BOB
-
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవా, బ్రయాన్ బ్రదర్స్
న్యూపోర్ట్: అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రష్యా స్టార్ మరియా షరపోవా... మేటి డబుల్స్ జోడీ బ్రయాన్ బ్రదర్స్ బాబ్, మైక్‌లకు చోటు లభించింది. బ్యాలెట్ సెలెక్షన్స్ ఓటింగ్ ద్వారా ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్ (2008), వింబుల్డన్ (2004), యూఎస్ ఓపెన్ (2006) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఒక్కోసారి నెగ్గగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను (2012, 2014) రెండుసార్లు సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించింది. కవల సోదరులైన బాబ్, మైక్ బ్రయాన్లు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 438 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. అంతేకాకుండా 16 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు 2007లో అమెరికా జట్టు డేవిస్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. -
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..
యువత రకరకాల హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతుంటుంది. సినిమాల్లో హీరోయిన్లు కొత్త హెయర్ స్టయిల్ పరిచయం చేస్తే ఇక ముందు వెనుక ఆలోచించే పనే లేదన్నట్లు ఫాలో అయిపోతుంది కాలేజ్ యువత. అలా ఎన్నెన్నో కొంగొత్త హెయిర్ స్టయిల్స్ వచ్చాయి. వాటిలో బాగా క్లిక్ అయ్యింది, యువతను బాగా అట్రెక్ట్ చేసింది బాబ్ హెయిర్ స్టయిల్. ఈ హెయర్ స్టయిల్ భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి అనుసరించేవారంటే.. ఈ హెయిర్ స్టయిల్ బాలీవుడ్ మూవీ 'కుచ్కుచ్ హోతా హై' కాజోల్దే తొలి హెయిర్ స్టయిల్ అని చెప్పొచ్చు గానీ అంతకుమునుపు మన తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఈ లుక్‌లోనే ఉండేవారు. మన భారతదేశంలో ఆమె నుంచి ఈ బాబ్ హెయిర్ స్టయిల్ మన దేశంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎవ్వరూ ఆ కాలంలో దీన్ని అనుకరించే డేర్ చేయలేదు. ఎందుకంటే? పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు ఇలా హెయిర్ స్టయిల్ వేసుకునుందుకు జంకే వారు. పైగా దాన్నో పెద్ద నేరంగా భావించేవారు. దీంతో అప్పట్లో ఇలాంటి హెయిర్ స్టయిల్ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇక కాజోల్ మూవీ "కుచ్కుచ్ హోతా"లో షార్ట్ భాబ్ హెయిర్ స్టయిల్లో కనిపించినప్పటి నుంచి ఈ హెయిర్ స్టయిల్‌కి కాస్త్ర క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి చిన్న పిల్లలకు దీన్ని బేబీ హెయిర్ స్టయిల్‌గా ఉపయోగించేవారు. అయితే ఇది పిల్లలకు చాలా క్యూట్‌గా ఉండి మంచి లుక్ ఇచ్చేది. ఆ తర్వాత క్రమంగా టీనేజర్లు ఈ లుక్‌ని పాలో అయ్యేవారు. దీన్ని 'టామ్ బాయ్ స్టయిల్" అని కూడా పిలిచేవారు. అయితే ఈ హెయిర్ స్టయిల్ సమ్మర్లో మంచి కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఎండలకు ఉక్కపోతతో చిర్రెత్తుకొస్తుంటుంది. వొంటి మీద బట్టలే ఈ ఎండల ధాటికి కంపరంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో పొడవాటి జుట్టుతో ఇబ్బంది అంతా ఇంతా కాదు!. అయితే ఈ స్టయిల్ కొన్నాళ్లుకు కనుమరుగయ్యి చిన్న జడలు ట్రెండ్‌లోకి వచ్చాయి. జస్ట్ భజాల దాక జుట్టు వదిలేసుకోవడం కూడా బాగా ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత మహిళా ఆఫీసర్లు, అధికారులు ఈ స్టయిల్‌నే అనుసరించేవారు. మళ్లీ ఇన్నేళ్లుకు షార్ట్ బాబ్(టామ్ బాయ్) హెయిర్ స్టయిల్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినీ తారలు అలియా భట్, అనుష్కా కోహ్లి నుంచి దీపికా పదుకునే వరకు అంతా ఈ హెయర్ స్టయిల్‌నే ఫాలో అవుతుండటం విశేషం. ఇక ఇటీవలే జరిగిన ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో కూడా ఈ హెయిర్ స్టయిల్‌తోనే రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ హిరోయిన్లు సందడి చేశారు. పాత హెయిర్ స్టయిల్ అయినా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టయిల్‌గా ఈ షార్ట్ బాబ్ హెయర్ స్టయిల్ నిలచిపోయింది. భారతదేశం లాంటి దేశంలో సమ్మర్లో మంచి వెసులుబాటుగా ఉండే హెయిర్ స్టయిల్ ఇది. ఈ సమ్మర్లో పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయాలంటే సరదాగా మీరు ఈ హెయిర్ స్టయిల్లని ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: దాల్చిన చెక్కతో మొటిమలకు చెక్‌పెట్టండిలా!) -
మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మహిళా ఖాతాదార్లకు ఆఫర్లు ప్రకటించింది. బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా లేదా బీఓబీ వుమెన్ పవర్ కరెంట్ ఖాతాలను జూన్ 30లోగా తెరిచి, డిసెంబరు 31 వరకు రుణం పొందేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలు తెరిచిన మహిళలకు అందించే రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనుంది. ఇదీ చదవండి: రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన ప్రభుత్వం ద్విచక్ర వాహన రుణాలకైతే 0.25%, విద్యా రుణాలకైతే 0.15%, వాహన, గృహ, తనఖా రుణాలపై 0.1% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బీఓబీ ప్రకటించింది. రిటైల్ రుణాలపై (వ్యక్తిగత రుణాలతో సహా) ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వార్షిక సురక్షిత డిపాజిట్ లాకర్ ఛార్జీలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. -
స్వల్పకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంతంటే..
స్వల్పకాలిక రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.1 నుంచి 7.6 శాతం వరకూ ఆఫర్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం రేటు వర్తిస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. ‘బీఓబీ360’ పేరుతో ప్రారంభించిన ఈ తాజా బల్క్ డిపాజిట్ స్కీమ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ప్రస్తుత లేదా కొత్త కస్టమర్లు ఈ బల్క్ డిపాజిట్ స్కీమ్‌ను ఏదైనా బ్రాంచ్‌లో, ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెరవవచ్చు. కాగా, రెండు వారాల క్రితమే బీఓబీ రూ.2 కోట్ల లోపు స్వల్పకాలిక స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) వరకూ పెంచింది. 7–14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25% పెరిగి 4.25 శాతానికి చేరింది. 15–45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50%కి చేరింది. 271 రోజుల బల్క్ డిపాజిట్లపై బ్యాంక్ 6.25 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసింది. -
అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే..
మెట్రో, బస్సు, రైలు, ఏటీఎం, టోల్, పార్కింగ్.. ఇలా ప్రతిదానికి ప్రత్యేకించి కార్డులుంటాయి. వీటన్నింటిని వెంటతీసుకుని వెళ్లడం కొంత చికాకుతో కూడిన వ్యవహారం. అయితే అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ) రూపే రీలోడబుల్ ప్రీపెయిడ్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ‘వన్ నేషన్, వన్ కార్డ్’ చొరవతోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్, పార్కింగ్ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఏటీఎం విత్‌డ్రాతో పాటూ పాయింట్ ఆఫ్ సేల్, ఈ-కామర్స్ చెల్లింపుల కోసం కూడా ఈ కార్డును ఉపయోగించవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలు చేసుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. ఆన్లైన్ వాలెట్ బ్యాలెన్స్ గరిష్ఠంగా రూ.లక్ష వరకు, ఆఫ్‌లైన్ వాలెట్లో అయితే రూ.2వేలుగా పరిమితిని నిర్ణయించింది. బ్యాంక్ ప్రత్యేక పోర్టల్ ద్వారా కార్డు దారులు డబ్బును లోడ్/ రీలోడ్ చేసుకోవచ్చు. -
విద్యార్థుల కోసం స్పెషల్ అకౌంట్ - ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్: విద్యార్థుల కోసం సున్నా బ్యాలన్స్ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రారంభించింది. 16–25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బీవోబీ బ్రో సేవింగ్స్ ఖాతా’ను రూపొందించినట్టు తెలిపింది. జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయోజనాలు.. 16–25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా సున్నా బ్యాలన్స్తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రపే ప్లాటినం డెబిట్ కార్డ్ సొంతం చేసుకోవచ్చు. ప్రతి త్రైవసికానికీ విమానాశ్రయాల్లో రెండు సార్లు లాంజ్ ప్రవేశాలను పొందొచ్చు. ర.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, ఆర్ట్జీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు ఉచితం. చెక్‌లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్‌ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతా ఏఎంసీపై నూరు శాతం రాయితీ ఉంది. విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీ లేకపోగా, వడ్డీ రేటులో 0.15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు చేరువ చేసేందుకు గాను ఐఐటీ బోంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నియమించుకుంది. -
ఖాతాదారులకు అలెర్ట్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం కలకలం!
