MCLR
-
ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్‌లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్‌లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్‌లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్‌ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మళ్ళీ పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు.. ఈ సారి ఎంతంటే?
దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మరోమారు పెంచుతూ ప్రకటించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచిన తరువాత.. ఎంసీఎల్ఆర్ రేట్లు 9.20 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ ప్రకటించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 2024 డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ను 5 పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరింది. ఒక నెల టెన్యూర్ రేటు (9.20 శాతం), మూడు నెలల టెన్యూర్ రేటు (9.30 శాతం) యధాతదంగా ఉంచింది.ఆరు నెలలు, 12 నెలలు (ఒక సంవత్సరం) టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద ఉంది. రెండు సంవత్సరాల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం అయితే.. మూడేళ్ళ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.50 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రమే 5 పాయింట్లు పెరిగినట్లు తెలుస్తోంది.కొత్త ఎంసీఎల్ఆర్లుఓవర్ నైట్: 9.20 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్డీఎఫ్సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..ఓవర్ నైట్: 9.15 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
ఎస్బీఐ కస్టమర్లకు చేదువార్త.. ఆ లోన్లు మరింత భారం!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇలా వడ్డీ రేట్లు పెంచడం ఇది వరుసగా మూడో నెల. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చాయి.మూడేళ్ల కాలవ్యవధికి ఎస్బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) ఇప్పుడు 9.10 శాతానికి పెరిగింది. ఇది ఇంతకుముందు 9% ఉండేది. ఇక ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ గతంలో 8.10 శాతం ఉండగా ఇప్పుడు 8.20% శాతానికి చేరింది. ఎస్బీఐ గత జూన్ నుంచి కొన్ని టెన్యూర్లలో 30 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ను పెంచింది.ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. అంటే దాని కంటే తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకు రుణాలు ఇవ్వదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించే కొన్ని నిర్దిష్ట సందర్భాలలో దీనికి మినహాయింపు ఉంటుంది. రుణ రేట్లను బెంచ్‌మార్కింగ్ చేయడానికి గతంలో ఉపయోగించిన బేస్ రేట్ సిస్టమ్ స్థానంలో 2016 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది. -
పెరిగిన ఎస్బీఐ వడ్డీ రేట్లు: ఈ రోజు నుంచే అమలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎట్టకేలకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. సవరించిన రేట్లు ఈ రోజు (జులై 15) నుంచి అమలులోకి వస్తాయి. ఇది లోన్ తీసుకున్నవారి మీద ప్రభావం చూపుతుంది.పెరిగిన వడ్డీ రేట్లుఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో వడ్డీ రేటు 8.3 శాతం నుంచి, 8.35 శాతానికి చేరింది.మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అంటే ఇది 10 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.బ్యాంక్ ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లకు 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఈ వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.85 శాతం, 8.95 శాతానికి చేరింది.మూడు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.95 శాతం నుంచి 9 శాతానికి చేరింది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్‌లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్‌మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న భారం!
హోమ్ లోన్ కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్ఆర్) మార్పులు చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్ఆర్ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్ఆర్ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.ఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు. -
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), బేస్ రేటును పెంచుతూ కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ కథనంలో పెరిగిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే వివరాలు తెలుసుకుందాం. ఎస్బీఐ బేస్ రేటు ఇప్పుడు 10.10 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగింది. అంటే కొత్త బేస్ రేటు గతం కంటే కూడా 0.15 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ రోజు (డిసెంబర్ 15) నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ విషయానికి వస్తే.. ఇది 8 శాతం నుంచి 8.55 శాతం వరకు ఉంది. ఓవర్ నైట్ ఎమ్సీఎల్ఆర్ రేటు 8.0 శాతం వద్ద ఉంది. ఒక నెల, మూడు నెలల కాలవ్యవధికి 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే? ఆరు నెలలకు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, సంవత్సర కాల వ్యవధికి 8.55 శాతం నుంచి 8.65 శాతానికి, రెండు సంవత్సరాలకు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, మూడు సంవత్సరాల కాల వ్యవధికి 8.75 నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఇవన్నీ ఈ రోజు నుంచే అమలులో ఉంటాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు షాకిచ్చింది. తాజా రివ్యూలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక వడ్డరీట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను సైలెంట్‌గా పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (MCLR) గరిష్టంగా 10 పాయింట్ల బేసిస్ పాయింట్ల వరకు పెంచింది బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ రుణాలపై MCLR 10 bps 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై MCLR 10 bps పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానిచేరింది మూడు నెలల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్ఆర్ 9.25 శాతంగా ఉంటుంది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్
HDFC Bank hikes interest rates దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. అన్ని రకాల లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆయా రుణాలపై ఈఎంఐ భారం మరింత భరించక తప్పదు. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) హెచ్డీఎఫ్సీ రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర పెంచింది. దీని ప్రకారం బ్యాంకుకు సంబంధించిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఇకపై వడ్డీ భారం పెరగనుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ పెంపు తర్వాత 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఏడాదిలోపు రుణాలపై వడ్డీరేటు భారం 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.15 శాతానికి చేరింది . (ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!) సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చిన హెచ్డీఎఫ్సీ MCLR 6 నెలలుకాల రుణాలపై 9.05 శాతం ఏడాది రుణాలపై 9.15శాతం రెండేళ్ల కాలపరిమితి రుణాలపై 9.20 శాతం మూడేళ్ల కాల రుణాలపై 9.25శాతం వడ్డీ వర్తిస్తుంది. -
ఆర్బీఐ వదిలినా.. ఆ మూడు బ్యాంకుల ఖాతాదారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా మూడవసారి 6.5 శాతం వద్ద కొనసాగిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్యాంకులు మాత్రం వడ్డీరేట్ల పెంపువైపే మొగ్గుచూపుతుండడం గమనార్హం. వ్యవస్థలో తగిన రుణ డిమాండ్ ఉందన్న విషయాన్ని బ్యాంకుల తాజా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ నిర్ణయాలతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణరేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగ రుణాలు ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్కు అనుసంధానమై ఉంటాయి. తాజా మార్పుతో ఏడాది బ్యాంకింగ్ ఎంసీఎల్ఆర్ రేట్ల పెరుగుదల తీరిదీ... బీఓబీ: రుణ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెరగనుంది. ఆగస్టు 12 నుంచి ఈ రేటు అమలవుతుంది. కెనరా బ్యాంక్: ఆగస్టు 12 నుంచి 8.65 శాతం నుంచి 8.7 శాతానికి పెరగనుంది. బీఓఎం: తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రేటు 10 బేసిస్ పాయింట్లు ఎగసి 8.60కి ఎగసింది. -
ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్! ఆ మూడు బ్యాంకుల్లో..
ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ 'ఐసీఐసీఐ'తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలకమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మూడు బ్యాంకులు తమ 'మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ల'ను (MCLR) సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది బహుశా కష్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రూల్స్ ఇప్పటికే (2023 ఆగష్టు 01) అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు బ్యాంకులు ఇచ్చే లోన్ మీద అమలు చేసే ఒక ప్రామాణిక వడ్డీ. ఒక వేలా ఎంసీఎల్ఆర్ రేట్లు పెరిగితే దీనికి అనుబంధంగా ఉండే వెహికల్, పర్సనల్, హోమ్ లోన్ వంటి అన్ని ఈఎమ్ఐలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కొత్త నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుందని సమాచారం. ఈ కారణంగా ఒక నెల ఎంసీఎల్ఆర్ రేట్లు 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3 & 6 నెలల కాలానికి వరుసగా 8. 41 శాతం, 8.80 శాతానికి చేరాయి. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) ఇప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లు యధాతధంగా ఉన్నట్లు సమాచారం. కావున బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.20 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) ఇక చివరగా బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే.. ఇది కూడా కొత్త నిర్ణయాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం ఉండగా.. ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 8.15 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్
మెగా మెర్జర్ తరువాత ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల్లో నిలిచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ఎంసిఎల్ఆర్ను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అవకాశం ఉంది. సవరించిన వడ్డీరేట్లు శుక్రవారం ( జూలై 7 ) నుంచే అమలులోకి వచ్చాయి. బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దీంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఆటో లోన్ సహా అన్ని రకాల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. (డైనమిక్ లేడీ నదియా వ్యాపారం, ఆమె కిల్లర్ మూవ్ గురించి తెలుసా?) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంపుతో ఇది 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగానూ,5 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.9 శాతంగా ఉండనుంది. అయితే ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం వద్ద యథాతథంగా ఉంటుంది. (మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?) -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు భారీ షాక్!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన టెన్యూర్ కాలానికి 15 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్( (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల )ను పెంచింది. పెంచిన ఈ రేట్లు మే 8 నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన ఈ ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లోని పర్సనల్, వెహికల్ లోన్స్ పాటు ఇతర రుణాలు తీసుకున్న ఖాతాదారులు నెలనెలా చెల్లించే ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ ఆర్ రేటు 7.95 శాతం, ఒక నెల టెన్యూర్ కాలానికి 8.10శాతం, 3 నెలల టెన్యూర్ కాలానికి 8.40శాతం, 6 నెలల టెన్యూర్ కాలానికి 8.80శాతం, ఏడాది టెన్యూర్ కాలానికి 9.05 శాతం, రెండు సంవత్సరాల టెన్యూర్ కాలానికి 9.10 శాతం, 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 9.20శాతం విధిస్తుంది. -
ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్: రుణాలపై భారీగా తగ్గనున్న భారం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గించి భారీ ఊరటనిచ్చింది.మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది. మరోవైపు 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు ప్రకటించింది. కాగా రివ్యూలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. (‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో) ఇదీ చదవండి: Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా! -
ఇక బ్యాంకుల బాదుడు షురూ?.. భారం కానున్న లోన్ ఈఎంఐలు
ఇదిలాఉండగా, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ సమీకరణ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్) మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును బ్యాంకులు వ్యవస్థపై 100 నుంచి 150 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) బదలాయించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే జరిగితే వాహన, వ్యక్తిగత, ఆటో, వాణిజ్య రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. గత నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. వచ్చే నెల్లో జరిగే సమావేశాల్లోనూ పావుశాతం రేటు పెంపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రుణ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తంగా డిపాజిట్ రేట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. వ్యవస్థలో డిపాజిట్లు కూడా 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి. -
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: వడ్డీ బాదుడు షురూ!
సాక్షి,ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని కాల రుణాలపై వడ్డీ రేటు పెంపునకు నిర్ణయంచింది. ఎస్బీఐ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటును10 బీపీఎస్ పాయింట్లుపెంచింది. ఫలితంగా వడ్డీరేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచింది. ఫలితంగా నెల కాల రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 8.10 శాతానికి పెరిగింది. పెరిగిన వడ్డీరేట్లు ఈ రోజునుంచే( ఫిబ్రవరి 15, బుధవారం) అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.ఒక సంవత్సరం కాల రుణాలపై కొత్త రేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి ,రెండేళ్ల కాలవ్యవధికి 8.50 శాతం నుంచి 8.60 శాతం. మూడేళ్ల పదవీకాలానికి రేటు 8.60 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగిందని ఎస్బీఐ తెలిపింది. తాజా నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు తీసుకున్న వారికి అదనపు భారం తప్పదు. ఇటీవలి మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ రెపోరేటు పావు శాతం పెంపు నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 25 బీపీఎస్ పాయింట్లు పెంచి 6.50 శాతంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఇవీ చదవండి! MBA Chai Wala: అపుడు టీ బిజినెస్‌తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..! గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్! తేలిగ్గా తీసుకుంటే అంతే.. -
సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
ఓ వైపు ఆర్ధిక మాద్యం.. మరోవైపు బ్యాంకులు పెంచుతున్న వడ్డీ రేట్లు సామాన్యులకు భారంగా మారాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లబ్ధిదారులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్ల పెరిగాయి. దీంతో ప్రస్తుతం మొత్తం ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.60 శాతంగా ఉన్నాయి. నెల వ్యవధి కాలానికి ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.60శాతం, మూడు నెలల టెన్యూర్ కాలానికి 8.65శాతం, ఆరునెలల కాలానికి 8.75శాతం, ఏడాది కాలానికి కన్జ్యూమర్ లోన్స్ 8.85శాతం నుంచి 8.90శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్ కాలానికి 9శాతం, మూడేళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 9.10శాతంగా ఉన్నాయి. కాగా, గత 9 నెలలుగా పెరుగుతోన్న వడ్డీరేట్ల మోతకు ఈసారి కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) ఆర్థిక రంగ వృద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఆర్బీఐ సమావేశంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పండుగ పూట కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ!
సంక్రాంతి పండుగ రోజే ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేట్లు పెంచింది. దీంతో హోమ్లోన్లు, ఇతర రుణాలపై ఏడాది టెన్యూర్ కాలానికి 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి.పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ వెబ్‌పోర్ట్‌లో పొందుపరిచిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఏడాది ఎంసీఎల్ ఆర్ రేటు గతంలో 8.3శాతం ఉండగా ఇప్పుడు 8.4 శాతానికి పెరిగింది. అయితే ఇతర టెన్యూర్లలోని ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇక, 2 ఏళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.50శాతం, 3 ఏళ్ల టెన్యూర్ కాలానికి 8.60 శాతంగా ఉంది. ఒక నెల, మూడు నెలల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ రేటులో మారకుండా 8 శాతంగా కొనసాగుతుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతంతో తటస్థంగా ఉంది. -
కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణ రేట్లు మరింత పెరగనున్నాయి. కొత్త రేటు జనవరి 12వ తేదీ నుంచి అమలవుతుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. నెల, మూడు, ఆరు, ఏడాది రేట్లు వరుసగా 8.15 శాతం, 8.25 శాతం, 8.35 శాతం, 8.50 శాతాలకు పెరిగాయి. పలు వాహన, వ్యక్తిగత, గృహ రుణాలకు ఏడాది రుణ రేటు అనుసంధానమై ఉండే సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు సోమవారం రుణ రేటను 25 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఐఓబీ డిపాజిట్ల రేట్లు అప్ కాగా, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)రిటైల్ డిపాజిట్ రేటును తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 45 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని ప్రకారం 444 రోజుల కాలానికి డిపాజిట్లపై 7.75 శాతం రేటు అమలవుతుంది. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ రేటును కూడా మంగళవారం నుంచి బ్యాంక్ 1% పెంచింది. దీనితో ఈ రేటు 5 శాతానికి చేరింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్!
ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరం తన కస్టమర్లకు షాకిచ్చింది. జనవరి నెల నుంచి రుణ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం పడనుంది. తాజా పెంపుతో రుణగ్రహితలపై అధిక వడ్డీల భారం పడనుంది. ఇప్పటికే పలు బ్యాంకుల తమ వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెంపు నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రేట్ల పెంపు తర్వాత వీటిపై లుక్కేస్తే.. ఓవర్ నైట్, ఒకనెల రోజులకు ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా ఉండగా, 3 నెలలకు ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.2 శాతం, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం పెంచిన కొత్త రేట్లు కారణంగా ఇకపై కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. వీటితో పాటు రెన్యూవల్, రీసెట్ డేట్ తర్వాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయి. చదవండి: అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రెపోరేట్ల పెంపుతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ, ప్రభుత్వ రంగం బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రుణ రేట్లను పెంచాయి. అయితే తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’(బీవోబీ) ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. నవంబర్ నెలలో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అప్పుడు రేట్ల పెంపు 15 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఈ రుణ రేటు పెంపు నిర్ణయం డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెరగడం వల్ల హౌసింగ్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఈ (Small Medium Enterprises) లోన్స్ వంటివి భారం కానున్నాయి. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు రీసెట్ డేట్ నుంచి అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులకు కట్టే నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. బీవోబీలో ఎంసీఎల్ రేట్లు ఇక బీవోబీ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 8.3 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. -
బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
ముంబై: గృహ రుణ రేటును పరిమిత కాలానికి పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. దీనితో ఈ రేటు 8.25 శాతానికి తగ్గింది. తాజా రేటు 2022 డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని కూడా పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక రేటు రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. తగ్గించిన రుణ రేటు బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ గృహ రుణ రేటులో ఒకటని, అత్యంత పోటీ పూర్వకమైనదని బ్యాంక్ పేర్కొంది. తాజా రేటు తగ్గింపు తాజా గృహ రుణాలతో పాటు, బ్యాలెన్స్ బదలాయింపులకూ వర్తిస్తుందని తెలిపింది. ‘‘ఈ ఏడాది మేము గృహ రుణ విభాగంలో మంచి వృద్ధి రేటును చూశాం. అన్ని పట్టణాల్లో పటిష్ట డిమాండ్ ఉంది. మా తాజా నిర్ణయం రుణ వృద్ధి మరింత పెరగడానికి దోహదపడుతుంది’’ అని బ్యాంక్ జనరల్ మేనేజర్ (తనఖాలు, ఇతర రిటైల్ రుణాలు) హెచ్‌టీ సోలంకీ తెలిపారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి
ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారం కానున్నాయి. ఈ పెంచిన రేట్లు నవంబర్ 15, 2022 నుండి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వాహన, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లు ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయించబడతాయి. అయితే ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్లు అంతకుముందు 7.95 శాతం నుండి 10 బేసిస్ పాయింట్లు (bps) 8.05 శాతానికి పెంచింది అలాగే, రెండేళ్లు , మూడేళ్ల ఎంసీఎల్ఆర్లను ఒక్కొక్కటి 10 బేసిస్ పాయింట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి పెంచినట్లు ఎస్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్లను ఒక్కొక్కటి 15 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి, ఓవర్‌నైట్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.60 శాతానికి చేరుకుంది. ఎంసీఎల్ఆర్ అంటే కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటే ..ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ అంటారు. రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్ఆర్ ఆటోమేటిక్‌గా రుణాల కాస్ట్‌పై ప్రభావం చూపుతుంది. రుణాలపై వడ్డీరేటు పెరిగితే నెలవారీ ఈఎంఐలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసీఎల్ఆర్పై ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపైనా ఈఎంఐ ప్రభావం పడుతుంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు భారీ షాక్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేట్లను పెంచింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణరేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సవరిత రేట్లు 12వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరిగిన రేట్లను చూస్తే బెంచ్‌మార్క్ ఏడాది ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి 8.05%కి చేరింది. ఇది వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు అనుసంధానమైన రేటు. ఏడాది, మూడేళ్లు, 6 నెలల రేట్లు 10 బేసిస్ పాయింట్ల చొప్పున ఎగసి వరుసగా 7.70%, 7.75%, 7.90 శాతాలకు చేరాయి. -
కస్టమర్లకు భారీ షాక్.. ఆ రెండు బ్యాంకులు కీలక నిర్ణయం!
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డీలా పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో చూస్తే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు సవరిస్తోంది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారంగా మారుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు బ్యాంకులు జత చేరాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు పెంచి తమ కస్టమర్లకు షాకిచ్చాయి. బాదుడే బాదడు! బ్యాంకులు వరుసపెట్టి వారి రుణ రేట్లు పెంచుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా రుణ రేట్లు పెంచింది. తాజాగా ఇండియన్ బ్యాంకు తమ రుణ రేటును (MCLR) 35 బేసిస్ పాయింట్ల, ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటును (MCLR) 20 పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో లోన్ ఈఎంఐలు పెరగడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పైకి ఎగబాకుతాయి. పెంచిన వడ్డీ రేటు ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.4 శాతానికి చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతానికి చేరింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ పెంపు నిర్ణయం నవంబర్ 1 నుంచే అమలులోకి రాగా, ఇండియన్ బ్యాంక్ రుణ రేటు పెంపు నవంబర్ 3 నుంచి అమలులోకి రానుంది. చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఖాతాదారులకు అందించే వివిధ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో కీలకమైన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పెంచినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో పెరిగిన ఎంసీఎల్ఆర్ రేట్లు పలు రకాల లోన్లపై ప్రభావం పడనుంది. ►సెప్టెంబర్ 11 నుండి పెరిగిన కొత్త యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ►ఇక ఈ ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ టెన్ష్యూర్కు 7.00 శాతం, ఒక నెల టెన్ష్యూర్ కాలానికి 7.15 శాతానికి పెంచారు. తద్వారా అన్ని టెన్ష్యూర్ కాలానికి 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. మూడు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లను 7.25 శాతంగా యథాతథంగా ఉంచారు. ఆరు నెలలు, ఏడాది కాలపరిమితిలో యూబీఐ బ్యాంక్ రేట్లు వరుసగా 7.55 శాతం, 7.75 శాతం చొప్పున 5 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ►రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితిలో యూబీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం, 8.10 శాతం చొప్పున 20 బేసిస్ పాయింట్లు, 35 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ►కొత్త యూనియన్ బ్యాంక్ ఎంసిఎల్ఆర్ రేట్లు సెప్టెంబర్ 11 నుండి అమల్లోకి రాగా..ఈ రేట్ల పెంపు కొత్తగా రుణాలు తీసుకునే ఖాతాదారులకు లేదంటే, ఇప్పటికే రుణాలు తీసుకున్న రుణ గ్రహితలపై ప్రభావం పడునుంది. బ్యాంక్ నుండి తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. సెప్టెంబర్ 11, 2022 నుండి అమల్లోకి వచ్చిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లు ఇలా ఉన్నాయి. ఓవర్ నైట్: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు - 6.95 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.00 శాతానికి పెరిగాయి ఒక నెల: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు - 7.10 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.15 శాతానికి పెరిగాయి మూడు నెలలు: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు 7.35 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.35 శాతంగా ఉంది ఆరు నెలలు: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు 7.50 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.55 శాతానికి పెరిగాయి ఒక సంవత్సరం: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు 7.70 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.75 శాతానికి పెరిగాయి రెండేళ్లు : ఎంసీఎల్ ఆర్ పాత రేట్లు 7.75 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతానికి పెరిగాయి. మూడేళ్లు: ఎంసీఎల్ ఆర్ పాత రేట్లు 7.75 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 8.10 శాతానికి పెరిగాయి. చదవండి: పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం! -
మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు
ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 0.10% మేర పెరిగింది. -
ఖాతాదారులకు షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మరోసారి తన ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు వాహన, గృహ అన్ని రకాల రుణాలపై వర్తిస్తుంది . ఈ రేట్లు నేడు(సెప్టెంబర్ 1, 2022) నుంచే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. తాజా వడ్డీ రేట్ల సవరణలో రుణ గ్రహీతలపై ఈఎంపై భారం మరింత పెరగనుంది. తాజాగాపెంచిన పెంపుతో ఓవర్‌నైట్ , ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటును 7.65 శాతం నుండి 7.75 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల కాల పరిమితి రుణాలపై 7.80 శాతంగానూ, ఆరు నెలలకు 7.95 శాతంగా ఉండనుంది. ఇక వార్షికరుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంటుంది. గత నాలుగు నెలల్లో వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూన్, జూలై, ఆగస్టులలో రేట్లు సవరించింది. ఆగస్టులో, బ్యాంక్ తన రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇది చదవండి: షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్ windfall profit tax: మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్ SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును మరోసారి పెంచింది. తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బీపీఎస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై మరింత భారం మోపింది. బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (EBLR), రెపో-లింక్డ్ లెండింగ్ రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఆగస్టు 15 నుండి సవరించిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ప్రకటించింది. ఓవర్‌నైట్ నుండి మూడు నెలల వరకు ఎస్బీఐ MCLR రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీరేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది. సంవత్సర పరిధి లోన్లపై 7.90 శాతం, రెండేళ్లు,మూడు సంవత్సరాల 8 శాతంగా ఉంచింది. మూడు నెలల్లో మూడో పెంపు ఇది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం ప్రకటించింది. -
ఐఓబీ రుణ రేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా పెంచింది. అన్ని కాలపరిమితులపై ఈ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 10వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణ రేటుకు ప్రధానంగా ప్రామాణికంగా ఉండే ఏడాది రుణ రేటు 7.45% నుంచి 7.55%కి చేరింది. రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 7.55% కి చేరింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 నుంచి 7.50% శ్రేణిలో ఉన్నాయి. -
కెనరా బ్యాంక్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. గురువారం నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల కాలాలకు సంబంధించి కొత్త రేట్లు 6.75 శాతం నుంచి 7.45 శాతం శ్రేణిలో ఉన్నాయి. రెపో ఆధారిత రుణ రేటును 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. -
హెచ్డీఎఫ్సీ రెండో ‘వడ్డింపు’: వినియోగదారులకు షాక్!
ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు నెలల వ్యవధిలో రెండో సారి రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. రుణ రేటును 0.35 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. దీనితో రెండు నెలల్లో పెరిగిన రేటు మొత్తం 0.60 శాతంగా ఉంది. తాజాగా పెంచిన నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ♦ రుణాలకు ప్రధానంగా ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. ♦ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుంచి 7.50 శాతానికి ఎగసింది. ♦ మూడళ్ల రేటు 7.70 నుంచి 8.05కు చేరింది. ఆర్బీఐ కీలక నిర్ణయాలు ఇదిలావుండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెండవ ద్వైమాసిక సమావేశం కీలక నిర్ణయాలను వెలువరించింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 4.4 శాతం) మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్‌లో తొలి ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ఎంపీసీ, మే తొలి వారంలో అనూహ్య రీతిలో సమావేశమై రెపో రేటును 2018 ఆగస్టు తర్వాత మొట్టమొదటిసారి 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
ఎస్బీఐ షాకింగ్ నిర్ణయం..వారిపై తీవ్ర ప్రభావం..!
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గట్టి షాక్‌ను ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు ఏప్రిల్ 15, 2022 నుంచి అమలులోకి రానుంది. ఎస్బీఐ అందించే లోన్ల వడ్డీ రేటు మరో 0.10 శాతం పెరగనుంది. ఈ పెంపు అన్ని రకాల టెన్యూర్స్‌కు వర్తించనుంది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లను తీసుకునే వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుంది. ఇక గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతరత్ర రుణాలు చెల్లించేవారిపై ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎస్బీఐ సవరించిన ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం. ఒక నెల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 నుంచి 6.75 శాతం. 3 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతం. 6 నెలల కాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 6.95 శాతం నుంచి 7.05 శాతం. ఒక ఏడాది కాలానికి ఎంసీఎల్ఆర్ 7 శాతం నుంచి 7.10 శాతం. రెండేళ్ల కాల పరిమితికి ఎంసీఎల్ఆర్ 7.2 శాతం నుంచి 7.3 శాతం. మూడేళ్ల కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతం. ఎంసీఎల్ఆర్ పెంపు...ఎస్బీఐ రుణ గ్రహీతలపై ప్రభావం..! సాధారణంగా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారంగానే సదరు లోన్లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)2016లో ప్రవేశపెట్టింది. ఎంసీఎల్ఆర్ పెరుగుదలతో...ఎస్బీఐ గృహ, ఇతర రుణగ్రహీతలు సంతోషంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సవరణ ప్రస్తుత, భవిష్యత్తు రుణగ్రహీతలకు వర్తిస్తుంది. చదవండి: జీఎస్టీ శ్లాబులో మార్పులు, చేర్పులు... దానిని తొలగించే అవకాశం...! -
బీవోబీ కనీస రుణ రేటు పెంపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తన కనీస రుణ రేటు ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్)ను అన్ని కాలపరిమితులకు సంబంధించి స్వల్పంగా 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. పెంచిన రేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్లు 0.05 శాతం పెరిగి వరుసగా 6.50 శాతం, 6.95 శాతం, 7.10 శాతం, 7.20 శాతం వరకూ పెరిగాయి. వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ వడ్డీరేటు 7.35 శాతానికి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)లో ఎటువంటి మార్పూ చేయకపోయినప్పటికీ, వ్యవస్థలో ఉన్న దాదాపు రూ.8.5 లక్షల కోట్ల అదనపు ద్రవ్యాన్ని కొన్ని సంవత్సరాల్లో క్రమంగా వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు భారీ డిమాండ్
మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడింగ్‌లో భాగంగా ప్రభుత్వ రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 5శాతానికి పైగా లాభపడింది. మార్కెట్ స్వల్పలాభాల ప్రారంభంలో భాగంగా ఈ ఇండెక్స్ 1,480.50 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్ ఒకదశలో 5.22శాతం లాభపడి 1555 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్ నిన్నటి ముగింపు(1,477.80)తో పోలిస్తే 5శాతం లాభంతో 1,551.85 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా మహారాష్ట్ర బ్యాంక్ 9శాతం పెరిగింది. కెనరా బ్యాంక్ 8శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 6శాతం, పీఎన్బీ, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, ఐఓబీ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ షేర్లు 3శాతం ర్యాలీ చేశాయి. ఎస్బీఐ నుంచి మరో గుడ్ న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎంసీఎల్ఆర్ను తగ్గించడం వరుసగా 14వ సారి కావడం విశేషం. కొత్త వడ్డీ రేట్లు జూలై 10 నుంచి అమలులోకి వస్తాయి. మూడు నెలల కాల వ్యవధిపై ఇకపై 6.65 శాతం వడ్డీ అమలులో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ ఎంత తక్కువ ఉంటే కస్టమర్లకు హోమ్ లోన్ ఈఎంఐ అంత తగ్గుతుంది అదేబాటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: పూణే ఆధారిత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఎంసీఎల్ఆర్ను 20 బేసిన్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఏడాదికాల వ్యవధిపై ఎంసీఎల్ఆర్ 7.70శాతం నుంచి 7.50శాతానికి దిగిరానుంది. -
వడ్డీరేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బి) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల వడ్డీరేటును తగ్గిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అన్ని కాల పరిమితి గల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 15 బీపీఎస్‌పాయింట్లు తగ్గించింది. అలాగే రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ను 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. దీంతో 7.05 నుంచి 6.65 శాతానికి తిగి వచ్చింది. ఈ సవరించిన రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది ఫండ్ డిపాజిట్ రేటును కూడా తగ్గించింది. గరిష్టంగా 3.25 శాతం చెల్లించనున్నట్టు తెలిపింది. వివిధ మెచ్యూరిటీల టర్మ్ డిపాజిట్ రేట్లను గరిష్టంగా 5.50 శాతంగా ఉంచింది. రూ .2 కోట్లకు పైన డిపాజిట్లపై సీనియర్ సిటిజనులకు సాధరణ వాటికంటే కంటే 75 బీపీఎస్ పాయింట్ల మేర అధిక వడ్డీ రేటును అందివ్వనుంది. ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంలో దీనికనుగుణంగా దేశీయ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే. -
తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్ఆర్కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్‌మార్క్ రుణ రేటు–ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది. వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్బీఐ వియ్‌కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది. మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్బీఐ అనుమతి నివ్వడంతో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. -
ఎస్బీఐ గుడ్ న్యూస్, వారికి ప్రత్యేక పథకం
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా వడ్డీని చెల్లించనుంది. అన్ని రకాల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా సవరింపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 7.40 శాతం 7.25 శాతానికి దిగి వచ్చింది. ఈ రేట్లు మే 10వ తేదీనుంచి అమల్లోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్లో ఇది వరుసగా పన్నెండవ తగ్గింపు అని బ్యాంకు వెల్లడించింది. అలాగే మూడేళ్ల కాల పరిమితిగల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 20 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లను మార్చి 12వ తేదీనుంచి అమలు చేయనుంది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో 'ఎస్బీఐ fవీకేర్ డిపాజిట్' పథకాన్ని లాంచ్ చేసింది. 5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ వ్యవధిలో ఈ డిపాజిట్లను అందుబాటులో ఉంచనుంది. వీటిపై అదనంగా 30 బీపీఎస్ పాయింట్ల ప్రీమియం వడ్డీని అందించనుంది. 2020 సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అందుబాటులో వుంటుందని ఎస్బీఐ తెలిపింది. (కోవిడ్-19 : కోటక్ మహీంద్ర వేతనాల కోత) (విశాఖ గ్యాస్ లీకేజీపై ఎల్జీ కెమ్ స్పందన) -
రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణ రేటును 0.20 శాతం తగ్గించింది. ఫండ్స్ బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్ఆర్) రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. సవరించిన ఈ వడ్డీరేట్టు ఈనెల 7నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన రేట్ల ప్రకారం ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 7.95 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగా మారిందని తెలిపింది. దీంతో గురువారం నాటి మార్కెట్టలో హెచ్‌డిఎఫ్‌సి షేరు లాభపడుతోంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్ డౌన్ నేపథ్యంలో ముందస్తు పరపతి విధాన సమీక్ష చేపట్టిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండయా కీలక వడ్డీరేట్లను బాగా తగ్గించింది. దీంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా రుణాలు, డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా డిపాజిట్లు, రుణాల వడ్డీరేటు కోతను ప్రకటించింది. చదవండి: లాభాల ప్రారంభం : ఫార్మా జోరు -
రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : రుణాలపై వడ్డీరేట్లను ఎస్బీఐ 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)లో కోత విధించింది. ఏడాది కాల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 7.85 శాతం నుంచి 7.75 శాతానికి, ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితి కలిగిన రుణ రేట్లను 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఎంసీఎల్ఆర్ను తగ్గించడం ఇది వరుసగా పదోసారి కావడం గమనార్హం. మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణ రేటును 7.65 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. మూడేళ్ల కాలానికి రుణ రేట్లను 8.05 శాతం నుంచి 7.95 శాతానికి కుదించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సోమవారం ఎంసీఎల్ఆర్ను అన్ని కాలపరిమితి కలిగిన రుణాలపై 10 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. చదవండి : ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం కాదు: రజనీష్ -
ఆర్బీఐ రివ్యూ, ఎస్బీఐ కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్ఆర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్ఆర్లో ఎస్బీఐ ప్రకటించిన వరుసగా తొమ్మిదవ కోత ఇది. ఈ తగ్గింపుతో, ఫండ్-బేస్డ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ఒక సంవత్సరం ఉపాంత వ్యయం 7.90 శాతం నుండి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటన తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును 5.15 శాతం, రివర్స్‌రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా రూ. లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ను ప్రకటించడంతో ఈ ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత విధించింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను రిటైల్ విభాగంలో 10-50 బీపీఎస్ పాయింట్లు, బల్క్ విభాగంలో 25-50 బిపిఎస్ తగ్గించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) పై సవరించిన వడ్డీ రేటున ఫిబ్రవరి 10నుంచి అమలవుతుందని తెలిపింది. చదవండి : రియల్టీకి భారీ రిలీఫ్: వడ్డీరేట్లు యథాతథం మారని రేట్లు.. వృద్ధికి చర్యలు -
గృహ రుణ బదిలీతో లాభమెంత
అరుణ్ మిశ్రా (40) ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. 2010లో యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.20 లక్షల రుణాన్ని తీసుకుని నోయిడాలో రూ.37 లక్షల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారు. ఫ్లోటింగ్ రేటుపై రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన 9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నాడు. 2010లో రుణాన్ని తీసుకున్నందున బీపీఎల్ఆర్ ఆధారిత రుణ రేటే ఇప్పటికీ అమలవుతోంది. ప్రస్తుత రేటుకు అతను మార్చుకోలేదు. దీనివల్ల అతను పలు ప్రయోజనాలు కోల్పోతున్నాడు. అరుణ్ ఒక ఉదాహరణ మాత్రమే. 2010 తర్వాత గృహ రుణాలకు బెంచ్‌మార్క్ విధానాలు మూడు పర్యాయాలు మారిపోయాయి. 2011లో బేస్ రేటు, 2016లో ఎంసీఎల్ఆర్ రేటు, 2019 అక్టోబర్‌లో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు విధానాలు అమల్లోకి వచ్చాయి. రేట్లలో మార్పును వెంటనే బదలాయించడం, పారదర్శకత పెంపునకు ఎప్పటికప్పుడు నూతన విధానాల అమలు జరుగుతోంది. కానీ, అరుణ్ మిశ్రా వంటి ఎందరో ఇప్పటికీ పాత బెంచ్ మార్క్ విధానంలోనే కొనసాగుతున్నారు. మరింత పారదర్శకత, తక్కువ వడ్డీ రేటుతో కూడిన విధానాలకు బదిలీ చేసుకోవడం లేదు. ఒక నివేదిక ప్రకారం.. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియోలో 25 శాతం రుణాలు ఇప్పటికీ బేస్ రేటు విధానంలోనే కొనసాగుతున్నాయి. రూ.5,000 కోట్ల రుణాలు బీపీఎల్ఆర్ విధానంలో ఉన్నాయి. ‘‘బేస్ రేటు లేదా బీపీఎల్ఆర్ విధానంలో రుణాలు తీసుకున్న కస్టమర్లు నేడు అందుబాటులో ఉన్న మెరుగైన రేట్లతో పోలిస్తే 3.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు’’ అని బ్యాంక్‌బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ చందానీ తెలిపారు. కనుక ఇంటి రుణాలు తీసుకున్న వారు ఒక్కసారి వాటిని సమీక్షించుకోవడం ఎంతో అవసరం. రుణాన్ని నూతన బెంచ్ మార్క్ విధానంలోకి మార్చుకోవడం.. అప్పటికీ తాము చెల్లిస్తున్న వడ్డీ రేటు, మార్కెట్లో ఉన్న రేటు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే వెంటనే ఆ రుణాన్ని మరో సంస్థకు బదలాయించుకోవడం వల్ల లాభం ఉంటుంది. కానీ, దీనికంటే ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను అందించే ప్రాఫిట్ కథనం ఇది. అవగాహన లేకే.. ‘‘ఇంటి రుణాన్ని మరొక బ్యాంకు లేదా సంస్థకు బదలాయించుకోకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటుంటాయి. మరింత పారదర్శకమైన బెంచ్‌మార్క్ రేట్ల విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలియకపోవచ్చు. లేదా ప్రస్తుతం తాము చెల్లిస్తున్న రేటు మెరుగ్గానూ ఉండొచ్చు. కొందరికి తెలిసినప్పటికీ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు’’ అని స్విచ్మే వ్యవస్థాపకుడు ఆదిత్య మిశ్రా తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర సేవింగ్స్, కరెంటు ఖాతాల్లో డిపాజిట్లు దండి గా ఉంటాయి. వీటిపై కస్టమర్లకు బ్యాంకులు చెల్లించే రేటు సగటున చాలా తక్కువ. సేవింగ్స్ ఖాతాలపై 3–3.5 శాతం రేటు చెల్లిస్తుంటే, కరెంటు ఖాతాల్లోని బ్యాలెన్స్‌లపై చెల్లింపులు సున్నా యే. చాలా చౌకగా బ్యాంకులకు నిధుల అందుబాటు ఉంటుంది. అందుకే బ్యాంకుల గృహ రుణాలపై రేట్లు కొంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఎప్పుడు మారడం.. గృహ రుణాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే మరో సంస్థకు బదిలీ చేసుకోవాలని భావించే వారు.. దీనివల్ల లాభమా? నష్టమా? అన్న సందిగ్ధంలో ఉంటే... పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ‘‘రుణ కాల వ్యవధి కనీసం మరో 15 ఏళ్లు ఉండి, ప్రస్తుత రుణంపై రేటుతో పోలిస్తే కనీసం 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తక్కువకు ఆఫర్ చేస్తుంటే అప్పుడు రుణాన్ని బదిలీ చేసుకోవడం లాభదాయకం అవుతుంది. ఒకవేళ 15 సంవత్సరాల కంటే తక్కువ కాలమే ఇంకా చెల్లింపులకు మిగిలి ఉంటే అప్పుడు బదిలీ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఎంతన్నది లెక్క వేసుకుని చూడాలి’’ అని ఆదిత్య మిశ్రా సూచించారు. హోమ్‌లోన్ ట్రాన్స్ఫర్ కాలిక్యులేటర్లు ఆన్లైన్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో బదిలీ వల్ల మిగిలేది ఎంతన్నది తెలుసుకోవచ్చు. రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో చెల్లించాల్సిన పలు చార్జీలను మిగిలే ప్రయోజనం నుంచి మినహాయించడం మరిచిపోవద్దు. అంతిమంగా పెద్ద మొత్తమే మిగులుతుందన్న లెక్క తేలితే అప్పుడు నిరభ్యంతరంగా రుణాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే, రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ‘‘చాలా సంస్థలు మిగిలి ఉన్న గృహ రుణ బదిలీకి అనుమతిస్తూ కొత్తగా టాపప్ లోన్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అదనపు నిధుల సాయం అవసరమున్న వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇది తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది’’ అని రతన్ చౌదరి తెలిపారు. రేటు తగ్గింపునకు సంప్రదింపులు మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే.. అదే సంస్థ మీతో పోలిస్తే కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకు రుణాన్ని ఆఫర్ చేస్తుంటే.. అప్పుడు మీకు కూడా రేటు తగ్గించే విషయమై సంప్రదింపులు చేపట్టాలి. రుణ రేటును తగ్గించేందుకు బ్యాంకు అంగీకరించనప్పుడు లేదా మంచి రేటును ఆఫర్ చేయనప్పుడే రుణ బదలాయింపు గురించి యోచించాలి. గతంలో రుణాలు తీసుకుని ఉంటే.. అవి ఎంసీఎల్ఆర్, బేస్ రేటు, బీపీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానంలో ఉండొచ్చు. ఈ రుణాలను ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత విధానానికి (రెపో తదితర) మార్చుకోవచ్చు. ఎటువంటి ఫీజులు తీసుకోకుండానే బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. ‘‘నిర్వహణ చార్జీ, న్యాయపరమైన డాక్యుమెంట్ల చార్జీలను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కసారి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మారిపోతే.. అప్పుడు కొత్త కస్టమర్లకు అమలు చేసే చార్జీయే వర్తిస్తుంది’’ అని పైసాబజార్ గృహ రుణాల విభాగం అధిపతి రతన్ చౌదరి తెలిపారు. బదిలీ ప్రక్రియ.. రుణాన్ని బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకుంటే మీ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ప్రస్తుత రుణదాతకు తెలియజేయాలి. అప్పుడు సంబంధిత బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేదా సమ్మతి పత్రాన్ని విడుదల చేస్తుంది. అందులో ఇంకా చెల్లించాల్సిన రుణం ఎంతన్న వివరాలు ఉంటాయి. ఈ పత్రాన్ని కొత్తగా రుణాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థకు అందించాలి. దీనితోపాటు ఆదాయ ధ్రువీకరణ, ప్రాపర్టీ టైటిల్ డాక్యుమెంట్ కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ (ప్రాపర్టీ వినియోగం) లేదా కంప్లీషన్ (నిర్మాణం పూర్తయినట్టు) సర్టిఫికెట్, ఆర్కిటెక్ట్ ప్లాన్ కూడా కొత్త సంస్థ కోరే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత కొత్త సంస్థ రుణాన్ని మంజూరు చేస్తుంది. అంగీకరించిన మేరకు రుణాన్ని చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పాత రుణదాత పేరు మీద విడుదల చేస్తుంది. దీన్ని పాత రుణదాతకు సమర్పించాలి. కొత్త రుణ గ్రహీత వద్ద మార్ట్గేజ్ అగ్రిమెంట్‌పై (తనఖా ఒప్పందం) సంతకం చేయాల్సి ఉంటుంది. పాత సంస్థ నుంచి కొత్త రుణ గ్రహీత పేరు మీదకు ప్రాపర్టీ డీడ్ మార్చే సమయంలో రుణ గ్రహీత హాజరుకావాల్సి వస్తుంది. వ్యయాలు నూతనంగా రుణాన్ని ఇచ్చే సంస్థ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. రుణ మొత్తంలో ఇది ఒక శాతంగా ఉండొచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో రుణదాతలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటారు. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.10వేల లోపే ఉంటుంది. కొన్ని అయితే, పూర్తిగా మాఫీ కూడా చేస్తున్నాయి. అయితే ప్రాపర్టీ మార్ట్గేజ్ డీడ్‌పై స్టాంప్ డ్యూటీ రూపంలో ఎక్కువ చార్జీ భరించాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఇది ఒక్కో విధంగా ఉండొచ్చు. గృహ రుణ బదిలీకి ఎంతలేదన్నా రెండు నుంచి ఐదు వారాల సమయం తీసుకుంటుంది. -
తగ్గిన ఎస్బీఐ రుణ రేటు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి. తాజా తగ్గింపుతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ 8% నుంచి 7.90%కి దిగివచ్చింది. తన గతవారం పాలసీ సమీక్షలో ఆర్బీఐ ఎటువంటి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) తగ్గింపు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఎస్బీఐ తాజా రుణరేటు కోత ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 బేసిస్ పాయింట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ఓవర్‌నైట్ రుణ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 7.75%కి దిగివచ్చింది. ఇతర కాలపరి మితి రేట్లు 10 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.30% నుంచి 8.20%కి చేరింది. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. అన్నిరకాల రుణాలపై బ్యాంకు వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ తాజా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటు యథాతథంగా ఉంచింది సంగతి తెలిసిందే. దీని ప్రకారం బ్యాంకులు సంబంధిత చర్యలు వెంటనే చేపట్టాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా సవరణ ప్రకారం ఎస్బీఐ వసూలు చేసే వార్షిక వడ్డీ రేటు 7.90 శాతంగా ఉంటుంది. ఈ రేట్లు రేపు (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ఆ ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లు ఇక పనిచేయవు! -
ఎస్బీఐ అటు ఉసూరు : ఇటు ఊరట
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును తగ్గించింది. ఎంసీఎల్ఆర్ ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు శుక్రవారం ప్రకటించింది. సవరించిన ఈ కొత్త రేట్లు నవంబర్ 10 నుండి వర్తిస్తాయని తెలిపింది. దీంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా ఎస్బీఐ భారీగా తగ్గించింది. తాజా తగ్గింపుతో మూడేళ్ల కాలానికి ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.20 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ఎంసీఎల్ఆర్ను 8.05 శాతం నుంచి తగ్గి 8శాతంగా ఉంది. ఓవర్ నైట్, ఒక నెల కాలానికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ 7.65 శాతంగా ఉంది. మూడు నెలలకు ఇది 7.70 శాతంగా ఉంది. అలాగే ఆరు నెలల, రెండేళ్ల రేటు వరుసగా 7.85 శాతం 8.10 శాతానికి తగ్గింది. వ్యవస్థలో తగినంత ద్రవ్యత దృష్ట్యా, నవంబరు 10 నుంచి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్టు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిటైల్ టిడి వడ్డీ రేటును 1-2 సంవత్సరాల కన్నా తక్కువ పరిమితి గల డిపాజిట్లపై రేటును 15 బీపీఎస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ టిడి వడ్డీ రేటును 30 - 75 బీపీస్ల వరకు తగ్గించిట్టు చెప్పింది. కాగా ప్రైవేట్ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా వడ్డీరేటును తగ్గిస్తూ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కొత్త రేట్లు నవంబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ప్రయివేటు బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలపై వడ్డీరేటును తగ్గించిందది. మార్జినల్-కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను (ఎంసిఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) దాకా తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల వ్యవధిగల గృహ,వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. సవరించిన వడ్డీరేట్లు నేటి (నవంబర్ 7) నుంచే అమలు చేయనున్నట్టు తెలిపింది. రేట్ కట్ కట్ తరువాత, 6 నెలల ఎంసిఎల్ఆర్ 5 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.10 శాతానికి చేరింది. అలాగే 1 సంవత్సరాల రేటు 8.30 శాతం, 2 సంవత్సరాల 8.40 శాతం, 3 సంవత్సరాల రేటు 10 బీపీఎస్ పాయింట్లు తగ్గి 8.5 శాతంగా ఉండనుంది. అయితే ఓవర్ నైట్, ఒక నె ల,మూడు నెలల కాల వ్యవధిల రుణాలపై వసూలు రేటును మాత్రం యథాతథంగా ఉంచింది. -
పండుగ సీజన్ : రుణాలపై గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి వినియోగదారులకు ఊరటనిచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 10 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు రేపటి (సెప్టెంబరు 10) నుంచి అమల్లోకి రానున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్బిఐ నుండి ఎంసిఎల్ఆర్ కోత పెట్టడం వరుసగా ఇది మూడవసారి. దీంతో ఒక ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అన్ని బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో 10-20 శాతం కోత పెట్టింది. గృహ రుణాలు , ఆటో రుణాల వాటా వరుసగా 35, 36 శాతంగా ఉందని ఎస్బీఐ తెలిపింది. -
మిశ్రమంగా మార్కెట్
కొత్త రుణాలపై వడ్డీరేట్లను రెపోరేటు, ఎమ్సీఎల్ఆర్ వంటి ఏదోఒక ప్రామాణిక రేటుతో అనుసంధానించాలన్న ఆర్బీఐ ఆదేశాల కారణంగా బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగానికి తగిన తోడ్పాటునందిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. ఆరంభంలోనే 174 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 80 పాయింట్ల నష్టంతో 36,644 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,848 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు పుంజుకొని 71.84కు చేరడంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 357 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్: ఆర్బీఐ తాజా ఆదేశాల కారణంగా గృహ, వాహన, ఎమ్ఎస్ఎమ్ఈలపై వడ్డీరేట్లు తగ్గుతాయని, దీంతో బ్యాంక్ షేర్లలో అమ్మకాలు జరిగాయని ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చౌహాన్ చెప్పారు. హాంగ్‌కాంగ్‌లో అలజడులకు కారణమైన వివాదస్పద బిల్లును అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, వచ్చే నెలలో చర్చలు జరపడానికి అమెరికా–చైనాలు అంగీకరించడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చాయి. ఈ జోష్‌తో సెన్సెక్స్ 174 పాయింట్ల మేర లాభపడింది. అయితే వృద్ధి అంచనాలను రేటింగ్ సంస్థ, క్రిసిల్ తగ్గించడం ప్రతికూలత చూపింది, దీంతో ఈ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్183 పాయింట్ల మేర నష్టపోయింది. రోజంతా 357 పాయింటల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్ల స్పీడ్.... అమ్మకాల్లేక అల్లాడుతున్న వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభయం ఇవ్వడంతో వాహన షేర్లు పరుగులు పెట్టాయి. వాహనాలపై జీఎస్టీ తగ్గింపు విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తామని గడ్కరీ తెలిపారు. పెట్రోల్, డీజీల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. దీంతో కాలుష్యం తగ్గించడానికి గాను ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించగలదన్న అంశంపై స్పష్టత వచ్చింది. దీంతో వాహన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. టాటా మోటార్స్ 8 శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్2.8 శాతం, భారత్ ఫోర్జ్2.8 శాతం, మదర్సన్ సుమి సిస్టమ్స్ 2.6%, మారుతీ సుజుకీ 2.4%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2%, బజాజ్ ఆటో 1.6%, హీరో మోటొకార్ప్ 1.5%, టీవీఎస్ మోటార్ కంపెనీ 1.4%, అశోక్ లేలాండ్ 1%, ఐషర్ మోటార్స్ 0.7%చొప్పున లాభపడ్డాయి. -
రుణ రేటును తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
సాక్షి, ముంబై : ప్రయివేటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా రుణ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. అన్ని కాలపరిమితుల రుణ రేట్లు 0.10 శాతం తగ్గాయి. తాజా నిర్ణయం బుధవారం నుంచీ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన రెండవరోజు హెచ్డీఎఫ్సీ తాజా ప్రకటన చేయడం గమనార్హం. కాగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలపై ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.75 శాతం) ను ఆర్బీఐ 35 పాయింట్ల మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. -
రుణాలపై ఎస్బీఐ శుభవార్త
సాక్షి, ముంబై : రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ దీనికనుగుణంగా స్పందించింది. అన్ని రకాల రుణాలపై 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు ఆగస్టు 10నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం తెలిపింది. దీంతో ఒక సంవత్సర కాలపరిమితి కల రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీరేటు 8.40 శాతంనుంచి 8.25 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ కూడా వరుసగా నాలుగో సారి ఎంసీఎల్ఆర్ను కోత పెట్టినట్టయింది. కాగా రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షలో ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువగా రెపో రేటుపై అనూహ్యంగా కోత విధించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలను చేపట్టిన తరువాత వరుసగా నాలుగోసారి రెపో రేటును తగ్గించడమే కాకుండా, తొలిసారిగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. అంతేకాదు తాజా తగ్గింపుతో ఆర్బీఐ రెపో రేటు తొమ్మిదేళ్ల కనిష్టానికి చేరింది. -
వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంకింగ్ దిగ్గజం
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది 5 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రుణాలపై వార్షిక ఎంసీఎల్ఆర్ 8.5 శాతంనుంచి 8.45 శాతానికి దిగి వచ్చింది. ఈ తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం ఒక నెల కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గింది. మూడు నెలల, ఆరు నెలల రుణ వడ్డీ రేటు వరుసగా 8.15 , 8.30 శాతానికి తగ్గాయి. రెండు, మూడు సంవత్సరాల రేట్లు 8.55 శాతం, 8.65 శాతంగా ఉంటాయి. కాగా గత నెల రోజుల తరువాత ఇది రెండవ తగ్గింపు. మానిటరీ పాలసి రివ్యూ అనంతరం ఏప్రిల్ మాసంలో ఎంసీఎల్ఆర్ను 5 బీపీఎస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యూ 4లో ఎస్బీఐ ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం రూ.838.4 కోట్లుగా నమోదైంది. -
రుణ రేట్లను తగ్గించిన ఐవోబీ
న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓవర్‌నైట్, ఒక నెల మినహా మిగిలిన అన్ని రుణాలకు తగ్గింపు అమలవుతుందని, నూతన రేట్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 0.10% తగ్గి 8.70%కి చేరుకుంది. కన్జ్యూమర్ రుణాలన్నీ ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు ప్రకారం జారీ చేసేవే. రెండు, మూడేళ్ల కాల ఎంసీఎల్ఆర్ రేటు సైతం 0.10 శాతం తగ్గి 8.80 శాతం, 8.90 శాతానికి చేరాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గించింది. -
వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్బీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 0.10 శాతం కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీరేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలోవెల్లడించింది. దీంతో సంవత్సరాల కాలపరిమితి గల లోన్లపై వడ్డీరేటు 8.55శాతం నుంచి 8.45 శాతానికి దిగి రానుంది. మూడేళ్ల కాల రుణాల రేట్లు 8.65శాతంగా ఉండనున్నాయి. కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ తాజా ద్రవ్య పరపతి విధాన సమీకలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వినియోగదారులకు అందించాలని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా 0.05శాతం ఎంసీఎల్ఆర్ను తగ్గించిన సంగతి తెలిసిందే. -
కర్ణాటక బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంపు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) 0.15 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ 9.10 శాతానికి చేరినట్లవుతుందని, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 0.10 శాతం పెరిగి 8.75 శాతానికి, మూడు నెలలది 0.10 శాతం మేర పెరిగి 8.70 శాతానికి చేరాయి. ఒక నెల రోజులు, ఒక్క రోజు వ్యవధి ఎంసీఎల్ఆర్ను కూడా 0.10 శాతం మేర పెంచినట్లు కర్ణాటక బ్యాంక్ తెలిపింది. ఇకపై 6 నెలల ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రూ. 75 లక్షల దాకా రుణాలపై 8.80 శాతం వడ్డీ రేటు ఉంటుందని వివరించింది. అటు మరో ప్రైవేట్ రంగ ధన్లక్ష్మి బ్యాంక్ కూడా జనవరి 1 నుంచి 1 ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ను పెంచడంతో ఇది 9.90 శాతానికి చేరింది. బ్యాంకింగ్ యాప్ ఆవిష్కరణ కాగా కర్ణాటక బ్యాంక్ గురువారం బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. తన వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్ సేవలకు సంబంధించి ఉన్న పలు యాప్‌ల (బీహెచ్ఐఎం కేబీఎల్ యూపీఐ, కేబీఎల్ ఎంపాస్‌బుక్, కేబీఎల్ లొకేటర్, ఎంకామర్స్ ఆన్లైన్) సేవలు సహా పలు బ్యాంక్ సేవలు సమగ్రంగా తాజా యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మహాబలేశ్వర్ ఎంఎస్ పేర్కొన్నారు. -
రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రుణ గ్రహీతలపై భారీ భారాన్ని మోపనుంది. ఎస్బీఐ తన బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను 0.05శాతం లేదా 5 బేసిస్ పాయింట్లను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు సోమవారం (డిసెంబరు 10) నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఏడాదిపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 8.50 నుంచి 8.55కి పెరగగా, 2-3 సంవత్సరాల పరిమితి రుణాలపై వరుసగా 8.66 శాతంనుంచి 8.65 కి, 8.70 శాతంనుంచి 8.75 పెరుగుతాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని రకాల రుణాలపై స్టాండర్డ్ గా 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన, రుణాలు, రీటెయిల్ట్ పర్సనల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. -
వడ్డీరేట్లు పెంచిన యూనియన్ బ్యాంకు
సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు చేదువార్త అందించింది. ఎంసీఎల్ఆర్ రేటు 0.5శాతం పెంచుతూ శనివారం ప్రకటించింది. ఈ పెంచిన వడ్డీరేట్లు ఈరోజు(డిసెంబరు 1) నుంచేఅమల్లోకి వస్తాయని వెల్లడించింది. -
పీఎన్బీ వినియోగదారులకు దీపావళి షాక్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఫెస్టివ్ సీజన్లో వినియోగదారులకు చేదు వార్త అందించింది. రుణాలపై వడ్డీరేటును పెంచుతున్నట్టు వెల్లడించింది. తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లను పెంచింది. అన్ని రకాల రుణీలపై ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. నవంబరు 1నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని పీఎన్బీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా పెంపుతో పీఎన్బీ అందించే ఒక సంవత్సర కాలపు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.50 శాతానికి చేరింది. మూడేళ్ల కాల పరిధి రుణాలపై పీఎన్బీ వసూలు చేసే వడ్డీరేటు 8.7శాతంగాను, ఆరునెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8.45శాతంగాను, మూడు నెలల కాలానికి 8.25శాతం గాను ఉంది. -
సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంపు
న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్ఆర్ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్లు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కాగా ఓవర్‌నైట్ (8.30), నెల (8.35), ఆరు నెలలు (8.60), ఏడాది (8.80) రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఓబీసీ కూడా... పలు కాలపరిమితులకు సంబంధించి ఓబీసీ కూడా ఎంసీఎల్ఆర్ను 0.10 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. గురువారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రిటైల్ రుణాలకు బెంచ్‌మార్క్‌గా పేర్కొనే ఏడాది కాలపరిమితి రుణరేటు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెరిగింది. అలాగే ఆరు నెలలు (8.70 శాతం), మూడు నెలలు (8.50 శాతం), నెల (8.45 శాతం) రుణ రేట్లు కూడా 0.10 శాతం పెరిగాయి. ఓవర్‌నైట్‌కు సంబంధించి రుణ రేటు 8.30 శాతానికి పెరిగింది. -
ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 0.2 శాతం వరకు పెంచుతూ నిర్ణయం ప్రకటించాయి. దీనివల్ల గృహ, ఆటో, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు మరికాస్త భారం కానున్నాయి. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఎస్బీఐ 20 బేసిస్ పాయింట్లు మేర (0.20 శాతం) పెంపును చేపట్టింది. మూడేళ్ల వరకు అన్ని కాల వ్యవధుల రుణాలకు ఇది వర్తిస్తుంది. ఒక రోజు నుంచి ఒక నెల వరకు ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.1 శాతానికి పెరిగింది. ఏడాది కాల వ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. చాలా వరకు రిటైల్ రుణాలకు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ ప్రామాణిక రేటుగా అమలవుతోంది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 8.55 శాతానికి చేరింది. ఈ రెండు బ్యాంకులు కూడా చివరిగా ఈ ఏడాది జూన్‌లో రుణ రేట్లను సవరించాయి. -
వడ్డీరేటు పెంచేసిన మరో ప్రభుత్వ బ్యాంకు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా లెండింగ్ వడ్డీరేట్లను పెంచేసింది. ఒక సంవత్సరం బెంచ్‌మార్క్ రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. 8.40 శాతంనుంచి 8.45 శాతానికి ఎంసీఎల్ఆర్ను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు జూన్ 7 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకరోజు, ఒక నెల, మూడు నెలలు , ఆరు నెలల కాల పరిమితి రుణాలపై వడ్డీరేటు రుసగా 7.95 శాతం, 8 శాతం, 8.1 శాతం, 8.3 శాతం ఉండనుంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో బీఓబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల, ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎప్సీ సహా కొన్ని బ్యాంకులు తమ ఎంసిఎల్ఆర్ను పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడివున్న గృహ, వాహన రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి. -
వడ్డీరేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంకు
ముంబై : యాక్సిస్ బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను మరోసారి పెంచింది. మూడు నెలల కాలం నుంచి మూడేళ్ల కాలం వరకున్న రుణాలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చిందని కూడా పేర్కొంది. దీంతో బ్యాంకు మూడు నెలల ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 8.15 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతంగా, ఏడాది రేటు 8.40 శాతంగా ఉన్నట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. రెండు నెలల కాలంలోనే వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి. జనవరిలో ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎక్కువ ఎంసీఎల్ఆర్, బ్యాంకు డిపాజిట్ రేట్లు పెరగడానికి సూచిస్తుందని తెలుస్తోంది. గత రెండు నెలల కాలంలో బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెరిగినట్టు తెలిసింది. బ్యాంకులు తమ డిపాజిట్లపై వ్యయాలు చెల్లించడం ఎంసీఎల్ఆర్తోనే ముడిపడి ఉంటుంది. -
బ్యాంకు బేస్ రేటు దానికి లింక్
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రుణాలన్నింటినీ బేస్ రేటు నుంచి ఎంసీఎల్ఆర్కి అనుసంధానం చేయనున్నట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) సిస్టమ్‌ను ఆర్బీఐ 2016 ఏప్రిల్ 1 నుంచే తీసుకొచ్చింది. బేస్ రేటు పాలనలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ ఎంసీఎల్ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బేస్ రేటుతో లింక్ అయి ఉన్న రుణాలు, ఇతర క్రెడిట్ ఎక్స్పోజర్స్లు ఎంసీఎల్ఆర్ విధానంలోకి మార్చనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు చాలా బ్యాంకు రుణాలు బేస్ రేటుతోనే లింక్ అయి ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించిన్నప్పటికీ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించడం లేదని, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయడానికి సమయం తీసుకుంటున్నాయని ఆర్బీఐ గుర్తించింది. అంతేకాక ఆర్బీఐ బెంచ్‌మార్కు రేట్ల తగ్గింపుకు అనుగుణంగా లెండింగ్ రేట్ల తగ్గింపు ఉండటం లేదని తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వస్తుండటంతో, ఈ ఎంసీఎల్ఆర్ సిస్టమ్‌ను ఆర్బీఐ తీసుకొచ్చింది. రుణాల బేస్ రేటును ఎంసీఎల్ఆర్కి అనుసంధానం చేయాలని కూడా నేడు ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ మోడ్‌లో బ్యాంకులు అర్థరాత్రి, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల రేట్లను ప్రతి నెలా సమీక్షించే, ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో త్వరితగతిన కీలక వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు చేరుతాయి. బేస్ రేటు కన్నా ఈ ఎంసీఎల్ఆర్ విధానంలో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. -
కస్టమర్లకు షాకిచ్చిన యాక్సిస్ బ్యాంక్
సాక్షి, ముంబై: ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. మార్జిన్ల బెడదతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకు రుణాలపై వడ్డీరేటును పెంచేందుకు నిర్ణయించింది. రుణాలపై వసూలు చేసే లెండింగ్ రేటుపై 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 18నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది. దీంతో బ్యాంకు అందిస్తున్న వార్షిక ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి చేరింది. వార్షిక రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచామనీ, జనవరి 18 నుంచి అమల్లోకి వస్తోందని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది. అయితే లాకింగ్ పీరియడ్‌లో పాత రుణగ్రహీతలకు పాత వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం ప్రభావం కొత్తగా రుణాలను తీసుకునేవారిపై పడనుంది. మరోవైపు వడ్డీరేటును పెంచుతున్న మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. దీంతో మూడు సంవత్సరాలలో మొదటిసారి వడ్డీ రేటు పెంచడం కొన్ని కీలక సంకేతాలను అందిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఎంసీఎల్ఆర్ను తగ్గించిన అలహాబాద్ బ్యాంకు
కోల్కత్తా : ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్ బ్యాంకు బుధవారం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) రేట్లను తగ్గించింది. గృహ, కారు, ఇతర రుణాలను చౌకగా చేస్తూ ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన ఈ రేటు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు చెప్పింది. అన్ని టెనోర్స్కు ఇది వర్తించనుంది. ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గడంతో, 8.3శాతంగా ఉన్న వడ్డీరేట్లు, 8.25 శాతానికి దిగొచ్చాయి. దీని ఫలితంగా గృహ, కారు, ఇతర రిటైల్ రుణాలు తగ్గనున్నాయని బ్యాంకు తెలిపింది. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో అలహాబాద్ బ్యాంకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. గత ఏడాది కాలంగా 50 లక్షల మంది కొత్త యూజర్లను అలహాబాద్ బ్యాంకు తన ఖాతాదారులుగా చేర్చుకుంది. నవంబర్ ప్రారంభంలో ఎస్బీఐ తన వడ్డీరేట్లకు కోత పెట్టగా... ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్ను తగ్గించింది. -
10నెలల్లో తొలిసారి: ఎస్బీఐ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహకొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. గృహ రుణాల వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జారీ చేసిన ప్రకటనలో మార్జినల్కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇది రేపటి నుంచే (బుధవారం) అమల్లోకి వస్తాయని తెలిపింది. 10 నెలల్లో దాని మొట్టమొదటి రుణ రేటు తగ్గింపుగా నిలిచింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 7.95 శాతానికి దిగి వచ్చింది. ఇప్పటివరకు 8 శాతంగా ఉంది. -
వడ్డీరేట్లు తగ్గించిన దేనా బ్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన దేనా బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) 0.20 శాతం పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2017, అక్టోబర్ 1 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని కాల పరిమితులకు గాను, ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించినట్టు బ్యాంకు తెలిపింది. ఓవర్‌నైట్, మూడు నెలల కాలానికి గాను ఎంసీఎల్ఆర్ రేటును 0.20 శాతం కోత పెట్టి 8 శాతం , 8.10 శాతంగా బ్యాంకు నిర్ణయించింది. అదేవిధంగా మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సర కాల రుణాలకు ఎంసీఎల్ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.05 శాతం, 8.20 శాతం, 8.25 శాతంగా ఉంచుతున్నట్టు బ్యాంకు చెప్పింది. బేస్ రేటును కూడా 9.70 శాతం నుంచి 9.60 శాతానికి తగ్గించింది. ఇది కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంకు చెప్పింది. 2016 ఏప్రిల్ నుంచి ఎంసీఎల్ఆర్ మెకానిజాన్ని బ్యాంకింగ్ సిస్టమ్‌లో ప్రవేశపెట్టారు. బేస్ రేటుకు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చారు. -
మరో 4 ప్రభుత్వ బ్యాంకుల రుణ రేటు తగ్గింపు
ముంబై: కొత్త నెల ఆరంభం అయిన నేపథ్యంలో– తమ నిధుల లభ్యత వ్యయం ప్రాతిపదికన పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తున్నాయి. ఈ వరుసలో బుధవారం తాజాగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను 0.45 శాతం వరకూ తగ్గించాయి. బెంచ్ మార్క్ రేటు కోతతో అనుసంధానమైన గృహ, కారు ఇతర రుణాలు కొంత చౌక కానున్నాయి. రేట్ల తగ్గింపును బ్యాంకుల వారీగా చూస్తే... పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఓవర్‌నైట్ రేటు పరిమితి 0.45% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 8.15%కి తగ్గింది. నెలవారీ కాలపరిమితి రేటు 0.40% తగ్గి 8.20 శాతానికి చేరింది. ఏడాది రేటు 0.15 శాతం తగ్గి 8.55 శాతానికి చేరింది. ♦ ఇండియన్ బ్యాంక్: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 0.15 శాతం తగ్గించింది. ♦ విజయా బ్యాంక్: ఏడాది కాలపరిమితి రేటు 0.15 శాతం తగ్గి 8.50కి చేరింది. ♦ ఐడీబీఐ బ్యాంక్: అన్ని కాల వ్యవధులపై రేటు 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ♦ ఇప్పటికే పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, దేనాబ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపును ప్రకటించాయి. -
ఎస్బీఐ డిపాజిట్ రేట్లపై అర శాతం కోత
6.25 శాతానికి తగ్గింపు ముంబై: ఇప్పటికే వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిల్లో కొనసాగుతుండగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గిస్తూ సోమవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించిం ది. రూ.కోటి లోపు విలువగల మధ్య కాల, దీర్ఘకాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు తాజాగా చేసే డిపాజిట్లు, గత డిపాజిట్ల పునరుద్ధరణకు ఏప్రిల్ 29 నుంచి వర్తిస్తుందని ఎస్బీఐ తెలిపింది. కాగా, బ్యాంకు ఎంసీఎల్ఆర్లో ఎటువంటి మార్పులేదు. ఏడాది ఎంసీఎల్ఆర్ 8%. నోట్: ఏడాది నుంచి 455 రోజుల టర్మ్ డిపాజిట్‌పై మాత్రం 6.90% వడ్డీని ఆఫర్ చేస్తోంది. -
గృహ రుణాన్ని మార్చేద్దాం!
► ఐదేళ్ల కిందట తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేటు ► ప్రస్తుతం ఎంసీఎల్ఆర్తో దిగొచ్చిన రేట్లు ► 8.5 శాతానికే ఆఫర్ చేస్తున్న పలు బ్యాంకులు ► పాత రుణాలను కొత్త విధానానికి మార్చుకునే అవకాశం ► వడ్డీ ఒకశాతం తగ్గినా మొత్తంగా మిగిలేది ఎక్కువే మీరు ఇంటి కోసం రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నారా? ఎప్పుడో తీసుకున్న రుణం కాబట్టి అప్పటి వడ్డీ రేట్ల ప్రకారం నెలసరి వాయిదాలు తీర్చడం కష్టంగా అనిపిస్తోందా? అయితే, రుణంపై వడ్డీ రేటును మార్చుకుంటే సరిపోతుంది! బ్యాంకులు గతంలో ఉన్న బేస్ రేట్ విధానం నుంచి నూతన మార్జినల్ కాస్ట్ బేస్డ్ రుణ రేటుకు (ఎంసీఎల్ఆర్) మారడంతో రుణాలపై రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎల్ఆర్కు మారడం ద్వారా మీరు కూడా తాత్కాలికంగా భారాన్ని దింపుకోవచ్చు. వడ్డీ రేటు ఎంత...? గృహరుణాన్ని తీసుకుని నెలసరి వాయిదాలు తీర్చడంలో ఇబ్బందులు పడుతున్నవారు ముందు చేయాల్సింది ఒకటుంది. బ్యాంకు ఎంత వడ్డీరేటు వసూలు చేస్తోందో ఓ సారి కనుక్కోవాలి. ఎందుకంటే బ్యాంకులు ఇటీవల బేస్ రేటు నుంచి ఎంసీఎల్ఆర్కు మళ్లాయి. మరి ఆ ప్రయోజనం కస్టమర్‌గా మీకు దక్కుతోందో, లేదో ముందు చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఖాతాదారులందరికీ ఒకటే రేటును అమలు చేయడం లేదు. కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకే రుణాలిస్తూ పాత కస్టమర్లను మాత్రం చార్జీల పేరుతో బాదేస్తున్నాయి. అందుకే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా గృహ రుణం లేదా ఆటో లోన్, లేదా వ్యక్తిగత రుణాన్ని తీసుకుని ఉంటే వారి నుంచి బ్యాంకు ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తోందో కనుక్కోండి. సాధారణంగా బ్యాంకుల మధ్య వడ్డీ రేట్ల విషయంలో స్వల్ప తేడాలుండడం సహజమే. కానీ ఒకే బ్యాంకులో ఖాతాదారుల మధ్య కూడా ఈ వ్యత్యాసాలుంటాయని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ తేడా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగానూ ఉండొచ్చు. ఇది కస్టమర్ల రుణ చెల్లింపుల చరిత్ర (క్రెడిట్ హిస్టరీ/క్రెడిట్ స్కోరు) వల్ల అనుకుంటే పొరబడినట్టే. కొన్ని బ్యాంకులు కొత్త వారిని ఆకర్షించటానికి వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. పాతవారిపై భారం మోపుతున్నాయి. బ్యాంకులు పాత ఖాతాదారులు, కొత్త ఖాతాదాల విషయంలో భిన్న రకాల వడ్డీ రేట్లతో వివక్ష చూపిస్తున్నాయని ఫిన్‌టెక్ స్టార్టప్ ‘ఫిస్డమ్’ సహ వ్యవస్థాపకుడు రామ్‌గణేష్ అయ్యంగార్ పేర్కొన్నారు. పీఎల్ఆర్ టు ఎంసీఎల్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2016 ఏప్రిల్‌లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానం ఇది. అప్పటి వరకు బేస్ రేట్ విధానం అమల్లో ఉండేది. బేస్ రేటు విధానంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు బదిలీ చేయకుండా వేచి చూసే ధోరణి అనుసరించటంతో ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ను తీసుకొచ్చింది. బ్యాంకులు నిధుల సేకరణకు అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రుణ రేటును ఖరారు చేసుకుంటాయి. బేస్ రేటు కంటే ముందు తక్కువ పారదర్శకతతో కూడిన ప్రైమ్ లెండింగ్ రేటు (పీఎల్ఆర్) అమల్లో ఉండేది. రుణ బదిలీకి చార్జీలుంటాయ్ రుణాల్లో ఫిక్స్డ్, ఫ్లోటింగ్ అని రెండు రకాల వడ్డీ రేట్లుంటాయి. ఆర్బీఐ ప్రకటించే రేట్ల ఆధారంగా బ్యాంకుల ఎంసీఎల్ఆర్ మారుతుంది. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారే రుణాలు ఫ్లోటింగ్. కొన్నేళ్ల పాటు అలా మారకుండా స్థిరంగా ఒకే రేటుతో ఉండేవి ఫిక్స్డ్ రేటు రుణాలు. అయితే ప్రస్తుత రుణాలను ఎంసీఎల్ఆర్ కిందకు మార్చుకుందామని నిర్ణయించుకుంటే అందుకు బ్యాంకులు కొంత చార్జీలు వసూలు చేయొచ్చు. డ్రాఫ్ట్ తయారీ, నూతన ఒప్పందం రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ తదితర చార్జీలను బ్యాంకులు భరించాల్సి వస్తుంది. దీంతో అవి ఖాతాదారుల నుంచి వసూలు చేస్తాయి. మిగిలి ఉన్న రుణం మొత్తంపై ఈ చార్జీలు 0.20 శాతానికి మించి ఉండవు. కానీ బ్యాంకులు 0.5 శాతం వసూలు చేస్తుంటాయి. ఈఎంఐ ఎంత తగ్గుతుంది...? 0.50 శాతం చార్జీని బ్యాంకు విధించినా ఎంసీఎల్ఆర్కు మారడం లాభదాయకమేనని నిపుణుల సూచన. ఎందుకంటే స్వల్పంగా చార్జీలు చెల్లించినా అధిక వడ్డీ రేటు దిగి రావడం వల్ల మిగిలే ప్రయోజనం ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అయిన శ్రావ్య (40) బేస్ రేటు కింద గృహ రుణం తీసుకున్నారు. ఆమె ఇంకా రూ.50 లక్షల బకాయి చెల్లించాల్సి ఉంది. వ్యవధి 15 ఏళ్లు. రుణ రేటులో ఒక శాతం తగ్గినా ఆమె నెలసరి వాయిదా (ఈఎంఐ) రూ.52,200 నుంచి రూ.49,250కు దిగొస్తుంది. అంటే రూ.2,950 తగ్గుదల. ఇలా మారడం వల్ల మొత్తం మీద మిగిలేది రూ.5 లక్షలకు పైనే. కానీ, మారేందుకు చెల్లించాల్సిన చార్జీలు 0.50 శాతం కింద రూ.25వేలే. బ్యాంకు సిబ్బందితో మంచి సంబంధాలుంటే ఈ చార్జీలను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల క్రితం తీసుకుంటే భారమే! ఐదేళ్ల క్రితం గృహ రుణం తీసుకుని ఉంటే ఆయా కస్టమర్లు పీఎల్ఆర్ రేటు విధానంలో వడ్డీ చెల్లిస్తున్నట్టే. ఆ తర్వాత బేస్ రేటు విధానం అమల్లోకి వచ్చింది. వీటితో పోలిస్తే ఇప్పుడు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కింద 8.5% వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తుండడం ఆకర్షణీయం. ఇప్పటికే గృహ రుణాలు తీసుకుని ఉన్న వారు కూడా ఈ ప్రయోజనాన్ని అందుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. ‘‘ముందు మార్కెట్లో తక్కువ రుణ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలుసుకోవాలి. దీనివల్ల తాము రుణం తీసుకున్న బ్యాంకును వడ్డీ రేటు విషయమై బేరమాడేందుకు కావాల్సిన అవగాహన వస్తుంది’’ అని ఐసర్వ్ ఫైనాన్షియల్ సీఈవో దీపక్ సమంత వ్యాఖ్యానించారు. మార్కెట్‌కు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించుకోవాలనుకుంటే పీఎల్ఆర్ లేదా బేస్ రేటులో ఉన్న వారు ఎంసీఎల్ఆర్కు మారడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో తటస్థ విధానానికి మళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని, కొంత తగ్గే అవకాశం కూడా లేకపోలేదన్నది వారి విశ్లేషణ. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎంసీఎల్ఆర్ విధానమనేది బ్యాంకులు ఎప్పటికప్పుడు ఆర్బీఐ విధానానికి అనుగుణంగా తమ ప్రామాణిక రేట్లను మార్చుకునేందుకు ఉద్దేశించినది. కనుక ఈ విధానంలో వడ్డీ రేట్లు ఎంత వేగంగా అయితే తగ్గాయో.... ఆర్బీఐ రెపో, సీఆర్ఆర్లను పెంచడం మొదలు పెడితే... అంతే వేగంగా పెరుగుతాయి. -
సొంతింటికి టైమొచ్చింది..!
గృహ రుణరేటు తగ్గిస్తున్న బ్యాంకులు ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8 శాతానికి... వడ్డీ 8.6 శాతం ఎంసీఎల్ఆర్ కింద రుణం తీసుకునే వారికి వర్తింపు ఏప్రిల్ తర్వాత రుణం తీసుకున్న వారికీ లాభమే అంతకుముందు తీసుకున్న వారైతే మార్చుకోవాలి ఇలా మార్చుకోవటానికి కన్వర్షన్ చార్జీలు చెల్లించాలి ఎలాంటి చార్జీలూ లేకుండా మారుస్తామంటున్న బీఓబీ పెద్ద నోట్ల రద్దుతో రియల్టీ ధరలు కూడా తగ్గుదల హైదరాబాద్ వంటి చోట్ల పెరగకుండా స్థిరంగా ఉన్నతీరు ఇదే మంచి తరుణమంటున్న హౌసింగ్ నిపుణులు అల్పాదాయ వర్గాల కోసం వడ్డీ రాయితీ ఇచ్చిన ప్రధాని గృహ రుణానికి సంబంధించి ఇపుడొక మంత్రంలా వినిపిస్తున్న సంఖ్య 8.65. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక గృహ రుణాలకు కొన్ని బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేటు శాతం. బహుశా! ఇటీవలి కాలంలో ఇంత తక్కువ రేటుకు గృహ రుణాలు లభ్యం కావటం ఇదేనని చెప్పాలి. నిన్న మొన్నటిదాకా 9.5 శాతంగా ఉన్న వడ్డీ రేటు... ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 90 బేసిస్ పాయింట్లు కోత విధించటంతో 8.65కు దిగివచ్చింది. గడిచిన మూడేళ్లలో తగ్గించిన రుణ రేటు కన్నా ఇది రెట్టింపు కావటం గమనార్హం. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తానూ రేసులో ఉన్నానంటూ ఎస్బీఐకి జత కలసింది. దాంతో అన్ని బ్యాంకులూ రేట్ల కోతను ప్రకటిస్తున్నాయి. ఈ తాజా తగ్గింపు ఎవరెవరికి వర్తిస్తుందంటే... ♦ పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు వచ్చి చేరాయి. సేవింగ్స్ ఖాతాల్లో వేసిన డబ్బులు కాబట్టి వీటిపై బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ తక్కువే. మరోవంక ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తూ వస్తోంది. దీంతో బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించే పనిలో పడ్డాయి. ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీకి ప్రాతిపదికగా భావించే ఎంసీఎల్ఆర్ను తగ్గిస్తున్నట్లు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. ♦ నోట్ల రద్దుతో దేశంలో రియల్టీకి డిమాండ్ తగ్గిందని సర్వేల సారాంశం. చాలా నగరాల్లో ధరలూ ఇప్పటికే తగ్గాయి. కొనుగోళ్లు మందగించటం వల్ల నేరుగా గృహ ప్రవేశం చేయటానికి వీలయ్యే ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ధరలు భారీగా తగ్గకపోయినా గడిచిన నాలుగైదు నెలలతో పోలిస్తే పెరగలేదు. ♦ వీటన్నిటికీ తోడు అల్పాదాయ వర్గాల వారు... తక్కువ రుణంతో ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పలు వరాలిచ్చారు. వారు తీసుకునే గృహ రుణాలపై రాయితీల జల్లు కురిపించారు. రూ.12 లక్షల లోపు గృహ రుణాలు తీసుకునేవారికి ఈ రాయితీలు వర్తిస్తాయన్న మాట. ఇది కూడా సొంతింటి కల సాకారం చేసుకోవటానికి నిచ్చెనలాంటిదే. ♦ ఒకవైపు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. మరోవంక ఇళ్ల ధరలు కూడా ఊరిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు కొన్ని వర్గాల వారికి గృహ రుణాలు రాయితీ ధరకే దొరుకుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం!! బ్యాంకు లోన్‌కి ఇదే సమయం.. అనుకుంటున్నారా? మరి బ్యాంకుకు వెళ్లే ముందు ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది? ఎంసీఎల్ఆర్ను ఎవరు ఎంత వసూలు చేస్తున్నారు? అసలింతకీ ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...! కొత్తగా రుణాలు తీసుకుంటున్న వారికి.. తాజా రేట్ల తగ్గింపుతో గరిష్ఠంగా లాభం పొందేది ఎవరైనా ఉంటే వారు కొత్తగా రుణాలు తీసుకోబోతున్నవారే. ఎందుకంటే వారు రుణం తీసుకున్ననాటి నుంచే తాజా రేట్లు వారికి వర్తిస్తాయి. ప్రస్తుతం అందరికన్నా తక్కువగా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8 శాతం ఉండగా... ఐసీఐసీఐ బ్యాంకు ఎంసీఎల్ఆర్ 8.2 శాతంగా ఉంది. ఇవి 8.6 నుంచి 9.25 మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. ఈ వడ్డీరేట్లు తీసుకున్న రుణం, తిరిగి తీర్చే వ్యవధిని బట్టి మారతాయి. ఇప్పటికే ఎంసీఎల్ఆర్ కింద రుణాలు తీసుకుంటే... చాలా బ్యాంకులు తాము ఎంసీఎల్ఆర్ను ఎప్పుడెప్పుడు సవరించేదీ చెబుతుంటాయి. అంటే ఎంసీఎల్ఆర్ వ్యవధి ఏడాదా? 6 నెలలా? 3 నెలలా? అనేది ముందే చెబుతాయి. చాలా బ్యాంకులకు ఇది ఏడాదిగానే ఉంది. అంటే... రుణం తీసుకున్న ఏడాది తరవాతే వారికి కొత్త రేటు వర్తిస్తుందన్న మాట. ఉదాహరణకు అక్టోబర్‌లో ఎంసీఎల్ఆర్ కింద రుణం తీసుకున్నారని అనుకుందాం. వారికి తాజా తగ్గింపు ఇప్పుడు వర్తించదు. ఈ ఏడాది అక్టోబర్‌లో అప్పుడు ఎంసీఎల్ఆర్ ఎంత ఉంటే... అది వర్తిస్తుంది. దాని ప్రకారం రుణ రేటు తగ్గటమో, పెరగటమో జరుగుతుంది. బేస్‌రేటు కింద రుణాలు తీసుకుంటే.. గతేడాది ఏప్రిల్‌కన్నా ముందు తీసుకున్న గృహ రుణాలన్నీ బేస్ రేట్ ప్రాతిపదికన తీసుకున్నవే. ఇది కొంత ఎక్కువే. వారికి తాజా తగ్గింపు వర్తించదు. కాకపోతే వారు ఎంసీఎల్ఆర్కు మారాల్సి ఉంటుంది. ఇలా మారడానికి చాలా బ్యాంకులు మొత్తం రుణంలో .0.5 శాతాన్ని గానీ, రూ. 10 వేల మొత్తాన్ని గానీ కన్వర్షన్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. దీన్లో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. రూ.15వేలు కన్వర్షన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.15 లక్షలైతే... రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం ఎలాంటి కన్వర్షన్ చార్జీలూ వసూలు చేయకుండా బేస్ రేట్ రుణ గ్రహీతలను ఎంసీఎల్ఆర్ విధానంలోకి మారుస్తామని చెబుతోంది. ఎలాంటి షరతులూ ఉండవని కూడా బ్యాంకు ప్రకటించింది. ఏం చేయాలంటే... ఇది ఒక్క గృహ రుణాలకే కాదు. ఎస్బీఐ అయితే ఆటో రుణాలకూ వర్తింపజేస్తోంది. అందుకని మీ రుణ రేట్ ఇపుడెంత ఉందో చూసుకుని... మీ బ్యాంకును సంప్రతించటం మేలు. ఒకవేళ తగ్గింపు మీకూ వర్తిస్తుందని అనుకుంటే వెంటనే ఎంసీఎల్ఆర్లోకి మారిపోవచ్చు. సీఎల్ఆర్లోకి మారడానికి చార్జీలు వసూలు చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. మారితే వచ్చే లాభాన్ని లెక్కించేటపుడు ఈ చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకని 0.5 శాతంకన్నా ఎక్కువ లాభం ఉంటేనే మారాలి. మీరిపుడు ఎంసీఎల్ఆర్లో ఉన్నా సరే... తాజా తగ్గింపు వర్తించకపోవచ్చు. అందుకని మీ బ్యాంకును సంప్రదించి, ఎప్పటి నుంచి తగ్గింపు వర్తిస్తుందో తెలుసుకోవాలి. గృహ రుణాలపై ప్రధాని రాయితీ.. ♦ పట్టణ ప్రాంతాల్లో రూ.9 లక్షలలోపు గృహ రుణం తీసుకునేవారికి వడ్డీలో 4 శాతం.. రూ.9–12 లక్షల మధ్య తీసుకున్న వారికి 3 శాతం రాయితీ లభిస్తుంది. తగ్గించిన వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ♦ గ్రామాల్లో అయితే కొత్తింటి కోసం గానీ, ఉన్న ఇంటిని విస్తరించడానికి గానీ రూ.2 లక్షలలోపు రుణం తీసుకునే వారికి 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ♦ 2017లో రుణాలు తీసుకుంటే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈఎంఐ బాగానే తగ్గుతుంది.. ప్రధాని ప్రకటించిన వడ్డీ రాయితీవల్ల ఈఎంఐ గణనీయంగా తగ్గుతుందని చెప్పవచ్చు. గతంలో రూ.6 లక్షల లోపు రుణం తీసుకునే వారికి వడ్డీలో 6.5 శాతం రాయితీ ఉండేది. ఈ రాయితీని తగ్గించినా... రుణ మొత్తాన్ని పెంచటం వల్ల చాలామందికి ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.12 లక్షల రుణాన్ని 15 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. వడ్డీ 3 శాతం తగ్గడం వల్ల వారికి ఈఎంఐ నెలకు రూ.2,044 వరకూ తగ్గుతుంది. ఈ పథకానికి అర్హులెవరు? ఈ వడ్డీ రాయితీ పొందడానికి వార్షికాదాయం రూ.6 లక్షల లోపున్న అల్పాదాయ వర్గాలు మాత్రమే అర్హులు. రుణాన్ని మహిళల పేరిట , లేదా జాయింట్‌గా భార్యతో కలసి తీసుకోవాలి. వారికి పక్కా ఇల్లు ఉండకూడదు. ఇంటి కార్పెట్ ఏరియా (బిల్టప్ ఏరియా కాదు) 645 చదరపు అడుగులకు మించి ఉండకూడదు. రుణానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ రుజువు పత్రాన్ని, సెల్ఫ్ అఫిడవిట్‌ను జత చేయాలి. వడ్డీ రేటు.. ఇదీ రూటు! అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏంటో చూద్దాం... మా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను తగ్గించాం. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానంగా ఉన్న గృహ, వాహన ఇతర రుణ రేట్లు తగ్గుతాయి. – బ్యాంకులన్నీ ఇపుడు చెబుతున్నదిదే బేస్‌రేటుపై రుణాలు తీసుకున్నవారు ఇపుడు ఎంసీఎల్ఆర్కు మారాలంటే చార్జీల రూపంలో రూ.10,000 లేదా 0.5 శాతం అదనంగా చెల్లించాలి. మా బ్యాంకులో అయితే ఇప్పుడు ఉచితం. – ఇది మరో బ్యాంక్ ప్రకటన ఇదంతా ఎందుకంటే ఇపుడు ఏ బ్యాంకయినా వడ్డీ రేట్ల గురించి చెప్పేటపుడు తమ ఎంసీఎల్ఆర్ ఎంతో చెబుతోంది. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు కావచ్చు. కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు కావచ్చు. వారి వడ్డీ రేట్లన్నీ ఈ ఎంసీఎల్ఆర్ మీదే ఆధారపడి ఉంటాయి. దాని హెచ్చుతగ్గులను బట్టే వడ్డీ రేట్లూ మారుతుంటాయి. 2016 ఏప్రిల్ 1వ తేదీకి ముందు బ్యాంకులన్నీ బేస్‌రేటు విధానాన్ని అమలు చేశాయి. అప్పటి నుంచి ఎంసీఎల్ఆర్ను తెచ్చాయి. ఎంసీఎల్ఆర్ను బేస్‌గా చేసుకుని... వినియోగదారులకు వారి రుణ చరిత్ర, ఆదాయం, చెల్లించే సామర్థ్యం ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ను నెలవారీ సమీక్షిస్తుంటారు. బేస్‌రేట్ ప్రకారమైతే... రెపో రేటును ఆర్బీఐ తగ్గించినా, పెంచినా దాని లాభనష్టాలు వెంటనే బ్యాంకు కస్టమర్లకు బదిలీ అయ్యేవి కావు. ఎంసీఎల్ఆర్ వ్యవస్థను ఆర్బీఐ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. ఎంసీఎల్ఆర్తో ఈ లోపం కొంత తొలగిపోయింది. రుణరేటు లెక్కింపు నిర్ణయంలో పారదర్శకత పెరిగింది. ఎంసీఎల్ఆర్కు సంబంధించి ఓవర్‌నైట్ (ఒకరోజు), నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలాలకు వేర్వేరు రేట్లు అమలవుతున్నాయి. ఆర్బీఐ నుంచి తాము తీసుకునే స్వల్ప కాలిక రుణాలకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. దీన్ని రెపో రేటుగా పిలుస్తారు ప్రస్తుతమిది 6.25 శాతం. దీన్ని... తాను డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీని లెక్కించి... లాభంగా కొంత మార్జిన్‌ను కలిపి బ్యాంకు ఎంసీఎల్ఆర్ను నిర్ణయిస్తుంది. ఇంకా తన డిపాజిట్లలో సీఆర్ఆర్ (నగదు నిల్వల నిష్పత్తి) ప్రకారం ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు (ప్రస్తుతం ఇది 4 శాతం) ఎంత? నిర్వహణా వ్యయాలెంత? రుణ కాలపరిమితి ఎంత? వంటివి కూడా ఎంసీఎల్ఆర్ లెక్కింపులో చోటు చేసుకుంటాయి. సీఆర్‌ఆర్‌పై ఆర్బీఐ ఎటువంటి వడ్డీనీ చెల్లించదు. దీనికి వడ్డీని పరోక్షంగా బ్యాంకులు రుణ గ్రహీత నుంచే వసూలు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఏ రుణాలకు లింక్... ఫ్లోటింగ్ రేట్ రుణాలన్నీ ఎంసీఎల్ఆర్కే అనుసంధానమవుతాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు– గృహ రుణాలకు తప్ప వ్యక్తిగత రుణాలు, కార్ లోన్లకు ఎంసీఎల్ఆర్ వర్తింపజేయడం లేదు. వాటికి స్థిర వడ్డీరేట్లుండడమే కారణం. ఎస్బీఐ మాత్రం వ్యక్తిగత, విద్య, ఆటో రుణాలకు కూడా ఎంసీఎల్ఆర్ వర్తింపజేస్తోంది. ఎంసీఎల్ఆర్తో లాభమిదీ... బ్యాంకులు ఎంసీఎల్ఆర్పై ‘స్ప్రెడ్’ను అమలు చేస్తుంటాయి. ఇది ఒకరకంగా బ్యాంకుల లాభం. ఇది డిపాజిట్‌పై చెల్లిస్తున్న వడ్డీ ప్రాతిపదికగానే ఉండాలి తప్ప, ఇష్టానుసారంగా ఉండకూడదు. కానీ అన్ని లోన్లకూ ‘స్ప్రెడ్’ను ఒకే శాతంలో విధించరు. గృహ రుణాలకు ఒకరకమైన ‘స్ప్రెడ్’ ఉంటే, తనఖా రుణాలపై మరో రకంగా ఉంటుంది. గృహ రుణాలపై ‘స్ప్రెడ్’ తక్కువ. ఉదాహరణకు వార్షిక పాతిపదికన గృహ రుణంపై ఎంసీఎల్ఆర్ 9.2 శాతం ఉంటే, అప్‌ట్రెండ్‌లో ‘స్ప్రెడ్’ మరో 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఉంటుంది. అపుడు రుణంపై వడ్డీ రేటు 9.45 శాతం చెల్లించాలన్నమాట. ఎంసీఎల్ఆర్... దీర్ఘకాలానికి బెటర్! నిజమే!! మీరిపుడు ఎంసీఎల్ఆర్కు మారొచ్చు. కానీ దీనికి బ్యాంకులు కన్వర్షన్ చార్జీల్ని వసూలు చేస్తున్నాయి. సాధారణంగా బేస్‌రేటులో ఉన్న రుణ గ్రహీతలు ఎంసీఎల్ఆర్కు మారాలంటే చెల్లించాల్సిన రుణంలో 0.5 శాతం లేదా రూ.10,000 చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు ఇతర వ్యయాలూ ఉంటాయి. ఇవన్నీ కలిపాక కూడా మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీకి, ఎంసీఎల్ఆర్లో చేరితే చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం కనీసం 25 బేసిస్ పాయింట్లుంటే మారొచ్చు. మీది దీర్ఘకాలిక రుణమైతే ఎంసీఎల్ఆర్లోకి మారడం బెటర్. చివరిగా ఒక విషయం.. బ్యాంక్ ఆఫ్ బరోడా..బేస్ రేట్ (9.60 శాతం) ప్రాతిపదికగా ఉన్న బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి అదనపు చార్జీలూ లేకుండా కొత్త ఎంసీఎల్ఆర్లోకి మారే వెసులుబాటునిచ్చింది. ప్రస్తుత రుణాలకు ప్రాతిపదిక.. ఎంసీఎల్ఆర్ బేస్‌రేట్ స్థానంలో 9 నెలలుగా అమలు ఇప్పుడైనా కొత్త్త రేటుకు మారే అవకాశం వడ్డీ లెక్కింపులో పారదర్శక విధానం -
యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు
వివిధ కాలాలకు 0.70% వరకూ కోత ముంబై: పెద్దనోట్ల రద్దుతో వచ్చిన భారీ డిపాజిట్లు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) నేపథ్యంలో రేటు కోత నిర్ణయం తీసుకుంటున్న పలు బ్యాంకుల జాబితాలో తాజాగా యాక్సిస్ బ్యాంక్ చేరింది. దేశంలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల తర్వాత మూడవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ లెండింగ్ ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేటును 70 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. శుక్రవారం సమావేశం అయిన బ్యాంక్ అసెట్ లైబిలిటీ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందనీ, ఈ నిర్ణయం జనవరి 18 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా రేట్లు ఇలా...: వార్షిక ఎంసీఎల్ఆర్ 0.65% తగ్గి 8.25 శాతానికి చేరింది. బ్యాంక్ ఓవర్‌నైట్ (ఒకరోజు) రుణ రేటు కూడా 0.65 శాతం తగ్గి 7.90 కి చేరింది. అత్యధికంగా 0.70 శాతం తగ్గింపు 3, 6 నెలల కాలానికి వర్తిస్తుంది. 3 నెలల రేటు 8.05 తగ్గుతుండగా, ఆరు నెలల రేటు 8.15%కి చేరింది. ఇప్పటికి ఇంతే...: ఇంతకుమించి రుణరేటు కోత అవకాశం ప్రస్తుతానికి లేదని ట్రెజరీ హెడ్ శశికాంత్ రాఠీ అన్నారు. ఆర్బీఐతన రెపో రేటు తగ్గించినా... లేక తక్కువస్థాయిలో వడ్డీ చెల్లించే డిపాజిట్లు పెరిగినా తదుపరి కోత నిర్ణయం ఉంటుందన్నారు. ఇటీవలే 0.10% వరకూ బేస్‌రేట్‌ను బ్యాంక్ తగ్గించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
యాక్సిస్ బ్యాంక్ సంక్రాంతి కానుక
ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు సంక్రాంతి పండుగ కానుకను అందించింది. గృహ రుణాలు సహా రుణాలపై ఎంసీఎల్ ఆర్ ను 0.70 శాతం వరకు తగ్గించినట్టు శుక్రవారం ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంక్ లెండింగ్ రేటులో 70 బేసిస్ పాయింట్ల కోత పెట్టింది. వార్షిక రుణ రేటులో 0.65 నుంచి 8.25 శాతందాకా తగ్గించింది. ఈ తగ్గింపురేట్లు జనవరి 18నుంచి అమల్లోకి రానున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. శిఖా శర్మ నేతృత్వంలోని యాక్సిస్ బ్యాంక్ నోట్లు రద్దు అనంతరం బ్యాంకు లో అధిక లిక్విడిటీ తో ఈ నిర్ణయం తీసుకుంది కాగా ఇప్పటికే డీమానిటైజేషన్ అనంతరం మేజర్ బ్యాంకులతో సహా ఇతర బ్యాంకులన్నీ తమ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన బ్యాంక్ ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ కమిటీ సమావేశంలో తగ్గింపు రేటు అమలుకు ఆమోదం లభించింది. -
యాక్సిస్ బ్యాంక్ గుడ్‌న్యూస్
ముంబై: దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు కూడా రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల కోతను ప్రకటించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ తగ్గింపు రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ఆర్బీఐ సూచనల మేరకు గత ఆగస్టులో 8.95 శాతం తగ్గింపు రేట్లను యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరోసారి రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఫెస్టివ్ సీజన్ లో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్ బీఐ, మరో ప్రయివేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ ఇటీవల వడ్డీరేట్ల కోత పెట్టాయి. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎస్‌బీహెచ్‌కు రూ.776 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రూ.776.64 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో సంస్థ రూ.375 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ లాభం 36 శాతంపైగా వృద్ధిచెంది రూ.1,101 కోట్లుగా ఉందని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ తెలిపారు. వసూలు కాని మొండి బకాయిలకు చేసిన కేటాయింపులు రూ.2,258 కోట్లు ఉం డడం వల్లే నష్టం వాటిల్లినట్టు చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 1.38 శాతం తగ్గి రూ.1,111 కోట్లు నమోదు చేసింది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.2,53,411 కోట్లు ఉంది. మొత్తం అడ్వాన్సులు 6.6 శాతం అధికమై రూ.1,12,249 కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లు 7.20 శాతం పెరిగి రూ.1,40,489 కోట్లుగా నమోదయ్యాయి. రుణ రేటు తగ్గింపు.. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నట్లు ఎస్బీహెచ్ ప్రకటించింది. నవంబర్ ఒకటవ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో ఏడాది కాలానికి రేటు 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది. హౌసింగ్ రుణ రేటు వార్షికంగా 9.45 శాతానికి తగ్గుతుంది. -
రుణ రేట్లను సవరించిన నాలుగు బ్యాంక్‌లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాయి. రెపో తగ్గిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను 9-9.35% రేంజ్లో నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 3 నెలల కాలానికి 9.2 శాతం,ఆరు నెలల కాలానికి 9.25 శాతం, ఏడాది కాలానికి 9.35 శాతంగా ఎంసీఎల్ఆర్ను నిర్ణయించామని వివరించింది. ఇక సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను 9.3-9.45 శాతంగా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల ఏడు నుంచి వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్ 9.05-9.6% రేంజ్లో ఉంది. ఇది ఈ నెల 1 నుంచే వర్తిస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ ఎంసీఎల్ఆర్ 9.3-9.75% రేంజ్లో ఉంది. ఈ నెల 5 నుంచి ఇది వర్తిస్తుంది. -
రుణ రేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బుధవారం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును స్వల్పంగా 0.05% తగ్గించింది. కొత్త రుణ గ్రహీతల నెలవారీ వాయిదాల చెల్లింపు (ఈఎంఐ)లు తగ్గడానికి దోహదపడే అంశం ఇది. తాజా నిర్ణయంతో బ్యాంక్ రెండేళ్ల రుణ రేటు 9.25% నుంచి 9.20%కి తగ్గింది. ఈ నిర్ణయం 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెబ్సైట్లో పేర్కొంది. నెలవారీ రేటు 9 శాతం నుంచి 8.95కు తగ్గింది. కొత్త రుణ గ్రహీతలకు బేస్ రేటు స్థానంలో ఎంసీఎల్ఆర్ వర్తిస్తుంది. బ్యాంకు రుణ సమీకరణ వ్యయం, నెట్‌వర్త్‌పై రిటర్న్స్ ప్రాతిపదికన ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేటు నిర్ణయం జరుగుతుంది. బీఓబీ పెంపు...: కాగా జూన్ 7 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా వార్షిక ఎంసీఎల్ఆర్ను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 9.30 శాతం నుంచి 9.40 శాతానికి ఎగసింది. -
రుణ రేటును స్వల్పంగా తగ్గించిన ఐసీఐసీఐ
ముంబై: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లకు సరిసమానమయ్యింది. బ్యాంక్ కొత్త రుణ గ్రహీతలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చుతుంది. తాజా తగ్గింపు ప్రకారం బ్యాంక్ ఓవర్‌నైట్ రుణ రేటు 8.95 శాతంగా ఉంటుంది. గృహ రుణాలకు అనుసంధానమైన ఏడాది రేటు 9.15 శాతానికి తగ్గుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలల రుణ రేట్లకు కూడా మార్చిన రేటు వర్తిస్తుంది. మారిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. మరికొన్ని బ్యాంకులూ: ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరాబ్యాంక్సహా మరికొన్ని బ్యాంకులు కూడా జూన్‌కు సంబంధించి ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేటును సమీక్షించాయి. ఏడాది రుణ రేటు విషయంలో ఎస్బీఐ (9.15%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (9.40%) ఎటువంటి మార్పూ చేయలేదు. కెనరా బ్యాంక్ రేటు 0.10% తగ్గి 9.35 శాతానికి చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్ రుణ రేటు 0.15 శాతం తగ్గి 9.55 శాతానికి చేరింది. తాజా రేటు తక్షణం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.