![Salman Khans Film At Rs 137 Crore Hit B' Akshay Kumar Good Newwz - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/31/salman.gif.webp?itok=deSk_Sqm)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘దబాంగ్ 3’. డిసెంబర్ 20 విడుదలైన భాయిజాన్ సినిమా తొలిరోజే కలెక్షన్‌ల వర్షం కురింపించడంతో ‘దబాంగ్ 3’ అంచనాలు మరింత పెరిగాయి. 10 రోజుల్లో సల్మాన్ సినిమా రూ.137.80 కోట్లకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ అంచనాలు వేశారు. అయితే రెండోవారం గడిచేసరికి ఈ సినిమా ఆయన అంచనాలను తలకిందులు చేసింది. ఈ విషయం గురించి ఆదర్శ్ మాట్లాడుతూ.. ‘ న్యూ ఇయర్ సందర్భంగా సల్మాన్ ‘దబాంగ్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తుందని అనుకున్నాం. మొదటి వారం కలెక్షన్‌లు బాగా రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ రెండవ వారం వచ్చేసరికి సల్మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా అయిపోయింది. బాలీవుడ్ ‘కిలాడి’ అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ జోరందుకోవడంతో మా అంచనాలు తారుమారయ్యాయి’. అంటూ అదర్శ్ చెప్పుకొచ్చారు.
కాగా గత వారం ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ మల్టీ స్టారర్ ‘గుడ్‌న్యూస్’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘అక్షయ్ ‘గుడ్‌న్యూస్’ సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’కి గట్టి పోటీనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు డిసెంబర్ 27 నుంచి తలపడ్డాయి. అయితే రోజు రోజుకు ‘గుడ్‌న్యూస్’ కలెక్షన్‌లను కొల్లగొడుతుండటంతో సల్మాన్ సనిమా వసూళ్లకు గండి పడింది’ అంటూ అదర్శ్ రాసుకొచ్చారు. అ అక్షయ్ కుమార్, కరీనా కపూర్, కైరా అద్వానీ, దిల్జిత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్‌న్యూస్‌కు రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో రూ.88 కోట్లను వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment