చిత్రం రాగా అది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అర్బజ్‌ఖాన్ దానికి సీక్వెల్‌గా ‘దబాంగ్ 2’ తీశాడు. అది కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. మరి ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రంతో రికార్డులు బద్దలు కొడతాడో లేదో వేచి చూడాలి. ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. -
సల్మాన్ సినిమాలో సౌత్ హీరో..!
సౌత్ సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో సుధీప్. ఈగ సినిమాతో విలన్‌గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుధీప్, మరోసారి బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. సాండల్‌వుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇతర భాషల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సుధీప్ త్వరలో బాలీవుడ్ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హీరోగా సూపర్ హిట్ అయిన సిరీస్ దబాంగ్. ఈ సిరీస్‌లో మూడో భాగంగా రిలీజ్ అవుతున్న దబాంగ్ 3లో సుధీప్ విలన్‌గా నటించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సుధీప్ పహిల్వాన్ టీజర్‌పై సల్మాన్ ప్రశంసల జల్లు కురిపించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్లో వాంటెడ్, రౌడీ రాథోడ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రభుదేవా దబాంగ్ 3కి దర్శకత్వం వహించనున్నాడు. -
స్టార్టింగ్ అప్పుడేనా?
బాలీవుడ్ ‘దబాంగ్’ ఫ్రాంచైజీలో రానున్న థర్డ్ పార్ట్ ‘దబాంగ్ 3’. ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు టీమ్. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లే షెడ్యూల్స్ గురించి క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 4న మొదలవుతుందని బాలీవుడ్ టాక్. ‘దబాంగ్ 3’ సినిమాలో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తారు. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తారు. ప్రస్తుతం ‘భారత్’ సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్‌ఖాన్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయిక. -
వచ్చే ఏడాది వస్తాం
...అంటున్నారు సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా. ఎక్కడికి అంటే.. థియేటర్స్‌లోకి. ‘దబంగ్’తో తొలిసారి ఈ ఇద్దరూ జత కట్టారు. సోనాక్షీకి అది తొలి సినిమా. ఫస్ట్ సినిమాకే సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఓ సూపర్ హిట్‌ని ఖాతాలో వేసుకోవడంతో ‘దబంగ్’ సోనాక్షీకి ఓ తీపి గుర్తు. ఎనిమిదేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రానికి ఆరేళ్ల క్రితం సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు మూడో భాగానికి రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్‌కి అభినవ్ కశ్యప్, సెకండ్ పార్ట్‌కి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. మూడో భాగానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘వచ్చే ఏడాది ‘దబాంగ్ 3’తో మేం మీ ముందుకు వస్తాం’’ అని సల్మాన్, సోనాక్షీ పేర్కొన్నారు. కాగా, తొమ్మిదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’కి దర్శకత్వం వహించారు. హిందీలో దర్శకుడిగా ప్రభుదేవాకి అది తొలి సినిమా. ‘వాంటెడ్’ సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ‘దబంగ్ 3’తో మరో సూపర్ హిట్‌కి రెడీ అయ్యారు. -
దబాంగ్ 3లో...
‘దబాంగ్’ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్లో పెద్ద హిట్స్‌లో ఒకటి. ఆల్రెడీ ఈ సినిమాకి ఓ సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో భాగం రూపొందించే పనిలో పడ్డారు హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవా. మూడో భాగాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు ప్రభుదేవా. అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. సుదీప్‌కు బాలీవుడ్లో యాక్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘ఫూంక్’తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు సుదీప్. ఆ తర్వాత ‘ఫూంక్ 2, రక్త చరిత్ర’ సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని పలకరించారు. ఇప్పుడు ‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఆడియన్స్‌కు మరోసారి హాయ్ చెప్పనున్నారీ కన్నడ స్టార్ హీరో. ఇందులో సుదీప్ది విలన్ క్యారెక్టర్ అని సమాచారం. -
సల్మాన్ సినిమాలో జగ్గుభాయ్
విలన్ గా టర్న్ తీసుకున్న తరువాత కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యారు జగపతి బాబు. లెజెండ్ సినిమాతో విలన్ మారిన ఈ సీనియర్ నటుడు తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇచ్చిన జగ్గుభాయ్ ఇప్పుడు ఉత్తరాది మీద కన్నేశారు. త్వరలోనే ఓ భారీ చిత్రంతో జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ దబాంగ్ సిరీస్ లో మూడో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకు జగపతి బాబును తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే అది విలన్ క్యారెక్టరా.. లేక సహాయ పాత్రా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు తన బాలీవుడ్ ఎంట్రీపై జగపతి బాబు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
రజనీలా కష్టపడే వ్యక్తి సల్మాన్...
... అంటున్నారు నటుడు, దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇది మన తెలుగు ‘పోకిరి’కి రీమేక్. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సల్మాన్ హీరోగా ప్రభుదేవా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూపర్ హిట్ సిరీస్ ‘దబాంగ్’లో మూడో భాగం ఇది. ‘దబాంగ్–3’ పేరుతో తెరకెక్కించనున్నారు. కాగా, ‘దబాంగ్ టూర్’ పేరుతో సల్మాన్ పలు ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుదేవా కూడా ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ గురించి ప్రభుదేవా మాట్లాడుతూ– ‘‘సల్మాన్‌తో సినిమా అంటే నాకు ఛాలెంజ్‌తో కూడుకున్న పని. ఛాలెంజ్‌ని నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. సినిమా రిలీజ్ టైమ్‌లో మాత్రం ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే విషయంలో ఒత్తిడికి గురవుతుంటా. సల్లూ భాయ్ బాగా కష్టపడే వ్యక్తి. ఆయనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇద్దరికీ ఓ విభిన్నమైన స్టైల్ ఉంది. వారెప్పుడూ ఇతరులను మెప్పించాలనుకోరు. వారిని తెరపై చూసి మనమే మెస్మరైజ్ అవుతుంటాం’’ అన్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా కథానాయిక. ‘దబాంగ్’ కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిదే అన్న సంగతి తెలిసిందే. -
దబాంగ్ 3 డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలలో దబాంగ్‌ది ప్రత్యేక స్థానం. 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా చాటిచెప్పింది. ఆ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సల్మాన్‌కి మంచి విజయాన్ని అందించింది. తాజాగా దబాంగ్ 3 నిర్మిస్తున్నట్టు వార్తలు రావడంతో ఆ సినిమా విశేషాలపై ఆసక్తి నెలకొంది. ఈ సీరిస్‌లో విడుదలైన సినిమాలు భారీగా కలెక్షన్లు రాబట్టడంతో, తాజా సినిమాపై పెద్ద ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి. దబాంగ్, దబాంగ్ 2 లలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి సిన్హా నటించారు. ఈ రెండింటిని నిర్మించిన సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, తాజా చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. దబాంగ్‌కు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, దబాంగ్ 2 కి అర్భాజ్ ఖాన్ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో దర్శకుడు ఎవరనేది తెలుసుకోవడానికి అందరు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నింటికి ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవా తెరదించారు. ఈ సినిమాకు తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రెండు సినిమాలకు పనిచేసిన హీరోయిన్ సోనాక్షి, మ్యూజిక్ అందించిన సాజిద్-వాజిద్లతో పాటు, ఇతర బృందం అంత పాతదే ఉంటుందని, తాను ఒక్కన్ని మాత్రమే కొత్తగా చేరుతున్నానని తెలిపారు. సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఒదులుకొవడానికి ఎవరు సిద్ధపడరని ఆయన అన్నారు. సినిమా హిట్, ప్లాఫ్ అనేది హీరో భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, కానీ సల్మాన్‌కి వాటితో ఏ మాత్రం సంబంధం లేని సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. గతంలో ప్రభుదేవా సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మహేశ్‌బాబు నటించిన తెలుగు మూవీ పోకిరి రిమేక్. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టడంతో, దబాంగ్ 3పై అంచనాలు మరింతగా పెరగనున్నాయి. -
ప్యారీ పరిణీతీ... టిప్స్ చెప్పవా?
...అనడుగుతున్నారట సోనాక్షీ సిన్హా! ఇంతకీ, ఏం టిప్స్ అడుగుతున్నారు? అంటే... వెయిట్ లాస్ టిప్స్ అట! ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? సోనాక్షి బొద్దుగా ఉన్నా... బీటౌన్ ప్రేక్షకుల అభిమానం బాగుంది కదా! అనే సందేహం రావొచ్చు. అయితే... మరింత స్లిమ్ముగా అవ్వాలని సోనాక్షి సీరియస్‌గా నిర్ణయం తీసుకున్నారట! ఎందుకంటే... ఎవరికీ తెలీదు. బట్, సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్–3’ షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు స్లిమ్ అవ్వాలనుకుంటున్నారు. యాక్చువల్లీ... హీరోయిన్ కాక ముందు సోనాక్షీ సిన్హా ఇంత కంటే బొద్దుగా ఉండేవారు. ఒక్కసారి హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాక చాలా బరువు తగ్గారు. అటువంటప్పుడు, ఓల్డ్ ఫార్ములా ఫాలో అవ్వొచ్చు కదా! పరిణీతి చోప్రాను టిప్స్ అడగడం ఎందుకు? అంటే... ఒకప్పుడు పరిణీతి కూడా సోనాక్షిలా బొద్దుగా ఉండేవారు. గత రెండేళ్లలో బాగా బరువు తగ్గారు. ‘గోల్మాల్ ఎగైన్’లో పరిణీతిని చూసిన సోనాక్షి సర్ప్రైజ్ అయ్యారట! అందుకే, ఆమెను టిప్స్ చెప్పమని అడుగుతున్నారట! ‘దబాంగ్–3’లో సోనాక్షి ఎంత స్లిమ్ముగా కనిపిస్తారో... వెయిట్ అండ్ సీ!! -
ప్రభుదేవాకు ఝలక్!
ముంబై: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభుదేవాకు మరో షాక్ తగిలింది. భారీ సినిమా చేసే అవకాశం చేజారినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సీక్వెల్‌కు దర్శకత్వం వహించే ఛాన్స్ తప్పిపోయినట్టు ‘ముంబై మిర్రర్’ పత్రిక వెల్లడించింది. ‘దబాంగ్ 3’ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం ‘బాగీ’ ఫేమ్ సబీర్ ఖాన్ దక్కినట్టు సమాచారం. దబాంగ్ నిర్మాతలు ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అతడు మూడు, నాలుగు స్ర్కిప్ట్లపై పనిచేస్తున్నట్టు సమాచారం. దీనిపై సబీర్ ఖాన్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘అవును.. దబాంగ్ 3 సినిమా కోసం పని ప్రారంభించాం. కథ పూర్తయ్యే వరకు నేనేమీ చెప్పలేను. చిత్ర యూనిట్లో సంప్రదింపులు జరుపుతున్నాను. ఫైనల్ స్ర్కిప్ట్ పూర్తయ్యాక దర్శకుడిగా ఎంపికైతే సంతోషిస్తాన’ని చెప్పారు. దబాంగ్ కథకు ఫ్రీక్వెల్‌గా దబాంగ్ 3 కథ ఉంటుందని ఊహాగాహాలు వస్తున్నాయి. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏక్తా టైగర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. -
వాంటెడ్ డైరెక్టర్‌తో దబాంగ్ 3
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో సీక్వల్కు సిద్ధమవుతున్నాడు. వాంటెడ్ సినిమా తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న సల్మాన్, ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తనకు తిరుగులేని ఫాలోయింగ్ తీసుకొచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లను మాత్రం వదిలిపెట్టడం లేదు. అందుకే1 సక్సెస్ ఫుల్ దబాంగ్ సీరీస్‌లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. దబాంగ్, దబాంగ్ 2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్లను బద్ధలు కొట్టిన సల్లూ భాయ్ ఇప్పుడు దబాంగ్ 3ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏక్తా టైగర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, త్వరలో దబాంగ్ సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మాణంలో ప్రభుదేవ దర్శకత్వంలో దబాంగ్ 3 రూపొందనుంది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ట్యూబ్‌లైట్ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
ఒకటి రెండేళ్లలో దబాంగ్-3
బాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచిన దబాంగ్ సిరీస్‌లో మూడో సినిమా తీయడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.. దర్శకుడు అర్బాజ్ ఖాన్. దబాంగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలు ఆర్జించడంతో దబాంగ్2 సినిమాకు స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. ఈ రెండు సినిమాల్లో హీరోగా చేసిన తన సోదరుడితోనే మూడో భాగం కూడా తీసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు అర్బాజ్. అయితే అందుకోసం సల్మాన్, తాను కూర్చుని చర్చించాల్సి ఉందని చెప్పాడు. దీనికి ఒకటి రెండేళ్లు పడుతుందన్నాడు. ఈసారి మాత్రం దర్శకత్వాన్ని వేరే ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందని అర్బాజ్ చెప్పాడు. దబాంగ్ మొదటి పార్ట్ బ్రహ్మాండమైన హిట్ కాగా, దబాంగ్-2 మాత్రం ఘోరమైన డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో తాను మెగాఫోన్ పట్టుకుంటే అంతగా వర్కవుట్ అవ్వదని అర్థం చేసుకున్న అర్బాజ్.. ఆ పనిని వేరే ఎవరైనా సమర్థులకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.