![Saiee Manjrekar Breaks Silence On 37 Year Age Gap With Salman Khan In Dabangg 3](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/19/Saiee-Manjrekar.jpg.webp?itok=_o9Ya-Lm)
సినిమా తారలకు ట్రోల్స్ కామన్. ఏదో ఒక విషయంలో వాళ్లను ట్రోల్ చేస్తునే ఉంటారు. అయితే సీనియర్ యాక్టర్స్ ఇలాంటివి పట్టించుకోరు కానీ..కొత్తగా వచ్చిన వాళ్లు మాత్రం ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోతారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు కూడా వాటిని పట్టించుకోకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తారు.
(చదవండి: కంగువా రిలీజ్ వాయిదా.. రజనీకాంత్ కోసమే!)
అలా తాను కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ట్రోలింగ్‌కు గురయ్యానని, తట్టుకోలేక కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకే దూరంగా ఉన్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం ‘దబాంగ్ 3’తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే తొలి సినిమానే వయసులో తనకంటే 37 ఏళ్లు పెద్ద నటుడైన సల్మాన్‌తో నటించడంతో అప్పట్లో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై సయీ స్పందించింది.
(చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)
‘నా తొలి సినిమా సల్మాన్‌తో అనగానే వెంటనే ఓకే చెప్పా. అప్పటికీ నాకు పీఆర్ టీమ్ లేదు. అందుకే నాకేమీ తెలియదు. సినిమా విడుదలైన తర్వాత నాపై విమర్శలు వచ్చాయి. 37 ఏళ్ల పెద్ద వయసు అయిన హీరోతో నటించావంటూ నన్ను ట్రోల్ చేశారు. చాలా బాధపడ్డాను. ఆ ట్రోల్స్ నా కెరీర్‌పై ప్రభావం చూపొద్దని ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత అలాంటి విమర్శలు వస్తే బాధపడడం మానేసి.. సరి చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను’ అని సయీ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment