టెక్కలిరూరల్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తానని తెలుపుతూ టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి జేఏసీ నాయకులకు ప్రమాణ పత్రాన్ని శుక్రవారం అందజేశారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం ప్రమాణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధన తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎస్.మోహనరావు, బి.ధనుంజయరావు, సీహెచ్ భాస్కరరావు, ఆర్.శేషు, పి.జోగారావు, ఎస్.సత్యం, లకీష్మపతి కాంగ్రెస్ నాయకుడు శిగిలిపల్లి శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయ జేఏసీ నాయకులంతా పాల్గొన్నారు.
తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తా
Published Sat, Oct 12 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement