good news
-
గతేడాదిలో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
డబుల్ గుడ్‌న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?
కేంద్ర కొత్త బడ్జెట్-2025 (Union Budget 2025) మన ముందుకు వచ్చేందుకు ఇక కొన్ని రోజులే ఉన్నాయి. ఇదిలా ఉంటే పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు చేయనున్నారు. కొత్త పన్ను విధానంలో మినహాయింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చే ప్రణాళిక ఇది. అలాగే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చేసి వారి ఖర్చు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం.ఆయా వర్గాల సమాచారం నిజమైతే.. ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయవచ్చు. కానీ ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, మినహాయింపు పరిధిని పెంచవచ్చు. మొదటి ప్రయోజనం స్టాండర్డ్ డిడక్షన్‌లో కాగా, రెండోది రూ.15-20 లక్షల పన్ను శ్లాబ్‌లో ఉన్నవారికి ఇవ్వవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు?కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.75,000 లుగా ఉంది. మూలాల ప్రకారం.. ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచవచ్చు. గత బడ్జెట్లో కూడా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50000 నుండి రూ. 75000కి పెంచింది. ఈ మార్పు జరిగితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో రూ.లక్ష వరకు పన్ను ఆదా అవకాశాన్ని పొందుతారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.20% పన్ను శ్లాబ్ పరిధి పెంపు?రెండవ పెద్ద శుభవార్త ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 20% పన్ను స్లాబ్ పరిధిని పెంచవచ్చు. రూ. 12-15 లక్షల ఆదాయం ఉన్న వారిపై ఇప్పటి వరకు 20% పన్ను విధించేవారు. కానీ, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షల ఆదాయానికి పెంచవచ్చు. ఈ మార్పు ముఖ్యంగా రూ.15-20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మార్పు మధ్య, అధిక ఆదాయ సమూహానికి చెందిన పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?పీఎంవోదే తుది నిర్ణయం 2025 బడ్జెట్లో పన్ను సంబంధిత మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం పీఎంవో తీసుకుంటుంది. దీనికి సంబంధించిన నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకునేందుకు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిధిని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో ఉంది.ఆర్థిక లోటును తగ్గించడమే సవాలుదేశ సార్వత్రిక బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తి బడ్జెట్. ఆర్థిక లోటును అదుపులో ఉంచుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంటుందని పెద్ద ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యం 4.9%. దీనిని 2026 నాటికి 4.5% కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి. -
ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
-
పూచీకత్తు లేకుండా రైతులకు రూ.2 లక్షలు రుణం
చిన్న, సన్నకారు రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఊరట కల్పించింది. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ.1.66 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.“వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు రుణ లభ్యతను మరింత పెంచుతుంది.’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితి పెంపునకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేయనుంది. ఈ రుణాలను రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంక్ సవరించింది. అప్పట్లో రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచింది.రైతుల మేలు కోసం..చిన్న, సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో రూ.3 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అంతకు ముందు 2014లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసి) నుండి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లను (సిఐఆర్) పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్లు/లోన్ పాలసీలలో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులతో సమానంగా వారికి మధ్యంతర భృతి మంజూరు చేసింది. మూలవేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
రైల్వేశాఖ సరికొత్త కార్యక్రమం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైలులో సీటు లేదా బెర్త్ దక్కని ప్రయాణికులు ఆఖరి నిమిషంలో అంటే చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు పొందే అవకాశం కల్పిస్తోంది. ఖాళీ బెర్త్‌ల గురించిన సమాచారాన్ని రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందిస్తోంది.హాజీపూర్ రైల్వే జోన్లో ఈ సదుపాయం ప్రారంభమైంది. రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలోనూ ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్)లో ఇస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంట్లో కూర్చొనే రైలులో ఖాళీగా ఉన్న సీట్ల గురించి నాలుగు గంటల ముందుగానే తెలుసుకుంటారు. ఏ రైలులో ఏ తరగతిలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకునే వీలుంది.రిజర్వేషన్ ఇలా.. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, ఖాళీగా ఉన్న సీట్లను కేటాయించే కరెంట్ రిజర్వేషన్ ఆన్లైన్లో జరగదు. ఇందుకోసం స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. దానాపూర్ రైల్వే డివిజన్ నుంచి బయలుదేరే రైళ్ల ప్రస్తుత స్థితిని తెలిపే వ్యవస్థను ప్రారంభించారు. రైలు ఎక్కడ నుండి బయలుదేరుతుందో అదే స్టేషన్ నుండి కరెంట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే రైలు ఆలస్యమైతే ఆ రైలు ఏ స్టేషన్ గుండా వెళుతుందో తెలిసిపోతుంది. అంతే కాదు ఏ ప్రత్యేక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ రోజు నడుస్తుందనే సమాచారాన్ని కూడా ఇక్కడ అందజేస్తున్నారు.మొబైల్లో మొత్తం సమాచారం రైలు రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత, అన్ని తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల పూర్తి సమాచారం ‘ఎక్స్’, ఫేస్బుక్ ద్వారా ప్రయాణికుల మొబైల్ ఫోన్ స్క్రీన్‌పైకి వస్తుంది. దీని ఆధారంగా ఖాళీ సీట్లకు అప్పటికప్పుడు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్‌కు రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్ మధ్య వ్యత్యాసం ఉంది. రైలు బయలుదేరడానికి ఒక రోజు ముందు బుక్ చేసుకునేది తత్కాల్ టికెట్. అదే కరెంట్ రిజర్వేషన్ కోసం ఆ రైలు చార్ట్ సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. చార్ట్ తయారు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల స్థితని కూడా ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తెలియజేస్తారు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. కుండలి భాగ్య సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.రుహి చతుర్వేది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్లో నటించారు. View this post on Instagram A post shared by Ruhi Chaturvedi (@ruhiiiiiiiiii) -
పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, సాక్షి: ఉద్యోగులకు జీహెచ్ఎంసీ దీపావళి శుభవార్త చెప్పంది. ఈరోజు సాయంత్రం వరకు జీతాలు విడుదల చేయనున్నట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. జీహెచ్ఎంసీ రూ.120 కోట్ల నిధులను విడుదల చేయనుంది. అయితే.. జీహెచ్ఎంసీ గత నెల వారం రోజుల ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. దసరాకు ఐదు రోజులు ఆలస్యంగా జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు రోజులు ముందుగానే జీహెచ్ఎంసీ జీతాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
-
Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్
లక్నో: యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీపావళికి ముందుగానే ఉద్యోగులకు డీఏ, బోనస్‌లను అందించనున్నట్లు తెలిపింది.రాష్ట్రంలోని దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు దీపావళి బోనస్‌తో ప్రయోజనం పొందనున్నారు. అలాగే 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు పరిధిలోకి రానున్నారు. డీఏను 50 శాతం నుంచి 54 శాతానికి పెంచనున్నారు. దీని ప్రయోజనాలు జూలై నెల నుంచి లెక్కించనున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్‌గా రూ.7 వేలు వరకూ అందుకున్నారు.మరోవైపు డియర్నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచుతున్నప్పుడల్లా రాష్ట్ర సర్కారు కూడా ఈ పెంపుదలని అమలు చేస్తూవస్తోంది. ఈ పెంపుపై త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇది కూడా చదవండి: డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు -
అసలు తగ్గింపు ఇక నుంచే.. శ్రావణం ముంగిట శుభవార్త!
శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.ఎంత మేర తగ్గుతాయి?కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్
-
ఒక నెల జీతం.. ఉద్యోగులకు శుభవార్త
-
రైతులకు గుడ్ న్యూస్..తొలి సంతకం చేసిన ప్రధాని మోదీ
-
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు. -
షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.ఎన్పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్లు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. -
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
-
మత్స్యకారులకు గుడ్ న్యూస్
-
తట్టుపల్లి టు ఢిల్లీ..
కురవి: ఆ విద్యార్థి.. హోమియోపతి వైద్య విద్యనభ్యసిస్తూ మెదడుకు పదును పెట్టాడు.. మిత్రులకన్నా ఏదో ఒక అంశంలో ప్రత్యేకత చాటుకోవాలనే తపన మొదలైంది. గైడ్‌టీచర్ సహకారంతో నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాడు.. ఎంచుకున్న తన గ్రంథాన్ని పూర్తి చేశాడు.. ఏకంగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డును అందుకునే గౌరవం పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లికి చెందిన జంగం సామ్రాజ్యం, రవి దంపతుల కుమారుడు లోహిత్ సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ హోమియోపతి మెడికల్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. షార్ట్‌టర్మ్ స్టూడెంట్‌షిప్ ఇన్ హోమియోపతి విభాగంలో ఆరు నెలలుగా ‘ఆగ్రో హోమియోపతి’ అనే అంశంపై రీసెర్చ్ చేస్తున్నాడు. గైడ్ టీచర్ శ్రీవిద్య సూచనల మేరకు లోహిత్.. రీసెర్చ్ పూర్తి చేశాడు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి ఆధ్వర్యంలో లోహిత్ గ్రంథానికి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ హోమియోపతి డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతులమీదుగా ఈనెల 10, 11 తేదీల్లో ఢిల్లీలో లోహిత్ అవార్డు అందుకోనున్నాడు. కాగా, ఈ అవార్డు తన తల్లిదండ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్‌లో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తానని లోహిత్ తెలిపారు. తన కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందం కలిగించిందని రవి తెలిపారు. లోహిత్‌కు అవార్డు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ పోలీస్: చోరీ అయిన ఫోన్ల రికవరీ.. యజమానులకు అందజేత (ఫొటోలు)
-
విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
-
నిరుద్యోగులకు మరో శుభవార్త
-
NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్ వాసి!
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తన టాలెంట్‌తో విశ్వవేదికపై మరోమారు మెరిశాడు. ఫోర్బ్స్ జాబితాలో అఫీషియల్ ఎగ్జిక్యూటీవ్‌గా స్థానం పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా 160కిపైగా విద్యా విషయక జర్నల్స్ రాసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రకటించింది. చిన్న గ్రామం నుంచి అగ్రరాజ్యానికి.. మక్తపల్లికి చెందిన చింతం రాములు–కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలో పూర్తిచేశాడు. ఉన్నత విద్య ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో చదివాడు. 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌గా కెరీర్.. చదువు పూర్తయిన తర్వాత నరేందర్ బెంగళూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తర్వాత వత్తిరీత్యా అమెరికా, ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పనిచేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్‌గా గుర్తింపు పొందాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు. రీసెర్చ్ పేటెంట్లు.. అమెరికా వెళ్లిన తర్వాత నరేందర్ 55 కీలక అంశాలపై రీసెర్చ్ చేసి ఇన్నోవేటివ్ పేటెంట్లు పబ్లిష్ చేశాడు. తర్వాత ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్‌గా వ్యవహరించాడు. 11 ప్రపంచస్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచస్థాయి జర్నల్ ప్రచురించాడు. అనేక విద్యాసంస్థల టెక్నికల్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడు. నరేందర్‌ను ప్రశంసిస్తూ వచ్చిన లేఖ పత్రం, నరేందర్‌కు వచ్చిన నేషన్ అవార్డు కేంబ్రిడ్జి నుంచి డాక్టరేట్.. నరేందర్ రీసెర్చ్ జర్నల్స్‌ను గుర్తించిన ప్రపంచంలోని అత్యున్నతమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా అందజేసింది. అతి తక్కువ సమయంలోనే కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్‌ఫ్రైస్ ఆర్కిటెక్ట్ స్థానం సంపాదించాడు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జర్నల్‌లో అఫీషియల్ ఎక్జిక్యూటీవ్‌గా స్థానం సంపాదించాడు. పిల్లర్ ఆఫ్ ది నేషన్ పురస్కారం! ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నరేందర్‌కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రదానం చేసింది. ఈమేరకు స్పీకర్ శ్రీరాం నివాస్‌గోయల్ ఇటీవల అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈమేరకు నరేందర్‌ను ప్రశంసిస్తూ లేఖ కూడా పంపించారు. గ్రామంలో సంబరాలు.. తమ ఊరి యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మక్తపల్లిలో నరేందర్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు. నరేందర్ తల్లిదండ్రులు అందరికీ మిఠాయిలు పంచారు. -
తల్లి కాబోతున్న దీపిక.. భర్తతో సంతోష క్షణాలు (ఫోటోలు)
-
రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం శుభవార్త
-
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
బ్యాంక్ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు!
బ్యాంక్ ఉద్యోగులకు 2024 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం కావచ్చు. తొందరలోనే రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ తన సమ్మతిస్తే జూన్ నాటికి బ్యాంకు ఉద్యోగులకు 5 పని దినాల విధానం అమల్లోకి రావచ్చు. అలాగే జీతాల పెంపును కూడా పొందవచ్చు. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంకింగ్ రంగానికి వారానికి ఐదు రోజుల పనిని సిఫార్సు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఆదివారాలు, షెడ్యూల్డ్ సెలవులు అదనంగా ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. ఐదు రోజుల పని విధానం మొత్తం బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించదని, కస్టమర్లకు బ్యాంకింగ్ అవర్స్‌లోగానీ, ఉద్యోగులకు మొత్తం పని గంటలలో గానీ తగ్గింపు ఉండదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తన ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని సానుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ముందుకు సాగేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఆదేశించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీలలో ఐదు రోజుల పని విధానం ఇప్పటికే ఆచరణలో ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గుర్తు చేసింది. జీతాల పెంపు గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 17 శాతం వేతనాల పెంపుదలకు రూ. 12,449 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ పథకానికి ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. -
2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై గుడ్‌న్యూస్
హైదరాబాద్, సాక్షి: లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన పథకం 2020-ఎల్ఆర్ఎస్(LAYOUT REGULARIZATION SCHEME) దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలగనుంది. ఏమిటీ ఎల్ఆర్ఎస్.. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎల్ఆర్ఎస్ ఉద్దేశమేంటంటే.. అధికారిక లేఅవుట్లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ.. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్ ల్యాండ్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్యోద్దేశం. కానీ.. జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్ఆర్ఎస్ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసూలు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు. ఎదురుచూపులే.. అయితే.. రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. నగర, పురపాలికలు; పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కదలిక.. అయితే 20లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31లోపు దరఖాస్తుదారులకు ఈ అవకాశం కల్పించనుంది. సోమవారం ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. -
తండా యువకుడు ఇప్పుడు సివిల్ జడ్జి
హొసపేటె: విజయనగరం జిల్లా కేంద్రం హొసపేటె నుంచి 40 కిలోమీటర్ల దూరంలో హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఆనేకల్ తండాకు చెందిన ఎన్.విజయ్‌కుమార్ ఇప్పుడు సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. దీంతో ఆనేకల్ తండాలో ఆనందం నెలకొంది. అవును, భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం తనను జడ్జి పరీక్ష రాయడానికి ప్రేరేపించింది. దీంతో ప్రేరణ పొంది పట్టుదలతో పరీక్ష రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించిన ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆనేకల్ తండాకు చెందిన బీ.నారాయణ నాయక్, మంజుల దంపతుల కుమారుడు విజయ్‌కుమార్ తండాలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 10వ తరగతి వరకు వల్లభాపురలోని మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. హగరిబొమ్మనహళ్లిలోని గంగావతి భీమప్ప కళాశాలలో పీయూసీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన బళ్లారిలోని వీఎస్ఆర్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీలో ఉత్తీర్ణత సాధించారు. మూడుసార్లు న్యాయమూర్తి పరీక్షకు హాజరయ్యారు. ఈసారి పరీక్షలో ఉత్తీర్ణుడై న్యాయమూర్తిగా ఎదిగారు. ఆనేకల్ తండాలో 1,200 ఇళ్లు ఉన్నాయి. తండాలో నలుగురు న్యాయవాదులు ఉన్నారు. జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో తమ పిల్లలను బాగా చదివించేందుకు మరింత చైతన్యం నింపారని తాండా వాసులు తెలిపారు. ప -
గుడ్‌న్యూస్! కెనడాలో వర్క్ పర్మిట్.. కీలక మార్పులు
Canada work permit : కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త ఇది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP) కి కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రెండేళ్లలోపు వ్యవధి ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి అర్హత పొందుతారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులను ఆ దేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే 2024 సెప్టెంబరు 1 నుండి కరికులమ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌కి అర్హత పొందలేరు. అలాగే దూరవిద్య, పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు కోసం ప్రత్యేక చర్యలను 2024 ఆగస్టు 31 వరకు పొడిగించింది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. పీజీడబ్ల్యూపీ హోల్డర్లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు ఎంత కాలం ఉంటుందనేది స్టడీ ప్రోగ్రామ్ స్థాయి, వ్యవధితోపాటు పాస్‌పోర్ట్ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది. విదేశీ విద్యార్థులందరూ అర్హులేనా? కెనడాలోని ఆమోదిత విద్యా సంస్థలలో కనీసం రెండు సంవత్సరాల నిడివి ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసి తాత్కాలికంగా కొన్నాళ్లపాటు కెనడాలో ఉండాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ 3 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP)కి అర్హులు. ఇక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే కనీసం 8 నెలలు (లేదా 900 గంటల క్యూబెక్ క్రెడెన్షియల్స్ ) వ్యవధి ఉండాలి. అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లకు వర్తించదు. -
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ రెండు పథకాలు ఇక ఈజీగా..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తమ కస్టమర్లకు చక్కని అవకాశాన్ని కల్పించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలకు కస్టమర్లు తామంతట తామే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటిచించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసుకున్న వ్యక్తి ఆకస్మికంగా మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి రూ. 2,00,000 లభిస్తాయి.ఇది ప్యూర్-టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఎలాంటి మెచ్యూరిటీ లేదా సరెండర్ ప్రయోజనాన్ని అందించదు. ఇక ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఇది ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా వైకల్యం కలిగినప్పుడు ప్రయోజనం అందిస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక సంవత్సరానికి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. అర్హులైన పౌరులందరికీ బీమా కవరేజీని విస్తరించడం, ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించడం అనే విస్తృత జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఎన్రోల్మెంట్ ఉంటుందని ఎస్బీఐ బ్యాంక్ పేర్కొంది. స్వీయ-చందా మార్గంలో కస్టమర్లు బ్రాంచ్ లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను సందర్శించకుండానే వారి సౌలభ్యం మేరకు ఆన్లైన్లోనే ఈ స్కీమ్‌ల కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకునేటప్పుడు కస్టమర్లు తమ ఖాతా నంబర్, పుట్టిన తేదీని జన్ సురక్ష పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వారి ప్రాధాన్య బ్యాంక్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన వెంటనే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. -
నా కుటుంబమే నా బలం
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ శుభవార్తను షేర్ చేశారు. తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మేం తల్లిదండ్రులయ్యాం. మీ ఆశీర్వాదాలు కావాలి. మై ఫ్యామిలీ మై స్ట్రెన్త్ (నా కుటుంబమే నా బలం)’’ అంటూ తన భార్య నటషాదలాల్ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోను షేర్ చేశారు వరుణ్‌ధావన్. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ నటషా దలాల్‌ను 2021 జనవరిలో వరుణ్ వివాహం చేసుకున్నారు. హిందీలో ప్రస్తుతం ‘బేబీ జాన్’ సినిమా చేస్తున్నారు వరుణ్ ధావన్. అలాగే ఆయన నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్‌సిరీస్ ఈ ఏడాది వేసవిలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేశారు. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 30 నిమిషాలే టైమ్!
Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్‌ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రుణాలు
HDFC Bank Home Loans : దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హోమ్ లోన్‌పై గుడ్‌న్యూస్ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్’ పేరిట ఓ లోన్‌ను ఏప్రిల్‌లో, హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. హోమ్ సేవర్ ప్రొడక్ట్ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్బీఐ అందిస్తున్న మ్యాక్స్గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్ రీఫర్బిష్మెంట్ లోన్ విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ లోన్‌ను అందించేది. ఇప్పుడు ఈ లోన్‌ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు. ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్టగేజ్ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుతో లింక్ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్డీఎఫ్సీ సర్వీస్ సెంటర్లను దశలవారీగా బ్యాంక్ బ్రాంచ్‌లుగా మార్చబోతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. -
‘బంగారం’ లాంటి వార్తే.. తెలిస్తే ఈరోజే కొనేస్తారు!
Gold Rate today : పసిడి ప్రియులకు ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్పల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (ఫిబ్రవరి 14) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. పవిత్రమైన మాఘమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో మహిళలు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో.. ➦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. ➦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ➦ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ➦ ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. Silver Price : ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది. -
హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది. "జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్టెక్ శంతను రూజ్ తెలిపారు. గతేడాది కంటే తక్కువే.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది. -
ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్.. ఇకపై క్యాబ్‌ల మాదిరిగానే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో రాపిడో క్యాబ్‌లను ప్రారంభించి క్యాబ్ బుకింగ్ సేవల రంగంలోకి ప్రవేశించిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లకు దాని జీరో-కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ మోడల్‌ను ఆటో డ్రైవర్లకూ అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం రోజూ 5 లక్షలకు పైగా ఆటో రైడ్లను సులభతరం చేస్తున్న ర్యాపిడో ఆఫ్‌లైన్ ఆటో డ్రైవర్లనూ తన ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో కోఫౌండర్ పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ సాస్ ప్లాట్‌ఫారమ్ ఆటోడ్రైవర్ల సంప్రదాయ కమీషన్ విధానాన్ని మారుస్తోందన్నారు. ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు సాస్ మోడల్ ఆధారిత డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆటో డ్రైవర్లు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ అనుభవాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. -
సీహెచ్ఓ యామినీకి జాతీయ అవార్డు
లబ్బీపేట(విజయవాడతూర్పు): గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు గాను కృష్ణాజిల్లా వణుకూరు–2 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్(వెల్నెస్ సెంటర్)లో కమ్యునిటీహెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)గా పనిచేస్తున్న మంత్రిప్రగడ యామినీకి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి జాతీయ అవార్డు లభించింది. ఈ నెల 8న న్యూఢిల్లీలో నిర్వహించిన సుశృత అవార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 53 మందికి కేంద్ర ప్రభుత్వం సుశృత అవార్డులు అందజేయగా, మన రాష్ట్రం నుంచి యామిని ఒక్కరే ఈ అవార్డును అందుకున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)/కమ్యూనిటీహెల్త్ ఆఫీసర్(సీహెచ్ఓ) కేటగిరిలో ఈ అవార్డు వరించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు అధునాతన భవన నిర్మాణాలు చేపట్టింది. దీంతో ఇప్పటికే ఆమె పనిచేస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు నేషనల్ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేషన్(ఎన్‌క్యూఏఎస్‌ఎస్) లభించింది. ఇప్పుడు అదే సెంటర్లో పనిచేస్తున్న సీహెచ్‌ఓకు జాతీయ గుర్తింపు లభించింది. -
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2,75,891 కోట్ల ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ స్వరూపం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 స్వరూపం ఇలా ఉంది. మొత్తం రూ.2,75,891 కోట్లకు బడ్జెట్ సమర్పించగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉంది. కేటాయింపులు ఇలా.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్లో అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించింది. ఇక మిగిలిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించింది. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించి మంత్రి భట్టీ విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్ రూ.500 చొప్పున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
-
ఆ తల్లికి ముగ్గురు ‘సరస్వతులు’
ఆమెకు ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భర్త విడిచిపెట్టాడు. అయినా, ఆమె కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలిడబ్బులతో పిల్లలను సాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు కుమార్తెలను చేర్పించింది. చదువు విలువ తెలియజేసింది. తల్లి కష్టాన్ని కుమార్తెలు గుర్తించారు. చదువులో రాణించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ పెద్దల అండదండలతో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికకాగా, మరొకరు పీహెచ్డీ చేస్తున్నారు. అమ్మనమ్మకాన్ని గెలిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. శృంగవరపుకోట: శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని. వీరిని విడిచి తండ్రి వెళ్లిపోయాడు. బంగారమ్మే కంటికి రెప్పలా సాకింది. భవన నిర్మాణ పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో చదువులు చెప్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ వరకూ చదివిన 2వ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువు మానిపంచాలనుకుంది. టెన్త్‌లో అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్.సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ లో ప్రవేశం కలి ్పంచారు. అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్‌లో కోరిన చదువుకు తనే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటరీ్మడియట్‌లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 2019లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భర్తీచేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పోస్టు సాధించింది. అంతటితో వదిలేయకుండా ఏపీపీఎస్సీ పరీక్షలకు సాధన చేసింది. 2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్‌లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్–1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తుండగా, చెల్లెలు పావని పీహెచ్డీ చేస్తోంది. ముగ్గురు అమ్మాయిలు చదువులో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతోంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. -
60 గ్రూప్–1 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 కేటగిరీలో మరో 60 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక, హోం, కార్మిక, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జీఓ నం.16 జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టుల వారీగా వివరాలు -
బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రూమర్స్ కి చెక్
-
నాడు సర్పంచ్.. నేడు న్యాయమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కర్రి సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సంతోషలక్ష్మి ఇదివరకు సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త దువ్వాడ వెంకటకుమార్ చౌదరి ప్రోత్సాహంతో ఆమె విజయం సాధించారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతిరాయ్, రాజ్యలక్ష్మి, పీఎసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్ దువ్వాడ పద్మావతి, ఎంపీటీసీ బమ్మిడి రాజ్యలక్ష్మి, బి.మోహన్‌రావు, దువ్వాడ జయరాం చౌదరి తదితరులు అభినందనలు తెలియజేశారు. -
రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ‘టెట్’ నిబంధనల సడలింపు.. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే.. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
సూర్య ప్రసాద్‌కు ప్రధాని మోదీ అభినందన
పరిగి: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లి విద్యార్థి రాగే సూర్య ప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ఢిల్లీలో అభినందించారు. ఏపీఆర్ఎస్ కొడిగెనహళ్లిలో 5వ తరగతి చదువుతున్న రాగే సూర్య ప్రసాద్, గతేడాది కిలిమంజారోతో పాటు లద్దాఖ్‌లోని దక్షిణ పుల్లు పర్వతాన్ని అధిరోహించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపిక చేసింది. ఈనెల 22న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. 23వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ సూర్యప్రసాద్‌తో పాటు రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపికైన బాలలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సూర్యప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల విద్యార్థికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం సంతోషంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్, ఉపాధ్యాయులు అన్నారు. -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
స్కూలుకు వెళ్లకుండానే.. 'ఇండియా బుక్ ఆఫ్ అవార్డ్స్' లో చైత్ర!
నిజామాబాద్: మూడేళ్ల ఆ చిచ్చర పిడుగు స్కూలుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అరుదైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డును సాధించింది. నగరంలోని గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర 17 జాతీయపండుగలు, 12 జాతీయ గుర్తులు, 13 అంతరిక్ష వస్తువులు, 26 శరీర భాగాలు, 26 రకాల జంతువులు, 22 రకాల కూరగాయలు, 21 పండ్లు, 13 రంగులు, 8 రకాల ఆకారాలు (ట్రైయాంగిల్, స్క్వేర్, సర్కిల్ లాంటివి) గుర్తుపట్టడంతో పాటు 26 అల్ఫాబెట్స్కి సంబంధించిన వస్తువుల పేర్లను, 11 ఇంగ్లిష్ రైమ్స్‌ని ధారాళంగా తడబడకుండా చెప్పేస్తుంది. ఈ పాప ప్రతిభను గుర్తించిన ఐబీఆర్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైత్ర ధారాళంగా చెప్పిన వాటిని ఆమె ప్రతిభా పాటవాలను ప్రత్యక్షంగా చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వారు అచీవర్ అవార్డును ప్రదానం చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ అనేది ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ వ్యక్తుల ప్రతిభని, ఒక సంస్థ సాధించిన ప్రగతిని భద్రపరచి భావితరాలకు స్ఫూర్తిని అందించే సంస్థ. దీనిలో భాగంగా రాష్ట్రంలోని నగరానికి చెందిన గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడంపై పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచీవర్ అవార్డును అందుకోవడం అభినందనీయమంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చైత్రకు ఐబీఆర్లో స్థానం దక్కడంతో ఆమె తల్లిదండ్రులైన బ్యాంక్ ఉద్యోగిని అన్నపూర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. తమ పాప ఇప్పటి వరకు స్కూల్‌కు కూడా వెళ్లలేదని, ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అచీవర్ అవార్డును కైవసం చేసుకుందన్నారు. ఇవి చదవండి: ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! -
సంక్రాంతికి డబుల్ ధమాకా
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఈ సంక్రాంతికి తన ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వనున్నారాయన. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘డైనోసార్ డార్లింగ్‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి. సంక్రాంతి రోజున ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తున్నాం’’ అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక కొత్త లుక్‌లో, క్యారెక్టర్లో కనిపిస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ మూవీ ఇవ్వాలనే ఆశయంతో మారుతి ఈ సినిమా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూఛిబొట్ల. కల్కి కోసం కొత్త ప్రపంచం ‘‘ఇండియాలో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఎక్కువ రాలేదు. ‘కల్కి 2898 ఏడీ’ వైవిధ్యమైన సినిమా. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూశాం. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో ‘కల్కి 2898 ఏడీ’లో చూస్తారు. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచం సృష్టించాం’’ అన్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా ఐఐటీ బాంబేలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ ప్రత్యేక కంటెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘కల్కి’లో ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపికాగార్లు తమ అభిమానులు అమితంగా ఆనందపడే పాత్రల్లో కనిపిస్తారు. ప్రత్యేకించి ఈ మూవీలో ఫ్యూచర్ ప్రభాస్‌ని చూస్తారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
39 లక్షల జాబ్స్.. ఉద్యోగార్థులకు పండగే!
కొత్త సంవత్సరంలో జాబ్స్ కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు పండగ లాంటి వార్త ఇది. వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో 39 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. స్థూల ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగుతున్నప్పటికీ 2024 ప్రథమార్థంలో భారతదేశంలో 3.9 మిలియన్ల ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని సాస్(SaaS), ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ బెటర్‌ప్లేస్ (BetterPlace) తమ సంవత్సరాంతపు నివేదికలో పేర్కొంది. ఈ పరిశ్రమల నుంచే అత్యధికం ఒక మిలియన్ డేటా పాయింట్లను విశ్లేషించిన బెటర్‌ప్లేస్ నివేదిక.. మొత్తం డిమాండ్‌లో 50 శాతం లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుంచే ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఈ-కామర్స్, ఐఎఫ్ఎం, ఐటీ పరిశ్రమలు వరుసగా 27 శాతం, 13.7 శాతంతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం నుంచి 0.87 శాతం, రిటైల్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(QSR) నుంచి 1.96 శాతం డిమాండ్ కొనసాగుతుందని నివేదిక విశ్లేషించింది. ఇదీ చదవండి: అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు! -
టీటీడీ ఉద్యోగులకు శుభవార్త
-
చిన్న రైతులకు గుడ్ న్యూస్ ప్రతి రైతుకు మైక్రో ఇరిగేషన్
-
మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'..
భద్రాద్రి: ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్ ఈ ఘనత సాధించాడు. ఆనంద్ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విద్యాభ్యాసం.. గ్రామానికి చెందిన ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ (కంట్రోల్ సిస్టమ్స్ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్ పడింది. రాజీ లేకుండా శ్రమించి.. కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ (బీఈఎల్)లో ట్రెయినీ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఆర్డీఓ – రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ‘రీసెర్చ్ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్ లెటర్ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇవి చదవండి: తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ -
13 ఏళ్లకే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్తగూడెం మిస్ టీన్!
ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న సియాటల్ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ టీన్ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్‌బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
వీసా లేకున్నా ఇరాన్ వెళ్లొచ్చు
టెహ్రాన్: ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇరాన్‌కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్‌తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ. భారతీయులు ఇకపై తమ దేశానికి వీసాతో పనిలేకుండా రావొచ్చంటూ ఇటీవలే మలేసియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
-
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లించనుంది. ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. దాంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది. పదోన్నతులకు త్వరలో మార్గదర్శకాలు ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – పల్లిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు ప్రయోజనకరం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సాను కూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – పీవీ రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వై.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
నిరుద్యోగులకు ఏపీపీ ఎస్సీ మరో గుడ్ న్యూస్
-
విద్యార్థులకు గుడ్ న్యూస్...విద్య శాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
-
మరోమారు ఎమ్మెల్యే రాచమల్లు దాతృత్వం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు తానే వెచ్చిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థినికి పాస్ పోర్టు, వీసాను తెప్పించానన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు బుధవారం మీడియాతో మాట్లాడుతూ పట్నం వాత్సల్యశ్రీకి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు. విద్యార్థిని కరాటేలో కూడా రాణించిందన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తనకు వివరించడంతో రూ.2లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించానన్నారు. రష్యా ఏషియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ సీటు రావడంతో తనను కలిసిందన్నారు. తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ.50లక్షలను భరిస్తానని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు కొత్త కాదని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను సాయం చేశానన్నారు. ఎవరికై నా చదువే రాజమార్గమని చెప్పారు. ఇందు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. విద్యావంతుల కుటుంబంలో జన్మించిన తాను పేదరికంతో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డానని, కేవలం విద్య కారణంగానే తన కుటుంబం మళ్లీ యధాస్థితికి వచ్చిందన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగాలంటే విద్య ద్వారానే సాధ్యమని తెలిపారు. విద్యతోనే నాగరికత అలవడుతుందన్నారు. అనంతరం పట్నం వాత్సల్యశ్రీ మాట్లాడుతూ గాడ్ ఫాదర్ లాంటి ఎమ్మెల్యే రాచమల్లుతోనే డాక్టర్ వాత్యల్సశ్రీ అవుతానని అన్నారు. తన తండ్రి శ్రీనివాస్ ఎల్ఐసీ ఏజెంట్‌గా ఉంటూ గుండెపోటుతో మరణించాడని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు గురించి తెలుసుకుని సంప్రదించానన్నారు. పెద్ద మనసుతో స్పందించిన ఆయన తన చదువుకు సహకారం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, విద్యార్థి తల్లి సునీత పాల్గొన్నారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
జియో గుడ్‌న్యూస్.. ఆ కస్టమర్లే టార్గెట్!
దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. కోట్లాది మంది టెలికం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ ప్లాన్లు విస్తరిస్తున్నప్పటికీ టారిఫ్‌లు మాత్రం పెంచబోమని హామీ ఇచ్చింది. దేశంలోని మిగతా అన్ని టెలికమ సంస్థల కంటే తమ రీచార్చ్ ప్లాన్లు చవగ్గానే ఉంటాయని వెల్లడించింది. అసలు టార్గెట్ వారే.. టెలికం పరిశ్రమలో రిలయన్స్ జియో దూకుడును మరింత పెంచింది. రానున్న రోజుల్లో 5జీ ప్లాన్లపైన కూడా టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న 24 కోట్ల మందికిపైగా ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్/ఎమ్టీఎన్ఎల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "సరసమైన టారిఫ్‌లు" ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. అంబానీల దృష్టి కూడా అదే.. జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. కంపెనీ టారిఫ్‌లను నాటకీయంగా పెంచాలని భావించడం లేదని, యూజర్లు ఇంటర్నెట్-హెవీ, డేటా ప్లాన్లకు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీల దృష్టి కూడా అదేనని ఆయన వివరించారు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
తమ్ముడు నేవీలో.. అన్న పోలీసు ఉద్యోగంలో
సారంగపూర్: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాతమ్ముళ్లు నెలరోజుల వ్యవధిలోనే రెండు ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మాన్పూరి లక్ష్మణ్–లక్ష్మీలకు ముగ్గురు సంతానం. ఇందులో పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇద్దరు కుమారులు లక్ష్మిరాజు, వినేష్ ఉన్నారు. అయితే బీడీ కంపెనీ నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను తల్లిదండ్రులూ కష్టపడి చదివించారు. వారి కోరుకున్నట్లే పెద్దవాడైన లక్ష్మిరాజు ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నెలరోజుల వ్యవధిలోనే రెండురోజుల క్రితం విడుదలైన నావికాదళం(నేవి) ఉద్యోగానికి అతడి తమ్ముడు వినేష్ ఎంపికయ్యాడు. శుక్రవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నాడు. తమ్ముడు దేశ రక్షణ దళంలో, అన్న రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే ఉద్యోగం సాధించడంపై మండల ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ శభాష్ సోదరులారా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి
సాక్షి, ఆదిలాబాద్: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని -
చిన్న విషయానికే నన్ను వదిలేసి నా భర్త వెళ్లిపోయాడు
కర్ణాటక: మాసిపోయిన తెల్లగడ్డం, చిరిగిపోయిన బట్టలు, పాత చెప్పులు, భుజంపై పెద్ద మూటతో ఒక వృద్ధుడు నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడు గంజాయిని అమ్ముతున్నాడేమోనని ఓ వ్యక్తి అనుమానంతో డయల్ 112 నంబర్‌కు కాల్చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ కాల్ ఒక కుటుంబాన్ని కలిపింది. ఫోన్ చేసిన వ్యక్తి చొరవ, పోలీసుల కృషి దీని వెనుక ఉన్నాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని ఆపి అతడి భుజంపై మోస్తున్న పెద్ద మూటను పరిశీలించగా డబ్బులు కనిపించాయి. అందులో రూ. 50 వేల చిల్లర, నోట్లు ఉన్నాయి. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా చెన్నరాయనదుర్గ హోబళి సిద్దరబెట్ట గ్రామ పంచాయతీ పరిధిలో మరేనాయకనహళ్లి గ్రామంలో జరిగింది. పదేళ్ల కిందట ఇల్లు వదిలి.. కొంతకాలంగా మరేనాయకనహళ్లి బస్టాండ్‌వద్ద గురుసిద్ధప్ప అనే వ్యక్తి చిరిగిపోయిన దుస్తులు ధరించి మూటతో ఉంటున్నాడు. అతన్ని పోలీసులు విచారించగా తన కథ చెప్పాడు. గుబ్బి తాలూకా చేళూరు హోబళి ఎంహెచ్ పట్న గ్రామ పంచాయతీ పరిధిలోని మాదాపుర గ్రామానికి చెందిన గురుసిద్ధప్ప తన భార్యతో గొడవల కారణంగా పదేళ్ల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చి జీవిస్తున్నట్లు చెప్పాడు. తుమకూరు, గుబ్బి, దేవరాయనదుర్గ, మధుగిరి, పావగడ, కొరటగెరె, సిద్దరబెట్ట తదితర ప్రాంతాల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బును గోనెసంచిలో భద్రం చేసుకున్నాడు. కుటుంబాన్ని పిలిపించి.. ఏఎస్సై హనుమంతరాయప్ప, హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణయ్య, కొరటెగెరె పీఎస్సై చేతన్‌లు అతని భార్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే భార్య మంగళమ్మ, కుమారుడు ప్రవీణ్ వచ్చారు. గురుసిద్ధప్పను, అలాగే నగదును అందించి మానవత్వం చాటుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు ‘చిన్న విషయానికే నన్ను వదిలేసి నా భర్త వెళ్లిపోయాడు. పదేళ్లు అయిపోయింది. కొరటగెరె పోలీసుల సహాయంతో మళ్లీ మాకు దొరికాడు. నా భర్త దాచిన డబ్బులు తిరిగి మాకే పోలీసులు ఇచ్చారు. నా భర్తను తిరిగి అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు.’ – మంగళమ్మ -
దీపావళి బోనస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు పండుగ వేళ తీపి కబురు అందించింది. పారామిలటరీ బలగాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులకు దీపావళి బోనస్‌లను ఆమోదించింది. 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్‌లను (తాత్కాలిక బోనస్‌లు) గరిష్టంగా రూ.7,000గా ఆర్థిక శాఖ నిర్ణయించింది. గ్రూప్-సి ఉద్యోగులతోపాటు గ్రూప్-బి లోని ఉత్పాదక బోనస్ పరిధిలోకి రాని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2022-23 అకౌంటింగ్ సంవత్సరానికి గానూ 30 రోజుల వేతనాలకు సమానమైన తాత్కాలిక బోనస్ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. బోనస్ నియమ నిబంధనలు 31.3.2023 నాటికి సర్వీస్‌లో ఉండి 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సర్వీస్ అందించిన ఉద్యోగులు మాత్రమే ఈ బోనస్‌కు అర్హులు. ఉద్యోగుల సగటు వేతనం లేదా గరిష్ట బోనస్ మొత్తం (ఏదీ తక్కువ ఉంటే అది) ఆధారంగా ఈ తాత్కాలిక బోనస్‌ను నిర్ణయిస్తారు. వారానికి 6 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో ఏడాదికి కనీసం 240 రోజులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు, వారానికి 5 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో అయితే కనీసం 206 రోజులు హాజరై ఉండాలి. The central government has approved a Diwali bonus for Group C and non-gazetted Group B rank officials, including paramilitary forces, with a maximum limit of Rs 7,000. (n/1) pic.twitter.com/IK0if6Swxh — Press Trust of India (@PTI_News) October 17, 2023 -
అరచేతిలో పంచాయతీ సమాచారం! మళ్ళీ కొత్త హంగులతో..
ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే యాప్ ద్వారా పరిశీలించవచ్చు. పంచాయతీలకు సంబంధించిన పద్దుల వివరాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ యాప్‌ను 2019 లోనే రూపొందించగా కొన్ని కారణాలతో వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్.. గ్రామపంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని సైతం యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏ దశల్లో ఉన్నాయనే సమాచం యాప్‌లో దర్శనమిస్తుంది. జిల్లా - పంచాయతీలు ► ఆదిలాబాద్ - 467 ► నిర్మల్ - 396 ► మంచిర్యాల - 311 ► ఆసిఫాబాద్ - 335 పారదర్శకతకు ప్రాధాన్యం.. పంచాయతీ నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది ప్రజలు సులువుగా తెలుసుకోవచ్చు. గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. పద్దుల వివరాలు ప్రజల వద్దకు వెళ్లడంతో పాలకవర్గాలు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలు ప్రశ్నించవచ్చు. పంచాయతీ వివరాలు ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్‌కు వెళ్లి ‘మేరీ పంచాయతీ’ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ వివరాలు దర్శనమిస్తాయి. వాటిని నమోదు చేయగానే గ్రామపంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు లేదా పిన్‌కోడ్‌తో సైతం సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకోవచ్చు. సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.. గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలను నెలకోసారి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షిప్తపరుస్తారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపు, పనుల వివరాల్లో సందేహాలు ఉంటే గ్రామసభల్లో ప్రశ్నించవచ్చు. – అరుణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
రేపో, ఎల్లుండో పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపు
సాక్షి, సిద్దిపేట: ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన రాష్ట్రాన్ని పొరపాటున కాంగ్రెస్ చేతిలో పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమ ర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. సోమ వారం సిద్దిపేట బస్టాండ్‌లో బీపీ చెకప్ కేంద్రం, స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపుపై రేపో, ఎల్లుండో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారన్నారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేశామని... ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లే వారని... ఇప్పుడు పక్క రాష్ట్రాల వారికి కూలీ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. వీవోలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని... ఉద్యోగస్తులతోపాటు వారికి కూడా పీఆర్సీ వర్తింపజేశామన్నారు. ‘దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చుస్తోంది.. ఇక్కడ అమలవుతున్న రైతు బంధు, బీమా, ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో మహిళా భవనం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్‌క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్‌క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్‌క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
BRS Manifesto: మహిళలకు అదిరిపోయే శుభవార్త..
-
ఒకేసారి అక్కాచెల్లెళ్లిద్దరికి..
వరంగల్: అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మర్థ శ్రీనివాస్–అంజలికి ప్రత్యూష, వినూష కుమార్తెలు ఉన్నారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి పరీక్షలు రాశారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో ఇద్దరు 111 మార్కులు సాధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అభినందించారు. కాగా, మండల పరిధిలో పలువురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. -
టైఫాయిడ్లోనూ వైద్య సేవలందిస్తూ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ చేతికి సెలైన్‌తోనే విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు వైద్యురాలు కృష్ణశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభ్వుత్వాస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణశ్రీ కొద్దిరోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం అయితే చేతికి సెలైన్ కూడా పెట్టుకున్నారు. అంత అనారోగ్యంలో కూడా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటలపాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. ఇన్ పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వారి రికార్డులను పరిశీలించారు. కృష్ణశ్రీ గతంలో వరదల సమయంలో కూడా పేషంట్లకు విశేషమైన సేవలందించిన ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి -
అవయవదానంతో అమరుడయ్యాడు
గుంటూరు: తాను మరణిస్తూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు కట్టా కృష్ణ అనే యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అయిన కృష్ణ అవయవదానంతో అమరుడు అయ్యాడు. పుట్టెడుదుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. తలకి బలమైన గాయం తగలటంతో చికిత్స నిమిత్తం గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక కృష్ణ ఈనెల 25న బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ముగ్గురి సంతానంలో ప్రథముడైన కృష్ణ మరణాన్ని తల్లిదండ్రులు రాజు, మల్లేశ్వరి జీర్ణించుకోలేక పోయారు. అనంతరం తమ బిడ్డ దూరమైనా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి తమ కుమారుడి అవయ వదానం చేసేందుకు ముందుకు వచ్చారు. కృష్ణ గుండెను తిరుపతికి, కాలేయాన్ని విశాఖపట్నంకు, రెండు కిడ్నీల్లో ఒకటి విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి, రెండోది గుంటూరు రమేశ్ ఆస్పత్రికి, రెండు కళ్లు (ఇద్దరికి అమర్చేందుకు) గుంటూరులోని సుదర్శిని ఆస్పత్రికి తరలించారు. విజయవంతంగా గుండె మార్పిడి తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో గుండెమార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం సుమారు 5.10 గంటలపాటు కష్టపడి గుండెమార్పిడి శస్త్రచికిత్సను చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన కృష్ణ గుండెను కర్నూలుకు చెందిన శ్రీనివాసన్ (33)కు అమర్చారు. శ్రీనివాసన్ గుండె సంబంధిత సమస్యతో మూడు నెలల క్రితం శ్రీపద్మావతి ఆస్పత్రికి వచ్చాడు. అతనికి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి మార్పిడి అనివార్యమని తేల్చారు. అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేయించారు. ఈ క్రమంలో కృష్ణ అవయవదానంతో శ్రీనివాసన్‌కు చికిత్స చేశారు. విశాఖలో గ్రీన్‌చానెల్.. కృష్ణ కాలేయాన్ని తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ విమానాశ్రయంకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్ ద్వారా షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తరలించారు. విమానాశ్రయం నుంచి 6 నిమిషాల్లోనే ఆస్పత్రికి కాలేయాన్ని చేర్చారు. సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రికి చేరేందుకు ట్రాఫిక్ పోలీసులు విశేష కృషి చేశారు. సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. ఓ ప్రాణం నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతలా ఆతృత పడతారో మరోసారి నిరూపించారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంవోతో చర్చలు జరిపిన నేపథ్యంలో గుండె మార్పిడి అవసరాన్ని ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గుండెను పదిలంగా, వేగంగా తరలించేందుకు ప్రత్యేక చాపర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలానే రూ. 13 లక్షలు ఖరీదైన గుండె మార్పిడి వైద్యానికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి నిధులను మంజూరు చేయించారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయంకు గుండెను తరలించి అక్కడి నుంచి ప్రత్యేక చాపర్ ద్వారా తిరుపతి విమానాశ్రయంకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌చానల్ ద్వారా 23 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
తాను మరణించినా మరో ఐదుగురికి జీవితం...
మరణశయ్యపై అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి కన్నపేగు కదిలి కదిలి కలచివేస్తున్నా.. దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తున్నా.. తీరని కడుపుకోత దావానలంలా తనువులను దహించి వేస్తున్నా.. విధిపై ఆక్రోశం కన్నీటిధారలు కడుతున్నా.. అంతరంగాన రేగిన ఆర్తనాదం నిశ్శబ్దంగా దేహాలను కంపింపజేస్తున్నా.. గుండెలను పిండేసే పెనువిషాదాన్ని పంటిబిగువనే భరిస్తూ ఆ తల్లిదండ్రులు కొండంత ఔదార్యం చూపారు. తమ కొడుకు చనిపోయినా మరికొందరికి పునర్జన్మనివ్వాలని తలంచారు. అవయవదానానికి అంగీకరించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. గుంటూరు మెడికల్, చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా రాజు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు సంతానం. రాజు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముతూ, ఆటో నడుపుతూ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ప్రథమ సంతానం కృష్ణ (18) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సంతోష్ తొమ్మిదో తరగతి, మూడో కుమారుడు అభిషేక్ 8వ తరగతి చదువుతున్నారు. ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో కృష్ణను ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్‌కి తరలించారు. కృష్ణకు ఈనెల 25న బ్రెయిన్ డెడ్ అయింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో గుండెలవిసేలా రోదించారు. చేతికంది వచ్చిన బిడ్డ తమను చూసుకుంటాడనుకునే సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అంతటి బాధలోనూ తల్లిదండ్రులు గుండెను దిటవు చేసుకుని తమ బిడ్డ మరణం మరికొందరికి జీవితం ప్రసాదించాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. కృష్ణ ఈనెల 19న తన 18వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న నాలుగురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని తల్లిదండ్రులు, స్నేహితులు విలపిస్తున్నారు. ఐదుగురికి పునర్జన్మ కృష్ణ నేత్రాలు గుంటూరు సుదర్శిని కంటి ఆస్పత్రికి, లివర్‌ను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్‌కు, ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్‌కు, మరో కిడ్నిని రమేష్ హాస్పిటల్‌కు, గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్‌కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా, గ్రీన్‌చానల్‌లో తరలించారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఐదుగురికి జీవితాలను ప్రసాదించనున్నట్టు వైద్యులు చెబుతున్నారు. తిరుపతి వ్యక్తికి గుండె ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించి తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆగమేఘాల మీద హెలీకాప్టర్‌ను రప్పించి, గ్రీన్ చానెల్ ద్వారా శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు. మరణంలోనూ పరోపకారం కట్టా కృష్ణ నాకు మంచి మిత్రుడు. చిన్ననాటి నుంచి కలుపుగోలు స్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. చివరకు మరణంలోనూ ఇతరులకు సహాయపడ్డాడు. మిత్రుడి మరణం తీవ్ర బాధ కలిగిస్తున్నా అతను చనిపోయినా ఇతరులకు ప్రాణదానం చేయడం గర్వంగా ఉంది. – పాలపర్తి మోహనవంశీ, స్నేహితుడు మంచితనానికి మారుపేరు కృష్ణ మంచితనానికి మారుపేరు. బంధువులందరితో కలుపుగోలుగా ఉండేవా డు. ఈనెల 19న సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నాడు. రోజుల వ్యవధిలోనే అందరినీ విడిచి కానరాని లోకాలకు వెళ్లడం మనసును కలచివేస్తోంది. అవయవ దానం ద్వారా ఐదుగురికి కొత్త జీవితాలు ఇచ్చిన కృష్ణతో స్నేహం, బంధుత్వం పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా. – పాలపర్తి నాని, స్నేహితుడు, మేనమామ కుమారుడు -
చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
సాక్షి, మహబూబాబాద్: చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్‌లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్‌లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. అరుదైన అవకాశం.. ఆసియా గేమ్స్‌లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం.