Bharti
-
Bharati Sumaria: చేదు అనుభవాలే తీపి విజయాలకు మెట్లు
జీవితంలో చెడు రోజులను ఎదుర్కోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ, మనలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యం, ధైర్యం గురించి మనల్ని మనం తెలుసుకునే సమయం ఇదే’ అంటుంది భారతీ సుమారియా. జీవించాలనే ఆశను కోల్పోయి అత్తవారింటి నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసిన ఆమె నేడు ఏడాదికి నాలుగు కోట్ల బిజినెస్ టర్నోవర్‌కి చేరుకునేంతగా ఎదిగింది. ముంబైలో పదేళ్ల క్రితం టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్ బాటిల్ .. వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే పనిని ప్రారంభించి, ఒంటరి పోరాటంతో ఎదిగిన భారతీ సుమారియా ధైర్యం ప్రతి ఒక్కరికీ పాఠం అవుతుంది. చేదు అనుభవాలే మనకు విజయవంతమైన మార్గానికి దారులు వేస్తాయి. దీనిని భారతీ సుమారియా చేసి చూపెట్టింది. సమస్యను సవాల్‌గా తీసుకొని ఎదిగిన వనితగా తనను తాను నిరూపించుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నేను ముంబైలోని భివాండి ప్రాంతంలో పుట్టాను. కొన్నేళ్లకు ములుండ్కి వెళ్లాం. మా కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే. ఆడపిల్లలకు ఎన్నో ఆంక్షలు. పదో తరగతి వరకు మాత్రమే చదవగలిగాను. పెళ్లయ్యాక వంటింటిని నడపాలి కానీ, ఆడపిల్లను చదివించి ఏం లాభం అనే మనస్తత్వం ఉన్న కుటుంబంలో పెరిగాను. అలా నా ప్రపంచం కూడా కుటుంబానికే పరిమితం అయ్యింది. నాకేమీ చేయాలనే కోరిక ఉండేది కాదు. నా ప్రపంచంలో నేను సంతోషంగానే ఉన్నాను. సక్సెస్ సాధించిన స్త్రీని చూసినా, అలాంటి వారి గురించి విన్నా, చదివినా నేను ఏదైనా చేయగలనా అనే ఆలోచన నా మదిలో మెదిలేది. కానీ, నా మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు చెప్పుకునే ధైర్యం ఉండేది కాదు. పెళ్లితో మారిన జీవితం.. ఆడపిల్లలకు పెళ్లే జీవిత లక్ష్యంగా ఉన్న రోజుల్లో 20ఏళ్ల వయసులో నాకు వివాహం చేశారు. మా అమ్మనాన్నలు చెప్పినట్టుగా నా భర్త సలహాలను అనుసరించాను. అత్తమామల బాధ్యతలను నెరవేర్చడంలో తీరిక లేకుండా గడిపాను. అత్తింటిలో అడుగుపెట్టినప్పుడు అదే నా ప్రపంచం అయ్యింది. అయితే, నా భర్త ఏ పనీ చేసేవాడు కాదు. నేను ఆర్థికంగా స్వతంత్రురాలిని కాదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు, నా పిల్లలకు నోటిలో నాలుగు వేళ్లూ పోక కనీసావసరాలు తీరక నా భర్త నాపై తన కోపాన్ని, చిరాకును ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇది నన్ను బాగా ప్రభావితం చేసింది. దీంతో నాకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా మారింది. మామగారు పనిచేసేవారు. కానీ, నా భర్త అస్సలు పనిచేసేవాడు కాదు. పిల్లల ఖర్చులు కూడా మామగారే భరించేవారు. 20 ఏళ్లు నా కోసం నేను ఎలాంటి షాపింగ్ చేయలేదు. మా అక్క బట్టలు నాకు ఇచ్చేది. వాటిని సంతోషంగా తీసుకునేదాన్ని. అత్తింట్లో రోజు రోజుకీ నా పరిస్థితి దిగజారడం మొదలయ్యింది. అమ్మ నా పరిస్థితి గమనించి పుట్టింటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. జీవించాలనే కోరికను కూడా కోల్పోయాను. డిప్రెషన్‌కు గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాక గంటల తరబడి మౌనంగా కూర్చునేదాన్ని. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఆరు లక్షల రూపాయలతో.. దీపావళికి, పుట్టిన రోజుకి నాన్న డబ్బులు ఇస్తుండేవారు. ఆ డబ్బు కూడా మా అత్తింట్లో ఖర్చయిపోయేది. దీంతో నాకు డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ చేయమని, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పాను. అత్తింటి నుంచి బయటకు వచ్చాక ఏం చేయలేని పరిస్థితిలో నాన్న నాకోసం డిపాజిట్ చేసిన డబ్బు ఆరు లక్షలకు పెరిగిందని తెలిసింది. 2005లో ఆ ఆరు లక్షల రూపాయలతో 300 అడుగల విస్తీర్ణంలో ఉన్న ఓ ప్లేస్ అద్దెకు తీసుకొని టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్‌బాటిల్ వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను తయారుచేసే పనిని ప్రారంభించాను. నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు రాత్రి కష్టపడ్డాను. త్వరలోనే సిప్లా, బిస్లరీ వంటి పెద్ద బ్రాండ్ల నుండి ఆర్డర్లను పొందడం ప్రారంభించాను. ఈ రోజు నా ఫ్యాక్టరీ లక్షా ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. భయం బలంగా మారింది ఎప్పుడూ పని కోసం ఇల్లు వదిలి వెళ్లలేదు. కానీ నాకు పని తప్ప వేరే మార్గం కనిపించలేదు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావించి, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను. చెడు సమయాలు నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. నా సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా చేయగలిగాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతగా సహించానో అంతగా కష్టాలు పెరిగాయి. నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. భగవంతుడు నా బలాన్ని గ్రహించి విజయపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చుట్టూ అలాంటి వాతావరణం సృష్టించాడని అనిపించింది. నా పురోభివృద్ధికి నా భర్త కోపం, తగాదాలే కారణమయ్యాయి. దాని వల్లనే నేను ఇదంతా చేయగలిగాను. పిల్లలే నా ప్రపంచం భార్యగా దృఢంగా ఉండలేకపోయినా పిల్లల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అలిసిపోవడానికి, వదులుకోవడానికి సిద్ధంగా లేనని నన్ను నేను బలంగా తయారుచేసుకున్నాను. జీవించాలనే కోరిక కూడా కోల్పోయిన ఆ భారతి ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. నా పిల్లల మంచి భవిష్యత్తు కోసం నేను కృష్టి చేయాల్సిందే అని గట్టిగా అనుకున్నాను. నేను నా పని మొదలుపెట్టినప్పుడు పిల్లలు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అప్పట్లో నా కూతురు ఎనిమిదో తరగతి, కొడుకులిద్దరూ ఐదో తరగతి చదువుతున్నారు. నా కూతురు తన చదువుతో పాటు తన తమ్ముళ్లనూ చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఆమే స్వయంగా వంట చేసి, తమ్ముళ్లకు పెట్టి, తినిపించి, నిద్రపుచ్చేది. పిల్లలను తండ్రి నుంచి దూరం చేయలేదు ఎప్పుడూ పిల్లలను వారి తండ్రి నుంచి కానీ, వారి కుటుంబం నుంచి కానీ దూరం చేయలేదు. పిల్లలు తల్లిదండ్రులిద్దరి ప్రేమను పొందాలని నమ్ముతాను. భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత నా పిల్లలు వారి పూర్వీకుల ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి మా ఇంటికి మారిపోయాం. నా పోరాటం నా పిల్లలను కూడా బలపరిచినందుకు సంతోషంగా ఉంది’’ అని వివరిస్తుంది భారతీ సుమారియా. మహిళలకు మద్దతు లభించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోకపోవడమే ఆడవాళ్లకున్న పెద్ద సమస్య. వాళ్ల అమ్మ ఇల్లు గానీ, అత్తమామల ఇల్లు గానీ తమ సొంతమని భావించరు. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లభించక చాలా మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆసరా దొరికితే ఎంతోమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకోకుండా జీవించగలుగుతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా పరిస్థితి చూసి మా తల్లిదండ్రులు నన్ను సొంతంగా వ్యాపారం చేయమని ప్రోత్సహించారు. నాన్న 3వ తరగతి వరకు మాత్రమే చదివారు. ముంబైలో బట్టల షాప్ పెట్టుకొని, మమ్మల్ని పోషించారు. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. మా పెంపకం బాధ్యత అమ్మ తీసుకుంది. ఇంటిని చూసుకోవడంతో పాటు చుట్టుపక్కలవారితో ఎప్పుడూ కలుపుకోలుగా ఉండేది. ఇప్పుడు కూడా మా చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేయడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. -
చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు
తమిళనాడులోని పురాతన నృత్య–నాటక రూపం ‘కట్టై కుట్టు’లో మహిళల ప్రాతినిధ్యం ఏ రకంగానూ ఉండేది కాదు. ‘కట్టై కుట్టు’ అంటే ‘పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం’గా ఉన్న పేరును భారతి తమిళవనన్ బృందం మార్చే ప్రయత్నం చేస్తోంది. ‘కట్టై కుట్టు’కు సంబంధించి నటన, సాంకేతికత, సంగీతం, దర్శకత్వం లాంటి వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తోంది. ఎంతో మంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇస్తోంది.... కాంచీపురంలో 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘కట్టై కుట్టు సంఘం’ పురాతన కళాసంప్రదాయం అయిన కట్టై కుట్టును సజీవంగా ఉంచడానికి అంకితం అయింది. ఆ పురాతన కళారూపాన్ని ఈ తరానికి పరిచయం చేయడంతోపాటు ‘ఈ కళలో మహిళలు అద్భుతాలు సృష్టించగలరు’ అని నిరూపించింది. ‘కట్టై కుట్టు నేర్చుకోవడానికి ఆడా, మగా తేడా లేదు. కులం, మతం అడ్డు కాదు అని చెప్పాలనుకున్నాం’ అంటారు కట్టై కుట్టు నిర్వాహకులు. ‘కట్టై కుట్టు’ ప్రదర్శన ఆషామాషీ కాదు. ఖరీదైన అలంకరణతో కూడిన ఓపెన్–ఎయిర్ ప్రదర్శన.సంగీతం, పాటలు, మాటలను ఏకతాటిపైకి తెచ్చి ప్రేక్షకులను రంజింప చేయాలి. ‘ఇంత క్లిష్టమైన కళకు మహిళలు అర్హులు కాదు’ అనే భావనను ‘కట్టై కుట్టు సంఘం’ తొలగించింది. మహిళల అద్భుత కళాప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. మొదట్లో మహిళలను రంగస్థలం మీదికి తీసుకురావడం అనేది అంత తేలిగ్గా జరగలేదు. పురుషులతో కలిసి నటించడానికి కొందరు మహిళలు నిరాకరించారు. కొందరు ఒప్పుకున్నా వారి తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు. ‘ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగమా! తినడానికి తిండి కూడా దొరకదు’ అని కొందరు నిట్టూర్చారు. అయితే ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ కళాప్రియులైన మహిళలను రంగస్థలం మీదికి తీసుకురాగలిగారు. వారిలో నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగారు. ‘మీరొక చారిత్రక ఘట్టంలో భాగం అవుతున్నారు’ అని చెప్పారు. ఆ మహిళా కళాకారులు చారిత్రక ఘట్టంలో భాగం కావడమే కాదు చరిత్రను తిరగ రాశారు.‘కట్టై కుట్టు’కు కొత్త వెలుగు తీసుకుచ్చారు. ‘కట్టై కుట్టు’ సంఘంలోని వారందరూ వివాహిత మహిళలే. డిగ్రీ పూర్తి చేసిన వారే. ‘బాడీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్, ఒక పెద్ద డైలాగ్‌ను సంగీతంతో మిళితం చేసే విధానంతో కూడిన కట్టై కుట్టు కళారూపాన్ని మహిళా కళకారులు కూడా అద్భుతంగా చేయగలరని నిరూపించాం’ అంటుంది భారతి తమిళవనన్. ఆమె గత పన్నెండు సంవత్సరాలుగా ‘కట్టై కుట్టు’ ప్రదర్శనలు ఇస్తోంది. ఎంతోమంది మహిళలకు నేర్పిస్తోంది. భారతీ కళాకారుల కుటుంబం నుంచి రాలేదు. తన స్వగ్రామం వేలూరులో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగింది, ‘ప్రదర్శన కోసం వేరే గ్రామాలకు వెళ్లినప్పుడు పురుషులు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వారికి మేము మా ప్రతిభతోనే తగిన సమాధానం చెబుతాం. మహిళలు చేయలేరు అన్నవారే ప్రదర్శన తరువాత మమ్మల్ని ప్రశంసించడం మరిచిపోలేని విషయం’ అంటుంది తమిళి జ్వాననన్. వివాహ సమయంలో తప్ప ప్రదర్శనకు ఎప్పుడూ సెలవు ఇవ్వలేదు తమిళి జ్వాననన్. ప్రముఖ కళాకారిణి సంగీత ఈశ్వర్ దగ్గర కట్టై కుట్టు, భరతనాట్యం నేర్చుకున్న తిలగావతి పళని ‘శ్రీకృష్ణ కట్టై కుట్టు కుజు’ పేరుతో స్వంత కట్టై కుట్టు పాఠశాలను నడుపుతోంది. ‘కట్టై కుట్టు కళాకారులు నిరక్షరాస్యులు , మహిళలు ఈ కళారూపానికి తగరు...లాంటి ఎన్నో అపోహలను బద్దలు కొట్టాం’ అంటుంది పళని. ప్రస్తుతం ఆమె తన పాఠశాల ద్వారా 65 మంది విద్యార్థులకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన ‘కట్టై కుట్టు గురుకులం’ ద్వారా గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు ‘కట్టై కుట్టు’లో శిక్షణ ఇస్తోంది కట్టై కుట్టు సంఘం. వీరిలో నుంచి భారతిలాంటి ఎంతో మంది అద్భుత కళాకారులు రంగస్థల ప్రపంచానికి పరిచయం కావచ్చు. ప్రతి సంవత్సరం ‘కట్టై కుట్టు సంఘం’ కాంచీపురంలో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచం నలుమూలల ఉన్న కళాభిమానులను ఈ ఉత్సవం ఆకట్టుకుంటోంది. ఎన్నో అవరోధాలు అధిగమించి... మా ఊళ్లో కట్టై కుట్టు కళాకారులను చూస్తూ పెరిగాను. నేను కూడా వారిలాగా చేయాలి అని కలలు కనేదాన్ని. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో కట్టై కుట్టు రంగస్థలంపై అడుగు పెట్టడానికి ఎన్ని అవరోధాలు ఉన్నాయో తెలిసింది. అయినా సరే, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాను. తల్లిదండ్రులు ప్రోత్సహించారే తప్ప అభ్యంతర పెట్టలేదు. ఈ పురాతన కళారూపంలోకి మరింత మంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను. – భారతి తమిళవనన్ -
రెండు లక్షల కొలువులిస్తాం
జవహర్‌నగర్, మేడ్చల్ రూరల్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, తమ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఆగమవుతుందని కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ను అభివృద్ధి చేయకపోగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, మేడ్చల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్ (జంగయ్య) యాదవ్‌ను గెలిపించాలంటూ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఆస్తులున్న కోకాపేట వైపు ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేయకపోగా డంపింగ్ యార్డ్‌ను బహుమతిగా ఇచ్చారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లలో ఐటీ కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. మేడ్చల్‌లో ఐటీ పార్క్ తెస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ పత్తాలేకుండా పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం..’’అని తెలిపారు. మల్లారెడ్డి టికెట్ కోసం ఎన్నికోట్లు ఇచ్చారు? రాష్ట్రంలో కేసీఆర్ వందల కోట్లు దండుకుంటుంటే.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జాచేస్తూ, కిందిస్ధాయి ప్రజాప్రతినిధులకు సీట్లు అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభు త్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టినా పట్టించుకోవడం లేదుగానీ.. పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలి..’’అని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక్కడ మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మూడోసారి గెలిపించాలంటూ వస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాల తరలింపు వంటివి వచ్చిది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదా? అని ప్రశ్నించారు. దొరల ప్రభుత్వాన్ని కూల్చాలి అసలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాందీ, కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో. బిర్లామందిర్ మెట్లపైనో బిచ్చమెత్తుకునే వారని రేవంత్ అన్నారు. హరీశ్‌రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్, కేటీఆర్‌లకు వేల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల పాలనకు, పేదలకు మధ్య పోరాటమని.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 91వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలే వెల్లడించాయని రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి 250 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆడపిల్లలకు పెళ్లినాడే రూ.లక్ష ఆర్థిక సా యంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, జవహర్‌నగర్ ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడు అనిల్, రజక, కురుమ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రెండు కంపెనీలకు ఐఎస్పీ లైసెన్స్
న్యూఢిల్లీ: జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వన్‌వెబ్ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్స్ అందుకున్నట్టు సమాచారం. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించవచ్చని ఒక అధికారి తెలిపారు. -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్‌లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్‌లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ఈమె డాక్టర్ భారతి ఎందరికో స్ఫూర్తి
సాకే భారతి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అనంతపురం ఎస్.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పట్టా తీసుకుంది. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియదు.అసలు సాకే భారతి చదువుకుంటూ ఉంటేనే ‘చదువెందుకు’ అని చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయేవారు. ‘మేము ఏం చదివామని సుబ్రంగా కాపురాలు చేస్తున్నాం’ అని కూడా అనేవారు. కాని చదువు తెచ్చే వెలుతురు భారతికి బాగా తెలుసు.ఈ మెట్టు తర్వాత తనకు ప్రోఫెసర్గానో అసిస్టెంట్ప్రోఫెసర్గానో ఉద్యోగం వస్తే మారబోయే తన జీవితమూ తెలుసు. తనను చూసైనా తన వర్గంలో తనలాంటి సామాజిక వర్గాల్లో స్ఫూర్తి రావాలని ఆమె కోరిక. ముగ్గురు ఆడపిల్లలు తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో సాకే భారతి రెండో సంతానం. తండ్రికి చదువు లేదు. పైగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అబ్బాయి పుట్టలేదని భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తను కూడా చాలా అస్థిమితంగా ఉండేవాడు.ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండేది కాదు. అప్పుడు భారతి తాత భారతితో అన్నమాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది– అమ్మా... నా కూతుర్ని మీ నాన్నకు ఇస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడపిల్లకు ఏం తక్కువ? బాగా చదువుకుంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు.నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ్లు తెరిపియ్యాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి భారతి గట్టిగా చదువుకోవాలనుకుంది. ఇవాళ్టికీ చదువుకుంటూనే ఉంది. ఎన్నో కష్టాలు భారతి మూడోక్లాసుకు వచ్చేసరికి చిన్న చెల్లెలు పుట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి వెళ్లాలి. అక్క బడికెళ్లాలి. చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి? రెండేళ్లు బడి మానేసి ఇంట్లో చెల్లెల్ని చూసుకుంటూ ఉండిపోయింది భారతి. ఆ తర్వాత పదోక్లాస్లో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం చదువు సాగలేదు.పెళ్లయ్యాక నివాసానికి ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే ఉన్నారు. అక్కడే ఒకరోజు కాలేజీకి వెళుతూ ఒకరోజు కూలి పనికి వెళుతూ చదువుకుంది భారతి. ఇంటర్ (ఎం.పి.సి.)లో రోజు కూలి పాతిక రూపాయలు, డిగ్రీ (బిఎస్సీ)లో రోజు కూలి యాభై రూపాయలు వచ్చేది. ఈ లోపు కూతురు పుట్టింది. పాటలంటే చాలా ఇష్టమున్న భారతి తన కూతురికి ‘గాయని’ అని పేరు పెట్టింది. పెళ్లి, సంసారం వల్ల చదువు మీద శ్రద్ధ ఉండటం లేదని భారతి బాధ పడుతుంటే భర్త ఏరికుల శివప్రసాద్ ఇంటర్ చదువు కొనసాగేలా ప్రోత్సహించాడు. పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతపురంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గ్రామం నుంచి కళాశాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజూ ఎనిమిది కిలోమీటర్లు గార్లదిన్నెకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళ్లి చదువుకుంది. డిగ్రీలో భారతి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇల్లు లేదు.. ఉద్యోగం లేదు భారతి నివసిస్తున్న ఇల్లు అసంపూర్ణ స్థితిలో ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే డబ్బులేక నిర్మాణం సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ప్రోఫెసర్ కావాలన్నదే భారతి కోరిక. ప్రోఫెసర్ ఉద్యోగం వస్తే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి కొంతమంది విద్యార్థులకు పంచి చదువులో రాణించే విధంగా కృషి చేస్తాను’ అంది భారతి. పీహెచ్డీ పట్టా వచ్చాక దానిని ఇంట్లో పెట్టి కూలి పనికి వెళుతోంది భారతి. టొమాటో చేనులో, బెండకాయ చేనులో పని చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తే 150 రూపాయలు వస్తున్నాయి. – రుషింగప్పగారి మునెప్ప, శింగనమల, సాక్షి చేతిలో పలుగూ పార నెత్తిన పచ్చగడ్డి నుదుటిన ఎప్పుడూ దొర్లే చెమట కాని గుండెల నిండా చదువు పూర్తి చేయాలన్నసంకల్పం.మహా మహా సౌకర్యాలు ఉండి కూడా పీహెచ్డీ కల నెరవేర్చుకోలేని వారు చకితమయ్యేలా ఏ సౌకర్యాలూ లేని వాళ్లు కొండంత స్ఫూర్తి పొందేలా వ్యవసాయ కూలీ భారతి మొన్న (సోమవారం) పీహెచ్డీ పట్టా అందుకుంది. అనంతపురంలో ఈ అద్భుతం జరిగింది. 2016లో పీహెచ్డీ సీటు 2016లో సాకే భారతి ఎస్.కె. యూనివర్శిటీలోప్రోఫెసర్ ఎం.సి.ఎస్ శోభ దగ్గర ఆర్గానిక్ కెమెస్ట్రీలో పిహెచ్.డి ప్రవేశం ΄పొందింది. పిహెచ్.డిలో చేరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనం భారతి చదువుకు సహాయపడింది. దీంతోపాటు కూలి పనులకు వెళ్తూ 2023 సంవత్సరానికి పట్టా పొందింది. స్లిప్పర్లతో, అతి సాదా బట్టలతో స్నాతకోత్సవంలో పట్టా అందుకోవడానికి భారతి స్టేజీ ఎక్కితే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. -
వైద్య రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత
సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే వైద్య కళాశాలలను పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. కేంద్ర మంత్రి గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో గృహాలను సందర్శించి అక్కడ స్థానికులతో, భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు 387 నుంచి 648కి పెంచారని వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. దేశంలో 2014 వరకు 60 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 3.50 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అయినా మోదీ చిత్రపటం ఎక్కడా లేదని అన్నారు. రెండు నెలల్లో మళ్లీ వస్తానని, ఇక్కడ ప్రతి అపార్ట్‌మెంట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండాలని, ప్రధాని ఆవాస్ యోజన అని రాసి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ 6,144 గృహాలు మంజూరవ్వగా 1854 మందికే ఇళ్లు అప్పగించారని, సౌకర్యాలు కూడా కల్పించలేదని అన్నారు. తాను మళ్లీ వచ్చేసరికి మిగిలిన ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని చెప్పారు. సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతమని, రాష్ట్ర ప్రభుత్వం వాటా 35 శాతమని, లబ్ధిదారుల వాటా 45 శాతం ఉందని తెలిపారు. కాగా, కేంద్ర మంత్రి ఎదుట రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగించాలని కొందరు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. సమస్యలున్న వారు చేతులెత్తాలని వారు ప్రజలను కోరగా, ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఖంగుతిన్నారు. -
భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్మెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:ఏరోసిటీ కమర్షియల్ డెవలప్మెంట్ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్ డిస్ట్రిక్ట్స్ డిజైన్, డెవలప్, ఫైనాన్స్, కన్స్ట్రక్ట్, ఆపరేట్, మేనేజ్, మెయింటెయిన్ ప్రాతిపదికన ఫేజ్–1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్–2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్–1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036 వరకు ఏటా డీఐఏఎల్కు రూ.363.5 కోట్లను భారతీ రియల్టీ చెల్లించనుంది. దీనితోపాటు అదనంగా రూ.1,837 కోట్లు వన్ టైం పేమెంట్ చేయనుంది. గడువు మరో 30 ఏళ్లు పొడిగించినట్టయితే భారతీ రియల్టీ వార్షిక లీజు మొత్తంపై 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. భారతీ రియల్టీ ఫేజ్–2 ప్రాజెక్టు చేపట్టాలంటే ఫేజ్–1 మాదిరిగా అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. -
