హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్‌ఆర్) మార్పులు చేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్‌ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్‌ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.
ఎంసీఎల్ఆర్ అంటే..
ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బెంచ్‌ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment