Know About Top Bollywood Actor Who Is With Highest Paid Celebrity Bodyguard In India - Sakshi
Sakshi News home page

Highest Paid Celebrity Bodyguard: ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీ బాడీగార్డులు.. ఏ హీరో బాడీగార్డుకు ఎక్కువ జీతం అంటే?

Published Thu, Jul 13 2023 1:26 PM | Last Updated on Thu, Jul 13 2023 2:19 PM

Know About Top Bollywood Actor Who Is With Highest Paid Celebrity Bodyguard In India - Sakshi

హీరోలు కోట్లు సంపాదిస్తారు. సినిమాలతోనే కాదు సైడ్‌ బిజినెస్‌లతో కూడా బాగానే వెనకేస్తారు. మరి అలాంటి హీరోలకు రక్షణ కవచాల్లా పని చేసే బాడీ గార్డులకు ఎంత సంపాదన ఉంటుందనుకుంటున్నారు? వందలు, వేలల్లో కాకుండా లక్షల్లో ఉంటుందంటారా? అవును, నిజమే.. కానీ స్టార్‌ హీరోల బాడీ గార్డులు ఏకంగా కోట్ల రూపాయలు ఏడాది జీతంగా తీసుకుంటున్నారంటే ఆశ్చర్యపోకమానరు! ఇది కొందరు చిన్న హీరోల పారితోషికంతో సమానం!

ఇంతకీ అంత రిచ్‌ బాడీగార్డు ఎవరనుకుంటున్నారా? రవి సింగ్‌.. ఇతడు స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ బాడీగార్డు. ఇతడి నెల సంపాదన సుమారు రూ.17 లక్షలు. అంటే ఏడాదికి రూ.2.7 కోట్ల పైచిలుకు సంపాదిస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఉంది షేరా.. ఇతడు బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ బాడీ గార్డు. దాదాపు 29 ఏళ్లుగా సల్మాన్‌ దగ్గరే పని చేస్తున్నాడు. ఇతడి నెల జీతం రూ.15 లక్షలు. అంటే సంవత్సరానికి రూ.2 కోట్ల మేర సంపాదిస్తున్నాడు.

అక్షయ్‌ కుమార్‌ బాడీగార్డు శ్రేయ్‌సే థెస్లె దాదాపు అందరు సెలబ్రిటీల దగ్గర పని చేశాడు. ప్రస్తుతం అక్షయ్‌కు అంగరక్షకుడిగా ఉంటున్న ఇతడు ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం అందుకున్నట్లు తెలుస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ దగ్గర జితేంద్ర షిండే అని ఓ బాడీగార్డు ఉండేవాడు. ఇతడు ముంబై పోలీస్‌ కానిస్టేబుల్‌. ఓపక్క వృత్తిలో కొనసాగుతూనే మరోపక్క బిగ్‌బీకి బాడీగార్డ్‌గా పని చేశాడు. ఇందుకుగానూ అతడు ఏడాదికి రూ.1.5 కోట్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు వరకు దాదాపు ఆరేళ్లపాటు అమితాబ్‌ దగ్గరే పని చేసి తర్వాత మానేశాడు.

ఆమిర్‌ ఖాన్‌ దగ్గర నమ్మకంగా పని చేసే బాడీగార్డు యువరాజ్‌ ఘోర్పడే. ఇతడు ఏడాదికి రెండు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె , అనుష్క శర్మ దగ్గర పని చేసే జలాల్‌, ప్రకాశ్‌ సింగ్‌ కూడా ఏడాదికి చెరో రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నారు.

చదవండి: 25 కోట్ల టికెట్ల ఊచకోత.. అంతగా ఎగబడి చూసిన సినిమా ఏదంటే?
క్యాస్టింగ్‌ కౌచ్‌.. ఆ డైరెక్టర్‌ రాత్రంతా తనతో ఉండిపోమన్నాడు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement