
సల్మాన్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ దబాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్‌లో భాగంగానే.. దబాంగ్2 ను తెరకెక్కించని సల్మాన్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. అయినా ఆ పాత్రపై ఉన్న మక్కువతో దబాంగ్3ని సిద్దం చేస్తున్నాడు. ఇటీవలె మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న దబాంగ్3.. రీసెంట్‌గా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది.
దబాంగ్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన గబ్బర్‌సింగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో అలీ పోషించిన సాంబ క్యారెక్టర్ కూడా హైలెట్ అయింది. అయితే ఇప్పుడీ పాత్రను దబాంగ్3లో కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రలో అలీ నటిస్తున్నారు. తాజాగా జరగుతున్న షెడ్యూల్‌లో అలీ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో అలీ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా నటిస్తోంది.