లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
Published Wed, Sep 20 2017 9:36 AM | Last Updated on Wed, Sep 20 2017 11:53 AM
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రి మద్దతుతో స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 41.81 పాయింట్ల లాభంలో 32,444 వద్ద, నిఫ్టీ 4.85 పాయింట్ల లాభంలో 10,152 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రాయ్ మంగళవారం వెలువరించిన మొబైల్ కాల్ కనెక్షన్ ఛార్జీల తగ్గింపుతో టెలికాం స్టాక్స్ కుప్పకూలాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్ 3-6 శాతం నష్టపోతున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 14 పైసలున్న ఇంటర్ కనెక్షన్ ఛార్జీలను 6 పైసలకు తగ్గించింది. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా, మిగతా టెల్కోలకు షాక్‌గా ఉంది. దీంతో టెల్కో షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి.
అంతేకాక టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎన్‌టీపీసీ, విప్రో కంపెనీలు ప్రారంభంలో ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్ ఇంటస్ట్రీస్ 4 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది. ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ, టాటా పవర్, యస్ బ్యాంకు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.4 శాతం పైకి ఎగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీన పడి 64.26 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 88 రూపాయల లాభంలో 29,635 రూపాయలుగా నమోదవుతున్నాయి.
Advertisement