సెన్సెక్స్ 258 పాయింట్లు జంప్
Published Wed, Aug 30 2017 4:03 PM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM
సాక్షి, ముంబై : గ్లోబల్‌గా సంకేతాలు పాజిటివ్‌గా రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి కోలుకుని బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 258.07 పాయింట్లు పైకి జంప్ చేసి 31,646.46 వద్ద, నిఫ్టీ 88.35 పాయింట్ల లాభంలో 9884.40 వద్ద క్లోజ్ అయ్యాయి. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు రేపు ముగియనున్న నేపధ్యంలో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. ఇది మార్కెట్లకి కలిసి వచ్చింది. ఇంట్రాడేలో నిఫ్టీ 9900 పాయింట్ల పైకి ఎగిసింది.
ఉత్తర కొరియా జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించడంతో మంగళవారం భారీగా నష్టపోయిన స్టాక్‌మార్కెట్ బుధవారం కోలుకుంది. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే ట్రేడయ్యాయి. లోహ షేర్ల లాభాలు కొనసాగగా, కొన్ని ఫార్మా షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు 1-2 శాతం రేంజ్‌లో పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, సిప్లా, లుపిన్ షేర్లు 0.1 శాతం నుంచి 1.5 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 63.94గా ఉంది.
Advertisement