లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
Published Mon, Feb 13 2017 9:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
ముంబై : ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో దేశీయ మార్కెట్లు సోమవారం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 100 పాయింట్ల మేర, నిఫ్టీ 8800 పైకి ఎగిసింది. అయితే ఒక్కసారిగా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 51.91 పాయింట్ల లాభంలో 28,386 వద్ద, నిఫ్టీ 15.35 పాయింట్ల లాభంలో 8808 వద్ద ట్రేడవుతున్నాయి.
మెటల్, ఎంపికచేసిన బ్యాంకింగ్, పవర్ స్టాక్స్ ప్రారంభ ట్రేడింగ్లో మార్కెట్లను పైకి ఎగిసేలా చేశాయి. ఫలితాలు నిరాశపరచడంతో బ్యాంకు ఆఫ్ బరోడా 5 శాతం, ఐడియా సెల్యులార్ 4 శాతం పడిపోయాయి. హిందాల్కో, మహింద్రా అండ్ మహింద్రా, ఎన్టీపీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్ టాప్ గెయినర్లుగా 1 శాతం మేర లాభాలు పండించాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.17 బలహీనపడి 67.02గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 101 రూపాయల లాభంతో 29,190 వద్ద కొనసాగుతోంది.
Advertisement