![రివెంజ్ కూడా రొమాంటిక్‌గా...](/styles/webp/s3/article_images/2017/09/2/41416763740_625x300.jpg.webp?itok=UgRSQGad)
రివెంజ్ కూడా రొమాంటిక్‌గా...
రీచాడే, అనూషా, భారతి, దినేష్, జాన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇక ఆట నాదే’. ‘రొమాంటిక్ రివైంజ్’ అనేది ఉపశీర్షిక. సత్తి దర్శకుడు. డి.కిశోర్‌బాబు నిర్మాత. కేకే 7 స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఖయ్యూం ఆడియో సీడీని ఆవిష్కరించి, మనోజ్‌నందం, అంజి శ్రీనుకి అందించారు. యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందిన సినిమా ఇదనీ, డిసెంబర్ తొలివారంలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు. ఇందులో ప్రతి పాటా డిఫరెంట్‌గా ఉంటుందని సంగీత దర్శకుడు చెప్పారు.