న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా మూడవసారి 6.5 శాతం వద్ద కొనసాగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్యాంకులు మాత్రం వడ్డీరేట్ల పెంపువైపే మొగ్గుచూపుతుండడం గమనార్హం.
వ్యవస్థలో తగిన రుణ డిమాండ్ ఉందన్న విషయాన్ని బ్యాంకుల తాజా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ నిర్ణయాలతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణరేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగ రుణాలు ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమై ఉంటాయి.
తాజా మార్పుతో ఏడాది బ్యాంకింగ్ ఎంసీఎల్‌ఆర్ రేట్ల పెరుగుదల తీరిదీ...
బీఓబీ: రుణ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెరగనుంది. ఆగస్టు 12 నుంచి ఈ రేటు అమలవుతుంది.
కెనరా బ్యాంక్: ఆగస్టు 12 నుంచి 8.65 శాతం నుంచి 8.7 శాతానికి పెరగనుంది.
బీఓఎం: తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రేటు 10 బేసిస్ పాయింట్లు ఎగసి 8.60కి ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment