
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:ఏరోసిటీ కమర్షియల్ డెవలప్‌మెంట్ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్ డిస్ట్రిక్ట్స్ డిజైన్, డెవలప్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్ట్, ఆపరేట్, మేనేజ్, మెయింటెయిన్ ప్రాతిపదికన ఫేజ్–1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్–2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది.
ఫేజ్–1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036 వరకు ఏటా డీఐఏఎల్‌కు రూ.363.5 కోట్లను భారతీ రియల్టీ చెల్లించనుంది. దీనితోపాటు అదనంగా రూ.1,837 కోట్లు వన్ టైం పేమెంట్ చేయనుంది. గడువు మరో 30 ఏళ్లు పొడిగించినట్టయితే భారతీ రియల్టీ వార్షిక లీజు మొత్తంపై 50 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. భారతీ రియల్టీ ఫేజ్–2 ప్రాజెక్టు చేపట్టాలంటే ఫేజ్–1 మాదిరిగా అదనపు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.