వండిన కథలు కావు
వండుకోవడానికి సరుకులే లేవు..ఇక ఆకలి కడుపున మెదడేం వండుద్ది?కాదు.. విషయం అది కాదు!నిజానికి కడుపు నిండితే.. మెదడు ఖాళీగా ఉంటుంది!కడుపు ఖాళీగా ఉంటే మెదడు నిండుగా ఉంటుంది!భారతి రచయిత్రి కాదు.. కథా వస్తువు!ఇంకా గట్టిగా చెప్పాలంటే కథా దినుసు!ఎంత బాగా వండుతుందో.. కానీ వండినట్టే ఉండదు!ఊర్లో నిలువెత్తు అద్దం తీసుకుని తిరిగినట్టు ఉంటుంది!అవును.. ఇవి వండిన కథలు కాదు..రోమాంచిత వాస్తవాలు! మట్టి పాత్రలే ఉన్న ఇళ్లలో ఇత్తడి బిందె.. బంగారపు బిందె కన్నా గొప్పది. ఆ బిందెను కొనుక్కోవడం వాళ్ల జీవన కల. రెక్కల కష్టం పెట్టుబడిగా సంపాదించుకున్న ఆస్తి. ఇలాంటి అపురూపాలకు, జీవనసారానికి అక్షరాలతో విలువగడ్తుంది ఎండపల్లి భారతి. చదువు అయిదవ తరగతే. అయితేనేం.. ఆమె రచనకు ప్రమాణం.. వందేళ్ల జీవిత అనుభవం.. అంతే లోతైన పరిశీలన. అందుకే ఆమె కథల్లో మనుషులు కదులుతారు. భావోద్వేగాలు కనపడ్తాయి. ఆమె పరిచయం ఎండపల్లి భారతి.. పుట్టింది, పెరిగింది.. చిత్తూరు జిల్లా, నిమ్మనపల్లి మండలంలోని దిగువ బురుజు. తండ్రి వెంకటరమణ, తల్లి ఎల్లమ్మ. వాళ్లకు భారతి ఏకైక సంతానం. ఆమెకు అయిదేళ్లున్నప్పుడే భారతి తల్లి టీబీతో చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తండ్రీ పోయాడు. అమ్మమ్మ, తాత ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. దాంతో చదువు ముందుకు సాగలేదు. అమ్మమ్మ, తాతకు తోడుగా పొలంలో పని చేసేది భారతి. ఆమెకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఉన్న ఊళ్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేసింది పెద్దమ్మ. భర్త శ్రీనివాసులు. మెట్టినింటికీ కూలి పనే ఆర్థిక ఆధారం. భర్తతోపాటు తనూ కూలీకి వెళ్లేది. కుటుంబ బాధ్యతల బరువు ఆమె భుజాల మీదున్నా.. చదువు పట్ల ఆసక్తి ఆవిరి కానివ్వలేదు. తన పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లాడు. ఆడపిల్లలకు ధైర్యం, అబ్బాయికి ఆపోజిట్ జెండర్‌ను గౌరవించడం నేర్పింది. పెద్దమ్మాయి విజయ కుమారి ఎమ్మే బీఈడీ. ప్రస్తుతం డిఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. రెండో అమ్మాయి స్వరూప డిగ్రీ ఫైనలియర్. అబ్బాయి సోమశేఖర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కథలు రాయి ‘‘ఏం రాయాలి?’’ ‘‘ఇప్పటి దాకా నువ్వు చూసిన జీవితం రాయి భారతీ’’ అన్నారు కిరణ్ కుమారి, సావెం రమేశ్. రాసింది. ‘సావు బియ్యం’ అనే పేరుతో. స్పష్టమైన వ్యక్తీకరణ. అద్భుతమైన మాండలీకం. చక్కటి పద సంపద. అబ్బుర పడ్డారు వాళ్లు. అక్షర దోషాలను సరిచేసి.. మరిన్ని రాయమని ప్రోత్సహించారు. రాస్తోంది భారతి.. ఏ ఒక్కరి జీవితాన్నో కాదు.. మొత్తం సమాజ సరళినే. ఆమె రాసిన కథలన్నిటినీ టైప్ చేసి పలు పత్రికలకు పంపించింది కిరణ్ కుమారి. అలా పత్రికల్లో అచ్చయిన కథలన్నిటితో ఓ సంకలం తెస్తే కూడా బాగుంటుందని భారతికి సలహా ఇచ్చింది ఆమె. పుస్తకం అంటే మాటలా? కనీసం యాభై వేలన్నా కావాలి. రెక్కలు ముక్కలు చేసుకున్నది కూటికి, పిల్లల చదువులకే చాలడం లేదనే చింత తొలుస్తున్నా.. పుస్తకం తేవాలనే కాంక్షా బలంగానే నాటుకుంది భారతిలో. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని పట్టుదల ఆమెది. ఆ ఉత్సాహానికి ఊతంలా పదిహేను వేల రూపాయలు సహాయం చేసింది కిరణ్ కుమారి. చిత్రకారిణి కూడా అయిన ఆమె.. భారతి కథలకు చక్కటి బొమ్మలనూ గీసింది. మిగిలిన డబ్బును అప్పుగా తెచ్చి ‘ఎదారి బతుకులు’ అనే కథా సంకలనాన్ని ముద్రించింది భారతి. వెయ్యి కాపీలు చేతుల మీదే అమ్ముడు పోయాయి. రెండునెల్లకే మొదటి ముద్రణ ఖాళీ అయిపోయింది. ఈ సంకలనం అమెరికాకూ చేరింది. తానా సభల్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ పుస్తకం రెండో ముద్రణ బాధ్యతను హెచ్‌బీటీ చేపట్టింది ఎంతో ఇష్టంగా. త్వరలోనే లాంచ్ కానుంది. నవోదయం భారతిలోని రచయిత్రిని ప్రపంచానికి చూపించిన కిరణ్ కుమారి, సావెం రమేశ్.. ఇద్దరూ వెలుగు ప్రాజెక్ట్ ఆఫీసర్లు. డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో కాస్త చదవగలిగిన, రాయగలిగిన పన్నెండు మంది మహిళలతో ‘నవోదయం’ అనే ఓ మాస పత్రికను మొదలుపెట్టించారు. వాళ్లలో ఒకరే ఎండపల్లి భారతి. తనకు వచ్చిన ఈ కొత్త గుర్తింపు ఘనతను ఆ ఇద్దరికే ఇస్తుంది భారతి. ‘‘ ముఖ్యంగా కిరణ్ కుమారి మేడమ్.. నాకు ఫ్రెండ్, గైడ్.. అన్నీ’’ అంటుంది. నవోదయం.. భారతికే కాదు మిగిలిన పదకొండు మంది మహిళలకూ కొత్త గుర్తింపును ఇచ్చింది. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచింది. ‘‘ఏదో రాస్తారట.. ’’ అని పెదవి విరిచిన వాళ్లే ఈ గ్రామీణ మహిళా విలేకర్లు రాస్తున్న వార్తలను కుతూహలంగా చదువుతున్నారు. బైక్, కారు నడుపుతున్న భారతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. పేపర్, పెన్నుతోనే కొంగుముడి ఆవులు.. సేద్యం.. అక్షరం.. ఇవే భారతి పనులు.. వ్యాపకాలూ. పేపర్, పెన్నూ ఆమె కొంగుతో ముడిపడే ఉంటాయి. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు పేపర్ తీసి రాస్తుంది.. ఆవులు మేపేందుకు వెళ్లినా.. పొలం పనులు చేస్తున్నా! అలాంటి తలపోతకే ఆ తర్వాత కథా రూపం ఇస్తుంది. ‘‘డబ్బు కూడబెట్టే కంటే అక్షరం కూడబెడితే ముందు తరాల వాళ్లకు ఎంతోకొంత లాభం. జీవితం తెలుసుకుంటారు. నేను చూసింది.. విన్నది.. అనుభవించిందే రాస్తాను. ఊహించి రాయలేను. మనుషులే నాకు ఇన్స్పిరేషన్. తాతా, అవ్వ వయసున్న వాళ్లతో ఎక్కువగా మాట్లాడ్తాను. వాళ్ల అనుభవాలే నా కథా వస్తువులు. నా కథలను చదివి ఫస్ట్ మా పిల్లలు నవ్వారు.. ఇట్లా మన మాండలికంలో రాస్తే.. ఎవరు చదువుతారు? అని. పుస్తకంగా వచ్చి.. అమ్ముడు పోయేసరికి ఇప్పుడు గొప్పగానే చూస్తున్నారు (నవ్వుతూ). డెబ్బై కథలు రాశా. వ్యవసాయదారుల సాదక బాధకాలనూ కథలుగా రాసి పుస్తకంగా తేవాలనుంది. ఇప్పటికే ఓ పది రైతు కథలు రాశా’’ అని చెప్పింది భారతి. భవిష్యత్ కన్నా వర్తమానంలో బతకడమే ఇష్టపడే భారతి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా. ఇప్పటివరకు అయిదు షార్ట్ ఫిల్ములు తీసింది. జాతీయ స్థాయి సమావేశాల్లో వాటిని ప్రదర్శించింది కూడా. ‘‘సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్లెందరో సమాజానికి తెలియకుండానే పోయారు. నేనేం చేశానని నాకు ఈ గుర్తింపు? అనిపిస్తుంటుంది’’ అని అంటుంది భారతి. మహిళల మీద జరుగుతున్న దాడులపై స్పందిస్తూ ‘‘చుట్టూ నిప్పు పెట్టి జాగ్రత్తలు చెబితే ఎలా కుదురుతుంది? ఆ నిప్పును ఆర్పే పనే కాదు.. ఇంకెప్పుడూ ఎవరు నిప్పు పెట్టకుండా చూసే బాధ్యతను మనం తీసుకోవాలి. అప్పుడే ఆడవాళ్లు క్షేమంగా ఉంటారు’’ అంటుంది భారతి. – సరస్వతి రమ -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రి మద్దతుతో స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 41.81 పాయింట్ల లాభంలో 32,444 వద్ద, నిఫ్టీ 4.85 పాయింట్ల లాభంలో 10,152 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రాయ్ మంగళవారం వెలువరించిన మొబైల్ కాల్ కనెక్షన్ ఛార్జీల తగ్గింపుతో టెలికాం స్టాక్స్ కుప్పకూలాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్ 3-6 శాతం నష్టపోతున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 14 పైసలున్న ఇంటర్ కనెక్షన్ ఛార్జీలను 6 పైసలకు తగ్గించింది. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా, మిగతా టెల్కోలకు షాక్‌గా ఉంది. దీంతో టెల్కో షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. అంతేకాక టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎన్టీపీసీ, విప్రో కంపెనీలు ప్రారంభంలో ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్ ఇంటస్ట్రీస్ 4 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది. ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ, టాటా పవర్, యస్ బ్యాంకు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.4 శాతం పైకి ఎగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీన పడి 64.26 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 88 రూపాయల లాభంలో 29,635 రూపాయలుగా నమోదవుతున్నాయి. -
లాభాల్లో మార్కెట్లు: భారతీ, ఐడియా జంప్
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు వారాంతంలో పాజిటివ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 61.36 పాయింట్ల లాభంలో 28,926 వద్ద, నిఫ్టీ 19.30 పాయింట్ల లాభంలో 8946 వద్ద ట్రేడవుతోంది. టెలినార్ ఇండియాను కొనుగోలు చేయబోతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 10 శాతం పైకి దూసుకెళ్లాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో 1,800 మెగాహెడ్జ్ బ్యాండ్ లో కంపెనీకి అదనపు స్పెక్ట్రమ్ లభించనుంది. మరోవైపు ఐడియా షేర్లు 7 శాతం పైకి రివ్వున ఎగిరాయి. వొడాఫోన్-ఐడియా విలీనంలో సాప్ట్ బ్యాంకు మైనారిటీ స్టాక్ ను అంటే 15-20 శాతం స్టాక్ ను కొనుగోలచేయనున్నట్టు తెలియడంతో ఐడియా షేర్లు రయ్ మని దూసుకెళ్లాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 66.96వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 103 నష్టంతో 29,198 వద్ద ట్రేడవుతోంది. కాగ, మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లు సెలవును పాటించనున్నాయి. -
అంచనాలు మించిన భారతీ ఎయిర్టెల్
విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలనే దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభాలు 4.9 శాతం పడిపోయి రూ.1,461 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,536 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ సంబంధిత ఖర్చులు, నైజీరియన్ కరెన్సీ డివాల్యుయేషన్ వంటి కారణాలతో భారతీ ఎయిర్టెల్ లాభాలు పడిపోయినట్టు కంపెనీ ప్రకటించింది. కానీ విశ్లేషకుల అంచనావేసిన దానికంటే బాగానే ఆపరేషన్ ఫర్ఫార్మెన్స్ను కంపెనీ చూపించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విశ్లేషకుల ముందస్తు అంచనా ప్రకారం భారతీ ఎయిర్టెల్ రూ.25,495 కోట్ల రెవెన్యూలపై రూ.1050 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,053 కోట్లగా ఉన్న నికర వడ్డీ వ్యయాలు రూ.1,603 కోట్లకు ఎగిశాయి. ఈ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం కూడా స్పెక్ట్రమ్ సంబంధిత వడ్డీ వ్యయాలేనని కంపెనీ వెల్లడించింది. ఉచిత సేవలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఎఫెక్టు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది. ఈ క్వార్టర్లో ఎయిర్ టెల్ మొబైల్ వ్యాపారాలు నెమ్మదించాయి. మొత్తంగా అయితే యేటికేటికి 10.1 శాతం రెవెన్యూ వృద్ధి నమోదుచేస్తూ కంపెనీ ఊపందుకున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. నాన్-మొబైల్ బిజినెస్‌ల్లో వృద్ధి నమోదు వల్లే కంపెనీ రెవెన్యూలను పెంచుకోగలిగిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రెవెన్యూలు 10.1 శాతం ఎగిసి రూ.19,219 కోట్లగా నమోదయ్యాయి. యేటికేటికీ డిజిటల్ టీవీ వ్యాపారాల్లో 20.9 శాతం వృద్ధి, ఎయిర్టెల్ బిజినెస్‌లో రూ.19.2 శాతం, మొబైల్ వ్యాపారాల్లో 7.9 శాతం వృద్ధి కంపెనీ భారత వ్యాపారాల్లో నమోదుచేసినట్టు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.24,671.5 కోట్లగా కంపెనీ నమోదుచేసింది. అయితే నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్తో కన్సాలిడేటెడ్ రెవెన్యూ వృద్ధి 3.3 శాతం మందగించింది. -
నష్టాలోకి జారుకున్న మార్కెట్లు
ముంబై : బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మద్దతుతో మంగళవారం కొత్త శిఖరాల దిశగా దూసుకెళ్లిన్న స్టాక్ మార్కెట్లు, నేడు కూడా అదే ఉత్సాహంతో ముందుకొచ్చాయి. కానీ ఆ ఉత్సాహం ఎన్నో నిమిషాలు నిలవలేదు. దేశీయ సూచీలు వెంటనే నష్టాలోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 24 పాయింట్ల నష్టంతో 28954 వద్ద, నిఫ్టీ 14.80 పాయింట్ల నష్టంతో 8928 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బీహెచ్ఈఎల్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ నష్టాలు గడిస్తుండగా..ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీలు, విప్రోలు లాభాల్లో నడుస్తున్నాయి. మార్కెట్లలో నమోదవుతున్న లాభాల వల్ల పెట్టుబడిదారులు నేడు ప్రాఫిట్ బుకింగ్స్ పై ఎక్కువగా మొగ్గుచూపారని ఆ ప్రభావంతో దేశీయ సూచీలు నష్టాలోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు నెలల గరిష్టంలో నమోదవుతున్న డాలర్‌తో రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్‌లో కూడా బలపడింది. నిన్నటి ముగింపుకు 16 పైసలు లాభంతో ప్రారంభమైంది. ఫెడ్ రేటు ఆందోళనలు వీడటంతో డాలర్ బలహీనపడిందని, రూపాయి విలువ పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 బలపడి 66.38గా ఉంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 393 రూపాయల లాభంతో 31,378గా కొనసాగుతోంది. -
పోషించే స్తోమత లేక..
పోషించే స్తోమత లేక ఓ తల్లి తన కన్న కూతురిని అచ్చంపేటలోని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించింది. ఈ సంఘటన అచ్చంపేట మండలం అక్కారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భారతి, వశ్యా దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు. మూడవ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో తమకు భారమై పోతుందని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. స్థానిక ఐసీడీఎస్ అధికారులు శిశువును మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని శిశువిహార్‌కు తరలించారు. -
వివాహిత గొంతుకోసి...
- అనంతరం ఆత్మహత్య చేసుకున్న నిందితుడు కదిరి అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. మూర్తినగర్ ప్రాంతంలో నివసించే భారతి అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన గొల్ల సుధాకర్‌తో వివాహేతర సంబంధం ఉంది. కాగా, మంగళవారం మధ్యాహ్నం సుధాకర్ భారతి ఇంటికి వెళ్లగా... ఆ సమయంలో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అతడు జీర్ణించుకోలేకపోయాడు. పథకం ప్రకారం... అర్ధరాత్రి ఆమె భర్త కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లగా... అదే సమయంలో సుధాకర్ భారతి ఇంటికి వేటకొడవలితో వెళ్లాడు. ఆమె గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తన గొంతుకూడా కోసుకుని రక్తపు మడుగులో పడిపోయాడు. అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
బుల్లితెర నటికి అసభ్యకర మెసేజ్‌లు...
బంజారాహిల్స్: గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపి మానసికంగా వేధిస్తున్నాడని బుల్లితెర నటి ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకా రం... శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్.భారతి (40) టీవీ షోల్లో నటిస్తోంది. మూడు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో తాను తీవ్రమానసిక క్షోభకు గురవుతున్నానని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి
సెల్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించిన మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు స్టేషన్ పంచాయతీ పరిధిలోని తూర్పుతండాలో సోమవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు భారతి (35) ఈ రోజు ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అందుకే తన పేరు 'భారతీ' అని పెట్టా...
కఠ్మాండు: రెండు పెను భూకంపాలకు గురై ప్రాణాలతో బయటపడిన నేపాల్‌కు చెందిన ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భూకంపం సందర్భంగా తమ దేశానికి విలువైన సేవలు అందిస్తున్న భారతదేశంపై గౌరవంతో తన కూతురుకు ఆస్పత్రిలోనే 'భారతి' అని నామకరణం చేసింది. ఏప్రిల్ 25 భారీ భూకంపం సంభవించడంతోపాటు దాని నుంచి తేరుకునే క్రమంలో తాజాగా మే 12 మరోసారి భారీ భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే. ఈ రెండోసారి భూకంపం బారిన పడిన భావనా సాప్కోటా పుదాసైని అనే గర్భవతిని అక్కడ సహాయక చర్యలు అందిస్తున్న భారత సైన్యం రక్షించడమే కాకుండా అక్కడే భారత్ తరుపున ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించి వైద్యం అందించారు. అందులోనే ఆమె శుక్రవారం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భూకంపం బారిని పడిన తమ దేశానికి ఎంతో గొప్ప సాయాన్ని అందిస్తూ వెన్ను దన్నుగా నిలుస్తున్న భారత్ అంటే తనకు అమితమైన ఇష్టమని, గౌరమని అందుకు చిహ్నంగానే తన కూతురుకు భారతి అని పేరు పెట్టినట్లు పుదాసైని తెలిపింది. -
అనుమానం.. పెనుభూతమై..
భార్యను హతమార్చిన భర్త మృతురాలి బంధువుల ఆందోళన పోలీసుల రాకతో సద్దుమణిగిన గొడవ ధర్మాపురం(దేవరుప్పుల) : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ధర్మాపురంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని ధర్మాపురం శివారు పడమటితండాకు చెందిన జాటోత్ సుగుణ బీకోజీ కూతురు భారతి(31)కి 16 ఏళ్ల క్రితం ఇదే తండా సమీపంలోని లకావత్‌తండాకు చెందిన జక్కమ్మ, హర్యానాయక్ కుమారుడు కబీర్‌తో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు జన్మించగా ఇటీవల కుటుంబ కలహాలు మొదలయ్యూరుు. భారతికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపిస్తూ భార్యతో తరచూ గొడవకు దిగుతున్నట్లు తండావాసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తల్లిగారింటికి వెళ్లొచ్చిన భారతి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కబీర్ మళ్లీ గొడవకు దిగాడు. కొడవలితో కడుపు చీరగా పేగులు బయటపడి విలవిలలాడుతూ మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షి ఎనిమిదేళ్ల కొడుకు శ్రవణ్ ఏడ్చుకుంటూ చెప్తున్న తీరు స్థానికులను కలచివేసింది. భార్యను హతమార్చిన కబీర్తోపాటు అత్తమామలు తెల్లారేసరికే పరారీ కావడంతో మృతురాలి బంధువులు చేరుకుని ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేశారు. ఎస్సై కె.సూర్యప్రసాద్ చేరుకుని శాంతింపజేసే యత్నం చేసినా మహిళలు ప్రతీకార చర్య తీసుకుంటామని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి సీఐ తిరుపతి పాలకుర్తి, కొడకండ్ల ఎస్సైలు ఉస్మానీ అలీ, శ్రీనివాస్‌తో చేరుకుని బాధితులను శాంతింపజేశారు. మూడు గంటల ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం మృతురాలి తల్లిదండ్రులు సుగుణ,బీకోజీ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. తల్లి మృతదేహాన్ని చూసి కూతుర్లు స్వాతి, జ్యోతి, కుమారుడు శ్రవణ్ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది. -
మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్...సెన్సెక్స్ 416 ప్లస్
మళ్లీ 27,000 దాటిన ఇండెక్స్... ⇒ అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఎఫెక్ట్ ⇒ చమురు, కరెన్సీ, ఈక్విటీల జోష్ ⇒ మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల హైజంప్ ⇒ ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ వడ్డీరేట్ల పెంపు విషయంలో ఓపికతో వ్యవహరిస్తామని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ .. బుధవారం రాత్రి ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దీనికిఅనుగుణంగానే సెన్సెక్స్ నేలక్కొట్టిన బంతిలా రివ్వున పెకైగసింది. దీనికి షార్ట్ కవరింగ్ కూడా జతకలవడంతో 416 పాయింట్లు దూసుకెళ్లింది. గత ఆరు వారాల్లో ఇది అత్యధిక లాభంకాగా, 5 రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ మళ్లీ 27,000 పాయింట్లను దాటేసింది. 27,127 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 130 పాయింట్ల హైజంప్ చేసి 8,159 వద్ద నిలిచింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,121 పాయింట్లు కోల్పోయిన సంగతి తె లిసిందే. అన్నింటా అదే జోరు...: వచ్చే ఏడాది ద్వితీయార్థంలో(2015 జూన్) మాత్రమే వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చునన్న ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. వెరసి ఐదున్నరేళ్ల కనిష్టం నుంచి చమురు, 13 నెలల కనిష్టం నుంచి రూపాయి కోలుకున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు బుధ, గురువారాల్లో భారీ ర్యాలీ జరిపాయి. దేశీయంగానూ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం రెట్టింపయ్యింది. బీఎస్ఈలో అన్ని రంగాలూ 1-5% మధ్య ఎగశాయి. మరిన్ని విశేషాలివీ.. ⇒వినియోగవస్తువుల సూచీ 5% జంప్‌చేయగా, విద్యుత్, యంత్రపరికరాలు, బ్యాంకింగ్, రియల్టీ, ఆటో, మెటల్ 3-2% మధ్య పురోగమించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2.7%, 3.5% చొప్పున పుంజుకున్నాయి. ⇒బ్లూచిప్స్‌లో భెల్, హిందాల్కో, గెయిల్, మారుతీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, టాటా పవర్, సిప్లా, యాక్సిస్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 5-1% మధ్య లాభపడ్డాయి. ⇒మిడ్ క్యాప్స్‌లో జేకే టైర్, పీసీ జ్యువెలర్, ఐవీఆర్సీఎల్, టొరంట్ పవర్, డీసీబీ, హెచ్‌డీఐఎల్, రెడింగ్టన్, అరవింద్, ఎస్సార్ ఆయిల్, పీఎఫ్సీ, పేజ్, గుజరాత్ గ్యాస్ 18-8% మధ్య దూసుకెళ్లాయి. రూపాయి రికవరీ.. 50 పైసలు అప్ ముంబై: వివిధ అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశీ స్టాక్స్ గణనీయంగా పెరగడంతో గురువారం రూపాయి కూడా భారీగా లాభపడింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ ఏకంగా యాభై పైసల మేర బలపడి 63.11 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే ఇంత పెరుగుదల నమోదు కావడం ఏడు నెలల్లో ఇదే ప్రథమం. వడ్డీ రేట్లు పెంచాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మరికొన్నాళ్ల దాకా అమల్లోకి తేకపోవచ్చంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు కాస్త ఊతమిచ్చినట్లు వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. గడచిన మూడు రోజుల్లో రూపాయి మారకం విలువ 132 పైసల మేర (2.12 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.61తో పోలిస్తే మెరుగ్గా 63.35 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరికి 0.79 శాతం లాభంతో 63.11 వద్ద ముగిసింది. ఎగుమతి సంస్థలు, కొన్ని బ్యాంకులు.. డాలర్లను విక్రయించడం కూడా రూపాయి పెరుగుదలకు తోడ్పడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
రివెంజ్ కూడా రొమాంటిక్‌గా...
రీచాడే, అనూషా, భారతి, దినేష్, జాన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇక ఆట నాదే’. ‘రొమాంటిక్ రివైంజ్’ అనేది ఉపశీర్షిక. సత్తి దర్శకుడు. డి.కిశోర్‌బాబు నిర్మాత. కేకే 7 స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఖయ్యూం ఆడియో సీడీని ఆవిష్కరించి, మనోజ్‌నందం, అంజి శ్రీనుకి అందించారు. యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందిన సినిమా ఇదనీ, డిసెంబర్ తొలివారంలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు. ఇందులో ప్రతి పాటా డిఫరెంట్‌గా ఉంటుందని సంగీత దర్శకుడు చెప్పారు. -
జీవితేచ్ఛ ఆవిరై!
కొండంత ఆశలతో వర్షాధార పంటలే పంచప్రాణాలుగా అందినంత అప్పు చేసి చెమటోడ్చి సేద్యం చేస్తున్న రైతన్నలు.. కరవు కాటుకు తమ కళ్లెదుటే పంటలు గిడసబారి ఎండుతుంటే జీవితేచ్ఛ ఆసాంతమూ ఆవిరై బలవన్మరణాల పాలవుతున్నారు. వరుణుడి వంచన, విద్యుత్ వెతలు, రద్దుకాని రుణ బాధలు, తోడేళ్లలా వేటాడుతున్న వడ్డీ వ్యాపారుల పీడ.. వెరసి విధిలేక మెట్ట సేద్యాన్నే నమ్ముకున్న బడుగు రైతును బలిగొంటున్నాయి. వాతావరణానికి అనువైన పంటల మార్పిడితోపాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చెప్పి పచ్చని బాట పట్టించే ఆసరా అంతకుముందే కొడిగట్టింది. ఈ నేపథ్యంలో నీటి వసతి లేని తేలిక నేలల్లోనూ అధిక ఖర్చుతో కూడిన పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు వేస్తూ అమావాస్య దీపం చుట్టూ ముసిరే ఉసుళ్ల మాదిరిగా నేలరాలుతున్న విషాదకర దృశ్యాలు ముఖ్యంగా తెలంగాణ పల్లెసీమలను నిస్తేజంగా మార్చుతున్నాయి. గత కొద్ది నెలల్లో వందలాది మంది రైతన్నలు ప్రాణత్యాగం చేస్తూ పంటపొలంలో వటవృక్షం మాదిరి బలిసిన సంక్షోభాన్ని, ఎవరికీ పట్టని తమ నిస్సహాయతను ఎలుగెత్తి చాటుతున్నారు. అటువంటి ఒకానొక అభిమన్యుడు మాలోతు రవి నాయక్! పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ‘సాక్షి’ ఇటీవల పరామర్శించింది. బంధువులు, గ్రామస్తుల సమాచారం మేరకు మెట్ట వ్యవసాయం యువ రైతుకు ప్రాణాంతకంగా పరిణమించిన తీరును ఆవిష్కరించే ప్రయత్నమే ఈ కథనం.. గిరిజన యువ రైతైన రవి నాయక్ గత నెల 15న తన మిరప చేలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వయసు 34 ఏళ్లు. స్వగ్రామం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లి. భార్య భారతి(32) రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనుల్లో భర్తకు చేదోడుగా ఉంటుంది. పిల్లలు ఈ ఏడాది నుంచే మనోహర్(10), జస్వంత్(8) ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు. పదో తరగతి వరకు చదివి ఉమ్మడి కుటుంబ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రవి మూడేళ్ల నుంచి సొంతంగా సేద్యం చేస్తున్నాడు. శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని, పిల్లలను బాగా చదివించాలన్న తపన కలిగిన రైతుగా అతనికి గ్రామంలో గుర్తింపుంది. అసలే కౌలు.. ఆపై పత్తి, మిరప సాగు.. సాగర్ ఎడమ కాలువ నీరు పారే చివరి గ్రామాల్లో కల్లేపల్లి ఒకటి. గ్రామంలోని 500 రైతు కుటుంబాలు కాలువ నీరందే 200 ఎకరాల్లో వరి, మిగతా వెయ్యి ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేస్తున్నాయి. రవికి కాలువ కింద సెంటు భూమి లేదు. మెట్ట ప్రాంతంలో 6 ఎకరాల భూమి ఉంది. కాలువ నీరు లేదు. బోరు వసతీ లేదు. గుట్టల మధ్యన ఎత్తయిన ప్రాంతంలో రెండెకరాల ఎర్రని ఇసుక దువ్వ నేలలో మిరప తోట వేశాడు. మరోచోట రాళ్లు రప్పలతో కూడిన తేలికపాటి నేల 4 ఎకరాల్లో పత్తి వేశాడు. మరో 4 ఎకరాలను కౌలు(ఎకరానికి రూ.5 వేలు)కు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు రవి. తోటి రైతుల మాదిరిగానే ఖర్చుకు వెనకాడకుండా అప్పోసొప్పో చేసి కాంప్లెక్స్ ఎరువులు, పురుగుమందులు విరివిగా వాడుతున్నాడు. అతనికి జత ఎడ్లు, రెండు గేదెలున్నాయి. వీటి పేడ ఎరువును ఒక్కో ఏడాది ఒక్కో పొలంలో రొటేషన్ పద్ధతిలో చల్లుతుంటాడు. ఈ ఏడాది 4 ట్రాక్టర్ల పశువుల ఎరువును మిరప తోటకు వేశాడు. అతని తమ్ముడు రాజు కూడా తన రెండెకరాలతోపాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పక్క రైతు బోరు నుంచి నీటిని తీసుకునే అవకాశం రాజుకు దొరికింది. రవికి దొరకలేదు. కీలక దశలో పడిన వర్షం 30% మాత్రమే! దామరచర్ల మండలాన్ని గత ఏడాది ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించింది. ఈ ఏడాది మేలో రోహిణీ కార్తె ప్రారంభం రోజున పెద్ద వాన పడింది. దీంతో ఈ ఏడాదైనా మంచి వర్షాలు పడతాయని, అప్పులన్నీ తీర్చేయొచ్చన్న కొండంత ఆశతో రైతులు ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. ఒకటీ అరా జల్లులు కురుస్తుండడంతో రవి నాయక్ 8 ఎకరాల్లో ఖరీదైన బీటీ పత్తి విత్తనాలు కొని వేశాడు. పత్తి విత్తనాలు సరిగ్గా మొలకెత్తక రెండోసారి మళ్లీ కొని బీటీ విత్తనాలు వేశాడు. అయితే, రైతులు ఆశించిన విధంగా వర్షాలు పడలేదు. మండల అధికారుల సమాచారం మేరకు.. ఖరీఫ్ పంట కాలం మొదటి 3 నెలల్లో (జూన్- ఆగస్టు నెలల్లో) సాధారణ వర్షపాతంతో పోల్చితే కేవలం 30% వర్షం కురిసింది. సెప్టెంబర్- అక్టోబర్ 15వ (రవి నాయక్ ఆత్మహత్య చేసుకున్న) తేదీ మధ్య 45% నమోదైంది. అయితే, తుపాన్ వల్ల అక్టోబర్ 18న భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో జూన్-నవంబర్(15వ తేదీ) మధ్య 85% వర్షం నమోదైనందున.. ఈ ఏడాది కరువు మండలంగా ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో నెల నెలా తగినంత వర్షం లేక, బోర్ల ద్వారా నీరందక వర్షాధార పంటలు గిడసబారి దిగుబడి మరీ తగ్గిపోయింది. బోర్లెన్ని వేసినా ఫలితం శూన్యం.. తన మెట్ట పొలానికి బోర్ల ద్వారా నీటి వసతిని సమకూర్చుకోవడానికి రవి రెండేళ్లలో పది బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. గత ఏడాది వేసిన 4 బోర్లు విఫలమయ్యాయి. ఈ ఏడాది 6 బోర్లు వేశాడు. ఈ లోగా పాతవి, కొత్తవి కలిపి భూమిని, పాస్‌బుక్‌ను తనఖా పెట్టి బ్యాంకులో తెచ్చిన అప్పు రూ. 5 లక్షలకు, ప్రైవేటు అప్పులు రూ. 6 లక్షలకు పెరిగాయి. రెండు బోర్లలో కొంచెం నీరు కనపడింది. ఆ నీటినైనా తోడి పంటను రక్షించుకుందామని విశ్వప్రయత్నం చేశాడు. పుట్టెడు అప్పులకు కష్టాలు తోడయ్యాయి. కరెంటు వచ్చేది రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు. వచ్చిన కరెంటు ఎంత సేపుంటుందో తెలీదు. ఎన్నిసార్లు పోయి, వస్తుందో లెక్కలేదు. ఈ ఏడాది 4 సార్లు మోటారు కాలిపోయింది. కాలిన ప్రతి సారీ రూ.5 వేల ఖర్చు. అయినా మొండి ధైర్యంతో మోటారు రిపేర్లు చేయించి చేను తడిపే ప్రయత్నం చేశాడు. అక్టోబర్ 14 రాత్రి మిరప తోటకు నీళ్లు పెట్టడానికి వెళ్లాడు రవి. రాత్రి 3 గంటలు 2 మోటార్లు ఆడినా ఒక సాలు కూడా సరిగ్గా తడవని దుస్థితి. వర్షమూ పడటం లేదు. కళ్లెదుటే ఎండిపోతున్న పంటను రక్షించుకోలేనన్న అధైర్యం రవిని కమ్ముకుంది. పొలానికి పిచికారీ చేయడానికి తెచ్చిన పురుగుమందు తాగి, అక్కడే తుది శ్వాస విడిచాడు. తెల్లారి పొద్దున అన్నం తీసుకెళ్లిన అతని భార్య భారతి తొలుత నిద్రిస్తున్నాడనుకుంది. నోటి నురగ చూసి భీతిల్లి గొల్లుమనడంతో ఇరుగుపొరుగు రైతులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లే అంతా అయిపోయింది.. ప్రస్తుతం ఈ పొలాన్ని భారతి అన్న రమేశ్ చూస్తున్నాడు. 8 ఎకరాల్లో ఇప్పటికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 2 క్వింటాళ్లు రావచ్చన్నాడు. గిడసబారిన మిరప తోట పూతమీదుంది. ఎంత దిగుబడి వస్తుందో ఆ దేముడికే ఎరుక! వ్యవసాయ సూచనలిచ్చే వారే లేరు! కల్లేపల్లిలో మెట్ట రైతులు పత్తి, మిరప తప్ప మరో పంట వేయడం లేదు. రవి బాబాయి లక్పతి (సొంత భూమి 4 ఎకరాల్లో పంటల మార్పిడి పాటిస్తూ కూరగాయలు, పత్తి, మిరప పండిస్తున్నాడు) వంటి ఒకరిద్దరికి తప్ప పంటల మార్పిడి అలవాటు అసలే లేదు. ఎప్పుడు ఏం చేస్తే పంట బాగుంటదో చెప్పాల్సిన వ్యవసాయాధికారి, విస్తరణాధికారులూ పత్తాలేరని కల్లేపల్లి రైతులు చెప్పారు. రవి చనిపోయినప్పుడు పంచనామాకు తప్ప వ్యవసాయ సూచనలివ్వడానికి వారు ఈ ఏడాది ఒక్కసారీ తమ గ్రామానికి రాలేదన్నారు. కల్లేపల్లిలో మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో పరిస్థితి ఇదే. పూర్తిస్థాయి వాతావరణ బీమా రక్షణతోపాటు పంటల మార్పిడి, మిశ్రమ పంటల సాగు, ఖర్చు తగ్గే సుస్థిర సాగు పద్ధతులను వ్యవసాయాధికారుల నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో రైతులకు అందించడం తప్ప సాగు సంక్షోభ నివారణకు దగ్గర దారేదీ లేదు. రవి విషాద గాథ చెబుతున్నది ఇదే. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: వల్లపురెడ్డి, మహేశ్వరరెడ్డి; ఫొటోలు: ముచ్చర్ల శ్రీనివాస్ కౌలు సేద్యమే కొంపముంచింది! తనకున్న పొలంతో సరిపెట్టుకోకుండా నీళ్లు లేని పొలాలను కౌలుకు చేయడం వల్లే రవి అప్పులపాలయ్యిండు. ‘కొంచెం చేసేది తన కొరకు.. మరింత చేసేది మంది కొరకు’ అన్నట్లయింది. సంపాయించుకొని పైకి రావాలని తాపత్రయపడ్డాడు. దేముడు అట్ల చేసిండు. వర్షాల్లేవు, కరెంటూ లేక రైతుల చావుకొచ్చింది. - మాలోతు లక్పతి, మృతుడు రవి పినతండ్రి, అభ్యుదయ రైతు, కల్లేపల్లి గ్రామాల్లోకొచ్చి రైతులను చైతన్యవంతం చేయాలి వాతావరణంలో మార్పులొచ్చాయి. గతంలో మబ్బులొస్తే వర్షం పడేది. ఇప్పుడు మబ్బులొచ్చినా వర్షం పడటం లేదు. ఒక ఊళ్లో పడితే ఇంకో ఊళ్లో పడటంలేదు. ఈ ఏడాది వర్షాలు తక్కువుంటాయి.. పంటలు మార్చండి, పెట్టుబడులు తగ్గించండని మాకు ఏ అధికారీ చెప్పలేదు. పెట్టుబడులు పెరిగిపోయి రైతు దెబ్బతింటున్నాడు. వ్యవసాయాధికారులు ప్రతి గ్రామంలో నెలకోసారి గ్రామసభలు పెట్టి రైతులను చైతన్యవంతం చేయాలి. పదేళ్లుగా మట్టి నమూనాలు ఇచ్చినా.. ఒక్కసారీ ఫలితం ఏమిటో చెప్పే స్థితిలో అధికారుల్లేరు. ఈ పరిస్థితి మారాలి. కరెంటు పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు టైంటేబుల్ ప్రకారం కచ్చితంగా ఇవ్వాలి. - మాలోతు రాంమోహన్ నాయక్, మాజీ ఆదర్శ రైతు, రవి దాయాది, కల్లేపల్లి బ్యాంకు రుణాలన్నీ రద్దు చేయాలి! ఎట్ల బతకాలో తెలియటం లేదు. బ్యాంకు అప్పులన్నీ రద్దుచేసి, మా పిల్లలను చదివించాలి. గవర్నమెంటే ఆదుకోవాలి. పత్తి విత్తనాలకు రూ.16 వేలు ఖర్చుపెట్టినం. అవి కూడా తిరిగొచ్చేలా లేవు.. నాకొచ్చిన కష్టం ఇంకొక ఆడకూతురికి రాకుండా చూడాలి. - భారతి, మృతుడు రవి భార్య -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం
మండాకురిటి(సంతకవిటి) : మరుగుదొడ్ల కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంకులో పడి యశ్వంత్(5) అనే బాలుడు మృతి చెం దారు. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరగ్గా సాయంత్రం మృతదేహం లభిం చింది. విజయనగర జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన కెల్ల సన్యాసిరావు భార్య భారతి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మం డాకురిటి. ఇద్దరు కుమారులతో సహా భార్యాభర్తలి ద్దరూ రెండురోజుల క్రితం మండాకురిటి వచ్చారు. శని వారం సాయంత్రం వీరు తిరిగి కోడూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వీరి పెద్ద కుమారుడు యశ్వంత్ ఆటాడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల వైపు వెళ్లాడు. కొడుకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. ఆ క్రమంలో పీహెచ్సీ భవనాల సమీపంలో మరుగుదొడ్డ కోసం నిర్మించిన ట్యాంకుల వద్ద బురదలో బాలుడి అడుగుజాడలు కనిపించాయి. దాంతో అనుమానంతో నీళ్లతో నిండి ఉన్న ట్యాంకులోకి దిగి వెతికారు. యశ్వంత్ మృతదేహాన్ని కనుగొని బయటకు తీసుకొచ్చారు. విగతజీవుడైన కుమారుడిని చూడగానే తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఐదేళ్లకే కొడుకు నూరేళ్ల జీవితం ముగిసిపోయిందని గుండెలవిసేలా వలపించారు. మరోవైపు తనను చూడ్డానికొచ్చిన కూతురు, అల్లుడికి పుత్రవియోగం కలగడాన్ని యశ్వంత్ తాత రామారావు తట్టుకోలేకపోయారు. విలపిస్తూ సొమ్మసిల్లిపోయాడు. అయితే ఈ సంఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్థానిక ఎస్సై పి.సురేష్‌బాబు చెప్పారు. నిర్లక్ష్యమే కారణం ఇంతటి దారుణానికి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బాధితులతోపాటు చుట్టుపక్కల ప్రజలు ఆరోపించారు. మరుగుదొడ్డి ట్యాంకు నిర్మించి మూత వేయకుండా వదిలేయడం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రామారావు ఇంటి సమీపంలో రెండేళ్ల క్రితం పీహెచ్సీ భవనాల నిర్మాణం ప్రారంభించారు. రూ.67 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాలకు మరుడుదొడ్డి వసతి కోసం 15 అడుగుల లోతులో రెండు ట్యాంకులు నిర్మించారు. అయితే వాటికి పైకప్పులు వేయకుండా వదిలేశారు. ఇటు కాంట్రాక్టర్, అటు అధికారులు ఈ విషయం పట్టించుకోలేదు. వర్షాలకు ఆ ట్యాంకులు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు ఈ దుర్ఘటనకు కారణమయ్యాయి. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఆ విషయమూ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. -
అమ్మకానికి ఆడశిశువు
రూ.15 వేలకు కుదిరిన బేరం విశ్వసనీయ సమాచారంతో అడ్డుకున్న పోలీసులు.. కేసు నమోదు కొండమల్లేపల్లి : అంగట్లో ఆడశిశువును అమ్ముకునే దుస్థితి, పరిస్థితి గిరిజన తండాల్లో ఇంకా మారడం లేదు. ఓ వైపు మగసంతానంపై ఆసక్తి, మరోవైపు అధిక సంతానాన్ని పెంచలేని పేదరికంతో ఆడశిశువులను అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. తాజాగా దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో రూ.15వేలకు ఆడశిశువును విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీర్‌నాయక్ తండాకు చెందిన మూడావత్ బాలు, కుమారీలకు ఇప్పటికే ఇద్దరు ఆడసంతానం. పదిహేను రోజుల క్రితం మూడవ కాన్పులో మళ్లీ ఆడపిల్లే జన్మించడంతో భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ శిశువును అమ్మకానికి పెట్టారు. అదే తండాకు చెందిన మూడావత్ భారతి అనే మహిళ మధ్యవర్తిత్వం నెరిపింది. హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో పనిచేస్తున్న పి.కుమార్ అనే వ్యక్తికి రూ.15 వేలకు అమ్మడానికి బేరం కుదిరింది. ఈ నేపథ్యంలో శిశువును శుక్రవారం వారికి అప్పగించడానికి ప్రయత్నిస్తుండగా సమాచారం బయటకు పొక్కడంతో వీఆర్ఓ వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ భాస్కర్ వారిని కొండమల్లేపల్లిలో పట్టుకొని కేసు నమోదు చేశారు. శిశువును విక్రయించడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు, కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన పి.కుమార్, మధ్యవర్తి భారతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శిశువును దేవరకొండ శిశుగృహకు తరలించారు.