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా’(bob)లో స్కాం కలకలం రేపింది. పలు బ్రాంచీలలో పనిచేస్తున్న ఉద్యోగులే కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు సంబంధం లేని మొబైల్ నంబర్లతో లింక్ చేసి, వాటి సాయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బాబ్ వరల్డ్’ లో లాగిన్ అయ్యారు. అనంతరం, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. తాజాగా, జరిపిన బ్యాంక్ ఇంట్రర్నల్ ఆడిట్లో కుంభకోణం జరిగింది నిజమేనని తేలింది. ఆర్బీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది. అసలేం జరిగింది? బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ఇతర బ్యాంకింగ్ యాప్‌ల మాదిరిగానే, కస్టమర్లకు లోన్ సదుపాయం, సేవింగ్స్, పెట్టుబడులు, పేమెంట్స్, బస్, హోటళ్ల బుకింగ్ వంటి వివిధ డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. దీన్ని ఆసరగా చేసుకుని బ్యాంక్ ఉద్యోగులే తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన బ్యాంక్ ఉద్యోగులు నివేదిక ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులే కస్టమర్లకు తెలియకుండా ఫోన్ నెంబర్లు లేని అకౌంట్లను గుర్తించారు. కస్టమర్ల ఫోన్ నెంబర్ల స్థానంలో బ్యాంక్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నెంబర్లను జత చేశారు. దీంతో బ్యాంక్ అసలైన ఖాతాదారులకు తెలియకుండా వారి మొబైల్ యాప్స్‌లలో లాగిన్ అయ్యారు. అకౌంట్లలో ఉన్న నిధుల్ని కాజేశారు. ఈ వ్యవహారంలో కస్టమర్లు భారీ ఎత్తున నష్టపోయారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖండించింది. ఆ తర్వాత వరుస ఫిర్యాదులతో ఆర్బీఐ సైతం అప్రమత్తమైంది. బీవోబీలో అంతర్గత విచారణ చేపట్టడంతో తీగ లాగడంతో డొంకంతా కదలడంతో స్కాం జరిగినట్లు తేలింది. ఉద్యోగుల సస్పెండ్ ఈ స్కామ్‌లో సంబంధం ఉన్న 60 మంది ఉద్యోగులకు సస్పెన్షన్ విధించింది. దీంట్లో గుజరాత్ వడోదరా, భోపాల్, బరోడా, రాజస్థాన్ నుంచి విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వీరందరిని ఆర్బీఐ సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తే వారి శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. రంగంలోకి ఆర్బీఐ బ్యాంక్ ఉద్యోగులు చేసిన మోసంతో ఆర్బీఐ యాప్‌లోని లోపాల్ని సరిదిద్దుతుంది. కొత్త కస్టమర్లు యాప్‌లో లాగిన్ అవ్వకుండా నిషేధించింది. యాప్‌లోని సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాతనే కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు నెట్ బ్యాంక్‌లో లాగిన్ అయ్యే అవకాశం కలగనుంది. చదవండి👉 మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే! -
పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!
ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. కేవలం ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే కాకుండా.. కొన్ని దిగ్గజ బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వడ్డీ & ఇతర రాయితీలను అందించనుంది. హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఇప్పుడు 8.4శాతం నుంచి ప్రారంభమవుతుంది బ్యాంక్ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రేట్ కార్ లోన్ల వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేవు ఎజ్యుకేషన్ లోన్ మీద వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది (60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ 10.10 శాతం నుంచి ప్రారంభమవుతుంది (80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే.. ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2023 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్స్ కింద బ్యాంక్ విద్య & వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను వరుసగా 60 bps, 80 bps తగ్గించింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే కొన్ని ఇతర బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ప్రత్యేక ఆఫర్స్ పొందవచ్చు. -
ఆర్బీఐ వదిలినా.. ఆ మూడు బ్యాంకుల ఖాతాదారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా మూడవసారి 6.5 శాతం వద్ద కొనసాగిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్యాంకులు మాత్రం వడ్డీరేట్ల పెంపువైపే మొగ్గుచూపుతుండడం గమనార్హం. వ్యవస్థలో తగిన రుణ డిమాండ్ ఉందన్న విషయాన్ని బ్యాంకుల తాజా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ నిర్ణయాలతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణరేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగ రుణాలు ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్కు అనుసంధానమై ఉంటాయి. తాజా మార్పుతో ఏడాది బ్యాంకింగ్ ఎంసీఎల్ఆర్ రేట్ల పెరుగుదల తీరిదీ... బీఓబీ: రుణ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెరగనుంది. ఆగస్టు 12 నుంచి ఈ రేటు అమలవుతుంది. కెనరా బ్యాంక్: ఆగస్టు 12 నుంచి 8.65 శాతం నుంచి 8.7 శాతానికి పెరగనుంది. బీఓఎం: తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రేటు 10 బేసిస్ పాయింట్లు ఎగసి 8.60కి ఎగసింది. -
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్‌ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్‌లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్‌కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్‌యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్‌కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్‌లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవో బీ) తన సబ్సిడరీ అయిన బీవోబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ (బీఎఫ్ఎస్ఎల్)లో 49 శాతం వరకు వాటాలను విక్రయించనుంది. ఇందుకు సంబంధించి బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీకి ప్రస్తుతం 100 శాతం వాటా కలిగి ఉంది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బీవోబీ తెలిపింది. -
వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు
ముంబై: వడ్డీ రేటు పెంపు జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) చేరాయి. ఈ నెల మొదట్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పావుశాతం పెంచడం (6.5 శాతానికి) దీనికి నేపథ్యం. ఎస్బీఐ బుధవారం రేట్ల పెంపు నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలో బీఓబీ, ఐఓబీలు చేరడం గమనార్హం. బీఓబీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఫిబ్రవరి 12 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి, ఓవర్‌నైట్, నెల, మూడు నెలా రేట్లు వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.3 శాతానికి చేరాయి. ఐఓబీ: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 8.45కు చేరింది. నెల, మూడు, ఆరు నెలల రేట్లుసైతం ఇదే స్థాయిలో పెరిగి వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.35 శాతాలకు చేరాయి. ఓవర్‌నైట్, రెండేళ్లు, మూడేళ్ల రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఎస్బీఐ డిపాజిటర్లకు తీపికబురు రుణ రేటును బుధవారం 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను కూడా గురువారం 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల శ్రేణిలో పెంచింది. తాజా పెంపు నేపథ్యంలో ఐదేళ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 8.5 శాతం వడ్డీరేటు పొందుతారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య రేటు పావుశాతం పెరిగి 7 శాతానికి చేరింది. మూడేళ్ల పైబడిన డిపాజిట్లపై రేటు కూడా పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్...!
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎస్సీఎస్ఎస్) పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు నిర్ణీత కాల డిపాజిట్లపై అధికంగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంతో అధిక వడ్డీ రేట్లనే కాకుండా, వీటిపై అదనపు ప్రయోజనాలు కూడా రానున్నాయి. ఇటీవలకాలంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో చాలా మంది ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను చేయడం లేదు. తిరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) పై ఉన్న రేట్లపై అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ పథకాన్ని 2021 సెప్టెంబర్ 30 వరకు పెంచుతూ బ్యాంకులు ఉత్తర్వులు జారీ చేశాయి. ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకంతో సాధారణ ఖాతాదారులకు లభించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్ల అధికంగా అందిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ఖాతాదారులకు ఐదేళ్ల ఎఫ్డీపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రత్యేక ఎఫ్డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం వడ్డీ రేట్లను ఇవ్వనుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన ‘ఎస్బీఐ వీకేర్‘ లో భాగంగా 30 బిపిఎస్ అదనపు ప్రీమియం పాయింట్లను వారి రిటైల్ టిడి కోసం చెల్లించబడుతుంది. అందుకోసం ఆయా బ్యాంకుల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఖాతాదారునిగా ఉండాలి. ఎస్బీఐ వీ కేర్ పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ ఐదు సంవత్సరాల వ్యవధితో 5 కోట్ల కన్నా తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25% అదనపు ప్రీమియం అందించనుంది. ఈ ప్రత్యేక డిపాజిట్ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ స్పెషల్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 75 బిపిఎస్ పాయింట్లను కూడా ఇవ్వనుంది. ప్రత్యేక ఎఫ్డి పథకం కింద సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఎఫ్డీ స్కీం ఫర్ సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 100 కంటే ఎక్కువ బిపిఎస్ పాయింట్లను ఇస్తోంది. ఈ పథకంలో డిపాజిట్ చేస్తే 6.25 వడ్డీ రేటు లభిస్తోంది. చదవండి: బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్బీఐ డిప్యూటీ ఎండీ -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ) తన ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివిధానాన్ని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఉద్యోగుల నుంచి మరింత ఉత్పాదకతను రాబట్టే యోచనతో ఉంది. కరోనా రాకతో ఉద్యోగుల పని స్వభావం మార్పు చెందిందని.. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే అనుకూలత ఏర్పడినట్టు బీవోబీ 2020-21 సంవత్సరం వార్షిక నివేదికలో పేర్కొంది. ‘‘ఎక్కడి నుంచి అయినా పనిచేయడం అన్నది నూతన సాధారణ విధానం. ఉద్యోగ బాధ్యతలకు, వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యం దీంతో సాధ్యపడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఉత్పాదకత పెరుగుతుంది. కొన్ని రకాల విధులను మారుమూల ప్రాంతాల నుంచీ లేదా ఎక్కడ నుంచి అయినా పనిచేసే విధంగా నిర్వహణ నమూనాపై దృష్టి పెట్టాము. ఇది ఉద్యోగులకు ఎంతో వెసులుబాటునిస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ బరోడా తెలిపింది. డిజిటల్ సేవలకు డిమాండ్ సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో చర్యలను అమలు చేసే విషయంలో బ్యాంకింగ్ సేవలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు బీవోబీ చైర్మన్ హస్ముఖ్ అదియా చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిజిటల్ సేవలకు అవసరం ఏర్పడిందని.. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవం కోసం బ్యాంకు సేవలను డిజిటల్‌గా మారుస్తున్నట్టు అదియా వివరించారు. బ్యాంకు శాఖల స్థాయిల్లో అధిక శాతం డిపాజిట్లు పేపర్ రహితంగానే ఉంటున్నట్టు తెలిపారు. మొబై ల్ బ్యాంకింగ్ డిజిటల్ సేవలకు కీలకంగా పేర్కొన్నారు. రుణాల మంజూరును సైతం డిజిటల్‌గా ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విధానాలతో ఖర్చు లు తగ్గించుకుని, మరింత వృద్ధి చెందడానికి అవకా శం ఉంటుందని తెలిపారు. ఆస్తుల నాణ్యత, డిపాజిట్లు, రుణాల వృద్ధి, లాభదాయకత, నిధుల పరం గా బీవోబీ పటిష్ట స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన అతిపెద్ద వజ్రం -
కెనరాబ్యాంక్, బీఓబీ, బీఓఐలకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. బీఓబీ: సంజయ్ చంద్ర ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్ చంద్ర బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎస్ జయకుమార్ స్థానంలో సంజయ్ చంద్ర నియామకం జరిగింది. బీఓఐ: బ్యాంక్ ఎండీ సీఈఓగా అతనూ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం దాస్ ఇదే బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ కుర్చీ గత ఏడాది జూలై నుంచీ భర్తీకాలేదు. కెనరా బ్యాంక్: లింగమ్ వెంకట్ ప్రభాకర్ ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రభాకర్ పీఎన్బీలో ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెలాఖరున రిటైర్ కానున్న ఆర్ఏ శంకర్ నారాయణన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. -
అమ్మకానికి దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయం
ముంబై: దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్ ప్రైస్ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహా్వనిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్ పత్రం ప్రకారం.. ఈ–వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్ వంటివి ఆస్తిలో భాగం కాదని ప్రకటనలో వివరించింది. కార్యాలయం 2,878.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. బిల్ట్ అప్ ఏరియా 9,953.73 చదరపు మీటర్ల విస్తీర్ణంగా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. -
బీవోబీలో బ్యాంకుల విలీనం నేటి నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం.. నేటి నుంచే (ఏప్రిల్ 1) అమల్లోకి రానుంది. తద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది. ఇకనుంచి విజయా బ్యాంక్, దేనా బ్యాంకు శాఖలన్నీ బీవోబీ శాఖలుగా పనిచేయనున్నాయి. ‘విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ ఖాతాదారులను ఏప్రిల్ 1 నుంచి బీవోబీ ఖాతాదారులుగా పరిగణించడం జరుగుతుంది’ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్రం గత వారం నిర్ణయం తీసుకుంది. విలీన ప్రతిపాదన ప్రకారం విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అలాగే, దేనా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 110 లభిస్తాయి. ఈ మూడింటి విలీనంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఏర్పడుతుంది. దీని వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గాను ఉంటుంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గుతుంది. -
బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో కేంద్రానికి ఊరట లభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్, దేనాబ్యాంక్ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారీమన్, న్యాయమూర్తి వినీత్ శరణ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది. బ్యాంకుల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తంగ్ వాదనలు వినిపించారు. మార్గదర్శకాల ప్రకారమే విలీన నిర్ణయం జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ విలీన నిర్ణయాల్లో పలు తప్పులు జరిగాయని బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది. కాగా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్లు ఈ పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
మెగా మెర్జర్ : మూడు బ్యాంకులు విలీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే మెగా మెర్జర్‌కు కీలక అడుగు పడింది. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మేరకు దెనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు విలీనానికి సర్వం సిద్దమైంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. ఈ మూడు బ్యాంకుల విలీనం అనంతరం దేశంలోని మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా విలీన బ్యాంకు అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ కార్యకలాపాల హేతుబద్ధత బాగా పుంజుకుందని చెప్పారు. బ్యాంకుల క్యాపిటల్ అవసరాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ విలీన ప్రక్రియలో ఈ మూడు బ్యాంకుల ఉద్యోగుల భద్రతను కాపాడతామన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం సందర్భంగా ఎలాంటి ఉద్యోగ నష్టం జరగ లేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఈ విలీన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు మూలధన మద్దతును కూడా అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకుల బోర్డుల తుది ఆమోదం తర్వాత విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగలు, ఖాతాదారుల భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు. -
శిఖాశర్మ స్థానంలో ప్రభుత్వ బ్యాంకర్
న్యూఢిల్లీ : పీఎస్ జయకుమార్.. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయనే ఇక యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ స్థానంలో, జయశంకర్ ఆ పదవిని అలంకరించబోతున్నారని తెలుస్తోంది. కొత్త సీఈవోను వెతుకులాడేందుకు బ్యాంక్ అపాయింట్స్‌మెంట్ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఇగోన్ జెహెండర్ను నియమించింది. జెహెండర్ ఆధ్వర్యంలోని సెర్చ్ ప్యానల్, జయకుమార్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జయకుమార్ అంతకముందు సిటీబ్యాంకర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఓబీ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం బీఓబీలో ముగియబోతోంది. కాగ, శిఖా శర్మ ఈ ఏడాది చివరికి శాశ్వతంగా తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. 2018 సెప్టెంబర్ వరకు యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవోపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జయకుమార్తో పాటు ఈ పదవికి బ్యాంక్ డిప్యూటీ ఎండీ వీ శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్‌లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను, బోర్డు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనుంది. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి సీఈవో ఎవరో తేల్చేశాక, షేర్‌హోల్డర్స్, ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఆమోదం పొందుతుంది. కాగ, గతేడాది జూలైలోనే యాక్సిస్ బ్యాంక్, శిఖా శర్మను మరోసారి సీఈవో, ఎండీగా నియమించింది. 2018 జూన్ నుంచి మూడేళ్ల పాటు ఆమెనే కొనసాగనున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఆర్బీఐ అభ్యంతరం తెలిపింది. బ్యాంక్ ప్రదర్శన, ఆస్తుల నాణ్యత బట్టి, మరోసారి యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలిపింది. అయితే శిఖా శర్మనే తన నాలుగో టర్మ్ పదవి కాలాన్ని 2021 మే వరకు కాకుండా.. ఈ ఏడాది చివరికి ముగించేయాలని కోరినట్టు బ్యాంక్ బోర్డు, ఆర్బీఐకి లేఖ తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరితోనే శిఖాశర్మ తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. -
వడ్డీరేటు పెంచేసిన మరో ప్రభుత్వ బ్యాంకు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా లెండింగ్ వడ్డీరేట్లను పెంచేసింది. ఒక సంవత్సరం బెంచ్‌మార్క్ రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. 8.40 శాతంనుంచి 8.45 శాతానికి ఎంసీఎల్ఆర్ను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు జూన్ 7 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకరోజు, ఒక నెల, మూడు నెలలు , ఆరు నెలల కాల పరిమితి రుణాలపై వడ్డీరేటు రుసగా 7.95 శాతం, 8 శాతం, 8.1 శాతం, 8.3 శాతం ఉండనుంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో బీఓబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల, ఎస్బీఐ, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎప్సీ సహా కొన్ని బ్యాంకులు తమ ఎంసిఎల్ఆర్ను పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడివున్న గృహ, వాహన రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి. -
గుప్తా స్కాం: బీవోబీకి సౌత్ ఆఫ్రికా దెబ్బ
జోహన్నెస్‌బర్గ్: అధ్యక్షుడు రాజీనామాకు దారితీసిన గుప్తా స్కాంపై సౌత్ ఆఫ్రికా ప్రతి పక్ష పార్టీ డెమెక్రాటిక్ అలయన్స్(డీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పై క్రిమినల్ చర్యలకు సిద్ధపడుతోంది. ఈ మేరకు హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. ది హిందూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఏసీసీఆర్‌పీ) చేపట్టిన ఒక వివరణాత్మక దర్యాప్తు నేపథ్యంలో ప్రతిపక్షపార్టీ బీవోబీపై చర్యలకు దిగనుందని నివేదించింది. సీనియర్ బ్యాంకు అధికారులు గుప్తా కుటుంబం యాజమాన్యంలోని కంపెనీలతో సహా, సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ సంస్థల నుండి పెద్ద ఎత్తున, వివరణ లేని చెల్లింపులు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా జూనియర్ ఉద్యోగులు లేవనెత్తిన అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.ఆర్.ఎస్) ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని విమర్శించింది. జోహాన్నెస్‌బర్గ్‌లో బీవోబీ బ్రాంచ్‌లో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా 2016 లో నమోదైనట్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీఏ భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టం 29 , 52 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ భారీకుంభకోణంపై తమ పోరాటం కొనసాగుతుందని డీఏ పార్టీ ప్రతినిధి నటాషా మజ్జోన్ స్పష్టం చేశారు. 1990లలో భారతదేశం నుంచి వలస వెళ్లిన గుప్తా బ్రదర్స్ అతుల్, అజయ్, రాజేష్ - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సహకారంతో బిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో జుమాకు సన్నిహిత్ సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. వీటితోపాటు పలు అవినీతి ఆరోపణలు. చివరకు అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జుమా రాజీనామాకు దారితీసింది. అదే రోజున, జోహెన్నెస్ బర్గ్‌లోని గుప్తా భవనంపై పోలీసులు దాడి చేయడంతోపాటు అజయ్గుప్తాకు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అలాగేమాజీ ప్రెసిడెంట్ కొడుకు డ్యుడ్యూజనే సహా, ముగ్గురు గుప్తా సోదరులు దుబాయ్‌కి పారిపోయారని భావిస్తున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాలో కార్యకలాపాలను నిలిపివేయాలని బీవోబీ నిర్ణయించింది. తమ కార్యకలాపాలు ఎప్పుడూ ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగాయని వివరించింది. -
సగానికి తగ్గిన బీవోబీ లాభాలు
న్యూఢిల్లీ: మొండి బాకీలు పెద్దగా మారనప్పటికీ.. అధిక కేటాయిం పులు జరపాల్సి రావడంతో జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం దాదాపు 52 శాతం క్షీణించి రూ. 203 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.424 కోట్లు. మరోవైపు, మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,878 కోట్ల నుంచి రూ. 12,104 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 11.15 సాతం నుంచి 11.40 శాతానికి చేరగా, నికర నిరర్ధక ఆస్తులు మాత్రం 5.73 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో ప్రొవిజనింగ్ కింద బీవోబీ రూ. 2,157 కోట్లు పక్కన పెట్టింది. క్రితం క్యూ1లో ఈ మొత్తం రూ. 1,986 కోట్లు. బీఎస్ఈలో బీవోబీ షేరు 3.91 శాతం క్షీణించి రూ. 142.55 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ ఫలితాలు ఓబీసీ నష్టం రూ. 486 కోట్లు ఆదాయంలో క్షీణత, మొండి బాకీలకు అధిక కేటాయింపుల మూలంగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) క్యూ1లో రూ. 486 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత జూన్ త్రైమాసికంలో లాభం రూ. 101 కోట్లు. ఇక ఆదాయం రూ. 5,398 కోట్ల నుంచి రూ. 5,204 కోట్లకు తగ్గింది. స్థూల ఎన్పీఏలు 11.45 శాతం నుంచి 14.83 శాతానికి, నికర ఎన్పీఏలు 8.11 శాతం నుంచి 9.56 శాతానికి పెరిగాయి. అలహాబాద్ లాభం రూ. 29 కోట్లు అలహాబాద్ బ్యాంక్ రూ. 29 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో బ్యాంకుకు రూ.565 కోట్ల నష్టం వచ్చింది. తాజా తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.5,123 కోట్ల నుంచి రూ.4,969 కోట్లకు తగ్గింది. నికర ఎన్పీఏలు 8.69 శాతం నుంచి 8.96 శాతానికి పెరిగాయి. క్యూ1లో మొండి బాకీల కోసం ప్రొవిజనింగ్ కింద అలహాబాద్ బ్యాంకు చేసిన కేటాయింపులు రూ.1,575 కోట్ల నుంచి రూ.1,687 కోట్లకు పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ లాభం 67 శాతం అప్.. తొలి త్రైమాసికంలో కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం 67 శాతం వృద్ధి చెంది రూ.36 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెరిగింది. అయితే, ఆదాయం మాత్రం రూ.5,241 కోట్ల నుంచి రూ.5,113 కోట్లకు తగ్గింది. మరోవైపు, స్థూల నిరర్ధక ఆస్తులు 11.01 శాతం నుంచి ఏకంగా 15.49 శాతానికి ఎగశాయి. -
కలుపుకునే ‘కింగ్’లు ఇవే
♦ పీఎన్బీ, బీవోబీ, బీవోఐ, కెనరా బ్యాంకులు ♦ ఇతర బ్యాంకులను విలీనం చేసుకునేందుకే ఎంపిక ♦ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పణ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) భారీ స్థాయిలో విలీనాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 21 బ్యాంకులు ఉండగా, విలీనాలతో ఓ నాలుగైదు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో బలంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), కెనరా బ్యాంకులను ఎంపిక చేసినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వరంగంలోని చిన్న బ్యాంకులను విలీనం చేసుకునే సామర్థ్యం వీటికుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చిన్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు గల అవకాశాలను అన్వేషించాలంటూ ఈ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్టు ఆ అధికారి వెల్లడించారు. విలీనానికి తమ వైపు నుంచి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలపై ఈ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సమర్పించాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఇందుకు ఎటువంటి కాల పరిమితి లేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కలసిపోయిన విషయం విదితమే. భవిష్యత్తులో మరిన్ని విలీనాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే తెలిపారు. విలీనం ఫలితమిచ్చేనా...? విలీనం చేసుకునేట్టు అయితే ఒకే ప్రాంతంలో శాఖలు పెరిగిపోవడం, సాంకేతిక అనుసంధానత, పోటీ వ్యతిరేక అంశాలు ఏవైనా తలెత్తుతాయా? తదితర వివరాలను ఆర్థిక శాఖ కోరింది. విలీనం అనంతరం ప్రతికూలత ఫలితాలు ఎదురవ్వకుండా చూడడమే దీని ఉద్దేశం. అయితే, ఈ విలీనాలు పీఎస్‌బీల బలోపేతానికి తోడ్పడతాయన్న విషయంలో విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనం వెనుకనున్న ఉద్దేశమేంటని రేటింగ్ సంస్థ ఇక్రా గ్రూప్ హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ సందేహం వ్యక్తం చేశారు. బలహీనంగా ఉన్న రెండు బ్యాంకుల విలీనంతో ఒక బలమైన బ్యాంకు ఏర్పడదన్నది ఆయన అభిప్రాయం. అలాగే, ఒక బలమైన బ్యాంకు, ఒక బలహీన బ్యాంకును విలీనం చేసినా పటిష్ట బ్యాంకు ఏర్పాటు అసాధ్యమన్నారు. విలీనం చేసుకున్న బ్యాంకు బలిపశువుగా మారే ప్రమాదమూ లేకపోలేదన్నారు. ఎస్బీఐ ఇందుకు ఉదాహరణ అని... ఆరు బ్యాంకుల విలీనం తర్వాత ఎస్బీఐ రూ.3,000 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిందని, అదే విడిగా ఎస్బీఐ బ్యాంకు ఫలితాలను చూసుకుంటే రూ.2,815 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆయన వివరించారు. సిండికేట్, విజయా, కెనరా విలీనం! విలీనానికి ఎంపిక చేసే సంస్థలు చిన్నవైనప్పటికీ ఆర్థికంగా స్థిరమైనవే అయి ఉండాలన్నది ఆర్థిక శాఖ ప్రతిపాదన. బెంగళూరు ప్రధాన కార్యాలయం గల కెనరా బ్యాంకు, విజయా బ్యాంకుతోపాటు సిండికేట్ బ్యాంకు (ప్రధాన కార్యాలయం మణిపాల్, కర్ణాటక)లు ఇప్పటికే విలీనంపై చర్చలు ప్రారంభించాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే కోల్‌కతా ప్రధాన కేంద్రంగా గల అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకు సైతం ఒక్కటిగా ఏర్పడవచ్చని చెప్పారు. మొండిబకాయిల సమస్య విలీనాలకు ఆటంకం కాబోదన్నారు. ఆర్బీఐ ఆంక్షల పరిధిలోకి సెంట్రల్ బ్యాంక్ భారీగా ఎన్పీఏల సమస్యను, ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటున్న సెంట్రల్ బ్యాంకు కూడా ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి వచ్చింది. ఈ విషయాన్ని బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియజేసింది. ఇప్పటికే ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, దేనా బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆంక్షల పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.