
ఈమె బాలీవుడ్ లో ఓ నటి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3'లో నటించింది. కానీ ఈమెకు ఆ సినిమా సెట్ లోనే దారుణమైన అవమానం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆమెనే బయటపెట్టింది. ఇదంతా కూడా కేవలం ఆ ఒక్క పనిచేసినందుకే అని బయటపెట్టింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
(ఇదీ చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?)
కుక్కలా తరిమేశారు!
'దబంగ్ 3'లో నటించిన హేమశర్మ.. షూటింగ్ లో తనది ఓ సీన్ పూర్తయిన తర్వాత సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు ప్రయత్నించింది. అయితే హీరో బాడీగార్డ్స్ తనతో దురుసుగా ప్రవర్తించారని, సెట్ లో 100 మంది ముందు తనని కుక‍్కలా తరిమేశారని పేర్కొంది. ఒక్క ఫొటో తీసుకుంటానని అని అడిగినందుకు సల్మాన్ బాడీగార్డ్స్ ఇలా బిహేవ్ చేశారని హేమశర్మ చెప్పుకొచ్చింది.
10 రోజులు నిద్రపట్టలేదు!
తనని సల్మాన్ ఖాన్ దగ్గరకి తీసుకెళ్తానని పండిట్ జనార్ధన్ అనే వ్యక్తి సహాయం చేశారు. ఆయనతో కూడా సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ దారుణంగా ప్రవర్తించారు. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని ఆయన్ని హెచ్చరించారని హేమశర్మ చెప్పుకొచ్చింది. తనకు ఘోర అవమానం జరిగిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదని హేమ చెప్పుకొచ్చింది. ఈమెనే కాదు రీసెంట్ గా హీరో విక్కీ కౌశల్ ని కూడా సల్మాన్ బాడీగార్డ్స్ పక్కకు నెట్టేశారు.
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)