
చెట్టులెక్కగలను.. పుట్టలెక్కగలను.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన పండ్లు కోయగలను అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). సికందర్ డిజాస్టర్‌తో బాధలో ఉన్న ఆయన కాస్త ప్రశాంతతను కోరుకుంటూ పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయాడు. అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోకుండా చెట్టెక్కి మల్బరీ పండ్లు తెంపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
59 ఏళ్ల వయసులో అలవోకగా..
ఏదో ఆయాసపడుతూ కష్టపడకుండా.. చిన్నపిల్లాడిలా చకచకా చెట్టెక్కేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 59 ఏళ్ల వయసులోనూ భాయ్‌లో జోష్ ఏమాత్రం తగ్గలేదు అని కామెంట్లు చేస్తున్నారు. మనకు ఆ వయసు వచ్చాక ఆయనలా హుషారుగా చెట్టెక్కగలమా? ఆయన ఫిట్‌నెస్‌ను చూసి కుళ్లుకునేవారు నాలుగో అంతస్తు వరకు కూడా నడుచుకుంటూ వెళ్లలేరు. కనీసం ఇప్పుడైనా ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోండి అని సలహా ఇస్తున్నారు.
సినిమా
సల్మాన్ చివరగా నటించిన చిత్రం సికందర్. రష్మిక మందన్నా కథానాయిక. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బాబర్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.107 కోట్లు రాబట్టింది.